పంచమ స్కంధము - పూర్వ : భరతుండు వనంబుఁ జనుట
- ఉపకరణాలు:
శరణని వచ్చిన జంతువుఁ
గరుణం గను విచ్చి చూచి కాచిన పుణ్యం
బరయఁగ నధికం బని ము
న్గర మెఱిఁగించిరి మునీంద్రగణములు ప్రేమన్.
టీకా:
శరణు = కాపాడు; అని = అని; వచ్చిన = వచ్చినట్టి; జంతువున్ = జంతువును; కరుణన్ = దయతో; కనువిచ్చి = కళ్ళువిప్పి; చూచి = చూసి; కాపాడినన్ = కాపాడితే; పుణ్యంబు = పుణ్యము; అరయగన్ = తరచి చూసిన; అధికంబు = ఎక్కువ; అని = అని; మున్ = పూర్వము; కరమున్ = మిక్కిలిగ; ఎఱిగించిరి = తెలిపిరి; ముని = మునులలో; ఇంద్ర = ఇంద్రుని వంటివారి; గణములున్ = సమూహములు; ప్రేమన్ = ప్రేమతో.
భావము:
శరణు కోరి వచ్చిన ఏ జంతువునైనా కనికరంతో కన్నెత్తి చూచి కాపాడటం కంటే మహాపుణ్యం మరేదీ లేదని మునీంద్రులు చెప్పారు.”