పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసులు ముక్తికిఁ జనుట

  •  
  •  
  •  

4-961-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రు ధన కుల కర్మ సము
న్న మదములఁ జేసి సజ్జప్రతతికి సం
మును నెగ్గొనరించు కు
తు లర్థిం జేయు పూజ తిఁ గొనఁ డెందున్.

టీకా:

శ్రుత = కీర్తి; ధన = సంపదలు; కుల = వంశగౌరవము; కర్మ = గొప్పపనులవలన; సమున్నత = మిక్కిలి అధికమైన; మదములన్ = గర్వముల; చేసి = వలన; సత్ = మంచి; జన = వారి; ప్రతతి = సమూహమున; కున్ = కు; సంతతమునున్ = ఎల్లప్పుడు; ఎగ్గున్ = కీడును; ఒనరించు = కలిగించెడి; కు = చెడు; మతులున్ = బుద్ధి గలవారు; అర్థిన్ = కోరి; చేయు = చేసెడి; పూజన్ = పూజలు; మతిన్ = మనసులోకి; కొనడున్ = స్వీకరించడు; ఎందున్ = ఏవిధముగను.

భావము:

(ఆ భగవంతుడు) కీర్తి, ధనం, కులం, కర్మల గొప్పదనం వల్ల గర్వించి సజ్జనులకు కీడు చేసే దుష్టులు చేసే పూజను స్వీకరించడు.