పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కపిల దేవహూతి సంవాదంబు

 •  
 •  
 •  

3-895-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ట్టి యహంకార మం దధిష్టించి సా-
స్రఫణామండలాభిరాముఁ
డై తనరారు ననంతుఁడు సంకర్ష-
ణుం డనఁ దగు పురుషుండు ఘనుఁడు
హిత భూతేంద్రియ మానస మయుఁడు నై-
ర్తృత్వ కార్యత్వ కారణత్వ
ప్రకట శాంతత్వ ఘోత్వ మూఢత్వాది-
క్షణ లక్షితోల్లాసి యగుచు

3-895.1-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నుండు నమ్మేటి రెండవ వ్యూహ మనఁగ
నవికారంబుఁ బొందు వైకారికంబు
న వినుము మనస్తత్వ మెమిఁ బుట్టె
ఱియు వైకారికంబును మాత! వినుము.
^చతుర్వ్యూహములు

టీకా:

అట్టి = అటువంటి; అహంకారమున్ = అహంకారము; అందున్ = లో; అధిష్టించి = ఆశ్రయించి; సాహస్ర = వెయ్యి (1000); ఫణా = పడగలతో; మండల = చుట్టబడి; అభిరాముండు = చక్కగనొప్పి యుండవాడు; ఐ = అయ్యి; తనరారున్ = అతిశయించెడి; అసంగతుడు = తగులములు లేనివాడు; సంకర్షణుండు = సంకర్షణుడు; అనన్ = అనుటకు; తగున్ = తగును; పురుషుండు = పురుషుడు; ఘనుడు = గొప్పవాడు; మహిత = గొప్పవియైన; భూత = (పంచ) భూతములు; ఇంద్రియ = (పంచ) ఇంద్రియములు; మానస = మనసులతో; మయుడున్ = నిండియున్నవాడు; ఐ = అయ్యి; కర్తృత్వ = కర్త తత్వము; కార్యత్వ = కార్యము తత్వము; కారణత్వ = కారణము తత్వము లని; ప్రకట = తెలియబడు; శాంతత్వ = శాంత లక్షణము; ఘోరత్వ = ఘోరమైన లక్షణము; మూఢత్వ = మూఢమైన లక్షణము; ఆది = మొదలైన; లక్షణ = లక్షణములకు; లక్షిత = చెంది; ఉల్లాసి = ప్రకాశించువాడు; అగుచున్ = అవుతూ; ఉండున్ = ఉండును; ఆ = ఆ; మేటి = సమర్థుడు;
రెండవ = రెండవదైన (సంకర్షణము); వ్యూహమున్ = తత్త్వము; అనగన్ = అనబడి; ఘన = మిక్కిలి; వికారంబున్ = మార్పులను; పొందున్ = పొండెడి; వైకారికంబున్ = సాత్వికము; వలన = వలన; వినుము = వినుము; మనస్తత్వము = మనస్తత్వము; ఎలమిన్ = కోరి; పుట్టెన్ = పుట్టెను; మఱియున్ = ఇంకను; వైకారికంబునున్ = సాత్వికమును; మాత = అమ్మ; వినుము = వినుము.

భావము:

వైకారికమైన సాత్త్వికాహంకారాన్ని అధిష్ఠించి సంకర్షణ వ్యూహం ఒప్పుతుంటుంది. వేయి పడగలతో ప్రకాశించేవాడూ, అనంతుడూ అయిన సంకర్షణ పురుషుడు మహానుభావుడై పంచభూతాలతో, పంచేంద్రియాలతో, మనస్సుతో నిండి ఉంటాడు. కర్త, కార్యం, కారణం అనే రూపభేదాలు కలిగి శాంతత్వం, ఘోరత్వం, మూఢత్వం మొదలైన లక్షణాలతో ఉల్లాసంగా ఉంటాడు. ఈ మేటి వ్యూహమే రెండవదైన సంకర్షణ వ్యూహం. దీనినుంచే మనస్తత్త్వం పుట్టింది.