చతుర్థ స్కంధము : ప్రచేతసుల తపంబు
- ఉపకరణాలు:
లలితాయ తాష్ట భుజ మం
డలమధ్యస్ఫురిత రుచివిడంబిత లక్ష్మీ
లలనా కాంతిస్పర్ధా
కలిత లసద్వైజయంతికా శోభితుఁడున్
టీకా:
లలిత = అందమైన; ఆయుత = నిడుపైన, దీర్ఘమైన; అష్ట = ఎనిమిది; భుజ = భుజముల; మధ్యస్ = మధ్యభాగము, వక్షస్థలము; స్ఫురిత = విలసిల్లి; రుచి = వెలుగులు; విడంబిత = వెదజల్లుతున్న; లక్ష్మీలలన = లక్ష్మీదేవి; కాంతి = కాంతితో; స్పర్థా = పోటీకి; ఆకలిత = వచ్చుచున్న; లసత్ = అందమైన; వైజయింతికా = వైజయింతికా మాలచే; శోభితుండు = శోభిల్లుతున్నవాడు.
భావము:
అతని అందమైన ఎనిమిది భుజాల మధ్య వైజయంతిక అనే వనమాల లక్ష్మీదేవితో పోటీ పడుతూ ప్రకాశిస్తున్నది.