పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము

  •  
  •  
  •  

6-304-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యఁగ నెల్ల లోకములు నంకిలి నొంద మహార్ణవంబులో
నొరిగి నిమగ్న మైన ధర నుద్ధతిఁ గొమ్మున నెత్తినట్టి యా
కిరిపతి యగ్ని కల్పుఁ డురుఖేలుఁడు నూర్జిత మేదినీ మనో
రుఁడు గృపావిధేయుఁడు సదాధ్వములన్ననుఁ గాచుఁగావుతన్.

టీకా:

అరయగన్ = చూడగా; ఎల్ల = సమస్తమైన; లోకములున్ = లోకములు; అంకిలి = కలత, ఆపద; ఒందన్ = బారగా, పొందగా; మహార్ణవంబు = మహాసముద్రము; లోన్ = లోపల; ఒరిగి = ఒరిగిపోయి; నిమగ్నము = మునిగి ఉన్నది; ఐన = అయిన; ధరన్ = భూమిని; ఉద్ధతిన్ = ఉద్దరించుటకు; కొమ్మునన్ = కోరలపై; ఎత్తిన = ధరించిన; అట్టి = అటువంటి; ఆ = ఆ; కిరిపతి = యజ్ఞవరాహుడు {కిరిపతి - కిరి (వరాహము) పతి (ప్రభువు), వరాహావతారుడు}; అగ్నికల్పుడు = అగ్నికల్పుడు; ఉరు = గొప్పగ; ఖేలుడు = క్రీడించువాడు; ఊర్జిత = గొప్పది అయిన, దృఢమైన; మేదినీ = భూదేవికి; మనోహరుడు = ప్రియుడు; కృప = దయకు; విధేయుడు = లొంగిపోవువాడు; సదా = ఎల్లప్పుడు; అధ్వములన్ = దారుల యందు; నన్ను = నన్ను; కాచుగావుత = కాపాడుగాక.

భావము:

లోకాలన్నీ మహాసముద్రం మధ్య మునిగినప్పుడు భూదేవిని ఉద్ధరించి తన కోర కొనపై ధరించిన అగ్నిసమానుడు, క్రీడావినోది, ధరణీమనోహరుడు, కారుణ్యనిధి అయిన ఆది వరాహమూర్తి నన్ను ఎల్లప్పుడు సకల దారులందు కాపాడునుగాక!