చతుర్థ స్కంధము : పృథుండు హరిని స్తుతించుట
- ఉపకరణాలు:
అదిగాన పద్మలోచన!
సదమల భవదీయ ఘనయశము వినుటకునై
పదివేల చెవులు కృప ని
మ్మదియే నా యభిమతంబు నగును ముకుందా!
టీకా:
అదిగాన = అందుచేత; పద్మలోచన = నారాయణా; సత్ = మిక్కిలి; అమల = స్వచ్ఛమైన; భవదీయ = నీ యొక్క; ఘన = గొప్ప; యశమున్ = కీర్తిని; వినుట = వినుట; కున్ = కోసము; ఐ = అయ్యి; పదివేల = పదివేలు (10000); చెవులు = చెవులు; కృపన్ = దయతో; ఇమ్ము = ఇమ్ము; అదియే = అదే; నా = నా యొక్క; అభిమతంబున్ = కోరిక; అగును = అయి ఉండెను; ముకుందా = నారాయణా.
భావము:
కాబట్టి కమలనయనా! నీ నిర్మల కీర్తిగాథలను ఆలకించడానికి నాకు పదివేల చెవులను ప్రసాదించు. ముకుందా! ముమ్మాటికి ఇదే నా అభిలాష.