పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : పూర్ణి

  •  
  •  
  •  

5.1-183-మాలి.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సహృదయవాసా! చారులక్ష్మీవిలాసా!
రితశుభచరిత్రా! భాస్కరాబ్జారినేత్రా!
నిరుపమఘనగాత్రా! నిర్మలజ్ఞానపాత్రా!
గురుతరభవదూరా! గోపికాచిత్తచోరా!

టీకా:

సరసహృదయవాసా = శ్రీకృష్ణ {సరస హృదయ వాసా - సరసుల హృదయము లందు వసించెడివాడ, శ్రీకృష్ణ}; చారులక్ష్మీవిలాసా = శ్రీకృష్ణ {చారులక్ష్మీ విలాసా - చారు (అందమైన) లక్ష్మీ (లక్ష్మీకళతో) విలాసిల్లెడివాడ, శ్రీకృష్ణ}; భరితశుభచరిత్రా = శ్రీకృష్ణ {భరిత శుభచరిత్రా - భరిత (నిండైన) శుభచరిత్ర కలవాడ, శ్రీకృష్ణ}; భాస్కరాబ్జారినేత్రా = శ్రీకృష్ణ {భాస్కరాబ్జారి నేత్రా - భాస్కర (సూర్యుడు) అబ్జారి (పద్మములకు శత్రువైన చంద్రుడు) వంటి నేత్రా (కన్నులు కలవాడ), శ్రీకృష్ణ}; నిరుపమఘనగాత్రా = శ్రీకృష్ణ {నిరుపమ ఘన గాత్రా - నిరుపమ (సాటిలేని) ఘన (గొప్ప, మేఘముల వంటి) గాత్ర (శరీరము కలవాడ), శ్రీకృష్ణ}; నిర్మలజ్ఞానపాత్రా = శ్రీకృష్ణ {నిర్మల జ్ఞాన పాత్రా - నిర్మల (స్వచ్ఛమైన) జ్ఞానముచే పాత్ర (తగినవాడ), శ్రీకృష్ణ}; గురుతరభవదూరా = శ్రీకృష్ణ {గురుతర భవదూరా - గురుతర (మిక్కిలి భారమైన) భవ (సంసారబాధలను) విదూర (తొలగించువాడ), శ్రీకృష్ణ}; గోపికా చిత్తచోరా = శ్రీకృష్ణ {గోపికాచిత్తచోరా - గోపికల చిత్తములను దొంగిలించినవాడ, శ్రీకృష్ణ}; = {గురు - గురుతరము -గురుతమము}

భావము:

సరసుల హృదయాలలో నివసించేవాడా! అందమైన లక్ష్మీకళతో విలసిల్లేవాడా! గొప్ప శుభచరిత్ర కలవాడా! సూర్య చంద్రులు కన్నులుగా గలవాడా! సాటిలేని మేఘం వంటి శరీరం కలవాడా! స్వచ్ఛమైన జ్ఞానంతో ఒప్పేవాడా! గొప్ప సంసారభారాన్ని దూరం చేసేవాడా! గోపికల మనస్సులను దొంగిలించినవాడా! కృష్ణా!