పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : ఋషభుని జన్మంబు

  •  
  •  
  •  

5.1-41-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రవరేణ్యుఁడైన నాభి సంతానార్థ
మంగనయును దాను జ్ఞపురుషుఁ
యిన వాసుదేవు తుల భక్తిశ్రద్ధ
ను జెలంగి పూజ లొరఁ జేసి.

టీకా:

నర = నరులలో; వరేణ్యుడు = ఉత్తముడు; ఐన = అయిన; నాభి = నాభి; సంతాన = సంతానము; అర్థమున్ = కోసము; అంగనయున్ = భార్య; తానున్ = తను; యజ్ఞ = యజ్ఞమునకు; పురుషుడు = భర్త; అయిన = అయిన; వాసుదేవున్ = విష్ణుదేవుని; అతుల = సాటిలేని; భక్తి = భక్తితోను; శ్రద్ధలను = శ్రద్ధలతోను; చలంగి = విజృంభించి; పూజల్ = పూజలను; ఒనరన్ = చక్కగా; చేసి = చేసి.

భావము:

రాజైన నాభి తన భార్య అయిన మేరుదేవి సమేతంగా సంతానం కోసం శ్రద్ధాభక్తులతో యజ్ఞపురుషుడైన వాసుదేవుణ్ణి పూజించి…