పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : భక్తియోగంబు

  •  
  •  
  •  

3-987-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు మహాపాపాత్ముం డైనవాఁడు ముహూర్తత్రయ కాలంబునను సామాన్యదోషి యగువాఁడు ముహుర్తద్వయంబునను నేగి యాతనం బొందును; అందు.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; మహా = ఎక్కువైన; పాపాత్ముండు = పాపములు చేసినవాడు; ఐన = అయినట్టి; వాడు = వాడు; ముహూర్త = ముహూర్తముల; త్రయ = మూటి; కాలంబునన్ = కాలములో; సామాన్య = సామాన్యమగు; దోషి = పాపములు చేసినవాడు; అగు = అయినట్టి; వాడు = వాడు; ముహూర్త = ముహూర్తముల; ద్వయంబునను = రెంటిలోను; ఏగి = వెళ్ళి; యాతనన్ = బాధలను; పొందును = చెందును; అందున్ = అక్కడ.

భావము:

ఈవిధంగా మహాపాపి యైనవాడు మూడు ముహూర్తాల కాలంలో, సామాన్యదోషి యైనవాడు రెండు ముహూర్తాల కాలంలో వెళ్ళి యాతనలను పొందుతారు. ఆ యమలోకంలో...