పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : కథా ప్రారంభము

  •  
  •  
  •  

6-39.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పటప్పటి కడఁగని ట్టి ప్రకృతి
లుగు పురుషుని భోగార్థటన దేహ
కారణా రంభ రూపమార్గంబు మొదలు
మాటిమాటికి నన్నియుఁ దేపడఁగ

టీకా:

షడ్గుణైశ్వర్యాది = ఆరు గుణములు ఈశ్వర లక్షణములు గలిగిన {షడ్గుణములు - భగవంతుని షడ్గుణములు - ఐశ్వర్యాది - 1ఐశ్వర్యము 1వీర్యము 3యశము 4శ్రీ 5జ్ఞానము 6వైరాగ్యము} { అష్టైశ్వర్యములు - 1అణిమ 2మహిమ 3లఘిమ 4గరిమ 5ప్రాప్తి 6ప్రాకామ్యము 7వశిత్వము 8ఈశత్వము}; శాశ్వత = జనన మరణాతీత మైన; మూర్తివి = స్వరూపమవు; ఐనట్టి = అయినటువంటి; ముని = మునులలో; నాథ = నాయకుడా; దయ = కృప; తోడన్ = తోటి; ముక్తిపదము = మోక్షమును చెందుటను; మున్నుగాన్ = ముందుగా; ఏ = ఏ; మార్గమునన్ = విధముగా; వినిపించితివి = చెప్పితివి; అరయన్ = విచారించగా; అపవర్గ = ముక్తిమార్గము యొక్క; భూరి = అత్యధికమైన; మహిమన్ = గొప్పదనమును; క్రమ = క్రమమార్గమైన; యోగ = అష్టాంగయోగము వలన; సంభవ = కలిగెడి; బ్రహ్మంబు = పరబ్రహ్మ; తో = తోటి; కూడన్ = కూడెడి; అనువొందన్ = అవకాశము; అగును = సాధ్యము; అని = అని; వినుతికెక్క = ప్రసిద్ధముగను; మఱియు = ఇంకను; సత్త్వరజస్తమ = త్రిగుణముల; ప్రభావంబులన్ = ప్రభావములను; కడిది = బలవత్తరమైనది; ఐ = అయినది; ఉన్నట్టి = అటువంటి; కర్మ = కర్మముల; చయమున్ = సమూహమును; అప్పటప్పటికి = ఎప్పటి కప్పుడు; అడగని = అణగనిది.
అట్టి = అయిన; ప్రకృతి = స్వభావము; కలుగు = ఉండెడి; పురుషుని = మానవుని; భోగ = అనుభవించుటకు; ఘటన = అయినట్టి; దేహ = శరీరమునకు; కారణ = కారణ మైనట్టి; ఆరంభ = మొదటి; రూప = రూపముల; మార్గంబు = విధానములు; మొదలు = మొదలైనవాటిని; మాటిమాటికిన్ = మరల మరల; అన్నియున్ = సమస్తమును; తేటపడగ = తేటతెల్లముగ తెలియునట్లు.

భావము:

ఐశ్వర్యం, ధైర్యం, కీర్తి, తేజస్సు, జ్ఞానం, వైరాగ్యం అనే ఆరు గుణాలతో; అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, వశిత్వం అనే ఆరు ఈశ్వర లక్షణాలతో నిరంతరం వెలుగొందే మునీశ్వరా! ముందుగా ముక్తిమార్గాన్ని నాకు చక్కగా వివరించి చెప్పావు. నివృత్తి మార్గాన్ని అనుసరించిన మానవుడు క్రమంగా జ్ఞానయోగం ద్వారా బ్రహ్మసాయుజ్యాన్ని పొందుతాడని వెల్లడించావు. మానవుడు సత్త్వరజస్తమో గుణాల ప్రభావం వల్ల ప్రకృతికి లొంగిపోయి అనేక దుష్కర్మలను ఆచరిస్తాడు. అందుకు ఫలితంగా మాటిమాటికి దేహాలు ధరించి సంసార బంధాలలో చిక్కుకొంటాడు. దీనినే ప్రవృత్తిమార్గం అంటారు. ఈ మార్గాన్ని కూడా నాకు తేటతెల్లంగా తెలిపావు.