చతుర్థ స్కంధము : భూమిని బితుకుట
- ఉపకరణాలు:
అక్క డక్కడఁ బూర్వంబునందు లేని
గ్రామ పట్టణ దుర్గ ఖర్వట పుళింద
ఖేట శబరాలయవ్రజ వాట ఘోష
వివిధ నిలయము లర్థిఁ గావించె నంత.
టీకా:
అక్కడక్కడ = అక్కడక్కడ; పూర్వంబున్ = ఇంతకు ముందు కాలము; అందున్ = లో; లేని = లేనట్టి; గ్రామ = గ్రామములు; పట్టణ = పట్టణములు; దుర్గ = కోటలు; ఖర్వట = కొండ పల్లెలు; పుళింద = బోయ గూడెములు; ఖేట = కాపు పేటలు; శబరాలయ = శబరుల గూడెములు; వ్రజ = పశువుల శాలలు; వాట = వీధులు; ఘోష = గొల్ల పల్లెలు; వివిధ = రకరకముల; నిలయములున్ = జనవాసములు; అర్థిన్ = కోరి; కావించెన్ = ఏర్పరచెను.
భావము:
అక్కడక్కడ పూర్వం లేని జనపదాలు, పట్టణాలు, దుర్గాలు, కొండపల్లెలు, బోయపల్లెలు, శబరాలయాలు, వ్రజవాటికలు, ఘోషవాటికలు మొదలైన పెక్కు విధాలైన నివాస స్థానాలను కల్పించాడు.