షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము
- ఉపకరణాలు:
"తేజంబు నాయువును వి
భ్రాజిత దివ్యాయుధములుఁ బరువడి వృత్రుం
డాజి ముఖంబున మ్రింగెను
మా జయ మింకెందుఁ? జెప్పుమా; జగదీశా! "
టీకా:
తేజంబున్ = తేజస్సులను; వాయువును = ప్రాణములను; విభ్రాజిత = విశిష్టముగా ప్రకాశించెడి; దివ్య = దివ్యమైన; ఆయుధములున్ = ఆయుధములను; పరువడి = క్రమముగా; వృత్రుండు = వృత్రుడు; ఆజి = యుద్ధ; ముఖంబునన్ = భూమిలో; మ్రింగెను = మింగివేసెను; మా = మా యొక్క; జయము = విజయము; ఇంకెందు = ఇంకెక్కడిది; చెప్పుమా = చెప్పుము; జగదీశా = హరి {జగదీశుడు - జగత్ (జగత్తునకు) ఈశుడు, విష్ణువు}.
భావము:
“ఓ జగదీశ్వరా! ఆ వృత్రాసురుడు మా తేజస్సును, ఆయుస్సును, గొప్ప గొప్ప ఆయుధాలను యుద్ధరంగంలో బలవంతంగా కబళించి వేశాడు. ఇక మాకు గెలుపనేది ఎక్కడున్నది?”