పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విదుర మైత్రేయ సంవాదంబు

  •  
  •  
  •  

3-186-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర కథావర్ణనముల
తి హేయత నొందె జిత్త నఘాత్మ! రమా
తి చరితామృతరతి సం
సృతివేదన లెల్లఁ బాయఁజేయు మునీంద్రా!

టీకా:

ఇతర = ఇతరమైన; కథా = కథలను; వర్ణనములన్ = వర్ణించునప్పుడు; అతి = మిక్కిలి; హేయతన్ = అసహ్యమును; ఒందెన్ = పొందెను; జిత్తము = మనస్సు; అనఘాత్మ = పుణ్యాత్మా {అనఘాత్ముడు - అనఘములు (పాపములు కానివి)తో నిండి ఉన్నవాడు}; రమాపతి = కృష్ణుని {రమాపతి - రమ (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు}; చరిత = వర్తనములు అను; అమృత = అమృతముపై; రతి = ప్రీతి ద్వారా; సంసృతి = సంసార; వేదన = బాధలు; ఎల్లన్ = అన్నిటిని; పాయన్ = పొవునట్లు; చేయున్ = చేయును; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా.

భావము:

ఓ పుణ్యాత్ముడా! ఇతర కథలు విని విని నా మనస్సుకు చాల వెగటు కలిగింది, ఓ మునినాథా! రమానాథుడైన శ్రీమన్నారాయుణుని కథాసుధాపూరాన్ని తనివితీరా సేవించడం వల్లనే సంసార బాధలు దూరంగా తొలగిపోతాయి.