షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము
- ఉపకరణాలు:
అనుదినము దీని నెవ్వరు
వినిరేనిఁ బఠించిరేని విస్మయ మొదవన్
ఘన భూతజాల మెల్లను
మునుకొని వారలను గాంచి మ్రొక్కుచు నుండున్.
టీకా:
అనుదినము = ప్రతిదినము; దీనిన్ = దీనిన్; ఎవ్వరు = ఎవరైనా; వినిరేని = విన్నట్లయితే; పఠించిరేని = చదివిరేని; విస్మయము = ఆశ్చర్యము; ఒదవన్ = కలుగునట్లు; ఘన = గొప్ప; భూత = జీవ; జాలము = సమూహములు; ఎల్లను = అన్నియును; మునుకొని = పూని; వారలను = వారిని; కాంచి = చూసి; మ్రొక్కుచునుండున్ = పూజించు చుండును.
భావము:
ఈ నారాయణ కవచాన్ని ఎవరైతే ప్రతినిత్యం వింటారో, పఠిస్తారో అటువంటి వారిని దర్శించగానే ఆశ్చర్యకరంగా సమస్త జీవకోటి భక్తితో నమస్కరిస్తారు.