పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

 •  
 •  
 •  

3-995-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వ్వఁడు నిఖిల భూతేంద్రియమయ మగు-
మాయావలంబున హితకర్మ
ద్ధుఁడై వర్తించు గిది దందహ్యమా-
నంబగు జీవ చిత్తంబు నందు
వికారమై శుద్ధమై యఖండజ్ఞాన-
మున నుండు వానికి ముఖ్యచరితు
కు నకుంఠితశౌర్యుకుఁ పరంజ్యోతికి-
ర్వజ్ఞునకుఁ గృపాశాంతమతికిఁ

3-995.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

డఁగియుఁ బ్రకృతిపురుషుల కంటెఁ బరముఁ
యిన వానికి మ్రొక్కెద స్మదీయ
దుర్భరోదగ్ర భీకర ర్భనరక
వేదనలఁ జూచి శాంతిఁ గావించు కొఱకు."

టీకా:

ఎవ్వడున్ = ఎవరైతే; నిఖిల = సమస్తమైన; భూత = భూతములచేతను; ఇంద్రియ = ఇంద్రియములచేతను; మయము = నిండినది; అగు = అయిన; మాయా = మాయను; అవలంబమున్ = అవలంభించుటయందు; మహిత = అధికముగ; కర్మ = కర్మములచే; బద్దుడు = బంధిపబడినవాడు; ఐ = అయ్యి; వర్తించున్ = ప్రవర్తించెడి; పగిదిన్ = విధమున; దందహ్యమానంబున్ = దహించుచున్నది; అగు = అయిన; జీవ = జీవుని; చిత్తంబున్ = చిత్తము; అందున్ = లో; అవికారము = మార్పులుచెందనిది; ఐ = అయ్యి; శుద్ధము = స్వచ్ఛము; ఐ = అయ్యి; అఖండ = అఖండమైన; జ్ఞానమునన్ = జ్ఞానములో; ఉండు = ఉండెడి; వాని = వాని; కిన్ = కి; ముఖ్య = మఖ్యమైన; చరితున్ = వర్తన కలవాని; కున్ = కి; అకుంఠిత = కుంటుపడని; శౌర్యమున్ = శౌర్యము కలవాని; కున్ = కి; పరంజ్యోతి = అన్నిటికిని అతీతమైన ప్రకాశమున; కిన్ = కి; సర్వజ్ఞున్ = సర్వమును తెలియువాని; కున్ = కిని; కృపాశాంతమతి = దయాశాంతములు కలవావి; కిన్ = కిని; కడగి = పూని; ప్రకృతి = ప్రకృతి; పురుషుల్ = పురుషులు; కంటెన్ = కంటెను; పరముండు = అతీతడు; అయిన = అయినట్టి; వాని = వాని; కిన్ = కిని;
మ్రొక్కెదన్ = కొలిచెదను; అస్మదీయ = నా యొక్క; దుర్భర = భరింపరాని; ఉదగ్ర = చెలరేగుతున్న; భీకర = భయంకరమైన; గర్భ = గర్భస్థితి అనెడి; నరక = నరకము యొక్క; వేదనలన్ = బాధలను; చూచి = చూసి; శాంతి = శాంతిని; కావింతు = కలిగించు; కొఱకున్ = కోసమై.

భావము:

ఏ దేవుడు సమస్త జీవరాసులలో పంచేంద్రియాలతో పంచభూతాలతో నిండిన మాయను అంగీకరించి కర్మబంధాలకు లోబడి ఉన్నట్లు కన్పిస్తాడో, దహించుకొని పోతున్న జీవుని చిత్తంలో అవికారుడై, పరిశుద్ధుడై, అఖండజ్ఞాన స్వరూపుడై భాసిస్తుంటాడో ఆ ఉదాత్త చరితునికి, ఆ మొక్కవోని శౌర్యం కలవానికి, ఆ పరంజ్యోతికి, ఆ దయామయునికి, ఆ శాంతమూర్తికి, ప్రకృతి పురుషులకంటె అతీతుడైన ఆ భగవంతునికి ఈ భరింపరాని భయంకరమైన గర్భనరకంలో ఉన్న నన్ను రక్షించి శాంతి కలిగించమని నమస్కరిస్తున్నాను.”