పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : శివుం డనుగ్రహించుట

  •  
  •  
  •  

4-154-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లియుర దండించుట దు
ర్భజన రక్షణము ధర్మద్ధతి యగుటం
లుషాత్ముల నపరాధము
కొలఁదిని దండించుచుందుఁ గొనకొని యేనున్."

టీకా:

బలియురన్ = బలవంతులను; దండించుట = దండించుట; దుర్భల = దుర్భలులు అయిన; జన = వారిని; రక్షణము = రక్షించుట; ధర్మ = ధర్మబద్ధమైన; పద్ధతి = విధానము; అగుటన్ = అవుటచేత; కలుషాత్ములన్ = దుష్టులను; అపరాధము = తప్పుల; కొలదిని = ప్రకారము; దండించుచున్ = దండిస్తూ; ఉందున్ = ఉంటాను; కొనకొని = పూనుకొని; ఏనున్ = నేను.

భావము:

బలవంతులను శిక్షించడం, దుర్బలులను రక్షించడం ధర్మమార్గం కనుక నేను దుష్టులను వారు చేసిన దోషాలకు తగినట్లుగా శిక్షిస్తూ ఉంటాను.”