పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దేవహూతి పరిణయంబు

  •  
  •  
  •  

3-797-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు ప్రవేశించి; తాపత్రయోపశమనం బగు భగవద్భక్తి వృద్ధిఁ బొందించుచుఁ బుత్ర మిత్ర కళత్ర సుహృద్భాంధవ సహితుం డై పరమానందంబున

టీకా:

ఇట్లు = ఈ విధముగ; ప్రవేశించి = ప్రవేశించి; తాపత్రయ = తాపత్రయములను {తాపత్రయములు - 1ఆధిభౌతికము 2ఆధ్యాత్మికము 3ఆదిదైవికము అనేమూడుతాపముల}; ఉపశమనంబున్ = అణగునట్లు; అగు = చేయునట్టి; భగవత్ = భగవంతుని ఎడ; భక్తిన్ = భక్తి; వృద్ధిన్ = పెరుగుటను; పొందించుచు = కలుగజేస్తూ; పుత్ర = పుత్రులు; మిత్ర = మిత్రులు; కళత్ర = భార్య; సుహృత్ = ఆప్తులు; బాంధవ = బంధువులతో; సహితుడు = కూడినవాడు; ఐ = అయ్యి; పరమ = అత్యధికమైన; ఆనందమునన్ = ఆనందముతో;

భావము:

అలా ప్రవేశించి ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికాలనే తాపత్రయాన్ని రూపుమాపే భగవద్భక్తిని పెంపొందించుకుంటూ పుత్రులు, మిత్రులు, ఆప్తులు, బంధువులతో కూడి పరమానందంగా ఉన్నాడు.