పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : గర్భసంభవ ప్రకారంబు

  •  
  •  
  •  

3-993-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యమును భువనరక్షణ
ముకై స్వేచ్ఛానురూపమునఁ బుట్టెడి వి
ష్ణుని భయవిరహిత మగు పద
జయుగం బర్థిఁ గొల్తు వారని భక్తిన్.

టీకా:

అనయమును = అవశ్యమును; భువన = విశ్వములను; రక్షణమున్ = రక్షించుట; కై = కోసమై; స్వేచ్ఛా = స్వతంత్రమైన; అనురూపమునన్ = అవతారములలో; పుట్టెడి = అవతరించెడి; విష్ణుని = విష్ణుమూర్తి యొక్క; భయ = భయము; విరహితము = లేనిది; అగు = అయిన; పద = పాదములు అనెడి; వనజ = పద్మముల {వనజము - వనము (నీటి)లో పుట్టునది, పద్మము}; యుగంబున్ = జంటను; అర్థిన్ = కోరి; కొల్తున్ = సేవించెదను; వారని = ఎడతెగని; భక్తిన్ = భక్తితో.

భావము:

ఎల్లప్పుడు లోకాలను రక్షించడానికి ఇచ్ఛానుసారం జన్మమెత్తుతూ ఉండే భగవంతుని పాదపద్మాలను అనురక్తితో, భక్తితో ఆరాధిస్తాను. ఆ పాదాలు నా భయాన్ని పటాపంచలు చేస్తాయి.