షష్ఠ స్కంధము : చంద్రుని ఆమంత్రణంబు
- ఉపకరణాలు:
బెల్లువడఁ గాల్పఁ దొడఁగినఁ దల్లడిల్లి
వారి కోపంబు వారించువాఁడ పోలెఁ
బలికెఁ జందురుఁ "డో మహాభాగులార!
దీనమగు వృక్షముల మీఁదఁ దెగుట దగునె?
టీకా:
పూని = సంకల్పించి; ప్రచేతపుత్రులు = ప్రచేతసుల కొడుకులు; పదుగురు = పదిమంది (10); ప్రాచీనబర్హిష = ప్రాచీనబర్హిషులు; ప్రాఖ్యన్ = అని పేరొందుట; కలుగు = కలిగిన; వారు = వారు; మహా = గొప్ప; అంబోధి = సముద్రము {అంబోధి - అప్పు (నీటి)కి నిధివంటిది, సముద్రము}; వలన = నుండి; వెల్వడి = బయటకు; వచ్చి = వచ్చి; తగన్ = పూర్తిగ; వృక్ష = చెట్లతో; ఆవృతమైన = నిండిన; ధరణిన్ = భూమిని; చూచి = చూసి; మేదినీజముల = చెట్ల {మేదినీజములు - మేదిని (భూమి) నుండి జములు (జనించునవి), వృక్షములు}; పై = మీద; మిక్కిలి = అధికముగ; కోపించి = కోపించి; మది = మనసు; లోనన్ = లోపల; దీపిత = రగులుతున్న; మన్యులు = కోపము గలవారు; అగుచు = అగుచు; వక్త్రంబులను = నోటినుండి; మహా = గొప్ప; వాయు = గాలితో; సంయుతము = కూడినది; ఐన = అయిన; అనలంబున్ = అగ్నిని; కల్పించి = పుట్టించి; అవనిజములన్ = చెట్లను {అవనిజములు - అవని (భూమి) నుండి జములు (పుట్టినవి), వృక్షములు}; పెల్లువడ = ఫెళఫెళమని శబ్దము చేయు చుండగ; కాల్పన్ = కాల్చివేయ; తొడగిన = మొదలిడిన; తల్లడిల్లి = చలించిపోయి.
వారి = వారి యొక్క; కోపంబు = కోపమును; వారించు = ఆపెడు; వాడ = వాడి; పోలెన్ = వలె; పలికెన్ = పలికెను; చంద్రుండు = చంద్రుడు; ఓ = ఓ; మహాభాగులారా = మహానుభావులూ; దీనము = దీనములు; అగు = అయిన; వృక్షముల = చెట్ల; మీద = పైన; తెగుట = ఇలా సాహసించుట; తగునె = సరియైనదా ఏమి.
భావము:
ప్రచేతసుని పుత్రులు “ప్రాచీనబర్హి” అని పేరెన్నిక గన్నవారు పదిమంది తపస్సు చాలించి సముద్రగర్భం నుండి బయటకు వచ్చి దట్టంగా సందు లేకుండా వృక్షాలతో నిండిన భూమిని చూశారు. సందు లేకుండా భూమినంతా ఆక్రమించిన చెట్లమీద వారికి కోపం వచ్చింది. వారు క్రోధావేశంతో తమ కోపాగ్ని జ్వాలలను మహావాయువుతో ప్రసరింపజేశారు. ఆ మంటలకు వృక్షసముదాయమంతా కాలి భస్మమై పోసాగింది. అది చూసి తల్లడిల్లిన చంద్రుడు వారి కోపాన్ని నివారించడానికి వారితో ఇలా అన్నాడు “ఓ మహానుభావులారా! దిక్కులేని ఈ వృక్షాలపై కోపం తగునా?