పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : వృత్రాసుర వృత్తాంతము

  •  
  •  
  •  

6-335-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"దుర్గమంబు లయిన స్వర్గాది ఫలములఁ
బుట్టఁజేయఁ జాలుట్టి గుణము
లిగి మెలఁగుచున్న నుఁడ వై నట్టి నీ
రయ మ్రొక్కువార మాదిపురుష!

టీకా:

దుర్గమంబులు = దాటరానివి; అయిన = అయినట్టి; స్వర్గ = స్వర్గప్రాప్తి; ఆది = మొదలగు; ఫలములన్ = ఫలితములను; పుట్టన్ = జనించునట్లు; చేయ = చేయుటకు; చాలు = సామర్థ్యము గలిగిన; అట్టి = అటువంటి; గుణము = లక్షణములు; కలిగి = ఉండి; మెలుగుచున్న = ప్రవర్తిస్తున్న; ఘనుడవు = గొప్పవాడవు; ఐనట్టి = అయినట్టి; నీ = నీ; కున్ = కు; అరయ = మాటిమాటికిని; మ్రొక్కువారము = నమస్కరించెడివారము; ఆదిపురుష = విష్ణుమూర్తి.

భావము:

“ఆదిపురుషా! అందరాని స్వర్గాది పుణ్యఫలాలను ప్రాప్తింప జేసే సహజగుణం కలిగిన మహానుభావుడవు. నీకు మ్రొక్కుతున్నాము.