పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : పూర్ణి

  •  
  •  
  •  

5.2-165-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జలజభవాది దేవ ముని సన్నుత తీర్థపదాంబుజాత! ని
ర్మల నవరత్న నూపుర విరాజిత! కౌస్తుభ భూషణాంగ! యు
జ్జ్వల తులసీ కురంగ మదవాసనవాసిత దివ్యదేహ! శ్రీ
నిలయ శరీర! కృష్ణ! ధరణీధర! భాను శశాంకలోచనా!

టీకా:

జలజభవాదిదేవమునిసన్నుత = శ్రీకృష్ణా {జలజభవాది దేవ ముని సన్నుతుడు -జలజభవ (బ్రహ్మ) ఆది (మొదలైన) దేవతలు మునులు చే (సన్నుతుడు) స్తుతింపబడువాడు, కృష్ణుడు}; తీర్థపదాంబుజాత = శ్రీకృష్ణా {తీర్థ పదాంబుజాతుడు - తీర్థ (పుణ్య గంగానదికి నిలయమైన) పద (పాదములు అనెడి) అంబుజాతుడు (పద్మములు కలవాడు), కృష్ణుడు}; నిర్మలనవరత్ననూపురవిరాజిత = శ్రీకృష్ణా {నిర్మల నవరత్న నూపుర విరాజితుడు - నిర్మల (స్వచ్ఛమైన) నవరత్నములు పొదిగిన నూపుర (అందెలు)తో విరాజిల్లువాడు, కృష్ణుడు}; కౌస్తుభభూషణాంగ = శ్రీకృష్ణా {కౌస్తుభ భూషణాంగుడు - కౌస్తుభమణిచే భూషణ (అలంకరింపబడిన) అంగుడు (దేహము కలవాడు), కృష్ణుడు}; ఉజ్జ్వలతులసీకురంగమదవాసనవాసితదివ్యదేహ = శ్రీకృష్ణా {ఉజ్జ్వల తులసీ కురంగమద వాసన వాసిత దివ్య దేహుడు - ఉజ్జ్వలమైన తులసి యొక్క కురంగ మదము (కస్తూరి యొక్క) సువాసనలచే వాసిత (పరిమళించుతున్న) దేహుడు (శరీరముగలవాడు), కృష్ణుడు}; శ్రీనిలయశరీర = శ్రీకృష్ణా {శ్రీనిలయశరీరుడు - శ్రీ (సంపదలకు) నిలయమైన శరీరముగలవాడు, కృష్ణుడు}; కృష్ణ = శ్రీకృష్ణా {కృష్ణ - కృష్ణుడు}; ధరణీధర = శ్రీకృష్ణా {ధరణీధరః - ధరణి (భూమిని) ధరుడు (మోయువాడు), విష్ణువు, విష్ణుసహస్రనామములు శ్రీశంకరభాష్యం 235వ నామం}; భానుశశాంకలోచనా = శ్రీకృష్ణా {భాను శశాంక లోచనుడు - భాను (సూర్యుడు) శశాంక (చంద్రుడు) లోచనుడు (కన్నులుగా కలవాడు), కృష్ణుడు};

భావము:

బ్రహ్మ మొదలైన దేవతలు, మునుల చేత స్తుతింపబడేవి, పుణ్య గంగా తీర్థమునకు నెలవైన పాదపద్మములు కలవాడా! స్వచ్ఛమైన నవరత్నాలతో ప్రకాశించే కాలి అందెలు కలవాడా! కౌస్తుభ మణి భూషణంగా కలవాడా! గొప్పనైన తులసీదళాల, కస్తూరి సుగంధాలు గుబాళించే దివ్యదేహం కలవాడా! లక్ష్మీదేవికి నిలయమైన శరీరం కలవాడా! భూభారాన్ని వహించేవాడా! సూర్య చంద్రులే కన్నులుగా గలవాడా! కృష్ణా!