పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుండు హరిని స్తుతించుట

  •  
  •  
  •  

4-554-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు భవదీయ సేవాతత్పరులమైన యిందిరయు నేను నేక పదార్థాభిలాషం జేసి స్పర్ధమానుల మగుచున్న మా యిద్దఱకును బర్యాయసేవం జేసి కలహంబు లేకుండని;మ్మట్లు గాక భవదీయ చరణ సరోరుహ సేవాసక్త మనోవిస్తారుల మగుటం జేసి యేనయేన మున్ను భజియింతు నను తలంపులం గలహం బయిననుం గానిమ్ము దేవా;” యని వెండియు నిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; భవదీయ = నీ యొక్క; సేవా = సేవించుట యందు; తత్పరులము = దీక్షగొన్నవారము; ఐన = అయిన; ఇందిరయున్ = లక్ష్మీదేవి; నేనున్ = నేను; ఏక = ఒకటే; పదార్థ = వస్తువును; అభిలాషన్ = కోరుచుండుట; చేసి = వలన; స్పర్ధమానులము = పోటీపడుతున్న వారము; అగుచున్న = అవుతున్న; మా = మా; ఇద్దఱ = ఇద్దరి; కునున్ = కిని; పర్యాయ = వంతులవారి; సేవన్ = సేవించుట; చేసి = వలన; కలహంబు = కలహము; లేకుండనిమ్ము = కలుగకుండగ జూడుము; కాక = కాకపోతే; భవదీయ = నీ యొక్క; చరణ = పాదములు అనెడి; సరోరుహ = పద్మముల; సేవా = సేవ యందు; ఆసక్త = ఆసక్తి కలిగిన; మనోవిస్తారులము = మనోవికాసము కలవారము; అగుటన్ = అగుట; చేసి = వలన; ఏనయేన = నేనంటే నేను; మున్న = ముందు; భజియింతును = సేవింతును; అను = అనెడి; తలంపులన్ = భావముల వలన; కలహంబున్ = కలహము; అయినను = కలిగినను; కానిమ్ము = కలుగనిమ్ము; దేవా = దేవుడా; అని = అని; వెండియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఈ విధంగా నీ సేవాసక్తులమైన లక్ష్మీదేవి, నేను ఒకే వస్తువును అభిలషించి పోటీపడుతున్నాము. కాబట్టి దేవా! మాకు కలహం కలుగకుండా ఒకరి తరువాత ఒకరికి నీ సేవాభాగ్యాన్ని అనుగ్రహించు. లేదా నిన్ను సేవించాలనే ఉత్కంఠతో ‘నేను ముందంటే నేను ముందు’ అని మాలో మాకు కలహం కలుగనీ. అయినా సంతోషమే!” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.