పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

చతుర్థ స్కంధము : ధ్రువక్షితిని నిలుచుట

  •  
  •  
  •  

4-368-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సుశీలసంపన్నుండును, బ్రహ్మణ్యుండును, ధర్మసేతురక్షకుండును, దీనవత్సలుండు నయి యవని పాలించు ధ్రువుండు దన్నుఁ బ్రజలు దండ్రి యని తలంప నిరువదియాఱువే లేండ్లు భోగంబుల చేతం బుణ్యక్షయంబును, నభోగంబులైన యాగాదులచేత నశుభ క్షయంబునుం జేయుచు బహుకాలంబు దనుకఁ ద్రివర్గ సాధనంబుగా రాజ్యంబుచేసి కొడుకునకుఁ బట్టంబుగట్టి యచలితేంద్రియుండై యవిద్యారచిత స్వప్నగంధర్వ నగరోపమం బయిన దేహాదికం బగు విశ్వంబు భగవన్మాయారచితం బని, యాత్మం దలంచుచు వెండియు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సు = మంచి; శీల = నడవడిక; సంపన్నుండును = మిక్కిలిగ కలవాడు; బ్రహ్మణ్యుండును = వేద మనెడి బ్రహ్మ మందు నిష్ఠ కలవాడు; ధర్మసేతు = ధర్మసేతువును; రక్షకుండును = రక్షించువాడు; దీన = దీనుల ఎడల; వత్సలుండును = వాత్సల్యము కలవాడు; అయి = అయ్యి; అవనిన్ = భూమిని; పాలించు = పాలించెడి; ధ్రువుండు = ధ్రువుడు; తన్ను = తనను; ప్రజలు = జనులు; తండ్రి = తండ్రి; అని = అని; తలంపన్ = అనుకొనునట్లు; ఇరువదియాఱువేల = ఇరవైయారువేలు (26000); ఏండ్లు = సంవత్సరములు; భోగంబులన్ = అనుభవింప దగినవాటి; చేతన్ = వలన; పుణ్య = చేసిన పుణ్య ఫలము యొక్క; క్షయంబును = వ్యయ మగుటను; అభోగంబులు = అశుభ శాంతి కరములు; ఐన = అయిన; యాగ = యజ్ఞము; ఆదులు = మొదలగువాని; చేతన్ = వలన; అశుభ = పాప; క్షయంబునున్ = వ్యయ మగుటను; చేయుచున్ = చేస్తూ; బహు = చాలా; కాలంబున్ = కాలము; దనుకన్ = పర్యంతము; త్రివర్గ = ధర్మము అర్థము కామము {త్రివర్గ - ధర్మము అర్థము కామము అనెడి మూడు (3) వర్గములు}; సాధనంబున్ = సాధించునది; కాన్ = అగునట్లు; రాజ్యంబున్ = రాజ్యమును; చేసి = చేసి; కొడుకున్ = పుత్రుని; కున్ = కి; పట్టంబుగట్టి = పట్టాభిషేకము చేసి; అచలిత = నిశ్చలమైన; ఇంద్రియుండు = ఇంద్రియములు కలవాడు; ఐ = అయ్యి; అవిద్య = అజ్ఞానము చేత; రచిత = నిర్మింపబడిన; స్వప్న = కలలో చూసిన; గంధర్వ = గంధర్వుల; నగర = నగరమును; ఉపమంబున్ = పోల్చదగినది; అయిన = అయినట్టి; దేహ = శరీరము; ఆదికంబున్ = మొదలైనవి; అగు = అయన; విశ్వంబు = జగత్తు; భగవత్ = భగవంతుని; మాయా = మాయచేత; రచితంబున్ = నిర్మిపబడినది; అని = అని; ఆత్మన్ = మనసులో; తలంచుచున్ = అనుకొనుచు; వెండియున్ = మరల.

భావము:

ఈ విధంగా శీలసంపన్నుడు, వేదబ్రహ్మనిష్ఠుడు, ధర్మసేతు రక్షకుడు, దీనవత్సలుడు అయి రాజ్యాన్ని పాలించే ధ్రువుడు ప్రజలు తనను తండ్రిగా భావించగా, భోగాలచేత పుణ్యం వ్యయం కాగా అభోగాలైన యజ్ఞయాగాలచేత పాపాలను నాశనం చేసుకొంటూ ధర్మార్థకామాలనే త్రివర్గాలను సాధింపజేసే రాజ్యాన్ని 26 వేల సంవత్సరాలు పాలించి, కొడుకుకు రాజ్య పట్టాభిషేకం చేసి ఇంద్రియ నిగ్రహం కలవాడై అవిద్య వల్ల సృష్టించబడిన స్వప్నంలోని గంధర్వనగరంతో సమానమైన దేహము మొదలైన ప్రపంచం భగవంతుని మాయచేత కల్పింపబడిందని తన మనస్సులో భావిస్తూ…

4-369-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ను నిభుఁ డంత భృత్యజన మంత్రి పురోహిత బంధు మిత్ర నం
పశు విత్త రత్న వనితా గృహ రమ్యవిహార శైల వా
రినిధి పరీత భూతల హరిద్విప ముఖ్య పదార్థ జాలముల్
మతిచే ననిత్యములుగాఁ దలపోసి విరక్తచిత్తుఁడై.

టీకా:

మను = మనువులకు; నిభుడు = సమానమైనవాడు; అంత = అంత; భృత్యు = సేవకులు; జన = ప్రజలు; మంత్రి = మంత్రులు; పురోహిత = పురోహితులు; బంధు = బంధువులు; మిత్ర = మిత్రులు; నందన = పుత్రులు; పశు = పశువులు; విత్త = ధనము; రత్న = రత్నములు; వనితా = స్త్రీలు; గృహ = గృహములు; రమ్య = అందమైన; విహర = విహరింప దగిన ప్దలములు; శైల = పర్వతములు; వారినిధి = సముద్రము; పరీతభూతల = హద్దులుగా గల భూమి; హరి = గుఱ్ఱములు; ద్విప = ఏనుగులు; ముఖ్య = మొదలగు; పదార్థ = పదార్థముల; జాలముల్ = సమూహములు; ఘన = గొప్ప; మతిన్ = బుద్ధిచే; అనిత్యములు = అశాశ్వతములు; కాన్ = అగునట్లు; తలపోసి = అనుకొని; విరక్త = వైరాగ్యమునకు చెందిన; చిత్తుడు = చిత్తము కలవాడు; ఐ = అయ్యి.

భావము:

మనువులతో సమానుడైన ధ్రువుడు సేవకులు, మంత్రులు, పురోహితులు, బంధువులు, మిత్రులు, పుత్రులు, పశువులు, ధనం, రత్నాలు, స్త్రీలు, భవనాలు, క్రీడా పర్వతాలు, సముద్ర పరివేష్ఠితమైన రాజ్యం, గుఱ్ఱాలు, ఏనుగులు మొదలైన పదార్థాలన్నీ తన బుద్ధికౌశలంతో అశాశ్వతాలని భావించి, విరక్తి చెంది…

4-370-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పురము వెల్వడి చని పుణ్యభూ బదరికా-
న విశాలానదీలిత మంగ
ళాంబుపూరంబుల నురక్తిమైఁ గ్రుంకి-
మనీయ పరిశుద్ధ రణుఁ డగుచుఁ
ద్మాసనస్థుఁడై వనుని బంధించి-
నెలకొని ముకుళితనేత్రుఁ డగుచు
రిరూపవైభవ ధ్యానంబు చేయుచు-
గవంతు నచ్యుతుఁ ద్మనేత్రు

4-370.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నందు సతతంబు నిశ్చలమైన యట్టి
క్తిఁ బ్రవహింపఁ జేయుచుఁ రమమోద
బాష్పధారాభిషిక్తుండు వ్యయశుఁడుఁ
బులకితాంగుండు నగుచు నిమ్ములఁ దనర్చి.

టీకా:

పురము = నగరము; వెల్వడి = బయల్పడి; చని = వెళ్ళి; పుణ్య = పుణ్యవంతమైన; భూ = భూమియైన; బదరికా = బదరికాశ్రమ సమీప; ఘన = గొప్ప; విశాలా = విశాల అనెడి; నదీ = నదిలో; కలిత = ఉన్న; మంగళ = శుభకరములైన; అంబుపూరంబులననున్ = నదీజలలో; రక్తిమై = ప్రీతిగా; క్రుంకి = స్నానముచేసి; కమనీయ = మనోహరమైన; పరిశుద్ధ = క్షాళనమైన; కరణుడు = ఇంద్రియములు కలవాడు; అగుచున్ = అవుతూ; పద్మాసనస్థుడు = పద్మాసనమునఉన్నవాడు; ఐ = అయ్యి; పవనుని = ప్రాణవాయువుని; బంధించి = బంధించి; నెలకొని = స్థిరుడై; ముకుళిత = మూసిన; నేత్రుడు = కన్నులు; అగుచున్ = అవుతూ; హరి = నారాయణుని; రూప = రూపము; వైభవ = వైభవములను; ధ్యానంబు = ధ్యానించుట; చేయుచున్ = చేస్తూ; భగవంతున్ = విష్ణుమూర్తి {భగవంతుడు - మహిమాన్వితుడు, విష్ణువు}; అచ్యుత = విష్ణుమూర్తి {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; పద్మనేత్రున్ = విష్ణుమూర్తి {పద్మనేత్రుడు - కలువలు వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; అందున్ = ఎడల.
సతతంబున్ = ఎడతెగని; నిశ్చలమైన = నిశ్చలమైన; అట్టి = అటువంటి; భక్తిన్ = భక్తి; ప్రవహింపన్ = ప్రవహించునట్లు; చేయుచున్ = చేస్తూ; పరమ = అత్యంత; మోద = సంతోష; బాష్ప = ఆశ్రువుల; ధారా = ధారలచే; అభిషిక్తుండు = అభిషేకింపబడినవాడు; భవ్య = దివ్యమైన; యశుండు = కీర్తికలవాడు; పులకిత = పులకరించిన; అంగుండు = అవయవములు కల వాడు; అగుచున్ = అవుతూ; ఇమ్ములన్ = కుతూహలముతో; తనర్చి = అతిశయించి.

భావము:

(విరక్తుడైన ధ్రువుడు) తన నగరంనుండి బయలుదేరి పుణ్యభూమి అయిన బదరికాశ్రమం వెళ్ళి, అక్కడి విశాల అనే పేరు కలిగిన పవిత్ర నదిలోని నీటిలో ప్రీతితో స్నానం చేసి, శుచియై పద్మాసనం కల్పించుకొని, వాయువును బంధించి, కనులు మూసికొని, భగవంతుని రూపాన్ని ధ్యానించాడు. ఆ విశాలయశోధనుడు ఆనందబాష్పాలతో తడిసిపోతూ మేను పులకించగా అచంచలమైన భక్తితో అచ్యుతుడు, కమలనేత్రుడు అయిన భగవంతుని ఆరాధించాడు.

4-371-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు; విగత క్లేశుండును, ముక్తలింగుండునునై, ధ్రువుండు తన్నుఁదా మఱచి యుండు సమయంబున దశదిక్కుల నుద్యద్రాకానిశానాయకుండునుం బోలె వెలింగించుచు నాకాశంబున నుండి యొక్క విమానంబు చనుదేర నందు దేవశ్రేష్ఠులును, జతుర్భుజులును, రక్తాంబుజేక్షణులును, శ్యామవర్ణులును, గదాధరులును, సువాసులును, గిరీటహారాంగదకుండలధరులును, కౌమారవయస్కులును, నుత్తమశ్లోక కింకరులు నయిన వారల నిద్దఱం గని; సంభ్రమంబున లేచి మధుసూదను నామంబులు సంస్మరించుచు వారల భగవత్కింకరులంగాఁ దలంచి దండప్రణామంబు లాచరించినం గృష్ణపాదారవింద విన్యస్తచిత్తుండుఁ, గృతాంజలియు, వినమితకంధరుండు నైన ధ్రువునిం గనుంగొని పుష్కరనాభభక్తు లైన సునందనందులు ప్రీతియుక్తులై మందస్మితు లగుచు నిట్లనిరి.

టీకా:

మఱియున్ = ఇంకను; విగత = విడిచిన; క్లేశుండును = క్లేశములు (చిక్కులు) కలవాడు; ముక్త = తొలగిన; లింగుండును = లింగశరీము కలవాడు; ఐ = అయ్యి; ధ్రువుండు = ధ్రువుడు; తన్ను = తనను; తాన్ = తను; మఱచి = మరచిపోయి; ఉండు = ఉండెడి; సమయంబునన్ = సమయములో; దశ = పది (10); దిక్కులను = దిక్కులను {దశదిక్కులు - నాలుగు (4)దిక్కులు (1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము) నాలుగు (4) మూలలు (5ఈశాన్యము 6ఆగ్నేయము 7నైరృతి 8వాయవ్యము) 9పైన 10 కింద}; ఉద్యత్ = ఉదయించుచున్న; రాకా = పూర్ణిమ; నిశానాయకుండును = చంద్రుని {నిశానాయకుండు - నిశ (రాత్రి)కి నాయకుడు, చంద్రుడు}; పోలెన్ = వలె; వెలిగించుచున్ = ప్రకాశవంతము చేయుచు; ఆకాశమున్ = ఆకాశము; నుండి = నుండి; ఒక్క = ఒకానొక; విమానంబున్ = విమానము; చనుదేరన్ = రాగా; అందున్ = దానిలో; దేవ = దేవతలలో; శ్రేష్ఠులును = గొప్పవారును; చతుః = నాలుగు (4); భుజులును = భుజములు కలవారును; రక్త = ఎఱ్ఱని; అంబుజ = పద్మముల వంటి; ఈక్షణులును = కన్నులు కలవారు; శ్యామ = నల్లని; వర్ణులున్ = రంగు కలవారు; గదా = గదను; ధరులును = ధరించినవారును; సువాసులును =మంచి వస్త్రములను ధరించినవారును; కిరీట = కిరీటము; హార = హారములు; అంగద = భుజకీర్తులు; కుండల = చెవికుండలములను; ధరులును = ధరించినవారు; కౌమార = కౌమార, కోడె; వయస్కులును = వయస్సు కలవారు; ఉత్తమశ్లోక = విష్ణుని {ఉత్తమ శ్లోకుడు - ఉత్తములచే శ్లోకుడు (కీర్తింపబడువాడు), విష్ణువు}; కింకరులు = సేవకులు; అయిన = అయిన; వారలన్ = వారిని; ఇద్దఱన్ = ఇద్ధరిని; కని = చూసి; సంభ్రమంబునన్ = తొట్రుపాటుతో; లేచి = లేచి నిలబడి; మధుసూదనున్ = విష్ణుని {మధుసూదనుడు - మధు అనెడి రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు, మధుసూదన – మధుం సూదయతి – నాశయతి, అసుర స్వభావ సంహారకత్వాత్, అసుర స్వభావమును నశింప చేయునది (ఆంధ్ర వాచస్పతము)}; సంస్మరించుచున్ = చక్కగా కీర్తిస్తూ; వారలన్ = వారిని; భగవత్ = విష్ణుమూర్తి యొక్క; కింకరులుంగా = సేవకులుగా; తలంచి = అనుకొని; దండప్రణామంబులు = సాష్టాంగనమస్కారములు; ఆచరించినన్ = ఆచరించగా; కృష్ణ =నీలపు; పాద = పాదములు అనెడి; అరవింద = పద్మము లందు; విన్యస్త = లగ్నముచేసిన; చిత్తుండున్ = చిత్తము కలవాడు; కృత = చేసిన; అంజలియున్ = నమస్కారము కలవాడు; వినమిత = వినయముతో వంగిన; కంధరుండును = మెడ కలవాడు; ఐన = అయిన; ధ్రువునిన్ = ధ్రువుని; కనుంగొని = చూసి; పుష్కరనాభ = విష్ణుమూర్తి {పుష్కరనాభు - పుష్కర (పద్మము) నాబిన కలవాడు, విష్ణువు}; భక్తులు = భక్తులు; ఐన = అయిన; సునంద = సునందుడును { విష్ణు పరిచరులు – సునందుడు, నందుడు, కుముదుడు మున్నగువారు}; నందులు = నందుడను; ప్రీతి = ప్రీతితో; యుక్తులు = కూడినవారు; ఐ = అయ్యి; మందస్మితులు = చిరునగవు కలవారు; అగుచున్ = అవుతూ; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి.

భావము:

ఇంకా దుఃఖాన్ని విస్మరించి, శరీరాభిమానాన్ని విడిచి, తనను తాను మరచి ఉన్న సమయంలో పది దిక్కులను ప్రకాశింపజేస్తూ ఉదయించిన పున్నమ చంద్రుని వలె ఒక విమానం ఆకాశంనుండి వచ్చింది. అందులో దేవతాశ్రేష్ఠులు, చతుర్భుజులు, ఎఱ్ఱ తామరల వంటి కన్నులు కలవారు, నల్లని రంగు కలవారు, గదాధరులు, మంచి వలువలు ధరించినవారు, కౌమార వయస్సులో ఉన్నవారు, కిరీటాలు హారాలు భుజకీర్తులు చెవికుండలాలు ధరించినవారు అయిన విష్ణుసేవకులు ఇద్దరున్నారు. వారిని చూచి ధ్రువుడు తటాలున లేచి మనస్సులో విష్ణునామాన్ని స్మరిస్తూ వారిని విష్ణుకింకరులుగా భావించి దండప్రణామాలు చేసాడు. విష్ణు పాదపద్మాల యందు లగ్నం చేసిన మనస్సు కలవాడు, భక్తుడు అయిన ధ్రువుణ్ణి చూచి సునందుడు, నందుడు అనే ఆ ఇద్దరు విష్ణుసేవకులు ఆనందంతో చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నారు.

4-372-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

" నృప! నీకు భద్ర మగు; నొప్పగుచున్న మదీయవాక్యముల్
వీనులయందుఁ జొన్పుము; వివేకముతో నయిదేండ్లనాఁడు మే
ధానిధివై యొనర్చిన యుదాత్త తపోవ్రతనిష్ఠచేతఁ దే
జోయశాలి యైన మధుసూదనుఁ దృప్తి వహింపఁ జేయవే!

టీకా:

ఓ = ఓ; నృప = రాజ; నీకున్ = నీకు; భద్రము = శుభము; అగున్ = అగును; ఒప్పు = చక్కటివి; అగుచున్న = అవుతున్న; మదీయ = నా యొక్క; వాక్యముల్ = మాటలు; వీనుల = చెవుల; అందు = లో; చొన్పుము = పెట్టుము; వివేకము = వివేకము {వివేకము – దేహాత్మాది బేధ జ్ఞానము కలిగి యుండుట (ఆంధ్ర వాచస్పతము), యుక్తాయుక్త నిర్ణయ బుద్ధి (శబ్దార్థ చంద్రిక), యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము}; తోన్ = కలగి యుండి; అయిదు = అయిదు (5); ఏండ్ల = సంవత్సరముల వయస్సు; నాడు = అప్పుడు; మేధా = బుద్ధి బలమునకు; నిధివి = స్థానము యైనవాడివి; ఐ = అయ్యి; ఒనర్చిన = ఆచరించిన; ఉదాత్త = గొప్పదైన; తపస్ = తపస్సు; వ్రత = వ్రతముల; నిష్ఠ = నిష్ఠ; చేతన్ = చేత; తేజస్ = ప్రకాశము; నయ = నీతి; శాలి = కలవాడు; ఐన = అయిన; మధుసూదనున్ = విష్ణుమూర్తిని; తృప్తి = సంతుష్టి; వహింపన్ = చెందునట్లు; చేయవే = చేయలేదా, కలిగించావు కదా.

భావము:

“రాజా! నీకు శుభం కలుగుగాక! మా హిత వాక్యాలను శ్రద్ధగా ఆలకించు. అయిదేండ్ల చిరుత ప్రాయంలోనే నీవు ఎంతో గొప్ప తపస్సు చేసి భగవంతుడైన శ్రీహరికి సంతృప్తి కలిగించావు కదా!

4-373-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి శార్ఙ్గపాణి ఖిల జగద్భర్త
దేవదేవుఁ డతుల దివ్యమూర్తి
మ్ముఁ బనుప మేము మాధవపదమున
ర్థి నిన్నుఁ గొనుచు రుగుటకును.

టీకా:

అట్టి = అటువంటి; శార్ఙ్గపాణి = విష్ణుమూర్తి {శార్ఙ్గ పాణి - శార్ఙ్గము యనెడి విల్లు ధరించినవాడు, విష్ణువు}; అఖిలజగద్భర్త = విష్ణుమూర్తి {అఖిల జగద్భర్త - సమస్త జగత్తునకు భర్త (ప్రభువు), విష్ణువు}; దేవదేవుడు = విష్ణుమూర్తి {దేవ దేవుడు – దేవుళ్ళకే దేవుడు, విష్ణువు}; అతులదివ్యమూర్తి = విష్ణుమూర్తి {అతుల దివ్యమూర్తి - అతుల (సాటిలేని) దివ్యమైన మూర్తి (స్వరూప మైనవాడు), విష్ణువు}; మమ్మున్ = మమ్మల్ని; పనుప = పంపగా; మేము = మేము; మాధవ = విష్ణు; పదమున్ = స్థానము; కున్ = కి; అర్థి = కోరి; నిన్నున్= నిన్ను; కొనుచున్ = తీసుకొని; అరుగుట = వెళ్ళుట; కున్ = కు.

భావము:

అటువంటి శార్ఙ్గపాణి, సర్వజగద్భర్త, దేవదేవుడు, దివ్యస్వరూపుడు అయిన హరి మమ్ము పంపించగా నిన్ను విష్ణుపదానికి తోడ్కొని పోవటానికై…

4-374-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వచ్చితిమి; ఏ పదంబు నేని సూరిజనంబులు సర్వోత్తమం బని పొందుదురు; దేనిఁ జంద్ర దివాకర గ్రహ నక్షత్ర తారాగణంబులు ప్రదక్షిణంబుగాఁ దిరుగుచుండు; మఱియు నీదు పితరులచేతను నన్యులచేతను ననధిష్ఠితంబును, జగద్వంద్యంబును, నభక్తజనాతిదుర్జయంబును నయిన విష్ణుపదంబుం బొందుదువు రమ్మిదె విమానశ్రేష్ఠం; బుత్తమశ్లోకజన మౌళిమణియైన శ్రీహరి పుత్తెంచె; దీని నెక్క నర్హుండ" వనిన నురుక్రమ ప్రియుం డయిన ధ్రువుండు తన్మధుర వాక్యంబులు విని కృతాభిషేకుం డయి యచ్చటి మునులకుఁ బ్రణమిల్లి తదాశీర్వాదంబులు గైకొని, విమానంబునకుం బ్రదక్షిణార్చనంబులు గావించి హరిపార్షదులైన సునందనందులకు వందనం బాచరించి భగవద్రూపవిన్యస్త చక్షురంతః కరణాదికుం డగుచు విమానాధిరోహణంబు గావించుటకు హిరణ్మయ రూపంబు ధరియించె; నప్పుడు.

టీకా:

వచ్చితిమి = వచ్చాము; ఏ = ఏ; పదంబునేమి = స్థానము అయితే; సూరి = విద్వాంసులైన; జనంబులు = వారు; సర్వోత్తమంబు = అత్యుత్తము; అని = అని; పొందుదురు = పొందుతారు; దేనిన్ = దేనిని; చంద్ర = చంద్రుడు; దివాకర = సూర్యుడు {దివాకరుడు - దివమునకు ఆకరుడు (చేయువాడు), సూర్యుడు}; గ్రహ = గ్రహములు; నక్షత్ర = నక్షత్రములు; తారా = తారల యొక్క; గణంబులు = సమూహములు; ప్రదక్షిణంబుగా = కుడిచేతి వైపుగాచుట్టును; తిరుగుచున్ = తిరుగుతూ; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకను; నీదు = నీ యొక్క; పితరుల = ముందటి తరము వారి; చేతను = చేత; అన్యుల = ఇతరుల; చేతను = చేత; అనధిష్ఠితంబును = చేరనిది, అధిరోహించచబడనిది; జగత్ = లోకముచేత; వంద్యంబును = నమస్కరింపబడునది; అభక్త = భక్తులు కాని వారు; జనా = వారికి; అతి = మిక్కిలి; దుర్జయంబునున్ = జయింపరానిది; అయిన = అయినట్టి; విష్ణు = విష్ణుని యొక్క; పదంబున్ = స్థానము; పొందుదువు = పొందుతావు; రమ్ము = రావలసినది; ఇదె = ఇదిగో; విమాన = విమానములలో; శ్రేష్ఠంబున్ = ఉత్తమమైనది; ఉత్తమ = ఉత్తములైన; శ్లోక = కీర్తింపబడు; జన = వారి; మౌళి = శిఖన ధరించు; మణి = మణివంటివాడు; ఐన = అయిన; శ్రీహరి = విష్ణుమూర్తి; పుత్తెంచెన్ = పంపించెను; దీనిన్ = దీనిన్; ఎక్కన్ = ఎక్కుటకు; అర్హుండవు = అర్హత కలవాడవు; అనినన్ = అనగా; ఉరుక్రమ = విష్ణునికి; ప్రియుండు = ఇష్ఠుడు; అయిన = అయిన; ధ్రువుండు = ధ్రువుడు; తత్ = ఆ; మధుర = మధురమైన; వాక్యంబులన్ = మాటలను; విని = విని; కృత = చేయబడిన; అభిషేకుండు = స్నానము కలవాడు; ఐ = అయ్యి; అచ్చటి = అక్కడి; మునుల = మునుల; కున్ = కు; ప్రణమిల్లి = నమస్కరించి; తత్ = వారి; ఆశీర్వాదంబులున్ = ఆశీర్వాదములు; కైకొని = స్వీకరించి; విమానంబున్ = విమానమున; కున్ = కు; ప్రదక్షిణ = కుడిచేతి వైపుగా చుట్టూ తిరుగుట; అర్చనంబులు = పూజించుటలు; కావించి = చేసి; హరి = విష్ణుని; పార్షదులు = అనుచరులు {పార్షదులు - పార్శ్వమున (పక్కన) ఉండువారు, అనుచరులు}; ఐన = అయిన; సునంద = సునందుడు; నందుల = నందుల; కున్ = కు; వందనంబు = నమస్కరించుట; ఆచరించి = చేసి; భగవత్ = విష్ణుని యొక్క; రూప = రూపము యందు; విన్యస్త = ఉంచబడిన; చక్షుస్ = కన్నులు; అంతఃకరణ = మనస్సు; ఆదికుండు = మొదలగునవి కలవాడు; అగుచున్ = అవుతూ; విమాన = విమానమును; అధిరోహణంబున్ = ఎక్కుటను; కావించుట = చేయుట; కున్ = కు; హిరణ్మయ = బంగారంలాంటి; రూపంబున్ = రూపమును; ధరియించెన్ = ధరించెను; అప్పుడు = అప్పుడు.

భావము:

(నిన్ను విష్ణుపదానికి తోడ్కొని పోవటానికై ) వచ్చాము. ఏ స్థానాన్ని పండితులు సర్వశ్రేష్ఠమని భావిస్తారో, దేనిని చంద్రుడు సూర్యుడు గ్రహాలు నక్షత్రాలు, తారాగణాలు ప్రదక్షిణ చేస్తూ ఉంటాయో, దేనిని నీ పితృదేవతలు పొందలేకపోయారో, ఏది జగద్వంద్యమో, దేనిని భక్తులు కానివారు పొందలేరో అటువంటి విష్ణుపదాన్ని నీవు పొందుతావు. రా! ఇదిగో ఈ గొప్ప విమానాన్ని దేవాదిదేవుడైన శ్రీహరి పంపించాడు. దీని నెక్కడానికి నీవు అర్హుడవు” అని విష్ణుకింకరులు చెప్పగా విష్ణుప్రియుడైన ధ్రువుడు వారి మధుర వాక్కులను విని సంతోషించి, స్నానము చేసి, అక్కడి మునులకు నమస్కరించి, వారి ఆశీస్సులను పొంది, విమానానికి ప్రదక్షిణ చేసి పూజించి, హరి అనుచరులైన సునంద్ నందులకు వందనం చేసి కన్నులను మనస్సును విష్ణువునందే లగ్నం చేసినవాడై విమానాన్ని ఎక్కడానికి తేజోమయం రూపాన్ని ధరించాడు. అప్పుడు…

4-375-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సుదుందుభి పణ వానక
ముజాదులు మొరసె; విరుల ముసురు గురిసె; గి
న్నె గంధర్వుల పాటలు
రితములై చెలఁగె నపుడు వ్యచరిత్రా!

టీకా:

సుర = దేవతల; దుందుభి = దుందుభులు, నగారాలు; పణవ = భేరి; ఆనక = డోళ్ళు; మురజ = మద్దెలలు; ఆదులు = మొదలగునవి; మొరసె = మోగినవి; విరుల = పూల; ముసురు = వాన; కురిసెన్ = కురిసినవి; కిన్నెర = కిన్నెరలు; గంధర్వుల = గంధర్వుల; పాటలు = పాటలు; భరితములు = నిండినవి; ఐ = అయ్యి; చెలగెన్ = చెలరేగెను; అపుడు = అప్పుడు; భవ్య = దివ్యమైన; చరిత్రా = నడవడిక కలవాడా.

భావము:

దేవతల నగారాలు, బేరీలు, డోళ్ళు, మద్దెలలు మొదలైనవి మ్రోగాయి. పూలవాన కురిసింది. దివ్యచరిత్ర కల విదురా! కిన్నరుల, గంధర్వుల పాటలు చెలరేగాయి.

4-376-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి సమయంబున ధ్రువుండు దుర్గమంబగు త్రివిష్టపంబునకు నేగువాఁ డగుచు "దీన యగు జననిం దిగనాడి యెట్లు వోవుదు?" నని చింతించు వానిం బార్షదు లవలోకించి యగ్రభాగంబున విమానారూఢ యై యేగుచున్న జననిం జూపిన సంతుష్టాంతరంగుం డగుచు.

టీకా:

అట్టి = అటువంటి; సమయంబునన్ = సమయములో; ధ్రువుండు = ధ్రువుడు; దుర్గమంబు = ప్రవేశించుటకు రానిది; అగు = అయిన; త్రివిష్టపంబున్ = స్వర్గము; కున్ = కు; ఏగు = వెళ్ళెడి; వాడు = వాడు; అగుచున్ = అవుతూ; దీన = దీనురాలు; అగు = అయిన; జననిన్ = తల్లిని; దిగనాడి = వదలివేసి; ఎట్లు = ఏ విధముగ; పోవుదును = వెళ్ళుదును; అని = అని; చింతించు = విచారించెడి; వానిన్ = వానిని; పార్షదులు = అనుచరులు; అవలోకించి = చూసి; అగ్ర = ముందు; భాగంబునన్ = ప్రక్క; విమాన = విమానమును; ఆరూఢ = ఎక్కినది; ఐ = అయ్యి; ఏగుచున్న = వెళ్తున్న; జననిన్ = తల్లిని; చూపినన్ = చూపించగా; సంతుష్ట = సంతోషించిన; అంతరంగుడు = మనస్సు కలవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

అటువంటి సమయంలో ధ్రువుడు ప్రవేశించడానికి సాధ్యం కాని దేవలోకానికి పోతూ "దీనురాలైన కన్నతల్లిని విడిచి ఎలా వెళ్ళను?" అని విచారిస్తుండగా విష్ణుభటులు చూచి, తమ ముందు విమానమెక్కి పోతున్న అతని తల్లిని చూపించగా తృప్తి పడుతూ…

4-377-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని సునీతిని మును కనుఁ
గొని యవల విమాన మెక్కి గొనకొని విబుధుల్
మీఁదఁ బుష్పవర్షము
యముఁ గురియింప ధ్రువుఁడు ర్షముతోడన్.

టీకా:

జననిన్ = తల్లిని; సునీతిని = సునీతిని; మును = ముందు; కనుగొని = చూసి; అవల = తరవాత; విమానము = విమానము; ఎక్కి = ఎక్కి; కొనకొని = పూని; విబుధుల్ = దేవతలు; తన = తన; మీదన్ = పైన; పుష్ప = పూల; వర్షముల్ = వానలు; అనయమున్ = అవశ్యము; కురియింపన్ = కురిపించగా; ధ్రువుడు = ధ్రువుడు; హర్షము = సంతోషము; తోడన్ = తోటి.

భావము:

తనకు ముందుగా వెళుతున్న తల్లియైన సునీతిని చూసి ధ్రువుడు విమానం ఎక్కి దేవతలు పూలవాన కురిపించగా సంతోషంతో…

4-378-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిచని వెస గ్రహమండల
మును ద్రైలోక్యంబు సప్తమునిమండలమున్
నుఁ డుత్తరించి యవ్వలఁ
రెడు హరిపదము నొందెఁ ద్దయుఁ బ్రీతిన్.

టీకా:

చనిచని = వెళ్ళివెళ్ళి; వెసన్ = శ్రీఘ్రమే; గ్రహ = గ్రహము లుండెడి; మండలమును = మండలమును; త్రైలోక్యంబున్ = ముల్లోకములను {ముల్లోకములు - 1భూలోకము 2భువర్లోకము 3సువర్లోకము}; సప్త = ఏడుగురు (7); ముని = ఋషి; మండలమునున్ = మండలమును; ఘనుడు = గొప్పవాడు; ఉత్తరించి = దాటి; అవ్వలన్ = ఆపైన; తనరెడు = విలసిల్లెడు; హరి = విష్ణుని; పదమున్ = స్థానమును; ఒందెన్ = పొందెను; తద్దయున్ = మిక్కిలి; ప్రీతిన్ = ప్రీతితో.

భావము:

వెళ్ళి వెళ్ళి ధ్రువుడు గ్రహమండలాన్ని, ముల్లోకాలను, సప్తర్షి మండలాన్ని దాటి ఆపైన ఉన్న విష్ణుపదాన్ని చేరుకున్నాడు.

4-379-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అది మఱియు నిజకాంతిచేతం ద్రిలోకంబులం బ్రకాశింపంజేయుచు నిర్దయాగమ్యంబును శాంతులు సమదర్శనులు శుద్దులు సర్వ భూతానురంజనులు నచ్యుతభక్తబాంధవులు నయిన భద్రాచారులకు సుగమ్యంబును నయి గంభీరవేగంబు ననిమిషంబు నగు జ్యోతిశ్చక్రంబు సమాహితంబై గోగణంబు మేధి యందుం బోలె నెందుఁ బరిభ్రమించుచుండు నట్టి యచ్యుతపదంబునుం బొంది, విష్ణుపరాయణుండైన ధ్రువుండు త్రిలోకచూడామణియై యొప్పుచుండె; నప్పుడు భగవంతుండైన నారదుండు ధ్రువుని మహిమం గనుంగొని ప్రచేతస్సత్త్రంబునందు వీణ వాయించుచు.

టీకా:

అది = అది; మఱియున్ = ఇంకను; నిజ = తన; కాంతి = వెలుగు; చేతన్ = చేత; త్రిలోకంబులన్ = ముల్లోకములను; ప్రకాశింపన్ = ప్రకాశించునట్లు; చేయుచున్ = చేస్తూ; నిర్దయ = దయ లేనివారికి; అగమ్యంబునున్ = చొరానిది; శాంతులు = శాంతమైన నడవడిక కలవారు; సమదర్శనులు = జీవుల యెడ సమదృష్టి కలవారు; శుద్ధులు = పరిశుద్దమైన వర్తన కలవారు; సర్వ = సమస్తమైన; భూత = జీవుల; అనురంజనులు = సంతోషము కలిగించెడివారు; అచ్యుత = విష్ణుని; భక్త = భక్తుల యొక్క; బాంధవులును = బంధువులును; అయిన = అయినట్టి; భద్ర = శుభమైన; ఆచారుల = ఆచారములు కలవారు; కున్ = కు; సు = సులభముగ; గమ్యంబును = ప్రవేశింప వీలగునది; అయి = అయ్యి; గంభీర = అత్యధికమైన; వేగంబున = వేగమున; అనిమిషంబున్ = దివ్యమైనది; అగు = అయిన; జ్యోతిశ్చక్రంబున్ = జ్యోతిశ్చక్రము {జ్యోతిశ్చక్రమ – గ్రహ నక్షత్ర తారకాదులు తిరిగెడు చక్రము}; సమాహితంబున్ = కూడినది; ఐ = అయ్యి; గోగణంబున్ = పశువులు; మేధి = ఇరుసు; అందున్ = అందు; పోలెన్ = వలె; ఎందున్ = ఎక్కడైతే; పరిభ్రమించుచున్ = తిరుగుతూ; ఉండున్ = ఉండునో; అట్టి = అటువంటి; అచ్యుత = విష్ణు; పదంబున్ = స్థానమును; పొంది = పొంది; విష్ణు = విష్ణువు యెడల; పరాయణుండున్ = లగ్నమైన మనసు కలవాడు; ఐన = అయిన; ధ్రువుండు = ధ్రువుడు; త్రిలోక = ముల్లోకములకు; చూడామణి = శిరోరత్నము వంటివాడు; ఐ = అయ్యి; ఒప్పుచున్ = ఒప్పి; ఉండె = ఉండెను; అప్పుడు = అప్పుడు; భగవంతుడు = మహిమాన్వితుడు; ఐన = అయిన; నారదుండు = నారదుడు; ధ్రువునిన్ = ధ్రువుని; మహిమన్ = మహత్మ్యమును; కనుంగొని = చూసి; ప్రచేతస్ = ప్రచేతస్సుల {ప్రచేతస్సులు - ప్ర (మిక్కిలి) చేతస్సులు (చైతన్యము కలవారు)}; సత్త్రంబున్ = యాగము; అందున్ = అందు; వీణన్ = వీణను; వాయించుచు = వాయిస్తూ.

భావము:

ఆ విష్ణుపదం తన కాంతిచేత ముల్లోకాలను ప్రకాశింపజేస్తున్నది. నిర్దయులకు పొందరానిది. శాంతస్వభావులు, సర్వజీవుల పట్ల సమదృష్టి కలవారు, పవిత్రులు, భూతదయ కలవారు, విష్ణుభక్తుల బంధువులైన సదాచారాలు కలవారు ఆ విష్ణుపదాన్ని సులభంగా పొందగలుగుతారు. కట్టుగుంజ చుట్టు పశువులు తిరిగే విధంగా జ్యోతిశ్చక్రం మహావేగంతో రెప్పపాటు కాలం కూడా ఆగకుండా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అటువంటి విష్ణుపదాన్ని పొంది విష్ణుభక్తుడైన ధ్రువుడు ముల్లోకాలకు చూడామణియై విలిసిల్లుతూ ఉన్నాడు. అప్పుడు పూజ్యుడైన నారదుడు ధ్రువుని మాహాత్మ్యాన్ని చూచి ప్రచేతసుల యాగంలో వీణ వాయిస్తూ…

4-380-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"తియె దైవంబుగా భావంబులోపలఁ-
లఁచు సునీతినంను తపః ప్ర
భావము క్రియ ధర్మవ్య నిష్ఠలఁ బొందఁ-
జాలరు బ్రహ్మర్షి నము లనిన
క్షత్రియకులు నెన్నఁగా నేల? యెవ్వఁడు-
పంచసంవత్సర ప్రాయమునను
సురుచి దురుక్త్యుగ్ర భిన్న హృదయుఁడై-
ద్వాక్యహిత బోధతిఁ దనర్చి

4-380.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నమునకు నేగి హరిభక్తి శత నొంది
జితుఁ డగు హరిఁ తన వశుఁడై చరింపఁ
జేసి వెసఁ దత్పదంబును జెందె, నట్టి
రిపదంబును బొంద నెవ్వరికిఁ దరము?"

టీకా:

పతియె = భర్తే; దైవంబు = దేవుడు; కాన్ = అగనట్లు; భావంబున్ = మనసు; లోపలన్ = లో; తలచు = అనుకొనెడి; సునీతి = సునీతి యొక్క; నందను = పుత్రుని; తపః = తపస్సు; ప్రభావము = ప్రభావము; క్రియన్ = వలె; ధర్మ = ధర్మబద్దమైన; భవ్య = దివ్యమైన; నిష్ఠలన్ = నిష్ఠలను; పొందన్ = పొందుటకు; చాలరు = సమర్థులుకారు; బ్రహ్మర్షి = బ్రహ్మఋషిలు అయిన; జనములున్ = వారు; అనినన్ = అనగాఇంక; క్షత్రియకులున్ = క్షత్రియ వంశములలో పుట్టినవారిని; ఎన్నగాన్ = ఎంచుట; ఎందులకు = ఎందులకు; ఎవ్వడు = ఎవడైతే; పంచ = ఐదు (5); సంవత్సర = ఏండ్ల; ప్రాయమునను = వయసులో; సురుచి = సురుచి యొక్క; దురుక్త = తిట్లను; ఉగ్ర = భయంకరమైన; శర = బాణములచే; భిన్న = బద్దలైన; హృదయుడు = హృదయముకలవాడు; ఐ = అయ్యి; మత్ = నా యొక్క; వాక్య = మాటలను; హిత = హితమును; మతిన్ = మనసులో; తనర్చి = అతిశయించి.
వనమున = అడవి; కున్ = కి; వెళ్ళి = వెళ్ళి; హరి = విష్ణుని; భక్తిన్ = భక్తికి; వశతన్ = వివశత్వమును; ఒంది = పొంది; అజితుడు = ఓడింపరానివాడు; హరి = హరి; తన = తనకి; వశుడు = వశమై; చరింపన్ = వర్తించుట; చేసి = వలన; వెసన్ = శ్రీఘ్రమే; తత్ = అతని; పదంబున్ = లోకమును; చెందెన్ = పొందెను; అట్టి = అటువంటి; హరి = విష్ణుని; పదంబున్ = లోకమును; పొందన్ = పొందుట; ఎవ్వరికిని = ఎవరికి; తరము = సాధ్యము.

భావము:

“పతివ్రత అయిన సునీతి కొడుకు ధ్రువుడు తపస్సు చేసి సాధించిన మహాఫలాన్ని బ్రహ్మర్షులు కూడా పొందలేరంటే ఇక క్షత్రియుల మాట చెప్పేదేముంది? అతడు ఐదేండ్ల వయస్సులో సవతితల్లి సురుచి పలికిన దుర్వాక్కులు అనే బాణాలు మనస్సుకు నొప్పింపగా నా ఉపదేశాన్ని పాటించి అడవికి పోయి భక్తిపారవశ్యంతో మెప్పించరాని శ్రీహరిని మెప్పించి విష్ణుపదాన్ని పొందాడు. ఆ విధంగా విష్ణుపదాన్ని సాధించడం ఎవరి తరమౌతుంది?”

4-381-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని పాడె"ననుచు విదురున
ఘుఁడు మైత్రేయుఁ డనియె నంచిత భక్తిన్
వినుతోద్దామయశస్కుం
నఁగల యా ధ్రువుని చరిత మార్యస్తుత్యా!

టీకా:

అని = అని; పాడెన్ = పాడెను; అనుచున్ = అంటూ; విదురున్ = విదురుని; కిన్ = కి; అనఘుడు = పుణ్యుడు; మైత్రేయుడు = మైత్రెయుడు; అనియెన్ = పలికెను; అంచిత = చక్కటి; భక్తిన్ = భక్తితో; వినుత = స్తుతింపబడుట; ఉద్దామ = అతిశయించిన; యశస్కుండు = కీర్తి కలవాడు; అనన్ = అనుటకు; కల = తగిన; ఆ = ఆ; ధ్రువునిన్ = ధ్రువుని; చరితము = కథ; ఆర్యస్తుత్యా = గొప్పవారిచే కీర్తింపబడువాడ.

భావము:

ఇలా అంటూ విదురుడికి పుణ్యాత్ముడు అయిన మైత్రేయుడు గొప్ప కీర్తి కలవాడు అనదగిన ధ్రువుని వృత్తాంతం కీర్తించాడు మహానుభావ!

4-382-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హితసత్పురుష సమ్మతమును ధన్యంబు-
స్వర్గప్రదంబు యస్కరంబు
నాయుష్కరంబుఁ బుణ్యప్రదాయకమును-
మంగళకర మఘర్షణంబు
సౌమనస్యముఁ బ్రశంసాయోగ్యమును బాప-
రమును ధ్రువపదప్రాపకంబు
నై యొప్పు నీ యుపాఖ్యానంబుఁ దగ నీకు-
నెఱిఁగించితిని; దీని నెవ్వఁడేని

4-382.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తివుట శ్రద్ధాగరిష్ఠుఁడై తీర్థపాద
రణ సరసీరుహద్వయాశ్రయుఁడు నైన
వ్యచరితు దినాంత ప్రభాతవేళ
ను సినీవాలి పూర్ణిమ లందు మఱియు.

టీకా:

మహిత = గొప్ప; సత్ = మంచి; పురుష = పురుషుల; సమ్మతమును = అంగీకారము; ధన్యంబున్ = ధన్యమైనది; స్వర్గ = స్వర్గలోక ప్రాప్తిని; ప్రదంబున్ = ఇచ్చునది; యశస్కరంబున్ = కీర్తిని కలుగజేయునది; ఆయుష్కరంబున్ = జీవితకాలమునుపెంచునది; పుణ్యప్రదాయకమును = పుణ్యమునుకలిగించెడిది; = మంగళకరము = శుభకరము; అఘ = పాపములను; మర్షణము = హరించునది; సౌమనస్యము = మంచిమనసుకలిగియుండుట; ప్రశంసా = కీర్తించుటకు; యోగ్యమును = తగినదియిను; పాప = పాపములను; హరమును = హరించుచున్నది; ధ్రువ = ధ్రువుని; పద = స్థానమును; ప్రాపకంబున్ = లభించునదియును; ఐ = అయ్యి; ఒప్పు = ఒప్పెడి; ఈ = ఈ; ఉపాఖ్యానంబున్ = ఉపాఖ్యానమున్; తగ = చక్కగ; నీకున్ = నీకు; ఎఱిగించితిని = తెలిపితిని; దీనిన్ = దీన్ని; ఎవ్వడు = ఎవరు; ఏనిన్ = అయినను.
తివుటన్ = కోరి; శ్రద్ధా = శ్రద్ధ; గరిష్టుడు = ఎక్కువగా కలవాడు; ఐ = అయ్యి; తీర్థపాద = విష్ణుమూర్తి యొక్క {తీర్థపాదుడు - పుణ్యతీర్థమునకు స్థానమైన పాదములు కలవాడు, విష్ణువు}; చరణ = పాదములు అనెడి; సరసీరుహ = పద్మముల; ద్వయ = జంటను; ఆశ్రయుండు = ఆశ్రయించినవాడు; ఐన = అయిన; భవ్య = దివ్యమైన; చరితున్ = వర్తనకలవానిని; దినాంత = సాయంకాలము; ప్రభాత = ఉదయపు; వేళలను = సమయములందు; సినీవాలీ = చంద్రకళకానవచ్చెడి అమావాస్య; పూర్ణిమల = పౌర్ణమిల; అందున్ = లో; మఱియున్ = ఇంకను.

భావము:

(ధ్రువుని చరిత్ర) సజ్జన సమ్మతం, ధన్యం, స్వర్గప్రదం, కీర్తికరం, ఆయుష్కరం, పుణ్యప్రద, శుభకరం, పాపహరం, సుజనత్వప్రదం, ప్రశంసాయోగ్యం, ధ్రువపదాన్ని కలిగించేది అయిన ధ్రువోపాఖ్యానాన్ని నీకు చెప్పాను. ఎవరైనా దీనిని కోరికతో, శ్రద్ధతో పుణ్యతీర్థాలకు స్థానమైన విష్ణుపాదాలను ఆశ్రయించి, ఉదయ సాయంకాలాలందు, సినీవాలి పూర్ణిమలందు, ఇంకా…

4-383-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ద్వాదశినిఁ బద్మ బాంధవ వాసరమున
శ్రవణ నక్షత్రమున దినక్షయమునందుఁ
రఁగ సంక్రమణవ్యతీపాత లందు
భల భక్తిని వినునట్టి జ్జనులకు.
దినక్షయము ; : వ్యతీపాతము - యోగములు

టీకా:

ద్వాదశినిన్ = చంద్రమానములో ద్వాదశి నాడు; పద్మబాంధవవాసరమునన్ = సూర్యమాన దినము; శ్రవణ = శ్రవణము; నక్షత్రమున = నక్షత్రము నాడు; దినక్షయము = ఒక దినమున మూడు తిథుల కలుగుట, సాయంకాలం లేదా మాపు; అందున్ = సమయ మందు; పరగన్ = ప్రసిద్ధమగు; సంక్రమణ = సంక్రమణ దినములు {సంక్రమణము - సూర్యుడు ఒకరాశినుండి మరియొక రాశికి మారుట, ఉదా. మకరసంక్రమణము}; వ్యతీపాతలు = సోమవారము పున్నమిల కూడిక (సూర్యారాయాంధ్ర), అమావాస్య రవివారముల కూడిక (సం. వాచ); అందున్ = లోను; సభలన్ = సభలలోను; భక్తిన్ = భక్తితో; వినున్ = వినెడి; అట్టి = అటువంటి; సత్ = మంచి; జనుల్ = వారి; కున్ = కి.

భావము:

ద్వాదశినాడు, శ్రవణనక్షత్రంనాడు, దినక్షయము (ఒక అహోరాత్రమున మూడు తిథులు వచ్చిన దినము), మకర సంక్రమణాది సంక్రమణకాలంలో, వ్యతీపాతములలో (పూర్ణిమ తిథితో కూడిన సోమవారం లేదా అమావాస్యతో కూడిన ఆదివారం), సభలలో భక్తిశ్రద్ధలతో వినే సజ్జనులకు…

4-384-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్లేశనాశనంబును మహాప్రకాశంబును నైన భగవద్భక్తియు శీలాది గుణంబులును గలుగు; మఱియుఁ దేజఃకామునకుఁ దేజంబును, మనః కామునకు మనంబును, నిష్కామునకుఁ దత్త్వవిజ్ఞానంబును గలుగు; దీని వినిపించువారికి దేవతానుగ్రహంబు గలుగు: నిట్టి యుపాఖ్యానంబు నీ కెఱింగించింతి” నని మైత్రేయుండు విదురునకుఁ జెప్పిన క్రమంబున శుకయోగి పరీక్షితున కెఱింగించిన తెఱంగున సూతుండు శౌనకాదులకు వినిపించి వెండియు నిట్లనియె "నట్లు చెప్పిన మైత్రేయునిం గని విదురుం డిట్లనియె.

టీకా:

క్లేశ = క్లేశములు, చీకాకులు; నాశనంబును = నాశన మగుట; మహా = గొప్ప; ప్రకాశంబునున్ = ప్రకాశవంతము; ఐన = అయిన; భగవత్ = భగవంతుని యెడ; భక్తియున్ = భక్తి; శీల = శీలము, మంచి నడవడిక; ఆది = మొదలగు; గుణంబులును = గుణములును; మఱియున్ = ఇంకను; తేజస్ = తేజస్సును; కామున్ = కోరెడివాని; కున్ = కి; తేజంబును = తేజస్సును; మనః = మానసిక శక్తిని; కామున్ = కోరెడివాని; కున్ = కి; మనంబును = మానసిక శక్తిని; నిష్కామున్ = విరాగుని; కున్ = కి; తత్త్వ = తత్త్వ; విజ్ఞానంబును = విజ్ఞానమును; కలుగున్ = కలుగును; దీనిన్ = దీనిని; వినిపించు = వినపించెడి; వారి = వారి; కిన్ = కి; దేవతా = దైవ; అనుగ్రహంబున్ = కరుణ; కలుగున్ = కలుగును; ఇట్టి = ఇటువంటి; ఉపాఖ్యానంబున్ = ఉపాఖ్యానమును {ఉపాఖ్యానము - ఇతిహాసము, ఒక కథాకథనమున వచ్చెడి మరియెక కథ}; నీ = నీ; కున్ = కి; ఎఱిగించితిని = తెలిపితిని; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; విదురున్ = విదురుని; కున్ = కి; చెప్పినన్ = చెప్పినట్టి; క్రమంబు = విధముగ; శుక = శుకుడు అనెడి; యోగి = యోగి; పరీక్షితున్ = పరీక్షితుని; కిన్ = కి; ఎఱింగించిన = తెలిపిన; తెఱంగునన్ = విధముగ; సూతుండు = సూతుడు; శౌనక = శౌనకుడు; ఆదులు = మొదలగు వారి; కున్ = కి; వినిపించి = చెప్పి; వెండియున్ = మరల; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అట్లు = అలా; చెప్పినన్ = చెప్పినట్టి; మైత్రేయునిన్ = మైత్రేయుని; కని = చూసి; విదురుండు = విదురుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

క్లేశాలు నాశనం అవుతాయి,, ప్రకాశవంతం అయిన భగవద్భక్తి, మంచి శీలం అలవడుతాయి. తేజస్సు కోరేవానికి తేజస్సు, మానసిక శక్తిని కోరేవానికి మానసిక శక్తిని, కోరికలు లేనివానికి తత్త్వజ్ఞానం కలుగుతాయి. ఈ కథను వినిపించేవారికి దేవుని అనుగ్రహం లభిస్తుంది. ఇటువంటి ధ్రువోపాఖ్యానాన్ని నీకు వినిపించాను” అని మైత్రేయుడు విదురునికి వినిపించాడని శుకమహర్షి పరీక్షిత్తు మహారాజుకు తెలిపిన విధానాన్ని సూతుడు శౌనకాది మునులకు చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “ఆ విధంగా చెప్పిన మైత్రేయుని చూచి విదురుడు ఇలా అన్నాడు.

4-385-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఘాత్మ! నారదమునిపతి ధ్రువ చరి-
త్రము ప్రచేతసుల సత్త్రంబునందు
ర్థిమై గీర్తించె నంటి; ప్రచేతసు-
న నెవ్వ? రెవ్వరి నయు? లెట్టి
వంశజుల్? సత్త్ర మె వ్వల నను జేసి? ర-
ధ్వరమందు నిజకుల ర్మశీలు
గు ప్రచేతసులచే జియింపఁగాఁ బడె-
జ్ఞపూరుషుఁ డెట్టు చ్యుతాంఘ్రి

4-385.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్తియుక్తుఁడు విదిత సద్భాగవతుఁడు
దివిరి హరిపాదసేవా విధిప్రయుక్త
దేవదర్శనుఁ డగు నట్టి దివ్యయోగి
నారదుం డెట్లు గొనియాడె శౌరికథలు?

టీకా:

అనఘాత్మ = పుణ్యాత్ముడా; నారద = నారదుడు అనెడి; ముని = మునుల; పతి = నాయకుడు; ధ్రువ = ధ్రువుని; చరిత్రమున్ = చరిత్రను; ప్రచేతసుల = ప్రచేతసుల; సత్రంబున్ = సత్రము; అందున్ = లో; అర్థిన్ = కోరి; కీర్తించెన్ = కీర్తించెను; అంటి = అన్నావు; ప్రచేతసులు = ప్రచేతసులు {ప్రచేతసులు - ప్ర (గొప్ప) చేతస్సు (చైతన్యము) కలవారు}; అనన్ = అనగా; ఎవ్వరు = ఎవరు; ఎవ్వరి = ఎవరి; తనయులు = పుత్రులు; ఎట్టి = ఎటువంటి; వంశజుల్ = వంశమువారు; సత్త్రమున్ = యాగమును; ఎవ్వలననున్ = ఎందులకు; చేసిరి = చేసితిరి; అధ్వరము = యజ్ఞము; అందున్ = లో; నిజ = తమ; కుల = వంశము యొక్క; ధర్మ = ధర్మమున; శీలురు = మంచినడవడికగలవారు; అగు = అయిన; ప్రచేతసుల్ = ప్రచేతసుల; చే = చేత; యజియింపగాబడెన్ = అర్చింపబడిన; యజ్ఞపురుషుడు = యజ్ఞపురుషుడు; ఎట్టులన్ = ఏవిధముగ; అచ్యుత = హరి {అచ్యుతుడు - చ్యుతము (పతనము) లేనివాడు, విష్ణువు}; అంఘ్రి = పాదముల.
భక్తి = భక్తితో; యుక్తుడు = కూడినవాడు; విదిత = ప్రసిద్ధమగు; సత్ = మంచి; భాగవతుడు = బాగవత ధర్మానుయాయి; తివిరి = పూని; హరి = విష్ణుని; పాద = పాదములను; సేవా = సేవించెడి; విధి = విధానమున; ప్రయుక్త = ప్రయోగించిన; దేవ = దివ్యమైన; దర్శనుడు = తెలివికలవాడు; అగు = అయిన; అట్టి = అటువంటి; దివ్య = దివ్యమైన; యోగి = యోగి; నారదుండు = నారదుడు; ఎట్లు = ఏవిధముగ; కొనియాడెన్ = కీర్తించెను; శౌరి = విష్ణు; కథలు = కథలు.

భావము:

“పుణ్యాత్మా! నారద మునీంద్రుడు ధ్రువుని చరిత్రను ప్రచేతసులు చేస్తున్న యాగంలో కుతూహలంతో గానం చేశాడని చెప్పావు. ప్రచేతసులు అంటే ఎవరు? ఎవరి కుమారులు? ఏ వంశానికి చెందినవాళ్ళు? ఎక్కడ ఎక్కడ యజ్ఞం చేశారు? స్వధర్మ శీలురైన ప్రచేతసులు యజ్ఞపురుషుడైన శ్రీహరిని ఏ విధంగా అర్చించారు? విష్ణు పాదపద్మాలపై భక్తి కలవాడు, ప్రసిద్ధ భాగవతోత్తముడు, శ్రీహరిని సేవించే విధానం తెలిసినవాడు, దేవర్షి అయిన నారదుడు విష్ణుకథలను ఎలా కీర్తించాడు?

4-386-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నా కిపు డెఱిఁగింపుము సు
శ్లోకుని చరితామృతంబు శ్రోత్రాంజలులం
బైకొని జుఱ్ఱియుఁ దనివిం
గైకొనకున్నది మనంబు రుణోపేతా!"

టీకా:

నాకున్ = నాకు; ఇపుడున్ = ఇప్పుడు; ఎఱిగింపుము = తెలుపుము; సుశ్లోకుని = నారాయణుని {సుశ్లోకుడు - మంచిగ కీర్తింపబడువాడు, విష్ణువు}; చరితా = వర్తనములు అనెడి; అమృతంబున్ = అమృతమును; శ్రోత్రా = చెవులు అనెడి; అంజలులన్ = దోషిళ్ళతో; పైకొని = మీఱి, మిక్కిలి; జుఱ్ఱియున్ = జుఱ్ఱినప్పటికిని {జుఱ్ఱుట - జుర్ అని శబ్దము తో పీల్చుకొనుచు ఇష్టముతోకూడిన ఆత్రుత కలిగి తినుట}; తనివి = తృప్తి; కైకొనకున్నది = పొందకున్నది; మనంబున్ = మనసు; కరుణన్ = దయతో; ఉపేత = కూడినవాడ.

భావము:

నాకు ఇప్పుడు వినిపించు. కరుణాత్మా! కీర్తనీయుడైన విష్ణు కథామృతాన్ని చెవులనబడే దోసిళ్ళతో ఎంత జుఱ్ఱుకొని గ్రోలినా తృప్తి కలుగడం లేదు.

4-387-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యడిగిన విదురునిఁ గనుఁ
గొని మైత్రేయుండు పలికె "గొనకొని ధ్రువుఁడున్
మునకుఁ జనిన నాతని
యుం డగు నుత్కళుండు ళితాఘుండై.

టీకా:

అని = అని; అడిగిన = అడుగగా; విదురునిన్ = విదురుని; కనుగొని = చూసి; మైత్రేయుండు = మైత్రేయుడు; పలికెన్ = పలికెను; కొనకొని = పూని; ధ్రువుడున్ = ధ్రువుడు; వనమున్ = అడవి; కున్ = కి; చనినన్ = వెళ్ళగ; అతని = అతని; తనయుండు = పుత్రుడు; ఉత్కళుండు = ఉత్కళుడు; దళిత = పోగొట్టబడిన; అఘుండు = పాపములు కలవాడు; ఐ = అయ్యి.

భావము:

అని ప్రశ్నించిన విదురుని చూచి మైత్రేయుడు ఇలా అన్నాడు. “ధ్రువుడు తపోవనానికి వెళ్ళగా అతని కుమారుడు ఉత్కలుడు నిష్కళంకుడై…

4-388-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తురుఁ డాజన్మ ప్రశాంతుండు నిస్సంగుఁ-
డును సమదర్శనుండును ఘనుండు
నై యాత్మయందు లోకావళి, లోకంబు-
లందు నాత్మను జూచు నఘమైన
నుపమయోగక్రియా పావకాదగ్ధ-
ర్మ మలాశయ లనఁ బేర్చి
డుని కైవడిఁ జీఁకు చందంబునను మూఢు-
గిది నున్మత్తుని భంగిఁ జెవిటి

4-388.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డువునను గానఁబడుచు సర్వజ్ఞుఁడై ప్ర
శాంతకీల హుతాశను రణిఁ బొల్చి
తత శాంతంబు నంచిత జ్ఞానమయము
నైన బ్రహ్మస్వరూపంబు నాత్మఁ దలఁచి.

టీకా:

చతురుడు = నేర్పరుడు; ఆజన్మ = జన్మించినప్పటినుండి; ప్రశాంతుండు = ప్రశాంతమైన మనసుకలవాడు; నిస్సంగుడును = సంగములలేనివాడు; సమ = సమత్వముతోకూడిన; దర్శనుండును = బుద్ధికలవాడు; ఘనుండున్ = గొప్పవాడు; ఐ = అయ్యి; ఆత్మ = మనసు; అందున్ = లో; లోక = లోకులు; ఆవళిన్ = సమూహమందరిని; లోకంబుల్ = లోకుల; అందున్ = లో; ఆత్మనున్ = తనను; చూచుచున్ = చూస్తూ; అనఘము = పుణ్యము; ఐన = అయిన; = అనుపమ = సాటిలేని; యోగక్రియా = యోగక్రియలు అనెడి; పావక = అగ్ని చే; ఆదగ్ధ = మిక్కిలికాలిపోయిన; కర్మ = కర్మల; మల = మలములైన; ఆశయ = సంకల్పముల; కలనన్ = కలుగుటచే; పేర్చి = అతిశయించి; జడుని = జడుని; కైవడిన్ = వలె; చీకు = గుడ్డివాని; చందంబుననున్ = వలె; మూఢు = మూఢుని; పగిదిన్ = వలె; ఉన్మత్తుని = పిచ్చివాని; భంగిన్ = వలె; చెవిటి = చెవిడివాని.
వడుపుననున్ = వలె; కానబడుచు = కనబడుతూ; సర్వజ్ఞుడు = అన్నీతెలిసినవాడు; ఐ = అయ్యి; ప్రశాంతకీలహుతాశను = నివురుగప్పిననిప్పు {ప్రశాంతకీలహుతాశను - ప్రశాంత (చల్లారిన) కీలన్ (మంటలు) కల హుతాశన (అగ్ని), నివురుగప్పిననిప్పు}; సరణిన్ = వలె; పొల్చి = అతిశయించి; సతత = ఎల్లప్పుడును; శాంతంబునన్ = శాంతమునందు; అంచిత = చక్కటి; జ్ఞాన = జ్ఞానముతో; మయమున్ = నిండినది; ఐన = అయిన; బ్రహ్మ = పరబ్రహ్మ; స్వరూపంబున్ = స్వరూపమును; ఆత్మన్ = మనసులో; తలచి = తలచి.

భావము:

(ఉత్కలుడు) చతురుడు, ఆజన్మ శాంతమూర్తి, నిస్సంగుడు, సమదర్శనుడు అయి తనలో లోకాలను, లోకాలలో తనను దర్శిస్తూ, యోగాభ్యాసం అనే అగ్నిలో కర్మ వాసనలను దగ్ధం చేసి, జడుని వలె, గ్రుడ్డివాని వలె, మూగవాని వలె, పిచ్చివాని వలె, చెవిటివాని వలె కనిపిస్తూ సర్వజ్ఞుడై కూడ నివురు గప్పిన నిప్పు వలె ఉండి శాంతమూ, జ్ఞానమయమూ అయిన బ్రహ్మస్వరూపాన్ని మనస్సులో భావించి...

4-389-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కంటె నితర మొక టెఱుఁ
ని కతమున సార్వభౌమశ్రీఁ బొందన్
మునఁ గోరక యుండుటఁ
ని కులవృద్ధులును మంత్రిణములు నంతన్.

టీకా:

తన = తన; కంటెన్ = కంటె; ఇతరమున్ = వేరైనది; ఒకటిన్ = ఏమియును; ఎఱుగని = తెలియని; కతమునన్ = కారణముచేత; సార్వభౌమక = సార్వభౌమత్వము; శ్రీ = సంపదను; పొందన్ = పొందుటకు; మనమునన్ = మనసులో; కోరక = కోరుకొనకుండగ; ఉండుట = ఉండుట; కని = చూసి; కుల = వంశము నందలి; వృద్ధులును = పెద్దవారు; మంత్రి = మంత్రుల; గణములున్ = సమూహములు; అంతన్ = అంతట.

భావము:

తనకంటే ఇతర పదార్థాన్ని ఎరుగక సార్వభౌమ పదాన్ని కోరకపోవడంతో కులవృద్ధులు, మంత్రులు...

4-390-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అతని నున్మత్తునింగాఁ దెలసి తదనుజుం డైన వత్సరునికిఁ బట్టంబు గట్టిరి; ఆ వత్సరునికి సర్వర్థి యను భార్య యందుఁ బుష్పార్ణుండును, జంద్రకేతుండును, నిషుండును, నూర్జుండును, వసువును, జయుండును నన నార్వురు తనయులు గలిగిరి; అందుఁ బుష్పార్ణుం డనువానికిఁ బ్రభయు దోషయు నను నిద్దఱు భార్య లైరి; అందుఁ బ్రభ యనుదానికిం బ్రాతర్మధ్యందిన సాయంబు లను సుతత్రయంబును, దోష యను దానికిం బ్రదోష నిశీథ వ్యుష్టు లనువారు ముగ్గురును బుట్టిరి; అందు వ్యుష్టుం డనువానికిఁ బుష్కరిణి యను పత్ని యందు సర్వతేజుం డను సుతుండు పుట్టె; వానికి నాకూతి యను మహిషి వలనఁ జక్షుస్సంజ్ఞుం డయిన మనువు జనియించె; వానికి నడ్వల యను భార్య యందుఁ బురువును, గుత్సుండును, ద్రితుండును, ద్యుమ్నుండును, సత్యవంతుండును, ఋతుండును, వ్రతుండును, నగ్నిష్ఠోముండును, నతిరాత్రుండును, సుద్యుమ్నుండును, శిబియును, నుల్ముకుండును నను పన్నిద్ధఱు తనయులు గలిగిరి; అందు నుల్ముకునికిఁ బుష్కరిణి యనుదాని వలన నంగుండును, సుమనసుండును, ఖ్యాతియుఁ, గ్రతువును, నంగిరసుండును, గయుండును నను నార్వురు గొడుకులు పుట్టిరి; అందు నంగునికి సునీథ యను ధర్మపత్నివలన వేనుం డను పుత్రుం డుదయించిన.

టీకా:

అతనిన్ = అతనిని; ఉన్మత్తుని = పిచ్చివానిగ; తెలిసి = తెలుసుకొని; తత్ = అతని; అనుజుండు = సోదరుడు; ఐన = అయిన; వత్సరుని = వత్సరుని; కిన్ = కి; పట్టంబున్ = పదవీకృతుని; కట్టిరి = చేసిరి; ఆ = ఆ; వత్సరుని = వత్సరుని; కిన్ = కి; సర్వర్థి = సర్వర్థి {సర్వర్థి - సమస్తమైన ప్రయోజనములు}; అను = అనెడి; భార్య = పత్ని; అందున్ = అందు; పుష్పార్ణుండును = పుష్పార్ణుడు {పుష్పార్ణుడు - పుష్పముల అర్ణుడు (సముద్రమైనవాడు)}; చంద్రకేతుండును = చంద్రకేతుడు {చంద్రకేతువు - చంద్రుని గుర్తుకల జండాకలవాడు}; ఇషుండును = ఇషుడు {ఇషుడు - ఇష (బాణము) కలవాడు}; ఊర్జుండును = ఊర్జుడు {ఊర్జుడు - ఊర్జ (ఉత్సాహము) కలవాడు, కార్తీకమాసము}; వసువును = వసువును {వసువు - సంపద కలవాడు}; జయుండు = జయుడు {జయుడు – జయము కలవాడు}; అనన్ = అనెడి; ఆర్వురు = ఆరుగురు (6); తనయులున్ = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; అందున్ = వారిలో; పుష్పార్ణుండు = పుష్పార్ణుడు; అను = అనెడి; వాడు = వాడు; కిన్ = కి; ప్రభయున్ = ప్రభ; దోషయున్ = దోష; అను = అనెడి; ఇద్దఱు = ఇద్దరు (2); భార్యలు = బార్యలు; ఐరి = కలరు; అందున్ = వారిలో; ప్రభ = ప్రభ {ప్రభ - వెలుగు, పగలు}; అను = అనెడి; దాని = ఆమె; కిన్ = కి; ప్రాతః = ప్రాతః {ప్రాతః - ఉదయము}; మధ్యందిన = మధ్యాహ్న {మధ్యాహ్న - మధ్యాహ్నము}; సాయంబులు = సాయము {సాయము - సాయంత్రము}; అను = అనెడి; సుత = పుత్రుల; త్రయంబునున్ = ముగ్గురు (3); దోష = దోష {దోష - రాత్రి}; అను = అనెడి; దాని = ఆమె; కిన్ = కి; ప్రదోష = ప్రదోష {ప్రదోష - సూర్యాస్తమయము తరువాతి కాలము. మునిమాపు}; నిశీథ = నిశీథ {నిశీథ - అర్థరాత్రి కాలము}; వ్యుష్టి = వ్యుష్టి {వ్యుష్టము - తెల్లవారకపూర్వపు కాలము, వేకువ}; అను = అనెడి; వారు = వారు; ముగ్గురు = ముగ్గురు (3); పుట్టిరి = పుట్టిరి; అందున్ = వారిలో; వ్యుష్టుండు = వ్యుష్టుడు; అను = అనెడి; వాడు = వాడు; కిన్ = కి; పుష్కరిణి = పుష్కరిణి {పుష్కరిణి – తామర కొలను, కోనేఱు, ఆడ ఏనుగు}; అను = అనెడి; పత్ని = భార్య; అందున్ = అందు; సర్వతేజుండు = సర్వతేజుడు; అను = అనెడి; సుతుండు = పుత్రుడు; పుట్టెన్ = పుట్టెను; వాడు = వాడు; కిన్ = కి; ఆకూతి = ఆకూతి {ఆకూతి – అభిప్రాయము }; అను = అనెడి; మహిషి = భార్య; వలన = అందు; చక్షుస్సు = చక్షుస్సు {చక్షుస్సు - కన్నుయైనవాడు}; సంజ్ఞుండు = పేరుకలవాడు; అయిన = అయిన; మనువు = మనువు; జనియించెన్ = పుట్టెను; వాడు = వాడు; కిన్ = కి; నడ్వల = నడ్వల; అను = అనెడి; భార్య = భార్య; అందున్ = అందు; పురువును = పురువు; కుత్సుండును = కుత్సుడు; త్రితుండు = త్రితుడు; ఉద్యమ్నుండును = ఉద్యమ్నుడు; సత్యవంతుండును = సత్యవంతుడు; ఋతుండును = ఋతుడు; వ్రతుండును = వ్రతుడు; అగ్నిష్ఠోముండును = అగ్నిష్ఠోముడు; అతిరాత్రుండును = అతిరాత్రుడు; సుద్యుమ్నుండును = సుద్యుమ్నుడు; శిబియును = శిబి; ఉల్ముకుండును = ఉల్ముతుడు; అను = అనెడి; పన్నిద్దఱు = పన్నిండుమంది (12); తనయులు = పుత్రులు; కలిగిరి = పుట్టిరి; అందున్ = వారిలో; ఉల్ముకున్ = ఉల్ముకుని {ఉల్ముకము – మండుతున్న కొఱవి}; కిన్ = కి; పుష్కరిణి = పుష్కరిణి; అను = అనెడి; దాని = ఆమె; వలనన్ = అందు; అంగుండును = అంగుడు; సుమనసుండును = సుమనసుడు; ఖ్యాతియున్ = ఖ్యాతి; క్రతువును = క్రతువు; అంగిరసుండు = అంగిరసుడు; గయుండునున్ = గయుడు; అను = అనెడి; ఆర్వురు = ఆరుగురు (6); కొడుకులున్ = పుత్రులు; పుట్టిరి = పుట్టిరి; అందున్ = వారిలో; అంగున్ = అంగుని; కిన్ = కి; సునీథ = సునీథ {సునీథుడు – పుణ్యాత్ముడు, ధార్మికుడు (శబ్దార్థ దీపిక}; అను = అనెడి; ధర్మపత్ని = భార్య; వలనన్ = అందు; వేనుండు = వేనుడు; అను = అనెడి; పుత్రుండు = కొడుకు; ఉదయించినన్ = పుట్టగా.

భావము:

ఆ ఉత్కలుణ్ణి పిచ్చివానిగా భావించి, అతని తమ్ముడైన వత్సరునికి పట్టం కట్టారు. ఆ వత్సరునికి సర్వర్థి అనే భార్యవల్ల పుష్పార్ణుడు, చంద్రుకేతుడు, ఇషుడు, ఊర్జుడు, వసువు, జయుడు అనే ఆరుగురు కుమారులు కలిగారు. వారిలో పుష్పార్ణునకు ప్రభ, దోష అని ఇద్దరు భార్యలు. అందులో ప్రభకు ప్రాతస్సు, మధ్యందినం, సాయం అని ముగ్గురు కొడుకులు కలిగారు. దోషకు ప్రదోషం, నిశీథ, వ్యుష్టుడు అని ముగ్గురు కుమారులు పుట్టారు. అందులో వ్యుష్టుడు అనేవానికి పుష్కరిణి అనే భార్య వల్ల సర్వతేజుడు అనే కుమారుడు పుట్టాడు. అతనికి ఆకూతి అనే భార్యవల్ల చక్షుస్సు అనే మనువు కొడుకై పుట్టాడు. అతనికి నడ్వల అనే భార్యవలన పురువు, కుత్సుడు, త్రితుడు, ద్యుమ్నుడు, సత్యవంతుడు, ఋతుడు, వ్రతుడు, అగ్నిష్ఠోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్ముకుడు అనే పన్నెండుమంది పుత్రులు కలిగారు. వారిలో ఉల్ముకునికి పుష్కరిణి అనే భార్యవల్ల అంగుడు, సుమనసుడు, ఖ్యాతి, క్రతువు, అంగిరసుడు, గయుడు అనే ఆరుగురు కొడుకులు పుట్టారు. వారిలో అంగునికి సునీథ అనే భార్యవల్ల వేనుడు అనే కొడుకు కలిగాడు.