పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : పృథుండు హరిని స్తుతించుట

  •  
  •  
  •  

4-552-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘ! మహాత్మ వాగ్గళితమైన భవత్పద పంకజాత సం
నిత సుధాకణానిలవశంబున విస్మృత తత్త్వ మార్గవ
ర్తను లగు దుష్టయోగులకుఁ గ్రమ్మఱఁ దత్త్వముఁ జూపఁజాలు ని
ట్లొరుట దక్క నన్య వర మొల్లఁ బయోరుహపత్రలోచనా!

టీకా:

అనఘ = పుణ్యుడ; మహాత్మ = మహాత్ముల యొక్క; వాక్ = నోటినుండి; గళితము = జారినవి; ఐన = అయిన; భవత్ = నీ యొక్క; పద = పాదములు అనెడి; పంకజాత = పద్మములనుండి {పంకజాతము - పంక (నీరు, బురద) జాతము (పుట్టినది), పద్మము}; జనిత = పుట్టిన; సుధా = అమృతపు; కణా = బిందువులనెడి; అనిల = వాయువునకు; వశంబునన్ = వశమగుటవలన; విస్మృత = మరచిన; తత్త్వ = తత్త్వము యొక్క; మార్గ = మార్గమున; వర్తనులు = నడచెడివారు; అగు = అయిన; దుష్ట = చెడ్డ; యోగుల్ = యోగుల; కున్ = కు; క్రమ్మఱన్ = మరల; తత్త్వమున్ = తత్త్వమును; చూపన్ = చూపుటకు; చాలున్ = సామర్థ్యము కలవి; ఇట్లు = ఈ విధముగ; ఒనరుట = అగుట; తక్కన్ = తప్పించి; అన్య = ఇతరమైన; వరమున్ = వరమును; ఒల్లన్ = ఒప్పుకొనను; పయోరుహపత్రలోచనా = నారాయణా {పయోరుహ పత్ర లోచనుడు - పయస్ (నీరు) అందు ఊరుహ (పుట్టు) తామర పత్ర (ఆకుల) వంటి లోచనా (కన్నులున్నవాడు), విష్ణువు}.

భావము:

మాలిన్యరహితులైన మహాత్ముల వాక్కులనుండి ప్రసరించే నీ పాదపద్మ సుధాకణాలను మోసికొని వచ్చే మలయమారుతం ద్వారా, ఆత్మ జ్ఞానాన్ని మరచిపోయిన అభాగ్యులకు, అజ్ఞానులకు మళ్ళీ ఆత్మ జ్ఞానాన్ని చూపించగలిగే వరాన్ని అనుగ్రహించు. తామర రేకుల వంటి కన్నులు గల స్వామీ! నాకు ఈ వరం తప్ప మరొక వరం అక్కరలేదు.