పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - ఉత్తర : ఉపోద్ఘాతము

  •  
  •  
  •  

5.2-1-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  



శ్రీకాంతాహృదయప్రియ!
లోకాలోకప్రచార! లోకేశ్వర! సు
శ్లో! భవభయనివారక!
గోకులమందార! నందగోపకుమారా!

టీకా:

శ్రీకాంతాహృదయప్రియ = శ్రీకృష్ణా {శ్రీకాంతా హృదయ ప్రియ - శ్రీకాంత (లక్ష్మీదేవి) యొక్క హృదయమునకు ప్రియ (ప్రియమైనవాడు), విష్ణువు}; లోకాలోకప్రచార = శ్రీకృష్ణా {లోకాలోకప్రచార - లోక (లోకములందును) అలోక (లోకములు లేనప్పుడును) ప్ర (చక్కగా) చార (వర్తించెడివాడు), లోకాలోక పర్వతముల వరకు ప్రచారము గలవాడు, విష్ణువు}; లోకేశ్వర = శ్రీకృష్ణా {లోకేశ్వరుడు – లోకము లన్నిటికిని ఈశ్వరుడు, విష్ణువు}; సుశ్లోక = శ్రీకృష్ణా {సుశ్లోక - సు (మంచివారి)చేత శ్లోక (స్తుతింపబడువాడు), విష్ణువు}; భవభయనివారక = శ్రీకృష్ణా {భవ భయ నివారకుడు - భవ (సంసారము) వలని భయ (భయమును) నివారకుడు (పోగొట్టువాడు), విష్ణువు}; గోకులమందార = శ్రీకృష్ణా {గోకుల మందార - గోకులమునకు మందార (కల్పవృక్షము వంటివాడు), కృష్ణుడు}; నందగోపకుమారా = శ్రీకృష్ణా {నందగోప కుమారుడు - నందగోపుని యొక్క కుమారుడు, కృష్ణుడు};

భావము:

లక్ష్మీదేవి తన మనస్సులో మెచ్చినవాడా! విశ్వం అంతటి యందు పేరెన్నిక గన్నవాడా! లోకాలన్నిటికి ప్రభువైనవాడా! మంచి కీర్తి కలవాడా! గోకులానికి కల్పవృక్షం వంటివాడా! నందగోపుని కుమారా! శ్రీకృష్ణా!.
ఈ స్కంధం గంగనార్యుల వారి కృతి. పోతన సంప్రదాయాన్ని అనుసరిస్తు చేసిన ఈ ద్వితీయాశ్వాస ప్రారంభ స్తోత్రంలో ‘లోకాలోకప్రచార ’ అనటంతో సందర్భ సార్థక్యం పాటించబడింది. అలా లోకాలను, అలోకాలను, లోకాలోక పర్వతాన్ని వివరించబడుతా యని సూచింపబడింది.

5.2-2-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సకల పురాణార్థ జ్ఞాన విఖ్యాతుం డగు సూతుం డిట్లనియె.


^ <<<<పంచమ స్కంధ పూర్వాశ్వాసము - పూర్ణి

టీకా:

సకల = సమస్తమైన; పురాణ = పురాణముల; అర్థ = ప్రయోజనములు; జ్ఞాన = విజ్ఞానములు కలిగిన; విఖ్యాంతుడు = ప్రసిద్ధుడు; అగు = అయినట్టి; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

సకల పురాణాల అర్థం జ్ఞానం తెలిసిన గొప్ప కీర్తివంతుడైన సూతుడు ఇలా చెప్పాడు.