పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

  •  
  •  
  •  

3-994-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక; పంచభూత విరహితుఁ డయ్యుం బంచభూత విరచితం బైన శరీరంబు నందుఁ గప్పంబడి యింద్రియ గుణార్థ చిదాభాస జ్ఞానుం డైన నేను.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ; పంచభూత = పంచబూతములును; విరహితుండ = లేనివాడను; అయ్యున్ = అయినప్పటికిని; పంచభూత = పంచభూతములచే; విరచితంబున్ = చేయబడినది; ఐన = అయిన; శరీరంబున్ = దేహము; అందున్ = లో; కప్పంబడి = కప్పబడి; ఇంద్రియ = ఇంద్రియముల; గుణ = ఇంద్రియ గుణములు; అర్థ = ఇంద్రియార్థములు యొక్క; చిత్ = విషయ జ్ఞానమున; అభాస = సందిగ్ద; జ్ఞానుండను = జ్ఞానము కలవాడను; ఐన = అయినట్టి; నేను = నేను.

భావము:

అంతేకాక పంచభూతాలు లేకున్నా పంచభూతాలతో ఏర్పడిన శరీరంతో కప్పబడి ఇంద్రియగుణాలు, ఇంద్రియార్థాల అస్తిత్వం తెలిసీ తెలియని అభాసజ్ఞానం కలిగిన నేను....