పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ప్రచేతసులు ముక్తికిఁ జనుట

  •  
  •  
  •  

4-952.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లైన జన్మంబు లేల? దీర్ఘాయు వేల?
వేద చోదిత యగు కర్మ వితతి యేల?
ప తపశ్శ్రుత వాగ్విలాసంబు లేల?
హిత నానావధాన సార్థ్య మేల?

టీకా:

చర్చింపన్ = చర్చించిచూడగా; నరుల్ = మానవుల; కున్ = కు; జన్మ = పుట్టుక; కర్మ = కర్మములు; ఆయుర్ = ఆయుర్దాయము; మనః = మనసు; వచనంబులన్ = వాక్కులతో; దేవదేవున్ = నారాయణుని; అఖిల = సమస్తమైన; విశ్వ = జగత్తునకు; ఆత్మకుండు = ఆత్మయైనవాడు; ఐన = అయిన; గోవిందుండున్ = నారాయణుడు; విలసిల్లు = విలసిల్లెడి; భక్తిన్ = భక్తితో; సేవింపబడెడున్ = సేవింపబడును; అవియపో = అవే; జన్మ = పుట్టుక; కర్మ = కర్మములు; వచనములనున్ = వాక్కులను; ధరణిన్ = భూమిపైన; ఎన్నంగన్ = ఎంచుటకు; తగును = తగియుండును; వనరుహనాభ = విష్ణు; సేవా = సేవించుటలు; రహితములు = లేనట్టివి; ఐన = అయిన; జనన = పురిటిశుద్ధి; ఉపనయన = వడుగు; దీక్షా = దీక్షలు; కృతంబులు = పట్టుటలు; ఐన = కలిగిన.
జన్మంబుల్ = జన్మలు; ఏలన్ = ఎందులకు; దీర్ఘ = పెద్దదైన; ఆయువు = ఆయుర్దాయము; ఏలన్ = ఎందులకు; వేద = వేదములప్రకారము; చోదిత = నడపబడెడివి; అగు = అయిన; కర్మ = కర్మల; వితతిన్ = సమూహము; ఏలన్ = ఎందులకు; జపః = జపము; తపః = తపస్సు; శ్రుత = వేదపఠనము; వాగ్విలాపంబులున్ = నోటితో చర్చలు; ఏలన్ = ఎందులకు; మహిత = గొప్ప; నానా = రకరకముల; అవధాన = అవధరించెడి; సామర్థ్యము = నేర్పులు; ఏలన్ = ఎందులకు.

భావము:

“దేవదేవుడు, విశ్వాత్మకుడు అయిన గోవిందుని సేవించే జన్మయే జన్మ, అదే కర్మ, అదే ఆయుస్సు, అదే మనస్సు, అదే వాక్కు. హరిని సేవించకుండ ఉపనయనం మొదలైన సంస్కారాలు గల జన్మ ఎందుకు? దీర్ఘాయువు ఎందుకు? వేదకర్మలను ఆచరించడం ఎందుకు? జపం, తపం, పాండిత్యం, వాక్చమత్కారం మొదలైనవి ఎందుకు?