పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

పంచమ స్కంధము - పూర్వ : పూర్ణి

  •  
  •  
  •  

5.1-181-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవాసుర యక్షరాక్షస మునీంద్రస్తుత్య! దివ్యాంబరా
ణాలంకృత! భక్తవత్సల! కృపాపారీణ! వైకుంఠ మం
ది! బృందావనభాసురప్రియధరిత్రీనాథ! గోవింద! శ్రీ
! పుణ్యాకర! వాసుదేవ! త్రిజగత్కల్యాణ! గోపాలకా!

టీకా:

నరదేవాసురయక్షరాక్షసమునీంద్రస్తుత్య = శ్రీకృష్ణ {నర దేవాసుర యక్ష రాక్షస మునీంద్ర స్తుత్య - మానవులు దేవతలు దైత్యులు యక్షులు రాక్షసులు మునులలోఇంద్రుని వంటివారుచేత స్తుతింపబడువాడ, శ్రీకృష్ణ}; దివ్యాంబరాభరణాలంకృత = శ్రీకృష్ణ {దివ్యాంబ రాభర ణాలంకృత - దివ్యమైన వస్త్రములు ఆభరణములచే అలంకరింపబడినవాడ, శ్రీకృష్ణ}; భక్తవత్సల = శ్రీకృష్ణ {భక్త వత్సల -భక్తుల యెడ వాత్సల్యము కలవాడ, శ్రీకృష్ణ}; కృపాపారీణ = శ్రీకృష్ణ {కృపా పారీణ - దయ సంపూర్ణముగా కలవాడ, శ్రీకృష్ణ}; వైకుంఠమందిర = శ్రీకృష్ణ {వైకుంఠ మందిర - వైకుంఠము నివాసముగా కలవాడ, శ్రీకృష్ణ}; బృందావనభాసుర = శ్రీకృష్ణ {బృందావన భాసుర - బృందావనమునందు ప్రకాశించువాడ, శ్రీకృష్ణ}; ప్రియధరిత్రీనాథ = శ్రీకృష్ణ {ప్రియధరిత్రీనాథ - ప్రియమైన భూదేవికి భర్తా, శ్రీకృష్ణ}; గోవింద = శ్రీకృష్ణ {గోవింద - గోవులకు విందుడ, శ్రీకృష్ణ}; శ్రీకర = శ్రీకృష్ణ {శ్రీకర - శుభములను కలిగించువాడ,శ్రీకృష్ణ}; పుణ్యాకర = శ్రీకృష్ణ {పుణ్యాకర - పుణ్యములకు ఆకర (నివాసమైనవాడ), శ్రీకృష్ణ}; వాసుదేవ = శ్రీకృష్ణ {వాసుదేవ - వసుదేవుని పుత్రుడా, శ్రీకృష్ణ}; త్రిజగత్కల్యాణ = శ్రీకృష్ణ {త్రిజగత్కల్యాణ - త్రిజగత్ (ముల్లోకములకు) కల్యాణ (శుభము చేకూర్చువాడ), శ్రీకృష్ణ}; గోపాలకా = శ్రీకృష్ణ {గోపాలకా - గోవులను పరిపాలించినవాడ, శ్రీకృష్ణ}.

భావము:

నరులచే దేవతలచే అసురులచే యక్షులచే రాక్షసులచే మహామునులచే స్తుతింపబడేవాడా! దివ్య వస్తాలు, భూషణాలచే అలంకరింపబడినవాడా! భక్తుల పట్ల వాత్సల్యం చూపేవాడా! సంపూర్ణ దయ కలవాడా! వైకుంఠ నివాసా! బృందావనంలో ప్రకాశించేవాడా! ప్రియమైన భూదేవికి భర్త అయినవాడా! గోవులను సంతోషపెట్టేవాడా! సంపదలను, పుణ్యాలను ప్రసాదించేవాడా! ముల్లోకాలకు శుభం అందించేవాడా! గోవులను పాలించినవాడా! కృష్ణా!

5.1-182-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మపదవాస! దుష్కృత
! కరుణాకర! మహాత్మ! తదితిసుత! భా
సుగోపికామనోహర!
సిజదళనేత్ర! భక్తననుతగాత్రా!

టీకా:

పరమపదవాస = శ్రీకృష్ణ {పరమపద వాస - పరమపదము (వైకుంఠము)న వాస (వసించెడివాడ), శ్రీకృష్ణ}; దుష్కృతహర = శ్రీకృష్ణ {దుష్కృత హర - దుష్కృతములు (పాపములు) హరించువాడ (పోగొట్టువాడ), శ్రీకృష్ణ}; కరుణాకర = శ్రీకృష్ణ {కరుణాకర - కరుణ (దయకు) ఆకర (స్థానము యైనవాడ), శ్రీకృష్ణ}; మహాత్మ = శ్రీకృష్ణ {మహాత్మ - గొప్ప ఆత్మ కలవాడ , శ్రీకృష్ణ}; హతదితిసుత = శ్రీకృష్ణ {హత దితిసుత - సంహరించిన దితిసుతులు (దైత్యులు) కలవాడ, శ్రీకృష్ణ}; భాసురగోపికామనోహర = శ్రీకృష్ణ {భాసుర గోపికా మనోహర - భాసుర (ప్రకాశవంతమైన) గోపికా (గోపికల యొక్క) మనః (మనసులను) హర (దొంగిలించినవాడ), శ్రీకృష్ణ}; = సరసిజదళనేత్ర = శ్రీకృష్ణ {సరసిజ దళ నేత్ర - సరసిజ (పద్మము యొక్క) దళ (రేకు)లవంటి నేత్రములు కలవాడ, శ్రీకృష్ణ}; భక్తజననుతగాత్ర = శ్రీకృష్ణ {భక్తజన నుత గాత్ర - భక్తజన (భక్తులైనవారి)చేత నుత (స్తోత్రములు)చేయబడుతున్న గాత్ర (దేహము కలవాడ), శ్రీకృష్ణ}.

భావము:

పరమపదమైన వైకుంఠంలో నివసించేవాడా! పాపాలను హరించేవాడా! దయకు నిలయమైనవాడా! మహానుభావా! రాక్షసులను చంపినవాడా! అందమైన గోపికల మనస్సులను కొల్లగొట్టినవాడా! కమలదళాల వంటి కన్నులు కలవాడా! భక్తులచే స్తుతింపబడే దివ్యదేహం కలవాడా! కృష్ణా!

5.1-183-మాలి.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సహృదయవాసా! చారులక్ష్మీవిలాసా!
రితశుభచరిత్రా! భాస్కరాబ్జారినేత్రా!
నిరుపమఘనగాత్రా! నిర్మలజ్ఞానపాత్రా!
గురుతరభవదూరా! గోపికాచిత్తచోరా!

టీకా:

సరసహృదయవాసా = శ్రీకృష్ణ {సరస హృదయ వాసా - సరసుల హృదయము లందు వసించెడివాడ, శ్రీకృష్ణ}; చారులక్ష్మీవిలాసా = శ్రీకృష్ణ {చారులక్ష్మీ విలాసా - చారు (అందమైన) లక్ష్మీ (లక్ష్మీకళతో) విలాసిల్లెడివాడ, శ్రీకృష్ణ}; భరితశుభచరిత్రా = శ్రీకృష్ణ {భరిత శుభచరిత్రా - భరిత (నిండైన) శుభచరిత్ర కలవాడ, శ్రీకృష్ణ}; భాస్కరాబ్జారినేత్రా = శ్రీకృష్ణ {భాస్కరాబ్జారి నేత్రా - భాస్కర (సూర్యుడు) అబ్జారి (పద్మములకు శత్రువైన చంద్రుడు) వంటి నేత్రా (కన్నులు కలవాడ), శ్రీకృష్ణ}; నిరుపమఘనగాత్రా = శ్రీకృష్ణ {నిరుపమ ఘన గాత్రా - నిరుపమ (సాటిలేని) ఘన (గొప్ప, మేఘముల వంటి) గాత్ర (శరీరము కలవాడ), శ్రీకృష్ణ}; నిర్మలజ్ఞానపాత్రా = శ్రీకృష్ణ {నిర్మల జ్ఞాన పాత్రా - నిర్మల (స్వచ్ఛమైన) జ్ఞానముచే పాత్ర (తగినవాడ), శ్రీకృష్ణ}; గురుతరభవదూరా = శ్రీకృష్ణ {గురుతర భవదూరా - గురుతర (మిక్కిలి భారమైన) భవ (సంసారబాధలను) విదూర (తొలగించువాడ), శ్రీకృష్ణ}; గోపికా చిత్తచోరా = శ్రీకృష్ణ {గోపికాచిత్తచోరా - గోపికల చిత్తములను దొంగిలించినవాడ, శ్రీకృష్ణ}; = {గురు - గురుతరము -గురుతమము}

భావము:

సరసుల హృదయాలలో నివసించేవాడా! అందమైన లక్ష్మీకళతో విలసిల్లేవాడా! గొప్ప శుభచరిత్ర కలవాడా! సూర్య చంద్రులు కన్నులుగా గలవాడా! సాటిలేని మేఘం వంటి శరీరం కలవాడా! స్వచ్ఛమైన జ్ఞానంతో ఒప్పేవాడా! గొప్ప సంసారభారాన్ని దూరం చేసేవాడా! గోపికల మనస్సులను దొంగిలించినవాడా! కృష్ణా!

5.1-184-గ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇది సకల సుకవిజనానందకర బొప్పనామాత్యపుత్ర గంగనార్యప్రణీతంబైన శ్రీ మహాభాగవతపురాణమునందుఁ బ్రియవ్రతుని సుజ్ఞాన దీక్షయు, బ్రహ్మదర్శనంబును, నాగ్నీధ్రాదుల జన్మంబును, నుత్తమ తామస రైవతుల జన్మంబును, బ్రియవ్రతుండు వనంబునకుం జనుటయు, నాగ్నీధ్రుం డప్సరసం బరిగ్రహించుటయు, వర్షాధిపతుల జన్మంబును, నాగ్నీధ్రుండు వనంబునకుం జనుటయు, నాభి ప్రముఖుల రాజ్యంబును, నాభి యజ్ఞంబును, ఋషభుని జన్మంబును, ఋషభుని రాజ్యభిషేకంబును, భరతుని జన్మంబును, ఋషభుండు దపంబునకుఁ జనుచు సుతులకు నతుల జ్ఞానం బుపదేశించుటయు, భరతుని పట్టాభిషేకంబును, భరతుండు వనంబునకుఁ జనుటయు, భరతుండు హరిణపోతంబునందలి ప్రీతింజేసి హరిణగర్భంబున జనించుటయు, మరల విప్రసుతుండై జనియించుటయు, విప్రుండు చండికాగృహంబున బ్రదికివచ్చుటయు, సింధుపతి విప్ర సంవాదంబును నను కథలు గల పంచమ స్కంధంబు నందుఁ ప్రథమాశ్వాసము సమాప్తము.

టీకా:

ఇది = ఇది; సకల = అఖిలమైన; సు = మంచి; కవి = కవులైన; జన = వారికి; ఆనంద = ఆనందమును; కర = కలిగించెడి; బొప్పనామాత్య = బొప్పనామాత్యుని; పుత్ర = పుత్రుడు; గంగన = గంగన యనెడి; ఆర్య = ఉత్తమునిచే; ప్రణీతంబు = సంస్కరింపబడినది; ఐన = అయినట్టి; శ్రీ = శుభకరమైన; మహా = గొప్ప; భాగవత = భాగవతము అనెడి; పురాణము = పురాణము; అందున్ = లో; ప్రియవ్రతుని = ప్రియవ్రతుని యొక్క; సు = చక్కటి; జ్ఞాన = జ్ఞానము నందు; దీక్షయున్ = దీక్ష; బ్రహ్మ = బ్రహ్మదేవుని; దర్శనంబునున్ = దర్శనము; ఆగ్నీధ్ర = ఆగ్నీధ్రుడు; ఆదుల = మొదలగువారి; జన్మంబునున్ = పుట్టుక; ఉత్తమ = ఉత్తముడు; తామస = తామసుడు; రైవతుల = రైవతుడుల యొక్క; జన్మంబునున్ = పుట్టుక; ప్రియవ్రతుండు = ప్రియవ్రతుడు; వనంబున్ = అడవి; కున్ = కి; చనుటయున్ = వెళ్ళుట; ఆగ్నీధ్రుండు = ఆగ్నీధ్రుడు; అప్సరసన్ = అప్సరసను; పరిగ్రహించుటయున్ = స్వీకరించుట; వర్ష = వర్షముల యొక్క; అధిపతుల = అధిపతుల; జన్మంబునున్ = పుట్టుక; ఆగ్నీధ్రుండు = ఆగ్నీధ్రుడు; వనంబున్ = అడవి; కున్ = కి; చనుటయున్ = వెళ్ళుట; నాభి = నాభి; ప్రముఖుల = మొదలగువారి; రాజ్యంబునున్ = రాజ్యపాలనలు; నాభి = నాభి యొక్క; యజ్ఞంబును = యజ్ఞము; ఋషభుని = ఋషభుని యొక్క; జన్మంబునున్ = పుట్టుక; ఋషభుని = ఋషభుని యొక్క; రాజ్య = రాజ్యమునకు; అభిషేకంబునున్ = పట్టాభిషేకము; భరతుని = భరతుని యొక్క; జన్మంబునున్ = పుట్టుక; ఋషభుండు = ఋషభుడు; తపంబున్ = తపస్సున; కున్ = కు; చనుచున్ = వెళ్ళుచూ; సుతుల్ = పుత్రుల; కున్ = కు; జ్ఞానంబున్ = జ్ఞానమును; ఉపదేశించుటయున్ = ఉపదేశించుట; భరతుని = భరతుని యొక్క; పట్టాభిషేకంబునున్ = పట్టాభిషేకము; భరతుండు = భరతుడు; వనంబున్ = అడవి; కున్ = కి; చనుటయున్ = వెళ్ళుట; భరతుండు = భరతుడు; హరిణ = లేడి; పోతంబున్ = పిల్ల; అందలి = ఎడలి; ప్రీతిన్ = ఆపేక్ష; చేసి = వలన; హరిణ = లేడి; గర్భంబునన్ = కడుపున; జనించుటయున్ = పుట్టుట; మరల = మరల; విప్ర = బ్రాహ్మణ; సూతుండు = పుత్రుడు; ఐ = అయ్యి; జనించుటయున్ = పుట్టుట; విప్రుండు = బ్రాహ్మణుడు; చండికా = కాళికాదేవి; గృహంబునన్ = ఆలయములో; బ్రతికి = ప్రాణములతో; వచ్చుటయున్ = తిరిగివచ్చుట; సింధు = సింధుదేశపు; పతి = రాజు; విప్ర = బ్రాహ్మణుల; సంవాదంబునున్ = సంభాషణము; అను = అనెడి; కథలున్ = కథలు; కల = కలిగిన; పంచమ = ఐదవ; స్కంధంబున్ = స్కంధము; అందున్ = లో; ప్రథమ = మొదటి; ఆశ్వాసము = భాగము; సమాప్తము = సమాప్తము.

భావము:

ఇది సకల సుకవులకు ఆనందాన్ని కలిగించేవాడు, బొప్పనామాత్యుని కుమారుడు అయిన గంగనార్యుని చేత రచింపబడ్డ శ్రీ మహాభాగవత పురాణంలో ప్రియవ్రతుడు పొందిన సుజ్ఞానదీక్ష, బ్రహ్మ సాక్షాత్కారం, ఆగ్నీధ్రుడు మొదలైనవారి జననం, ఉత్తమ తామస రైవత మనువుల జననం, ప్రియవ్రతుడు వనాలకు వెళ్ళడం, ఆగ్నీధ్రుడు అప్సరసను వివాహమాడడం, వర్షాధిపతుల జననం, ఆగ్నీధ్రుడు అడవికి వెళ్ళడం, నాభి మొదలైనవారి రాజ్యపాలనం, నాభిరాజు యజ్ఞం, ఋషభుని జననం, ఋషభుని పట్టాభిషేకం, భరతుని జననం, ఋషభుడు తపస్సు కోసం వెళ్తూ కుమారులకు సాటిలేని జ్ఞానాన్ని బోధించడం, భరతుని పట్టాభిషేకం, భరతుడు వనాలకు వెళ్ళడం, భరతుడు జింకపిల్లమీది ప్రేమతో జింక కడుపుట పుట్టడం, తరువాత బ్రాహ్మణునకు కుమారుడై జనించడం, బ్రాహ్మణుడు చండికాలయం నుండి బ్రతికి రావడం, సింధురాజ భరతుల సంవాదం అనే కథలు కలిగిన పంచమ స్కంధంలో ప్రథమాశ్వాసం సమాప్తం.


ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!