షష్ఠ స్కంధము : శ్రీమన్నారాయణ కవచము
- ఉపకరణాలు:
వటుఁడు సమాశ్రిత మాయా
నటుఁడు బలిప్రబల శోభనప్రతిఘటనో
ద్భటుడు త్రివిక్రమదేవుఁడు
చటులస్థలమందు నన్ను సంరక్షించున్.
టీకా:
వటుడు = బ్రహ్మచారి; సమాశ్రిత = చక్కగా ఆశ్రయించిన; మాయా = మాయా; నటుడు = నటనలు చేసెడి వాడు; బలి = బలిచక్రవర్తి; ప్రబల = అత్యధికమైన; శోభన = తేజస్సును; ప్రతిఘటన = ప్రతిఘటించుట యందు; ఉద్భటుడు = బహు గట్టివాడు, మిక్కిలి సమర్థుడు; త్రివిక్రమదేవుడు = వామనుడు {త్రివిక్రమదేవుడు - త్రివిక్రమావతారము ధరించిన దేవుడు, వామనుడు}; చటుల = భయంకరమైన; స్థలము = ప్రదేశముల; అందు = లో; నన్ను = నన్ను; సంరక్షించున్ = కాపాడుగాక.
భావము:
మాయావటుడై నటించి బలి చక్రవర్తి సంపదను అపహరించిన త్రివిక్రమ దేవుడు నన్ను అన్ని భయంకర స్థలాలలో రక్షించునుగాక!