షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము
- ఉపకరణాలు:
"నారాయణ కవచ సమా
ధారణ పుణ్యాస్థి దీని దగ్గఱ నీకుం
గూరెడినె? విష్ణుభక్తుల
వారక చేరంగ నెట్టివారికిఁ దరమే?
టీకా:
నారాయణకవచ = నారాయణకవచమును; సమ = మిక్కిలిగ; ధారణ = ధరించిన; పుణ్యు = పుణ్యుని; అస్థి = ఎముక; దీని = దీని; దగ్గఱ = వద్ద; నీ = నీ; కున్ = కు; కూరెడినే = ఘటించ సాధ్యమా; విష్ణు = విష్ణుమూర్తి యొక్క; భక్తులన్ = భక్తులను; వారక = విడువక; చేరంగ = దగ్గరకు వెళ్ళుటకు, దాటుటకు; ఎట్టి = ఎటువంటి; వారికిన్ = వారికైనను; తరమె = సాధ్యమా.
భావము:
“నారాయణ కవచాన్ని ధరించి దేహం విడిచిన పుణ్యాత్ముని అస్థికలివి. వీని దగ్గర నీ మహిమలు పని చేయవు. విష్ణుభక్తులను అతిక్రమించి వెళ్ళడం ఎవరికి సాధ్యం?