పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : విదురుండు హస్తిన కరుగుట

  •  
  •  
  •  

4-971-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునిచే నా మంత్రితుఁ
డై నమున బంధు దర్శనాకాంక్షితుఁడై
ధీ హితుఁడైన విదురుఁడు
సాజపురమునకుఁ జనియె మ్మద మొప్పన్.

టీకా:

ఆ = ఆ; ముని = ముని; చేన్ = చేత; ఆమంత్రితుండు = వీడ్కోలు పొందినవాడు; ఐ = అయ్యి; మనమునన్ = మనసులో; బంధు = బంధువులను; దర్శన = చూచుటను; కాంక్షితుండు = కోరువాడు; ఐ = అయ్యి; ధీ = ధీశక్తి కలుగుటచే; మహితుడు = గొప్పవాడు; ఐన = అయిన; విదురుడు = విదురుడు; సామజపురమున్ = హస్తినాపురము; కున్ = కు; చనియెన్ = వెళ్ళెను; సమ్మదము = సంతోషము; ఒప్పన్ = కలుగునట్లుగా.

భావము:

జ్ఞాన సంపన్నుడైన విదురుడు ఆ మైత్రేయ ముని దగ్గర సెలవు తీసుకొని బంధువులను చూచే కోరికతో హస్తినాపురానికి వెళ్ళాడు”.