పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుని బరమపద ప్రాప్తి

  •  
  •  
  •  

4-650-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లోకోత్తర భగవ
త్పరిచర్యారాధనమునఁ రిశుద్ధాంతః
ణుండగు నా పృథునకు
సిరుహోదరు కథానుసంస్మరణమునన్.

టీకా:

నరలోక = మానవులు అందరిలోకి; ఉత్తర = గొప్పవాడా; భగవత్ = నారాయణుని; పరిచర్యా = సేవిండెడి; ఆరాధననన్ = పూజించుట వలన; పరిశుద్ధ = పరిశుద్ధమైన; అంతఃకరణుండు = ఆత్మ కలవాడు; అగు = అయిన; ఆ = ఆ; = పృథున్ = పృథుచక్రవర్తి; కున్ = కి; సరసిహోదరున్ = నారాయణుని; కథా = కథలను; అనుసంస్మరణమునన్ = ధ్యానించుటచేత.

భావము:

విదురా! భగవత్పరిచర్య చేత, ఆరాధనం చేత పృథుచక్రవర్తి అంతఃకరణం పరిశుద్ధమయింది. నిరంతర హరికథా సంస్మరణం చేత…