పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : శివుం డనుగ్రహించుట

  •  
  •  
  •  

4-163.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లితనీలాభ్రరుచిఁ గుంతములు దనరఁ
బ్రవిమలాత్మీయ దేహజప్రభ సరోజ
వ భవామర ముఖ్యుల ప్రభలు మాప
ఖిలలోకైక గురుఁడు నారాయణుండు.

టీకా:

మానిత = మన్నింపదగు; శ్యామాయమాన = నల్లనిదైన; శరీర = దేహ; దీధితులు = కాంతులు; నల్దిక్కులన్ = నాలుగు (4) దిక్కులను {నాలుగు దిక్కులు - 1తూర్పు 2దక్షిణము 3పశ్చిమము 4ఉత్తరము}; దీటుకొనగ = పరచుకొనగ; కాంచన = బంగారపు; మేఖలా = మొలనూలు యొక్క; కాంతుల = ప్రకాశముల; తోడన్ = తోటి; కౌశేయచేల = పట్టుబట్ట; ద్యుతుల్ = మెరుపులు; = చెలిమి = స్నేహము; చేయన్ = చేస్తుండగ; లక్ష్మీ = లక్ష్మీదేవితో; సమాయుక్త = కూడిఉన్న; లలిత = అందమైన; వక్షంబున = వక్షస్థలమున; వైజయంతీ = వైజయంతిమాల; ప్రభల్ = కాంతులు; వన్నెచూప = ప్రకాశిస్తుండగ; హాటక = బంగారపు; రత్న = రత్నములు తాపిన; కిరీట = కిరీటము యొక్క; కోటి = అతిశయిస్తున్న; ప్రభల్ = కాంతులు; బాల = ఉదయిస్తున్న; అర్క = సూర్యుని; రుచుల = కాంతుల; తోన్ = తో; మేలమాడ = పరిహాసమాడ.
లలిత = అందమైన; నీల = నల్లని; అభ్ర = మేఘముల; రుచిన్ = కాంతులతో; కుంతలములు = ముంగురులు; తనరన్ = అతిశయించ; ప్రవిమల = మిక్కిలినిర్మలమైన; ఆత్మీయ = స్వంత; దేహజ = శరీరమునుండి జనించు; ప్రభ = కాంతి; సరోజభవ = బ్రహ్మదేవుడు {సరోజభవ - సరోజము (పద్మము)న భవ (జనించినవాడు), బ్రహ్మదేవుడు}; భవా = శివుడు మొదలగు; అమర = దేవ; ముఖ్యుల = ప్రముఖుల; ప్రభలు = కాంతులు; మాపన్ = తగ్గింపజేయగ; అఖిలలోకైకగురుడు = విష్ణువు {అఖిలలోకైకగురుడు - సమస్తమైన లోకములకు ఒకడేయైన పెద్ద, హరి}; నారయణుండు = విష్ణువు {నారాయణుడు - నారములు (నీటి) యందు వసించువాడు, హరి}.

భావము:

నల్లని మేని కాంతులు నాలుగు దిక్కుల్లో వ్యాపిస్తుండగా, బంగారు మొలత్రాడు కాంతులతో పట్టుబట్టల కాంతులు కలిసిపోగా, లక్ష్మికి కాపురమైన వక్షఃస్థలంపై వైజయంతీమాల కాంతులను ప్రసరిస్తుండగా, రత్నాలు పొదిగిన బంగారు కిరీటం కాంతులు బాలసూర్యుని వెలుగులతో అతిశయించగా, శిరోజాలు నీలమేఘ కాంతులతో ఒప్పుతుండగా, తన దేహంనుండి వెలువడే దివ్యకాంతులు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతాశ్రేష్ఠుల దేహకాంతులను క్రిందుపరుస్తూ సమస్త లోకాలకు గురువైన నారాయణుడు (సాక్షాత్కరించాడు).