పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : భగణ విషయము

 •  
 •  
 •  

5.2-93-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

శింశుమారాఖ్యగు చక్రమున భాగ-
తుఁడైన ధ్రువుఁ డింద్ర రుణ కశ్య
ప్రజాపతి యమప్రముఖులతోఁ గూడి-
హుమానముగ విష్ణుదముఁ జేరి
ణఁక నిచ్చలుఁ బ్రదక్షిముగాఁ దిరుగుచుఁ-
జెలఁగి యుండును గల్పజీవి యగుచు;
నఘుఁ డుత్తాన పాదాత్మజుఁ డార్యుఁడు-
యిన యా ధ్రువుని మత్త్వ మెల్లఁ

5.2-93.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దెలిసి వర్ణింప బ్రహ్మకు విగాదు
నే నెఱింగినయంతయు నీకు మున్న
తెలియఁ బలికితిఁ; గ్రమ్మఱఁ లఁచికొనుము
జితరిపువ్రాత! శ్రీపరీక్షిన్నరేంద్ర!

టీకా:

ఆ = ఆ; శింశుమార = శింశుమారము యనెడి; ఆఖ్యము = పేరుగలది; అగు = అయిన; చక్రమున = చక్రమునందు; భాగవతుడు = భాగవతుడు; ఐన = అయిన; ధ్రువుడు = ధ్రువుడు; ఇంద్ర = ఇంద్రుడు; వరుణ = వరుణుడు; కశ్యప = కశ్యపుడు యనెడి; ప్రజాపతి = ప్రజాపతి; యమ = యముడు; ప్రముఖుల్ = మొదలగు ముఖ్యుల; తోన్ = తోటి; కూడి = కలిసి; బహుమానముగ = సమ్మానరూపముగ; విష్ణుపదమున్ = విష్ణులోకమును; చేరి = ఒంగి; కణక = కడక, యత్నించి; నిచ్చలున్ = నిత్యము; ప్రదక్షిణమున్ = చుట్టుతిరుగుచు; చెలగి = చక్కగా; ఉండునున్ = ఉండును; కల్పజీవి = బ్రహ్మకల్పాంతము ఉండెడి జీవి; అగుచున్ = అగుచు; అనఘుడు = పుణ్యుడు; ఉత్తానపాద = ఉత్తానపాదుని; ఆత్మజుడు = పుత్రుడు; ఆర్యుడు = పూజ్యుడు; అయిన = అయినట్టి; = ఆ = ఆ; ధ్రువుని = ధ్రువుని; మహత్త్వమున్ = గొప్పదనమును; ఎల్లన్ = అంతటిని; తెలిసి = తెలిసికొని;
వర్ణింపన్ = కీర్తించుటకు; బ్రహ్మ = బ్రహ్మదేవుని; కున్ = కి; అలవి = సాధ్యము; కాదు = కాదు; నేన్ = నేను; ఎఱింగిన = తెలిసినది; అంతయున్ = అంతా; నీవు = నీవు; కున్ = కు; మున్నన్ = ఇంతకు ముందే; తెలియ = తెలియునట్లు; పలికితిన్ = చెప్పితిని; క్రమ్మఱన్ = మరల; తలచికొనుము = జ్ఞప్తిచేసుకొనుము; జిత = జయించిన; రిపు = శత్రువుల; వ్రాత = సమూహముగలవాడ; శ్రీ = సంపత్కరమైన; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్ర = రాజా;

భావము:

పరీక్షిన్మహారాజా! ఆ శింశుమారచక్రంలో పరమ భక్తుడైన ధ్రువుడు ఉన్నాడు. అతడు ఇంద్రుడు, వరుణుడు, కశ్యపుడు, యముడు మొదలైన దేవతలతో, ప్రజాపతులతో విష్ణుపదానికి ప్రతినిత్యం ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. అతడు కల్పం చివరిదాకా జీవిస్తాడు. ఉత్తానపాదుని కుమారుడైన ఆ ధ్రువుడు పూజ్యుడు, మహాత్ముడు. ఆయన మహిమలను బ్రహ్మకూడా వర్ణింపలేడు. నాకు తెలిసిన విశేషాలన్నీ నీకు ముందే తెలియజేశాను. ఒకసారి ఆ కథలన్నీ గుర్తుకు తెచ్చుకో.