షష్ఠ స్కంధము : దేవాసుర యుద్ధము
- ఉపకరణాలు:
ఇట్లు బ్రహ్మదేవుండు దేవేంద్రప్రముఖు లయిన దేవతల కనుకంపాతిశయ విభవంబున నభయం బొసంగి యిట్లనియె.
టీకా:
ఇట్లు = ఈ విధముగ; బ్రహ్మదేవుండు = చతుర్ముఖబ్రహ్మ; దేవేంద్ర = దేవేంద్రుడు; ప్రముఖులు = మొదలగు గొప్పవారు; అయిన = అయిన; దేవతల్ = దేవతల; కు = కు; అనుకంప = కనికరము; అతిశయ = మిక్కుటమైన, విశేషమైన; విభవంబునన్ = వైభవముతో; అభయంబున్ = అభయము; ఒసంగి = ఇచ్చి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:
ఈ విధంగా బ్రహ్మదేవుడు ఇంద్రుడు మొదలైన దేవతలకు విశేషమైన దయతో అభయమిచ్చి ఇలా అన్నాడు.