షష్ఠ స్కంధము : గ్రంథకర్త వంశ వర్ణనము
- ఉపకరణాలు:
ఆడదు భర్తమాట కెదురాడదు వచ్చినవారి వీఁడగా
నాడదు పెక్కుభాష లెడనాడదు వాకిలి వెళ్ళి, కల్ల మా
టాడదు మిన్నకేని సుగుణావళి కిందిరగాక సాటి యే
చేడియ లేదు చూరికుల శేఖరు కస్వయ ముమ్మడమ్మకున్.
టీకా:
ఆడదు = పలుకదు; భర్త = మొగుని; మాట = మాట; కున్ = కు; ఎదురాడదు = ఎదురు చెప్పదు; వచ్చినవారి = ఇంటికి వచ్చినవారిని; వీడగాన్ = వదలిపొవునట్లు; ఆడదు = పలుకదు; పెక్కు = అనేక; భాషల = మాటల; ఎడన్ = పెడసరముగా; ఆడదు = పలుకదు; వాకిలి = గుమ్మము దాటి బయటకు; వెళ్ళి = వెళ్ళి; కల్ల = అనవసరపు మాటలను; మాటాడదు = మాట్లాడదు; మిన్నకేని = మాట్లాక నుండును గాని; సుగుణ = (ఆమె) మంచి గుణముల; ఆవళి = సమూహముల; కిన్ = కు; ఇందిర = లక్ష్మీదేవి; కాక = కాకుండ; సాటి = సరిపడగలిగిన; ఏ = ఎవరు; చేడియలు = స్త్రీలు; ఏరుచూరి = ఏరుచూరి వంశపు; కుల = మంచివంశపు; శేఖరు = ఉత్తముడు; కస్వయ = కసువయుని యొక్క; ముమ్మడమ్మ = ముమ్మడమ్మ; కున్ = కి;
భావము:
ముమ్మడమ్మ భర్త మాటకు ఎదురాడదు. ఇంటికి వచ్చినవారిని వెళ్ళగొట్టదు. వాకిలి దాటి పెద్దగా మాట్లాడదు. హాస్యానికైనా అసత్యమాడదు. ఏరుచూరి కులశేఖరుడైన కసువన్న భార్య అయిన ఆ ముమ్మడమ్మకు సుగుణాలలో లక్ష్మీదేవి తప్ప మరే స్త్రీ కూడ సాటి కాదు.