పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : కర్దమప్రజాపతి వంశాభివృద్ధి

  •  
  •  
  •  

4-18-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ప్రతి కల్పమందు సర్వప్రపంచోద్భవ-
స్థితి వినాశంబులఁ జేయునట్టి
హిత మాయాగుణయ దేహములఁ బొల్చు-
జ వాసుదేవ శివాభిధాన
ములు గల్గు మీ పాదజాతములకు నే-
తిభక్తి వందనం బాచరింతు;
ఖిల చేతన మానసాగమ్య మన నొప్పు-
మూర్తులు గల్గు మీ మువ్వురందుఁ

4-18.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రఁగ నాచేతఁ బిలువంగఁ డిన ధీరుఁ
డెవ్వఁడే నొక్కరునిఁ బిల్వ నిపుడు మీరు
మువ్వు రేతెంచుటకు నాదు బుద్ధి విస్మ
యంబు గదిరెడిఁ జెప్పరే నఘులార!

టీకా:

ప్రతి = అన్ని; కల్పము = కల్పముల; అందు = లోను; సర్వ = సమస్తమైన; ప్రపంచన్ = ప్రపంచములకు; ఉద్భవ = సృష్టి; స్థితి = స్థితి; వినాశంబులన్ = లయములను; చేయునట్టి = కలిగించెడి; మహిత = గొప్ప; మాయా = మాయతో నేర్పడిన; గుణ = గుణములుతో; మయ = కూడిన; దేహంబులన్ = శరీరము లందు; పొల్చు = ఒప్పుతున్నవారు; అజ = బ్రహ్మదేవుడు {అజ - పుట్టుక లేనివాడు, బ్రహ్మదేవుడు}; వాసుదేవ = విష్ణుమూర్తి {వాసుదేవ - వసించి ఉండు దేవుడు, విష్ణుమూర్తి}; శివ = శివుడును {శివ - శుభకరమైనవాడు, శంకరుడు}; అభిదానములు = పేర్లు; కల్గు = కలిగియున్నట్టి; = మీ = మీ; పాద = పాదము లనెడి; జలజాతముల్ = పద్మముల; కున్ = కు; నేన్ = నేను; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; వందనంబు = నమస్కారములు; ఆచరింతు = చేసెదను; అఖిల = సమస్తమైన; చేతన = చేతనములకు; మానస = మనస్సులకు; అగమ్యము = అందనిది; అనన్ = అనుటకు; ఒప్పు = సరిపడు; మూర్తులున్ = స్వరూపములు; కల్గు = కలిగియుండు; మీ = మీరు; మువ్వురు = ముగ్గురు; అందు = లో; పరగన్ = ప్రసిద్ధముగ.
నా = నా; చేతన్ = చేత; పిలువంగబడిన = పిలువబడ్డ; ధీరుడు = గొప్పవాడు; ఎవ్వడు = ఎవరు; ఏని = అయినా; ఒక్కరున్ = ఒక్కరిని; పిల్వ = పిలవగా; ఇపుడు = ఇప్పుడు; మీరు = మీరు; మువ్వురు = ముగ్గురు; ఏతెంచుటకు = వచ్చుటకు; నాదు = నాయొక్క; బుద్ధి = మనస్సు; విస్మయంబున్ = ఆశ్చర్యము; కదిరెడిన్ = కలుగుచున్నది; చెప్పరే = తెలియజెప్పండి; అనఘులార = మహాత్ములార.

భావము:

“ఓ మహనీయులారా! ప్రతికల్పంలోను మీరు సర్వప్రపంచాన్ని సృజించి, పోషించి, నాశనం చేస్తారు. మాయాస్వరూపులై, బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే పేర్లుకల మీ పాదపద్మాలకు నేను భక్తిపూర్వకంగా ప్రణామం చేస్తున్నాను. చైతన్యవంతా లయిన మానవుల స్వాంతాలకు కూడ మీ తత్త్వం అందదు. మీ ముగ్గురిలో నేను ఒక్కరినే పిలిచాను. మీరు ముగ్గురూ వేంచేశారు. నాకు వింతగా ఉన్నది.