పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : అర్చిపృథుల జననము

  •  
  •  
  •  

4-458.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

బ్రకృతి పురుష కావేశుఁడై రఁగువాఁడు;
వదవతారయుక్తుఁడై నెడువాఁడు;
గుచు వర్తించు సమ్మోద తిశయిల్లఁ
జారుతరమూర్తి యీ రాజక్రవర్తి.

టీకా:

తలపోయ = పరికించగ; బ్రహ్మవిద్యా = బ్రహ్మవిద్యయందు; నిష్ఠ = పారంగతులైన; జనముల = వారి; కిన్ = కి; అనయంబున్ = ఎల్లప్పుడు; కింకరుండు = సేవించువాడు; ఐనవాడు = అయినవాడు; అఖిల = సమస్తమైన; = శరీరగుడు = జీవులయెడనుండువాడు; ఆప్త = ఆప్తులైనట్టి; సహృత్ = హితులైన; జనత్ = వారికి; ఆనంద = ఆనందమును; కరుండు = కలుగజేయువాడు; అనన్ = అనునట్లు; అలరువాడు = విలసిల్లెడివాడు; = సంసార = సంసారమందలి; ఘన = మిక్కిలిపెద్దవైన; సంగ = కర్మబంధములు; హీనుల్ = లేనివారి; అందున్ = ఎడల; సంగ = కూడుటయందు; సంప్రీతుడు = ఆదరముకలవాడు; ఐ = అయ్యి; జరగువాడు = వర్తించెడివాడు; దుర్మార్గ = దుష్ట; మనుజ = మానవుల; సందోహంబున్ = సమూహముల; కున్ = కు; ఉగ్ర = భయంకరమైన; దండధరుండు = శిక్షించువాడు, యమునివంటివాడు; అనన్ = అనగా; తనరు = అతిశయించు; వాడు = వాడు; ప్రకృతిన్ = స్వభావసిద్ధముగ; పురుష = మానవులకు; కున్ = కు ఆవేశుడు = స్తూర్తిప్రధాతయైనవాడు; ఐ = అయ్యి.
పరగువాడు = నడచుకొనును; భగవత్ = భగవంతుని; అవతార = అవతారమై; యుక్తుండు = కూడియుండువాడు; ఐ = అయ్యి; నెగడువాడు = వర్థిల్లువాడు; అగుచున్ = అవుతూ; వర్తించున్ = నడచుకొనును; సమ్మోదము = సంతోషము; అతిశయిల్లన్ = అతిశయించగ; చారుతర = బహుచక్కని {చారు - చారుతర - చారుతమ}; మూర్తిన్ = మూర్తిత్వముకలవాడు; ఈ = ఈ; రాజ = విశిష్టమైన; చక్రవర్తి = చక్రవర్తి.

భావము:

సౌందర్యమూర్తి అయిన ఈ చక్రవర్తి బ్రహ్మవిద్యా పారంగతులైన పెద్దలను ఆరాధిస్తాడు. సమస్త శరీరాలలోను తానే ఉన్నట్లు బంధుమిత్రులకు సంతోషాన్ని కలిగిస్తాడు. సంసార లంపటులు కానివారితో సాంగత్యం చేస్తాడు. దుర్మార్గులకు యమధర్మరాజువలె భయంకరు డౌతాడు. ప్రజలకు ఉత్సాహం కలిగిస్తాడు. సాక్షాత్తు భగవంతుని అవతారమని సమస్త జనులు భావించేటట్లు ఈ పృథు చక్రవర్తి ప్రవర్తిస్తాడు.