తృతీయ స్కంధము : భక్తియోగంబు
- ఉపకరణాలు:
"నలినాయతాక్షి! విను జన
ముల ఫలసంకల్పభేదమునఁ జేసి మదిం
గల భక్తియోగమహిమం
బలవడఁగ ననేకవిధము లనఁదగు నవియున్.
టీకా:
నలినాయతాక్షి = తల్లీ {నలి నాయ తాక్షి - నలిన (పద్మముల వంటి) ఆయత (పెద్ద) అక్షి (కన్నులు ఉన్నామె), స్త్రీ}; విను = వినుము; జనముల = జనుల యొక్క; ఫల = ప్రయోజనములు; సంకల్ప = సంకల్పములు యొక్క; భేదంబునన్ = తేడాలను; జేసి = పట్టి; మదిన్ = మనస్సున; కల = కలుగు; భక్తియోగ = భక్తయోగము యొక్క; మహిమంబున్ = సాధనలు; అలవడగన్ = అభ్యాసముల లో; అనేక = అనేకమైన; విధములు = విధములు; అనన్ = అనుట; తగున్ = తగును; అవియున్ = వాటిని;
భావము:
“పద్మాలవంటి విశాలమైన కన్నులుగల తల్లీ! విను. ప్రజల సంకల్పాలను బట్టి ఆశయాలను బట్టి భక్తియోగం సిద్ధిస్తుంది. అదికూడ అనేకవిధాలుగా ఉంటుంది.