పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : చంద్రుని ఆమంత్రణంబు

 •  
 •  
 •  

6-197-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దికాలంబున నా ప్రజాపతి పతి-
యైన లోకేశ్వరుం చ్యుతుండు
ద్మనేత్రుఁడు వనస్పతుల నోషధి ముఖ్య-
జాతంబు నిషము నూర్జంబుఁ గోరి
ల్పించె; నందు ముఖ్యంబైన యన్నంబు-
చరంబు లై నట్టి పద మెల్లఁ
బాదచారులకును బాల్వెట్టి యిరుగాళ్ళు-
చేతులు గలిగిన జీవతతికి

6-197.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

పాణులొగి లేని యా చతుష్పాత్తు లెల్ల
న్నముగఁ బూని గావించె దియుఁగాక
నా మహాభాగుఁ డచ్యుతుఁ డాదరమున
మీకు ననఘాఖ్య విఖ్యాతి జోపఱిచె.

టీకా:

ఆదికాలంబునన్ = పూర్వకాలమున; ఆ = ఆ; ప్రజాపతిపతి = మూలపురుషుడు {ప్రజాపతిపతి - ప్రజాపతులందరికిని పతి (ప్రభువు), విష్ణువు}; ఐన = అయిన; లోకేశ్వరుండు = నారాయణుడు; అచ్యుతుండు = నారాయణుడు; పద్మనేత్రుడు = నారాయణుడు; వనస్పతులన్ = వనస్పతులను; ఓషధి = ఓషధులు {ఓషధులు - ఫలించెడుతోడనే నశించెడు చెట్లు వరి వంటివి}; ముఖ్య = మొదలగు; జాతంబున్ = సమూహమును; ఇషమున్ = ఇష్టము; ఊర్జము = బలములను; కోరి = కోరి; కల్పించెన్ = సృష్టించెను; అందు = వానిలో; ముఖ్యంబు = ముఖ్యమైనట్టిది; ఐన = అయిన; అన్నంబు = ఆహారము; అచరంబులు = చరించలేనివి; ఐనట్టి = అయినట్టి; అపదము = పాదములు లేనివి, అచరములు; ఎల్లన్ = సర్వము; పాదచారుల్ = పాదములతో చరించెడివాని; కును = కి; పాల్వెట్టి = పంచిపెట్టి; ఇరుగాళ్ళు = రెండు (2) కాళ్ళు; చేతులు = చేతులు; కలిగిన = ఉన్నట్టి; జీవ = ప్రాణుల; తతి = జాతి; కి = కి;
పాణులు = చేతులు; ఒగి = అసలు; లేని = లేనట్టి; ఆ = ఆ; చతుష్పాత్తుల = నాలుగుకాళ్ళ జంతువులు; ఎల్లన్ = అన్నిటిని; అన్నముగన్ = ఆహారముగ; పూని = నిశ్చయించి; కావించె = చేసెను; అదియునున్ = అంతే; కాక = కాకుండగ; ఆ = ఆ; మహాభాగుడు = మహానుభావుడు; అచ్యుతుడు = నారాయణుడు {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; ఆదరమున = మన్ననతో; మీకున్ = మీకు; అనఘ = పుణ్యులు అను; ఆఖ్య = పేరును; విఖ్యాతి = ప్రసిద్ధిని; జోకపఱిచె = జతపరిచెను.

భావము:

సృష్టి ప్రారంభంలో ప్రజాపతులకు అధిపతి, సర్వ లోకాధిపతి, అచ్యుతుడు, కమలనయనుడు అయిన శ్రీహరి వనస్పతులను, ఓషధులను సృష్టించాడు. జీవులకు ఆహారంగా ఇష్టమైన రుచులకోసం, శరీరానికి శక్తిని ఇవ్వడానికి ఈ వృక్షాలను ఏర్పాటు చేశాడు. చరించేవి, పాదచారులు అయిన జీవులకు అచరాలు, పాదరహితాలు అయినవానిని ఆహారంగా కల్పించాడు. రెండుకాళ్ళు గల ప్రాణులకు, నాలుగు కాళ్ళు కలిగిన జంతువులకు వృక్షాలను ఆహారంగా ఏర్పాటు చేశాడు. అంతేకాక ఆ మహానుభావుడు, అచ్యుతుడు అయిన విష్ణువు మీకు అనఘులు అన్న ప్రఖ్యాతిని కల్పించాడు.