పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : కృష్ణాది నిర్యాణంబు

  •  
  •  
  •  

3-77-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుకులనిధియగు కృష్ణుని
జలజవియోగతాపరమున మాటల్
ప్రిదులక హృదయంబెరియఁగఁ
బెవులుదడుపుచును వగలఁ బెంపఱియుండెన్."

టీకా:

యదు = యాదవ; కుల = వంశమునకు; నిధి = నిధి వంటి వాడు; అగు = అయిన; కృష్ణుని = కృష్ణుని; పద = పాదములను; జలజ = పద్మముల {జలజ - జలమున పుట్టినది, పద్మము}; వియోగ = ఎడబాటువలని; తాప = బాధ యొక్క; భరమునన్ = భారముచేత; మాటల్ = మాటలు; ప్రిదులక = పెగలక; హృదయంబు = హృదయములో; ఎరియగ = బాధపడగ, పరితపింపగ; పెదవులున్ = పెదవులు; తడపుచును = తడుపుకొనుచు; వగలన్ = దుఃఖము; పెంపఱి = అతిశయించి; ఉండెన్ = ఉండెను.

భావము:

అప్పుడు యాదవకులానికి పెన్నిధి అయిన కృష్ణుని పాదపద్మాలకు, దూరమైన కారణంగా ఉద్ధవునికి దుఃఖం పొంగి వచ్చింది. నోటమాట రాలేదు. గుండె పగిలినట్లయింది. పెదవులు తడుపుకున్నాడు. శోకం వల్ల కాంతివిహీనుడైనాడు.”

3-78-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిచెప్పి బాదరాయణి
నుజేంద్రునివలను సూచి ఱి యిట్లనియెన్
"విను మొకనాఁడీ యుద్ధవుఁ
యము నైదేండ్ల బాలుఁడై యున్నతఱిన్.

టీకా:

అని = అని; చెప్పి = చెప్పి; బాదరాయణి = శుకుడు {బాదరాయణి - బాదరాయణుని (వ్యాసుని) పుత్రుడు, శుకుడు}; మనుజేంద్రుని = పరీక్షిత్తుని {మనుజేంద్రుడు - మానవులకు ప్రభువు, రాజు, పరీక్షిత్తు}; వలని = వైపు; చూచి = చూసి; మఱి = ఇంకనూ; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; వినుము = విను; ఒకనాడు = ఒకరోజు; ఈ = ఈ; ఉద్ధవుడు = ఉద్ధవుడు; అనయమున్ = అవశ్యము; ఐదు = ఐదు; ఏండ్ల = సంవత్సరముల; బాలుడు = పిల్లవాడు; ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; తఱిన్ = సమయమున.

భావము:

అని చెప్పి, శుకుడు పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు “పరీక్షిత్తు మహారాజా! విను. అప్పుడు తన చిన్నతనంలో ఈ ఉద్ధవుడు ఐదేండ్ల బాలుడుగా ఉన్న సమయంలో....

3-79-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మున్ను కృష్ణునిం గూడియాడు బాలకులలో నొక్క బాలునిఁ గృష్ణునింగా భావించి పరిచర్యసేయుచుండ గుణవతీమతల్లి యగు తల్లి సనుదెంచి "యాకొంటి విదియేల రావన్న" యని పిలిచిన జననీవాక్యంబులు గైకొనక యఖండతేజోనిధియైన పుండరీకాక్షుపాదారవింద మకరందసేవానురక్తింజేసి యున్న యుద్ధవుండు నేఁడు కృష్ణవియోగతాపంబున హరివార్త విదురునకుఁ జెప్పంజాలక యొప్పఱి యుండుట యేమి చిత్రం" బని వెండియు నిట్లనియె "అంత నుద్ధవుండు సరోజాక్షపాదారవింద మకరందసుధాజలనిధి నిమగ్నమానసుం డై గద్గదకంఠుం డగుచు.

టీకా:

మున్ను = మునుపు; కృష్ణునిన్ = కృష్ణుని; కూడి = కలిసి; ఆడు = అడే; బాలకుల = పిల్లల; లోన్ = లో; ఒక్క = ఒక; బాలునిన్ = బాలుని; కృష్ణునింగా = కృష్ణునివలె; భావించి = భావించి; పరిచర్య = సేవ; చేయుచున్ = చేస్తూ; ఉండగన్ = ఉండగా; గుణవతీమతల్లి = సద్గుణవతులలో శ్రేష్ఠురాలు; అగు = అయిన; తల్లి = తల్లి; చనుదెంచి = వచ్చి; ఆకొంటివి = ఆకలితో ఉన్నావు; ఇదిఏమి = ఇదేమిటి; రావు = రావటంలేదు; అన్న = తండ్రి; అని = అని; పిలిచిన = పిలవగా; జననీ = తల్లి యొక్క; వాక్యంబులు = మాటలు; కైకొనక = వినిపించుకొనక; అఖండ = అఖండమైన; తేజస్ = తేజస్సునకు; నిధి = నిధివంటివాడు; ఐన = అయిన; పుండరీకాక్షు = కృష్ణుని {పుండరీకాక్షుడు - పుండరీక (పద్మ)ములవంటి కన్నులున్న వాడు, విష్ణువు}; పాద = పాదములను; అరవింద = పద్మముల; మకరంద = తేనెను; సేవా = సేవించుటయందు; అనురక్తిన్ = ఆసక్తి; చేసి = కలిగి; ఉన్న = ఉన్నట్టి; ఉద్ధవుండు = ఉద్ధవుడు; నేడు = ఈరోజు; కృష్ణ = కృష్ణుని; వియోగ = ఎడబాటువలని; తాపంబునన్ = తాపముచేత; హరి = కృష్ణునిగూర్చిన; వార్త = వార్త; విదురున్ = విదురున; కున్ = కు; చెప్పంజాలక = చెప్పలేక; ఒప్పఱి = ఉపేక్షించి; ఉండుట = ఉండుట; ఏమి = ఏమి; చిత్రంబు = విచిత్రము; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; అంతన్ = అంతట; ఉద్ధవుండు = ఉద్ధవుడు; సరోజాక్ష = కృష్ణుని; పాద = పాదములను; అరవింద = పద్మముల యొక్క; మకరంద = తేనెవంటి; సుధా = అమృత; జలనిధిన్ = సముద్రములో {జలనిధి - నీటికి నిధి వంటిది, సముద్రము}; నిమగ్న = మునిగిన; మానసుండు = మనసుకలవాడు; ఐ = అయి; గద్గద = బొంగురుపోయిన; కంఠుండు = కంఠము కలవాడు; అగుచున్ = అవుతూ.

భావము:

అలా ఉద్ధవుడు ఐదేండ్ల పిల్లాడుగా ఉండగా, ఒకనాడు కృష్ణునితో కలిసి ఆడుకుంటున్న ఆ పిల్లలు అందరిలో ఒక బాలుణ్ణి కృష్ణునిగానే భావిస్తూ సేవలు చేయసాగాడు. సుగుణాలవల్లి అయిన అతని తల్లి అక్కడికి వచ్చి “నీకు ఆకలేస్తోంది కదా, ఇక అన్నానికి రా” అని పిలిచింది. ఉద్ధవుడు తల్లి మాటలు వినిపించుకోలేదు. అనంత తేజస్సంపన్నుడగు పద్మాక్షుని పాదారవింద మకరంద మాధుర్యంలో మైమరచి అలాగే ఉన్నాడు. అటువంటి ఉద్ధవుడు నేడు కృష్ణుని ఎడబాటు వల్ల ప్రాప్తించిన పరితాప భారంతో ఆ విషయాన్ని విదురునకు చెప్పలేక కుప్పగూలి పోవడంలో ఆశ్చర్యం ఏముంది.” అని మళ్లీ శుకుడు ఇలా అన్నాడు “అప్పుడు ఉద్ధవుని హృదయం శ్రీకృష్ణచరణారవింద మకరందాల పాలమున్నీటిలో మునిగి తేలింది. మిక్కిలి ఆనందంతో ఒక్క క్షణంపాటు తన కన్నులు బాష్పాలతో నిండిపోయాయి, కంఠం గద్గదమయింది.

3-80-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ముగ నెమ్మనమున మిం
చి కృష్ణవియోగజనిత శిఖిదరికొనఁగాఁ
నుఁగవఁ బెడచే నొత్తుచుఁ
బెనుపొందిన దురితశిఖరిభిదురున్ విదురున్.

టీకా:

ఘనముగన్ = మిక్కిలిగా; నెమ్మనమునన్ = హృదయములో; మించిన = అతిశయించిన; కృష్ణ = కృష్ణుని; వియోగ = ఎడబాటు వలన; జనిత = పుట్టిన; శిఖి = మంటలు; తరికొనగా = రగుల్కొనగా; కనుగవ = రెండుకళ్ళు; పెడచేన్ = చేతిమండతో; ఒత్తుచున్ = తుడుచుకొనుచు; పెనుపొందిన = మిక్కిలివిస్తారమైన; దురిత = పాపములను; శిఖరి = కొండశిఖరములకు; భిదురున్ = వజ్రాయుధమువంటివానిని; విదురున్ = విదురుని.

భావము:

శ్రీకృష్ణ వియోగంవల్ల కలిగిన శోకాగ్నికి చీకాకైన మనస్సుతో ఉద్ధవుడు ముంజేతులతో కన్నులు తుడుచుకుంటూ పాపాలు అనే పర్వతాలకు వజ్రాయుధం వంటివాడైన విదురుణ్ణి చూశాడు.

3-81-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కనుంగొని యిట్లనియె

టీకా:

కనుంగొని = చూసి; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అప్పుడు విదురుణ్ణి చూసి ఇలా అన్నాడు.

3-82-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"యముఁడను ఘనకాలభుజం
పుంగవుఁడెగచిపట్టఁగా యదువంశో
త్తముల చరిత్రలుఁదత్కుశ
ములేమని చెప్పుదుంగలంగెడిమనమున్.

టీకా:

యముడు = యముడు; అను = అను పేరుగల; ఘన = పెద్ద; కాల = కాల; భుజంగమ = సర్పములలో; పుంగవుడు = శ్రేష్ఠుడు; ఎగచి = తరిమి; పట్టగా = పట్టుకొనగా; యదు = యాదవ; వంశ = వంశమునందు; ఉత్తములన్ = ఉత్తములైనవారి; చరిత్రలున్ = ప్రవర్తనలును; తత్ = వారి; కుశలములున్ = కుశలములు; ఏమని = ఏమని; చెప్పుదున్ = చెప్తాను; కలంగెడి = కలతపడుతున్న; మనమునన్ = మనసుతో.

భావము:

“నల్లని కాలసర్పం లాంటి యమధర్మరాజు యదువంశాన్ని ఒడిసిపట్టి కాటువేశాడు. ఇప్పుడు యాదవ వంశీయుల వృత్తాంతమూ, వారి క్షేమమూ ఏమని చెప్పమంటావు. నా మనస్సు కలవరపడుతోంది.

3-83-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునిజనముఖపద్మములు ముకుళింపంగ-
లజనలోచనోత్పలము లలర
జారచోరులకోర్కి ఫలతనొందగ-
దానవదర్పాంధమస మడర
రయోగిజనచక్రవాకంబు లడలంగ-
లుషజనానురాగంబు పర్వ
భూరిదోషాగమస్పూర్తి వాటిల్లంగ-
నుదిత ధర్మక్రియ లుడిగిమడఁగ

3-83.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానుషాకారరుచికోటి మందపఱచి
నఘ యేమన నేర్తుఁ గృష్ణాభిదాన
లోకబాంధవుఁ డుత్తమశ్లోకమూర్తి
మించుతేజంబుతో నస్తమించెనయ్య.

టీకా:

ముని = మునుల; జనముల = సమూహముల; ముఖ = ముఖములు అను; పద్మములు = పద్మములు; ముకుళింపంగ = ముడుచుకుపోగా; ఖల = చెడ్డ; జన = జనముల; లోచన = కళ్ళు అను; ఉత్పలములు = కలువలు; అలరన్ = అందముసంచరించుకొనగా; జార = వ్యభిచారుల; చోరుల = దొంగల; కోర్కి = కోరికలు; సఫలతని = తీరుట; ఒందగ = పొందగా; దానవ = రాక్షసుల; దర్ప = గర్వము అను; అంధతమసము = గుడ్డిచీకటి {అంధతమసము - అంధ (గుడ్డి) తసమము (చీకటి)}; అడరన్ = విజృంభిస్తుండగా; వర = శ్రేష్ఠమైన; యోగి = యోగుల; జన = సమూహములు అను; చక్రవాకంబులు = చాతక పక్షులు; అడలంగా = బెదిరిపోతుండగా; కలుష = మలినప్రవృత్తిగల; జన = జనుల; అనురాగంబు = ఆపేక్షలు; పర్వ = వ్యాపించగా; భూరి = మిక్కిలి విస్తారమైన; దోష = పాపపుకాలము; ఆగమ = వస్తున్నట్లు; స్ఫూర్తి = అనిపించుట; పాటిల్లంగన్ = కలుగుచుండగా; ఉదిత = చెప్బపడిన; ధర్మ = ధర్మబద్ధమైన; క్రియలు = పనులు; ఉడిగి = చిక్కిపోయి; అడగన్ = అణగిపోగా;
మానుష = (తన) మానవ; ఆకార = ఆకారమందలి; రుచి = కాంతులు; కోటి = సమస్తము; మందపఱచి = తగ్గించేసుకొని; అనఘ = పుణ్యాత్ముడా; ఏమననేర్తున్ = ఏమనగలను; కృష్ణ = కృష్ణ అను; అభిదాన = పేరు కల; లోక = లోకములకు; బాంధవుడు = చుట్టము, సూర్యుడు; ఉత్తమ = ఉత్తములచే; శ్లోక = కీర్తింపబడు; మూర్తి = స్వరూపుడు; మించు = అతిశయించు; తేజంబు = తేజస్సు; తోన్ = తో; అస్తమించెన్ = వెళ్ళిపోయెను {అస్తమించు - కనబడకుండగ పోవు, మరణించు}.

భావము:

ఓ పుణ్యమూర్తీ! విదురుడా! నోట్లోంచి మాటలు పెగలటం లేదయ్యా! లోకబాంధవుడూ, ఉత్తమశ్లోకుడూ, మహాతేజస్వీ అయిన శ్రీకృష్ణుడనే సూర్యుడు అస్తమించాడయ్యా; ఇంకే చెప్పమన్నావు. మునీంద్రుల ముఖాలు అనే కమలాలు ముకుళితా లయ్యాయి; జారచోరుల కోరికలు ఫలించాయి; రాక్షసుల గర్వాంధకారాలు నలుదిశలా వ్యాపించాయి; పరమ యోగులనే చక్రవాకాలు శోకించాయి; కలుషాత్ముల కనుగలువలు విప్పారాయి; మహా పాపాగ్నులు పేట్రేగి పోయాయి; ధర్మకృత్యాలకు విఘాతాలు ఏర్పడ్డాయి; మానవుల తేజస్సులు మందగించాయి.

3-84-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియును.

టీకా:

మఱియును = ఇంకనూ.

భావము:

అంతే కాకుండా

3-85-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కులిశ జలజ రేఖా
లితశ్రీకృష్ణపాదక్షితయై ని
ర్మగతి నొప్పెడు ధరణీ
నామణి నేఁ డభాగ్య క్షణ యయ్యెన్.

టీకా:

హల = నాగలి; కులిశ = వజ్రము; జలజ = పద్మ; రేఖ = రేఖలతో; లలిత = అందమైన; శ్రీకృష్ణ = శ్రీకృష్ణ భగవానుని; పాద = పాదములచే; లక్షిత = ముద్రింపబడినది; ఐ = అయి; నిర్మల = నిర్మలమైన; గతిన్ = విధముగ; ఒప్పెడు = ఒప్పి ఉండే; ధరణీ = భూమి అను; లలనామణి = దేవి; నేడు = ఇవాళ; అభాగ్య = భాగ్యము లేని; లక్షణ = లక్షణములు కలది; అయ్యెన్ = ఆయిపోయినది.

భావము:

హలమూ వజ్రమూ, పద్మమూ మొదలైన రేఖలతో అందమైన కృష్ణుని పాదాలు వేసిన అడగుల ముద్రలతో స్వచ్ఛంగా సలక్షణంగా ప్రకాశించే భూదేవి ఈనాడు దౌర్భాగ్యలక్షణాలు కలది అయింది.

3-86-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యావులవలన రాజ్య
శ్రీదొలఁగెను ధర్మగతి నశించెను భువి మ
ర్యాలు దప్పె నధర్మో
త్పానమున దైత్యభేదిప్పినపిదపన్.

టీకా:

యాదవుల = యాదవుల; వలన = నుండి; రాజ్య = రాజ్యము అను; శ్రీ = సౌభాగ్యము; తొలగెన్ = తొలగిపోయినది; ధర్మ = ధర్మము యొక్క; గతి = ప్రవర్తన; నశించెను = నశించెను; భువిన్ = భూమిని; మర్యాదలు = కట్టుబాట్లు; తప్పెన్ = తప్పినవి; అధర్మ = అధర్మము; ఉత్పాదనమునన్ = పుట్టుటచే; దైత్యభేది = కృష్ణుడు {దైత్యభేది - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు}; తప్పిన = మరణించిన; పిదపన్ = తరువాత.

భావము:

దానవాంతకుడైన శ్రీకృష్ణుడు అస్తమించిన పిమ్మట, యాదవల రాజ్య వైభవం మాయం అయిపోయింది. ధర్మమార్గం నశించింది. అధర్మం అతిశయించింది. లోకంలో మర్యాదలు లేకుండా పోయాయి.

3-87-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు లలితనికషణవిరాజమాన మణిగణకిరణ సుషమావిశేష విడంబిత విమలసలిలంబు లందుఁ బ్రతిఫలిత సంపూర్ణచంద్రమండల రుచి నిరీక్షించి జలచరబుద్ధింజేసి తజ్జలవిలోలమీనంబు లనూన స్నేహంబునం దలంచు చందంబునఁ, గృష్ణానుచరులైన యదు వృష్ణి కుమారు లమ్మహనీయమూర్తిం దమకు నగ్రేసరుండని కాని లీలా మానుషవిగ్రహుండైన పరమాత్ముండని యెఱుంగక, హరిమాయా జనితంబగు నసద్భావంబునంజేసి భోజన శయనాసనానుగమనంబులం జేరి సహోదరాదిభావంబులం గూడి చరియింతురు; అద్దేవుని మాయాపయోనిధినిమగ్నులు గాకుండ నబ్జభవాదులకైనం దీఱదు సర్వగుణగరిష్ఠులును సత్పురుష శ్రేష్ఠులును నగు పరమభాగవతులకుం దక్కఁ దక్కినవారలకుం జెప్పనేల; అదియునుంగాక, యభిజన విద్యా ధన బల గర్వమదాంధీభూతచేతస్కులైన శిశుపాలాది భూపాలకు లమ్మహాత్మునిం బరతత్త్వంబని యెఱుంగక నిందించు దుర్భాషలు దలంచి మనస్తాపంబు నొందుచుండుదు" నని, వెండియు.

టీకా:

మఱియున్ = ఇంకా; లలిత = అందమైన; నికషణ = మెరుగుపెట్టి; విరాజమాన = మిక్కిలి ప్రకాశిస్తున్న; మణి = మణుల; గణ = వరుసల; కిరణ = కిరణముల; సుషమా = కాంతిని; విశేష = విశేషముగా; విడంబిత = పోలిన; విమల = నిర్మలమైన; సలిలంబు = జలముల; అందున్ = లో; ప్రతిఫలిత = ప్రతిఫలించిన; సంపూర్ణ = సంపూర్ణ; చంద్ర = చంద్ర; మండల = మండలము యొక్క; రుచి = ప్రకాశము; నిరీక్షించి = చూచి; జలచర = చేపల యొక్క; బుద్ధిన్ = స్వభావము; చేసి = ప్రకారము; తత్ = ఆ; జల = నీట; విలోల = తిరుగుచున్న; మీనంబులు = చేపలు; అనూన = చనువు కల; స్నేహంబునన్ = స్నేహితుడని; తలంచు = అనుకొను; చందంబునన్ = విధముగ; కృష్ణ = కృష్ణుని; అనుచరులు = అనుచరులు; ఐన = అయిన; యదు = యాదవ వంశ; వృష్ణి = వృష్ణి వంశ; కుమారులు = పిల్లలు; ఆ = ఆ; మహనీయ = గొప్ప; మూర్తిన్ = స్వరూపుని; తమ = తమ; కున్ = కు; అగ్రేసరుండు = పెద్దవాడు; అని = అని; కాని = అంతేకాని; లీలా = మాయ; మానుష = మానవ; విగ్రహుండు = స్వరూపుడు; ఐన = అయిన; పరమాత్ముండు = పరమాత్ముడు; అని = అని; ఎఱుంగక = తెలియక; హరి = కృష్ణుని; మాయా = మాయవలన; జనితంబు = పుట్టినది; అగు = అయిన; అసత్ = అసత్యమైన; భావంబునన్ = తలంపు; చేసి = వలన; భోజన = భుజించుట; శయన = పడుకొనుట; ఆసన = కూర్చొనుట; అనుగమనంబులన్ = వెంటతిరుగుతూ; చేరి = కలసిమెలసి; సహోదర = సోదర; ఆది = మొదలైన; భావంబులన్ = తలపులతో; కూడి = కూడి; చరియింతురు = వర్తింతురు; ఆ = ఆ; దేవుని = దేవుని; మాయా = మాయ అను; పయోనిధిన్ = సముద్రములో; నిమగ్నులున్ = మునిగినవారు; కాకుండన్ = కాకుండా; అబ్జభవ = బ్రహ్మదేవుడు {అబ్జభవుడు - అప్ప్ (నీరు) నుండి భవ (పుట్టిన) పద్మము నందు పుట్టినవాడు. బ్రహ్మదేవుడప}; ఆదులున్ = మొదలైనవారి; కున్ = కి; ఐనన్ = అయినప్పటికిని; తీఱదు = వీలుకాదు; సర్వ = సర్వ; గుణ = గుణమము లందును; గరిష్ఠులును = గొప్పవారును; సత్పురుష = మంచివారిలో; శ్రేష్ఠులును = ఉత్తమమైన వారును; అగు = అయిన; పరమ = అత్యుత్తమ; భాగవతుల = భాగవతులు; కున్ = కిని; తక్కన్ = తప్పించి; తక్కినవారలకుం = మిగిలినవారి గురించి; చెప్పన్ = చెప్పుట; ఏల = ఎందులకు; అదియునన్ = అంతే; కాక = కాకుండగ; అభిజన = (పుట్టిన) వంశము; విద్యా = విద్యా; ధన = సంపద; బల = బలములచే; గర్వ = గర్వము వలన; మద = పొగరుతో; అంధీభూత = చీకటిచేయబడిన; చేతస్కులు = చేతనములు కలవారు; ఐన = అయిన; శిశుపాల = శిశుపాలుడు {శిశుపాలుడు - కృష్ణుని మేనల్లుడు, చైద్యదేశపు యువరాజు}; ఆది = మొదలైన; భూపాలకులు = రాజులు {భూపాలకుడు - భూమిని పరిపాలించు వాడు, రాజు}; ఆ = ఆ; మహాత్మునిన్ = గొప్పవాని; పరతత్త్వము = పరమాత్మ; అని = అని; ఎఱుంగక = తెలియక; నిందించు = నిందించే; దుర్భాషలు = తిట్లు; తలంచి = తలచుకొని; మనస్ = మనసునందు; తాపంబున్ = బాధను; ఒందుచున్ = పొందుచు; ఉండుదును = ఉంటాను; అని = అని; వెండియు = మరల.

భావము:

అంతేకాకుండా, చక్కగా సానపట్టుటచే బాగా ప్రకాశించే మణుల మనోజ్ఞమైన కాంతువలె తళతళ మెరిసే స్వచ్ఛమైన జలాల్లో ప్రతిబింబించిన పరిపూర్ణ చంద్రమండల కాంతిని చూసి ఏదో జలచరమని భ్రాంతిపడి, ఆ నీటిలో తిరిగే చేపలు దాని చుట్టూ తిరుగుతూ సాటిలేని చనువు, స్నేహాన్నీ చూపుతున్నాయి. అదేవిధంగా కృష్ణుని వెంట తిరిగే యదు, వృష్ణి కుమారులు ఆ మహానుభావుని తమకు అగ్రనాయకుడని మాత్రమే భావించేవారుకానీ, లీలావిలాసార్థం మానవరూపం ధరించిన పరాత్పరుడని తెలుసుకోలేక, శ్రీహరిమాయామోహితులై ఆయనతోపాటు భుజిస్తూ, శయనిస్తూ, కలిసి కూర్చొంటూ, వెంట తిరుగుతూ తమ తోబుట్టువు, చుట్టం ఇత్యాది భావాలతో ప్రవర్తించేవారు. ఆ దేవాదిదేవుని మాయాసముద్రంలో మునిగి పోకుండా ఉండేందుకు బ్రహ్మాదులకు కూడా సాధ్యం కాదు. అన్ని గుణాల్లోనూ మిన్నయైన వారూ, ఉత్తమ పురుషుల్లో అగ్రేసరులూ అయిన భాగవతోత్తముల మాట అటుంచితే, ఇక మిగిలిన వారి విషయం చెప్పడం ఎందుకు. కులం, విద్య, ధనం, బలం వీటివల్ల విఱ్ఱవీగుతూ గర్వాంధకారంతో మసక బారిన మనస్సులతో శిశుపాలుడు మొదలైన రాజులు ఆ మహానుభావుణ్ణి దేవదేవుడిగా తెలుసుకోలేక పలికిన దుర్భాషలు, నిందావాక్యాలు తలుచుకుంటే నా మనస్సు క్షోభించిపోతూ ఉంటుంది.

3-88-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వితృప్తేక్షణధీసమాహిత తపోవ్యాసంగులైనట్టి భా
తశ్రేష్ఠుల కాత్మమూర్తి నిఖిలైజ్యోతిమైఁజూపి శో
విశోకంబులు నిర్దహించి కమలాకాంతుండు శాంతుండు మా
రూపంబగు దేహమున్ వదలి యంర్ధానుఁ డయ్యెం జుమీ.

టీకా:

అవితృప్త = తనివితీరని; ఈక్షణ = చూపులతోను; ధీ = బుద్ధిని; సమాహిత = కూడగొట్టుకొన్న; తపస్ = తపస్సే; వ్యాసంగులు = ప్రవృత్తిగా కలవారు; ఐన = అయిన; అట్టి = అటువంటి; భాగవత = భాగవతులలో {భాగవతులు - భగవంతుని మార్గమున నడచువారు}; శ్రేష్ఠులు = ఉత్తములు; కున్ = కి; ఆత్మ = తన యొక్క; మూర్తిన్ = స్వరూపమును; నిఖిల = సమస్తమునకు; ఏక = ఒకటే యైన; జ్యోతి = జ్యోతి; మైన్ = స్వరూపమును; చూపి = చూపించి; శోక = శోకములు; విశోకంబులున్ = శోకములు కానివి (రెంటిని); నిర్దహించి = పూర్తిగా దహింపజేసి; కమలాకాంతుండు = కృష్ణుడు {కమలాకాంతుడు - కమల (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు}; శాంతుడు = శాంతాకారుడు; మానవ = మానవ; రూపంబు = రూపము; అగు = అయిన; దేహమున్ = శరీరమును; వదలి = వదలి; అంతర్ధానుండు = మాయమైనవాడు; అయ్యెన్ = అయిపోయెను; చుమీ = సుమా.

భావము:

తనివి తీరక తన్ను చూచేవారికీ; బుద్ధియోగంతో తన్ను తెలుసుకోగోరినట్టి వారికీ; తన్ను గూర్చి తపస్సుచేసి భాగవతధర్మం అవలంబించినవారికీ; సమస్త సృష్టిలో తన్నే దర్శించే భక్తులకూ; తన అఖండ జ్యోతిస్వరూపం చూపించి వారి దుఃఖాలూ జంజాటాలూ పోగొట్టి, ప్రశాంత సాక్షాత్కారం ప్రసాదించి. లక్ష్మీవల్లభుడైన శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి అంతర్హితుడు అయ్యాడు.

3-89-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానవైకవికాసమానమై తనకును-
విస్మయజనకమై వెలయునట్టి
యాత్మీయయోగమాయాశక్తిఁ జేపట్టి-
చూపుచు నత్యంతసుభగుఁ డగుచు
భూషణంబులకును భూషణంబై వివే-
ములకెల్లనుఁ బరాకాష్ఠ యగుచు
కలకల్యాణసంస్థానమై సత్యమై-
తేజరిల్లెడునట్టి దివ్యమూర్తి

3-89.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తాన తనమూర్తి నిజశక్తిఁ గ ధరించె
మతనూభవు రాజసూయాధ్వరంబు
నందు నెవ్వని శుభమూర్తి ర్థితోడ
నిండువేడుకఁ జూచి వర్ణించుచుండు.

టీకా:

మానవ = మానవత్వమునకు; ఏక = ముఖ్యమైన; వికాసము = ఆత్మవికాసము కలిగించునది; ఐ = అయ్యి; తన = తన; కున్ = కుకూడ; విస్మయ = ఆశ్చర్యమును; జనకము = కలిగించునది; ఐ = అయ్యి; వెలయు = వెలసినది; అట్టి = అటువంటి; ఆత్మీయ = స్వంత; యోగ = యోగముయొక్క; మాయా = మాయయొక్క; శక్తిన్ = శక్తిని; చేపట్టి = స్వీకరించి; చూపుతున్ = చూపిస్తూ; అత్యంత = మిక్కిలి; సుభగుడు = అందగాడు; అగుచున్ = అవుతూ; భూషణంబులు = ఆభరణములు; కున్ = కే; భూషణంబు = ఆభరణము; ఐ = అయ్యి; వివేకములు = జ్ఞానములు; కున్ = కి; ఎల్లన్ = అన్నిటికిని; పరాకాష్ఠ = అత్యధికుడు {పరాకాష్ఠ - అవధి, అవధి వంటివాడు, అత్యధికుడు}; అగుచున్ = అవుతూ; సకల = సమస్త; కల్యాణ = శుభములకును; సంస్థానము = నివాసము; ఐ = అయ్యి; సత్యము = సత్యస్వరూపుడు; ఐ = అయ్యి; తేజరిల్లు = ప్రకాశింస్తుండే; అట్టి = అటువంటి; దివ్య = దివ్యమైన; మూర్తి = స్వరూపుడు;
తాన = తనే; తన = తన; మూర్తిన్ = రూపమును; నిజ = స్వంత; శక్తి = శక్తివలన; తగన్ = చక్కగా; ధరించెన్ = ధరించెను; యమతనూభవు = ధర్మరాజు యొక్క {యమతనూభవుడు - యమధర్మరాజు యొక్క పుత్రుడు. ధర్మరాజు}; రాజసూయ = రాజసూయము అను; అధ్వరంబు = యాగము; అందున్ = లో; ఎవ్వని = ఎవని; శుభ = శుభకరమైన; మూర్తిన్ = రూపమును; అర్థి = కోరిక; తోడన్ = తో; నిండు = పూర్తి; వేడుకన్ = సంతోషముతో; చూచి = చూసి; వర్ణించుచు = వర్ణిస్తూ; ఉండు = ఉంటారో.

భావము:

మానవులకు మహాభ్యుదయానికి అవధి అయి, తనకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించే తన యోగం యొక్క మాయాబలాన్ని స్వీకరించి ప్రకటీకరిస్తూ, మిక్కిలి సుందరమై, అలంకారాలకే అలంకారమై, జ్ఞానానికి పరాకాష్ఠ అయి, సకల శుభాలకూ సుస్థానం అయి, నిత్యమై దీపించే ఆ దివ్యమంగళమూర్తి తన ఆకారాన్ని తన శక్తివల్ల తానే ధరించాడు. ధర్మరాజు యొక్క రాజసూయ యాగంలో మూర్తీభవించిన ఆ శ్రీకృష్ణుని సౌందర్యాన్ని ఎంతో ఆనందంతో అందరూ సందర్శించారు. ఎంతో సంతోషంతో అభివర్ణించారు.

3-90-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రటముగఁ గమలభవసృ
ష్టికిఁ గారణ మిమ్మహాత్ముఁడే యనుచును ను
త్సుకులై తన్మూర్తిని ద
ప్పచూచిరిగాదె తత్సభాజనులెల్లన్.

టీకా:

ప్రకటముగన్ = ప్రసిద్ధముగ, వెల్లడిగ; కమలభవ = బ్రహ్మదేవుని {కమలభవుడు - పద్మమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; సృష్టి = సృష్టి; కిన్ = కి; కారణము = కారణము; ఈ = ఈ; మహాత్ముడే = మహాత్ముడే; అనుచున్ = అంటూ; ఉత్సుకులు = కుతూహలము కలవారు; ఐ = అయి; తత్ = అతని; మూర్తిని = స్వరూపమును; తప్పక = వదలక; చూచిరి = చూసారు; కాదె = కదా; తత్ = ఆ; సభా = సభలోని; జనులు = జనులు; ఎల్లన్ = అందరును.

భావము:

“బ్రహ్మసృష్టికి కూడా మూలకారణం ఈ మహానుభావుడే” అని ఆనాడు ఆ సభలోని వారంతా ఉత్సాహంతో ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని తదేకధ్యానంతో రెప్పవాల్చకుండా చూసారు కదా.

3-91-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియు శాంతోగ్రరూపధరుఁడైన సర్వేశ్వరుండు శాంతరూపుండు గావునఁ, బరకృతాపరాధ నిపీడ్యమానసుండయ్యు ననుకంపాయత్త చిత్తుండై వర్తించు పరాపరుండునుఁ బ్రకృతికార్యంబైన మహతత్త్వరూపుండును జననవిరహితుం డయ్యును దారువులువలన ననలంబు దోఁచు చందంబున జననంబు నొందుచుండు; నట్టి సరోజనాభుని హాసరాసలీలానురాగ విలోకన ప్రతిలబ్ధమానలైన గోపకామినులు దన్మూర్తి దర్శనానుషక్త మనీషలం గలిగి వర్తించి; రదియునుం గాక.

టీకా:

మఱియు = ఇంకా; శాంత = శాంతమును; ఉగ్ర = ఉగ్రమును; రూప = తన రూపముగ; ధరుండు = ధరించినవాడు; ఐన = అయినట్టి; సర్వేశ్వరుండు = కృష్ణుడు {సర్వేశ్వరుడు - సర్వులకును ఈశ్వరుడు, విష్ణువు}; శాంత = శాంతమైన; రూపుండు = రూపము కలవాడు; కావున = అగుటవలన; పర = ఇతరులచే; కృత = చేయబడిన; అపరాధ = తప్పులచేత; నిపీడ్యమాన = మిక్కిలి పీడింపబడుచున్న; మానసుండు = మనసు కలవాడు; అయ్యున్ = అయినప్పటికిని; అనుకంప = దయతో; ఆయత్త = కూడుకున్న; చిత్తుండు = మనసు కలవాడు; ఐ = అయి; వర్తించు = ప్రవర్తించు; పరాపరుండునున్ = పరాత్పరుడు {పరాపరుడు - పర (ఇతరము) అన్నది అపరము (ఇతరములేని) వాడు, తానుతప్పఇతరము లేనివాడు, పరాత్పరుడు}; ప్రకృతి = ప్రకృతికి; కార్యంబున్ = హేతువు; ఐన = అయిన; మహతత్త్వ = మహాతత్త్వము యొక్క; రూపుండును = స్వరూపమైనవాడును; జనన = జన్మములు; విరహితుండు = లేనివాడు; అయ్యును = అయినప్పటికిని; దారువులు = కొయ్య, మ్రాను; వలనన్ = వలన; అనలంబున్ = నిప్పు; తోచు = కనిపించు; చందంబునన్ = విధముగ; జననంబున్ = పుట్టుటను; ఒందుచున్ = పొందుతూ; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; సరోజనాభుని = కృష్ణుని {సరోజనాభుడు - సరోజము (పద్మము) నాభిని కలవాడు, విష్ణువు}; హాస = చిరునవ్వులు; రాసలీల = రాసలీలలు {రాసలీలలు - గుండ్రముగా వృత్తాకారమున ఒకరి చేతు లొకరు పట్టుకొని తిరుగుతూ చేయు విలక్షణ నృత్తము}; అనురాగ = ఆపేక్షగా; విలోకన = చూచుటలు; ప్రతిలబ్ధ = ప్రతిఫలముగ లభించిన; మానసలు = మనసులు కలవారు; ఐన = అయిన; గోప = గోపికా; కామినులు = స్త్రీలు; తత్ = ఆ; మూర్తిన్ = స్వరూపమును; దర్శన = దర్శించుట యందు; అనుషక్త = తగులుకొన్న, సంలఘ్నమైన; మనీషలన్ = ప్రజ్ఞలు; కలిగి = కలిగుండి; వర్తించిరి = ప్రవర్తించిరి; అదియునున్ = అంతే; కాక = కాకుండ.

భావము:

శ్రీకృష్ణుడు వారి వారి స్వభావాలను అనుసరించి కొందరికి శాంత స్వరూపుడు గానూ, మరికొందరికి భయంకర స్వరూపుడు గాను కనిపిస్తాడు. ఆ సర్వేశ్వరుడు సహజంగా శాంత స్వభావుడు. అందువలన ఇతరులు తనకు చేసిన అపరాధాలకు ఆయన మనస్సు ఎంతో బాధపడుతున్నా వారి యందు వాత్సల్య పరిపూర్ణమైన బుద్ధితోనే మెలగుతూ ఉంటాడు. ఆ పరాత్పరుడు ప్రకృతి కార్యమైన మహత్తత్త్వమే స్వరూపంగా కలవాడు. పుట్టుక లేనివాడైనా కట్టెలలోనుండి అగ్ని పుట్టునట్టు ఆవిర్భవిస్తూ ఉంటాడు. అటువంటి శ్రీకృష్ణుని చిరునవ్వులకూ, రాసక్రీడలకూ, ప్రేమావలోకనాలకూ తహతహలాడుతున్న వ్రేపల్లెలోనే గొల్లభామలంతా ఆయన దివ్య సౌందర్య సందర్శనంలో పరవశమైన భావాలతో ప్రవర్తించారు. సరే ఈ సంగతి ఇలా ఉంచు.

3-92-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివిజులకోర్కెఁ దీర్ప వసుదేవుని యింట జనించి కంసదా
వుఁడు వధించునన్భయమునంజని నందుని యింట నుంటకున్
నజరాసుతాదులకు నాజినెదుర్పడలేక సజ్జన
స్తమథురాపురిన్ విడిచి దాగుటకున్ మదిఁ జింతనొందుదున్.

టీకా:

దివిజుల = దేవతల {దివిజులు - దివి (స్వర్గము) నకు సంబంధించినవారు, దేవతలు}; కోర్కెన్ = కోరికను; తీర్పన్ = తీర్చుటకై; వసుదేవుని = వసుదేవుని; ఇంటన్ = ఇంటిలో; జనించి = పుట్టి; కంస = కంసుడు అను; దానవుండు = రాక్షసుడు; వధించున్ = సంహరించును; అను = అనే; భయంబునన్ = భయముతో; చని = వెళ్ళి; నందుని = నందుని; ఇంటన్ = ఇంటిలో; ఉంటకున్ = ఉండుటకును; యవన = కాలయవనుడు; జరాసుత = జరాసంధుడు {జరాసుతుడు - జర (ముసలితనము) అను రాక్షసి పుత్రుడు, జరాసంధుడు}; ఆదుల = మొదలైనవారల; కున్ = కిని; ఆజిన్ = యుద్ధమున; ఎదుర్పడన్ = ఎదురింప; లేక = లేక; సజ్జన = మంచివారిచే; స్తవ = పొగడబడు; మథురా = మథుర అను; పురిన్ = పట్టణమును; విడిచి = విడిచిపెట్టి; దాగుట = దాగుకొనుట; కున్ = కు; మదిన్ = మనసులో; చింతన్ = దుఃఖమును; ఒందుదున్ = పొందుదును.

భావము:

అంతటి మహానుభావుడు దేవతల కోరిక తీర్చడానికి వసుదేవుని ఇంట్లో జన్మించి రాక్షసత్వం పెరిగిపోయిన కంసుడు హింసిస్తాడేమో అనే భయంతో, వెళ్ళి నందుని ఇంట్లో చాటుమాటుగా పెరగటమూ; కాలయవనుడూ, జరాసంధుడూ మొదలైన వారిని కదనరంగంలో ఎదిరించకుండా తప్పుకొని మంచివారి చేత పొగడబడే మథురా నగరాన్ని కూడా వదలిపెట్టి ఎక్కడో దాక్కోవటమూ; ఈ రెండు సన్నివేశాలను తలచినప్పుడు నా మనస్సు దుఃఖంతో కుమిలి పోతుంది.

3-93-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండ.

భావము:

అంతేకాకుండా.

3-94-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

డఁగి పెక్కిడుమలఁ గుడుచుచుఁ జిత్తముల్-
లఁగఁగ బంధనాగారములను
నరిన దేవకీసుదేవులను డాయఁ-
నుదెంచి భక్తివంన మొనర్చి
"లిదండ్రులార! యేఁ లుగంగ మీరలు-
కంసుచే నలజడిఁ గ్రాగుచుండఁ
డగి శత్రునిఁ జంపఁగాలేక చూచుచు-
నున్న నాతప్పుఁ బ్రన్ను లగుచుఁ

3-94.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గావుఁ"డని యానతిచ్చిన దేదేవు
ద్భుతావహ మధురవాక్యములఁ దలఁచి
లఁచి నాచిత్తమునఁ బెద్దలుగుచుందుఁ
బృథులపాతకభూమిభృద్భిదుర విదుర!

టీకా:

కడగి = పూనుకొని; పెక్కు = పలువిధములైన; ఇడుములన్ = కష్టములను; కుడుచుచున్ = అనుభవించుచు; చిత్తముల్ = మనస్సులు; కలగగ = కలతచెందగా; బంధనాగారములను = కారాగారములో; వనరిన = శోకించిన; దేవకీ = దేవకీదేవి; వసుదేవులన్ = వసుదేవుడులను; డాయన్ = దగ్గరకు; చనుదెంచి = వచ్చి; భక్తిన్ = భక్తితో; వందనమున్ = నమస్కారములు; ఒనర్చి = చేసి; తల్లిదండ్రులారా = తల్లిదండ్రులారా; ఏన్ = నేను; కలుగంగ = ఉండగనే; మీరలు = మీరు; కంసు = కంసుని; చేన్ = చేత; అలజడిన్ = ఆపదలలో; క్రాగుచున్ = తపించుచు; ఉండన్ = ఉండగా; కడగి = యత్నముచేసి; శత్రునిన్ = శత్రువును; చంపగలేక = చంపలేక; చూచుచున్ = చూస్తూ; ఉన్న = ఉన్నట్టి; నా = నాయొక్క; తప్పున్ = తప్పుని; ప్రసన్నులు = ప్రసన్నమైన వారు; అగుచున్ = అయ్యి; కావుడు = క్షమింపుడు; అని = అని;
ఆనతిచ్చిన = పలికిన; దేవదేవున్ = కృష్ణుని {దేవదేవుడు - దేవుళ్ళకే దేవుడు, విష్ణువు}; అద్భుత = అద్భుతమును; ఆవహ = కలిగించునట్టి; మధుర = తీయని; వాక్యములన్ = పలుకులను; తలచితలచి = మరలమరల తలచుకొని; నా = నాయొక్క; చిత్తమునన్ = మనసునందు; పెద్దన్ = మిక్కిలి; కలగుచున్ = బాధపడుతూ; ఉందున్ = ఉంటాను; పృథుల = దట్టమైన; పాతక = పాపములు అను; భూమిభృత్ = పర్వతములకు; భిదుర = వజ్రాయుధము వంటివాడా; విదుర = విదురుడా.

భావము:

వజ్రాయుధం కొండలను ఛేదించినట్లు ప్రచండమైన పాపాలను పటాపంచలు చేసే ఓ విదురుడా! గుండెనిబ్బరంతో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ మనస్సు అంతా అల్లకల్లోలం అవుతుండగా చిరకాలం చెరసాలలో బాధపడ్డారు దేవకీ వసుదేవులు. వారి దగ్గరకు వెళ్ళి కృష్ణుడు భక్తితో నమస్కారం చేసి “జననీజనకులారా! నేనుండగా మీరిద్దరూ కంసుని క్రూరకృత్యాలకు గురికావలసి వచ్చింది. ఆ దుర్మార్గుణ్ణి తుదముట్టించకుండా చూస్తూ ఉపేక్షించిన నా అపరాధాన్ని దయచేసి క్షమించండి" అని విన్నవించుకొన్నాడు. ఆ దేవదేవుని అద్భుతమైన ఆ మృదుమధుర వచనాలను పదేపదే స్మరించి నా హృదయం ఎంతో వ్యథపడుతూ ఉంటుందయ్యా.

3-95-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలమతిఁదలఁప నెవ్వని
బొముడి మాత్రమున నిఖిలభూదేవీభా
ము వాయునట్టి హరిపద
లమరందంబు గ్రోలు నుఁడెవ్వాడో?

టీకా:

విమల = నిర్మలమైన; మతిన్ = మనస్సుతో; తలపన్ = ఆలోచించిన; ఎవ్వని = ఎవని; బొమముడి = కనుబొమలు బిగింపు; మాత్రమునన్ = మాత్రముచేతనే; నిఖిల = సమస్తమైన; భూదేవీ = భూదేవి యొక్క; భారము = భారము; పాయున్ = తొలగునో; అట్టి = అటువంటి; హరి = కృష్ణుని; పద = పాదములు అను; కమల = కమలముల; మరందమున్ = మకరందమును; క్రోలు = తాగునట్టి; ఘనుడు = గొప్పవాడు; ఎవ్వడో = ఎవరో.

భావము:

వాస్తవానికి ఆయన కనుబొమలు ఒక్కమాటు ముడిపడితే చాలు దుష్టశిక్షణ జరిగి భూభారమంతా తొలగి పోతుంది. అటువంటి ఆ దేవదేవుని పాదపద్మ మకరందాన్ని ఆస్వాదించే అదృష్టం పట్టిన మహాత్ముడే గదా ధన్యాత్ముడు.

3-96-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంప్రజ్ఞుఁడనై గో
విందుని మురదైత్యహరుని విష్ణునిఁ బరమా
నందుని నందతనూజుని
మంరధరుఁ జిత్తమందు ఱతునె యెందున్.

టీకా:

మంద = మందగించిన; ప్రజ్ఞుండను = తెలివి కలవాడను; ఐ = అయి; గోవిందుని = కృష్ణుని {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; మురదైత్యహరుని = కృష్ణుని {మురదైత్యహరుని - ముర అను రాక్షసుని సంహరించినవాడు, విష్ణువు}; విష్ణుని = కృష్ణుని {విష్ణువు - సమస్త మందును ప్రకాశము వ్యాపించిన వాడు}; పరమానందుని = కృష్ణుని {పరమానందుడు - పరమానంద స్వరూపుడు, కృష్ణుని}; నందతనూజుని = కృష్ణుని {నందతనూజుడు - నందుని పుత్రుడు, కృష్ణుడు}; మందరధరున్ = కృష్ణుని {మందరధరుడు - మందర పర్వతమును కూర్మావతారంలో ధరించినవాడు, కృష్ణుడు}; చిత్తమున్ = మనసు; అందు = లో; మఱతునె = మరుస్తానా ఏమిటి; ఎందున్ = ఎప్పుడైనా, ఎక్కడైనా.

భావము:

ఆ గోవిందుణ్ణి, ఆ మురాంతకుణ్ణి, ఆ విష్ణుస్వరూపుణ్ణి, ఆ ఆనందమయుణ్ణి, ఆ నందనందనుణ్ణి, ఆ మందరగిరి ధరుణ్ణి ఎక్కడైనా ఎప్పుడైనా మరిచిపోయేటంత మందబుద్ధినా నేను.

3-97-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దియునుఁ గాక, మీరు నృపులందఱుఁ జూఁడగ ధర్మసూతి పెం
పొవిన రాజసూయసవనోత్సవమందును జన్మమాదిగాఁ
పడి యెగ్గొనర్చు శిశుపాలుఁడు యోగిజనంబు లిట్టిద
ట్టిని యెఱుంగనోపని కడిందిపదంబునునొందెనే కదా.

టీకా:

అదియునన్ = అంతే; కాక = కాకుండ; మీరు = మీ; నృపులు = రాజులు {నృప - నరులను పాలించువాడు, రాజు}; అందఱున్ = అందరూ; చూడగన్ = చూస్తుండగా; ధర్మసూతి = ధర్మరాజు {ధర్మసూతి - యముని పుత్రుడు, ధర్మరాజు}; పెంపు = అతిశయము; ఒదవిన = చెందిన; రాజసూయ = రాజసూయము అను; సవన = యాగము యొక్క; ఉత్సవము = ఉత్సవము; అందున్ = లో; జన్మము = పుట్టినది; ఆదిగాన్ = మొదలు పెట్టి; పదపడి = తదనంతరము; ఎగ్గున్ = అవమానములు; ఒనర్చిన = చేసిన; శిశుపాలుడు = శిశుపాలుడు {శిశుపాలుడు - చైద్యదేశపు యువరాజు, కృష్ణుని మేనల్లుడు}; యోగి = యోగులైన; జనంబులున్ = జనములు కూడ; ఇట్టిదట్టిది = ఇలాంటి అలాంటిది; అని = అని; ఎఱుంగ = తెలిసుకొన; ఓపని = లేని; కడింది = దుర్లభమైన; పదంబున్ = పదమును; ఒందెనే = పొందెను; కదా = కదా.

భావము:

మరొక్కమాట. తను పుట్టినప్పటినుండి పనిగట్టుకొని ఎన్నో ఎగ్గులు చేసినవాడే కదా శిశుపాలుడు. ఆటువంటి శిశుపాలుడు మీరందరూ చుస్తూ ఉండగా, సమస్తరాజులూ చూస్తూ ఉండగా ధర్మరాజు సర్వోత్తమంగా నిర్వహించిన రాజసూయ మహోత్సవంలో మహాయోగీంద్రుల మనస్సులకు కూడా అగమ్యగోచరమైన పరమపదాన్ని అందుకున్నాడు గదా.

3-98-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కురునృప పాండు నందను లకుంఠితకేళిఁ జమూసమేతులై
రిగి రణోర్వి నెవ్వని ముఖాంబురుహామృత మాత్మలోచనో
త్కములఁ గ్రోలి పార్థవిశిప్రకరక్షతపూతగాత్రులై
గురుతర మోక్షధామమునకుం జని సౌఖ్యము నొందిరో తుదిన్.

టీకా:

కురు = కౌరవ; నృప = రాజులు; పాండునందనులు = పాండవులు {పాండునందనులు - పాండురాజు పుత్రులు, పాండవులు}; అకుంఠిత = మొక్కవోని; కేళిన్ = యుద్ధకేళిలో; చమూ = సేనలతో; సమేతులు = కూడినవారు; ఐ = అయి; అరిగిన్ = వెళ్ళి; రణ = యుద్ధ; ఉర్విన్ = భూములలో; ఎవ్వని = ఎవని; ముఖ = ముఖము అను; అంబురుహ = పద్మము అను {అంబురుహము - అంబు (నీటిలో) పుట్టినది, పద్మము}; అమృతమున్ = అమృతమును; ఆత్మ = తమ; లోచన = చూపుల; ఉత్కరములన్ = గుంపులతో; గ్రోలి = తాగి; పార్థ = అర్జునుని; విశిఖ = బాణముల; ప్రకర = పరంపరలచే; క్షత = గాయపడి; పూత = పవిత్రమైన; గాత్రులు = శరీరములు కలవారు; ఐ = అయి; గురుతర = బహుగొప్పదైన {గురు - గురుతర - గురుతమ}; మోక్ష = మోక్షము అను; ధామమున్ = వాసమున; కున్ = కు; చని = వెళ్ళి; సౌఖ్యమున్ = సొఖ్యమును; ఒందిరో = పొందారో; తుదిన్ = చివరకు.

భావము:

కౌరవులూ, పాండవులూ మొక్కపోని మగటిమితో, లెక్కలేని సైన్యాలతో యుద్ధభూమికి వెళ్ళారు. అక్కడ ఆ వీరులు శ్రీకృష్ణుని ముఖారవిందాన్ని సందర్శిస్తూ, ఆ సౌందర్య మధు రసాన్ని త్రాగుతూ అర్జునుని బాణాలకు క్షతగాత్రులై పరమ పవిత్రులై మహోన్నతమైన మోక్షాన్ని పొంది ఆనందించారు గదా.

3-99-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి సరోజాక్షుఁ డాద్యంతశూన్యుండు-
సుభగుండు త్రైలోక్యసుందరుండు
మనీయ సాగరన్యకాకుచకుంకు-
మాంకిత విపులబాహాంతరుండు
కలదిక్పాలభాస్వత్కిరీటన్యస్త-
ద్మరాగారుణపాదపీఠుఁ
జుఁ డనంతుఁడు సమానాధికవిరహితుం-
డిద్ధమూర్తిత్రయాధీశ్వరుండు

3-99.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నైన హరి యుగ్రసేనుని ఖిలరాజ్య
రుచిరసింహాసనమునఁ గూర్చుండఁబెట్టి
భృత్యుభావంబునొంది సంప్రీతి నతని
నుపుసేయుట కెపుడు నానముగుందు."

టీకా:

అట్టి = అటువంటి; సరోజాక్షుడు = కృష్ణుడు {సరోజాక్షుడు - సరోజము (పద్మము) వంటి కన్నులున్నవాడు}; ఆద్యంతశూన్యుడు = కృష్ణుడు {ఆద్యంతశూన్యుడు - ఆది (పుట్టుక) అంతము (మరణము) లేనివాడు, విష్ణువు}; సుభగుండు = కృష్ణుడు {సుభగుండు - సౌభాగ్యము కలవాడు}; త్రైలోక్యసుందరుండు = కృష్ణుడు {త్రైలోక్యసుందరుండు - మూడు లోకములకునూ సుందరమైనవాడు}; కమనీయ = మనోహరమైన; సాగర = సముద్రుని {సాగరకన్యకాకుచకుంకుమాంకితవిపులబాహాంతరుండు - సాగర (సముద్రము)నకు కన్యకా (పుత్రిక) కుచములకు రాసుకొన్న కుంకుమ అంకిత (అంటిన) విపుల (విస్తారమైన) బాహాంతరము (వక్షము) కలవాడు, విష్ణువు}; సకల = సమస్తమైన {సకలదిక్పాలభాస్వత్కిరీటన్యస్తపద్మరాగారుణపాదపీఠుఁడు - సమస్త దిక్పాలుల కిరీటములు హత్తించిన పద్మరాగముల వంటి అరికాళ్ళు కలవాడు, విష్ణువు}; దిక్ = దిక్కులను; పాల = పాలించువారి; భాస్వత్ = ప్రకాశిస్తున్న; కిరీట = కిరీటములందు; న్యస్త = పొదిగిన; పద్మరాగ = పద్మరాగమణులచే; అరుణ = ఎఱ్ఱబడిన; పాద = పాదములను ఉంచుకొను; పీఠుడు = పీఠముకలవాడు; అజుడు = కృష్ణుడు {అజుడు - జన్మములేనివాడు, విష్ణువు}; అనంతుడు = కృష్ణుడు {అనంతుడు - అంతమన్నదిలేనివాడు, విష్ణువు}; సమానాధికవిరహితుండు = కృష్ణుడు {సమానాధికవిరహితుండు - సమానమైన లేదా అధికమైన వారు ఎవ్వరూ లేనివాడు, విష్ణవు}; ఇద్ధమూర్తి = కృష్ణుడు {ఇద్దమూర్తి - పరిశుద్ధస్వరూపుడు}; త్రయాధీశ్వరుడు = కృష్ణుడు {త్రయాధీశ్వరుడు - త్రయ (వేదత్రయము)లకు అధిపతి, విష్ణువు}; ఐన = అయిన;
హరి = కృష్ణుడు {హరి - సకల పాపములను హరించు వాడు, విష్ణువు}; ఉగ్రసేనుని = ఉగ్రసేనుని {ఉగ్రసేనుడు - కృష్ణుని తాత, కంసుని తండ్రి}; అఖిల = సమస్తమైన; రాజ్య = రాజ్యమునకు; రుచిర = ప్రకాశవంతమైన; సింహాసనమునన్ = సింహాసనమునందు; కూర్చుండబెట్టి = కూర్చోపెట్టి; భృత్యు = భటుడు; భావంబునన్ = అను భావమును; ఒంది = తీసుకొని; సంప్రీతిన్ = మంచి ఇష్టముగ; అతని = అతను; పనుపు = నియమించిన పనులను, ఆజ్ఞలను; చేయుటకున్ = చేయుటకు; ఎపుడున్ = ఎప్పుడైనను; నా = నాయొక్క; మనమునన్ = మనసులో; కుందు = బాధతో కుంగుదును.

భావము:

అటువంటి పద్మాక్షుడు, ఆద్యంత రహితుడు సౌభాగ్యశాలి, అత్యంత సుందరుడు, త్రిజగన్మోహనుడు, సముద్రుని కూతురు, అందాలు చిందే ఇందిరాదేవి చనుదోయి కుంకుమ గుర్తులు హత్తుకున్న విశాల వక్షఃస్థలం కలవాడు, సకల దిక్పాలకుల ధగధగ మెరిసే బంగారు కిరీటాలలోని పద్మరాగాల కాంతులతో ఎఱ్ఱనైన పాదపీఠం కలవాడు. పుట్టుట లేనివాడు, సాటిలేని వాడు, తన కంటె మేటి లేనివాడు, వేదత్రయములకు అధీశ్వరుడు అయిన శ్రీకృష్ణుడు; కంసుని తండ్రి అయిన ఉగ్రసేనుడికి రాజ్యం అంతా పట్టంగట్టి, సింహాసనం మీద కూర్చోబెట్టి, తాను భృత్యుడై అతని ఆజ్ఞల్ని ఆనందంతో తలదాల్చటం తలచుకుంటే నా మనస్సు ఎప్పుడూ ఎంతో సంతాపపడుతూ ఉంటుంది.”

3-100-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని వెండియు నిట్లనియె "అనఘా! పరాత్పరుండును యోగీశ్వరుండును నగు కృష్ణుండు భగవద్భక్తుండునుఁ బరమ భాగవతోత్తముండును నైన యుగ్రసేనుని సేవించుట యాశ్చర్యంబు గాదు; తన్ను హరియింపం దలంచి కుచంబుల విషంబు ధరియించి స్తన్యపానంబు సేయించిన దుష్టచేతన యైన పూతనకుం జన్నిచ్చిపెంచిన యశోదాదేవికి నైన నందరాని నిజపదంబుఁ గారుణ్యచిత్తుండై యొసెంగె ననిన, నిజపాదధ్యానపరాయణు లగువారల ననుసరించి సేవించుట సెప్పనేల" యనిన నుద్ధవునికి విదురుం డిట్లనియె "భక్తవత్సలుండునుఁ గారుణ్యనిధియు నై భాగవతజనుల ననుగ్రహించు పుండరీకాక్షుండు నిజదాసలోకంబున కొసంగు పరమపదంబు నుగ్రకరులైన రాక్షసుల కెట్లొసంగె అత్తెఱం గెఱింపు" మనిన విదురునకు నుద్ధవుం డిట్లనియె.

టీకా:

అని = అని; వెండియు = మరల; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెన్; అనఘా = పుణ్యాత్ముడా; పరాత్పరుండును = పరాత్పరుడును {పరాత్పరుడు - పరముకన్న పరమైన వాడు, అన్నిటికిని పైవాడు, విష్ణువు}; యోగీశ్వరేశ్వరుండును = యోగీశ్వరులకును ఈశ్వరుడును {యోగీశ్వరేశ్వరుడు - యోగీశ్వరులకును ఈశ్వరుడు, విష్ణువు}; అగు = అయిన; కృష్ణుండు = కృష్ణుడు; భగవత్ = భగవంతుని; భక్తుండును = భక్తుడును; పరమ = ఉత్కృష్టమైన; భాగవత = భాగవతులలో; ఉత్తముండును = ఉత్తమమైనవాడును; ఐన = అయిన; ఉగ్రసేనుని = ఉగ్రసేనుని; సేవించుట = సేవచేయుట; ఆశ్చర్యంబు = ఆశ్చర్యము; కాదు = కాదు; తన్నున్ = తనను; హరియింపన్ = సంహరింపుదు నని; తలంచి = అనుకొని; కుచంబులన్ = స్తనంబులకు; విషంబున్ = విషమును; ధరియించి = రాసుకొని; స్తన్య = పాలు; పానంబున్ = తాగునట్లు; చేయించిన = చేసినట్టి; దుష్ట = చెడ్డ; చేతన = పనులు చేయునది; ఐన = అయిన; పూతనకున్ = పూతనకు; చన్నిచ్చి = పాలిచ్చి; పెంచిన = పెంచినట్టి; యశోదాదేవి = యశోదాదేవి; కిన్ = కిని; ఐనన్ = అయిన; అందరాని = అందనట్టి; నిజ = తన; పదంబున్ = మోక్షపదమును; కారుణ్య = దయామయమైన; చిత్తుండు = మనసు కలవాడు; ఐ = అయి; ఒసంగెన్ = ఇచ్చెను; అనినన్ = అనగా; నిజ = తన; పాద = పాదములందు; ధ్యాన = ధ్యానములో; పరాయణులు = మునిగినవారు; అగు = అయిన; వారలన్ = వారిని; అనుసరించి = అనుసరించి; సేవించుట = సేవించుటగురించి; చెప్పన్ = చెప్పుట; ఏల = ఎందులకు; అనినన్ = అన్నట్టి; ఉద్దవున్ = ఉద్ధవుని; కిన్ = కి; విదురుండు = విదురుడు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను; భక్త = భక్తులకు; వత్సలుండును = ఆపేక్ష కలవాడును; కారుణ్య = కారుణ్యమునకు; నిధియున్ = నిధి వంటివాడును; ఐ = అయి; భాగవత = భాగవతులు యైన; జనులన్ = జనులను; అనుగ్రహించు = అనుగ్రహించే; పుండరీకాక్షుండు = కృష్ణుడు {పుండరీకాక్షుడు - పుండరీకములు (పద్మములు) వంటి కన్నులు ఉన్నవాడు}; నిజ = తన; దాస = దాసుల, భక్తుల; లోకంబున్ = అందరి; కిన్ = కి; ఒసంగు = ప్రసాదించునట్టి; పరమపదంబున్ = ముక్తిని; ఉగ్ర = భయంకరములైన; కరులు = పనులు చేయువారు; ఐన = అయిన; రాక్షసుల = రాక్షసుల; కిన్ = కి; ఎట్లు = ఏవిధముగ; ఒసంగె = ఇచ్చెను; ఆ = ఆ; తెఱంగున్ = విధమును; ఎఱింగింపుము = తెలుపుము; అనిన = అన్నట్టి; విదురున్ = విదురుని; కున్ = కి; ఉద్దవుండు = ఉద్దవుడు; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అని మళ్ళీ ఇలా అన్నాడు ఉద్ధవుడు “ఓ పుణ్యాత్ముడా! పరాత్పరుడూ, పరమ యోగీశ్వరుడూ, అయిన శ్రీకృష్ణుడు; దైవభక్తుడు, ఉత్తమ భాగవతుడు అయిన ఉగ్రసేనుణ్ణి సేవించడం ఏమంత ఆశ్చర్యంగా లేదు కాని తనను చంపాలని, చన్నులకు విషం పూసుకొని పాలిచ్చిన పరమ పాతకురాలు పూతనకు మోక్షం ఇచ్చాడంటే; చన్నిచ్చి పెంచిన యశోదమ్మకు సైతం లభించని పరమపదాన్ని, కరుణార్ద్రహృదయంతో ఆ ఘాతుకురాలికి ప్రసాదించాడంటే; ఇక నిజ పాదాల్ని నిరంతరం భావించే వారిని అంటిపెట్టుకుని ఉండి సేవించడంలో పెద్ద విశేషం ఏముంది.” ఈ విధంగా పలికిన ఉద్ధవుడితో విదురుడు ఇలా అన్నాడు “భక్తులపై వాత్సల్యం కలవాడు, కరుణాసాగరుడు, భాగవతులను పరిరక్షించే పద్మాక్షుడు శ్రీకృష్ణుడు. తన అనుచరులకు ప్రసాదించే పరమపదాన్ని ఘోర కృత్యాలు చేసే క్రూర రాక్షసులకు ఎలా ఇచ్చాడు. అలా ఎలాగో సవిస్తరంగా నాకు తెలిసేలా చెప్పు.

3-101-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నుజానీక మనేక వారములు దోర్దర్పంబు సంధిల్లఁగా
వినుతాసూను భుజావరోహుఁ డగు నవ్విష్ణున్ సునాభాస్త్రుఁ దా
నిలో మార్కొని పోకు పోకు హరి దైత్యారాతి! యంచుం దదా
ముం జూచుచుఁ గూలి మోక్షపదముం ప్రాపింతు రత్యున్నతిన్.

టీకా:

దనుజ = రాక్షసుల; అనీకము = సేనలు; అనేక = పెక్కు; వారములు = మారులు; దోర్దర్పంబున్ = భుజగర్వము; సంధిల్లగా = ప్రాప్తించగా; వినుతాసూను = గరుత్మంతుని {వినుతాసూనుడు - వినుత యొక్క పుత్రుడు, గరుత్మంతుడు}; భుజ = భుజములను; ఆరోహుడు = ఎక్కువాడు; అగు = అయిన; ఆ = ఆ; విష్ణునిన్ = విష్ణువును; సునాభాస్త్రున్ = విష్ణుని {సునాభాస్త్రుడు - సునాభము(అను చక్రము) ఆయుధముగా గలవాడు, విష్ణవు}; తారు = తాము; అని = యుద్ధము; లోన్ = లో; మార్కొని = ఎదుర్కొని; పోకు = వెళ్ళిపోకు; పోకు = వెళ్ళిపోకు; హరి = హరీ; దైత్యారాతి = రాక్షసులకు శత్రువా; అంచుం = అనుచు; తత్ = ఆ; ఆననమున్ = ముఖమును; చూచుచున్ = చూస్తూ; కూలి = చనిపోయి; మోక్ష = మోక్ష; పదమున్ = స్థితిని; ప్రాపింతురు = పొందుదురు; అతి = మిక్కిలి; ఉన్నతిన్ = ఉన్నతస్థితిని.

భావము:

“గరుడుని భుజం ఎక్కువాడూ, సుదర్శన చక్రం ధరించువాడూ అయిన శ్రీమహావిష్ణువును ఎందరో రాక్షసులు ఎన్నో పర్యాయాలు అవక్ర భుజపరాక్రమంతో యుద్ధాలలో ఎదుర్కొన్నారు. “ఓరీ! హరీ! అసురవైరీ! ఆగు పారిపోకు నిలు” అని ఆయన నామాన్నే పలుకుతూ, ఆయన ముఖాన్నే చూస్తూ రణరంగంలో నేలగూలిన ఆ రాక్షసులు మోక్ష సామ్రాజ్యాన్ని అందుకొని అత్యున్నతమైన స్థానాన్ని పొందారు.

3-102-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధీజనోత్తమ! నవసిత
సాసలోచనుఁడు గృష్ణుననంబునుఁ ద
చ్చారిత్రము నెఱిఁగింతును
దాత నీ విపుడు వినుము ద్విధమెల్లన్.

టీకా:

ధీర = ధీరులైన; జన = జనులలో; ఉత్తమ = ఉత్తముడా; నవ = కొత్త; సిత = తెల్లని; సారస = కమలముల వంటి; లోచనుడు = కన్నులు ఉన్నవాడు; కృష్ణు = కృష్ణుని; జననంబున్ = పుట్టుకను; తత్ = అతని; చారిత్రమున్ = వర్తనలును; ఎఱింగింతున్ = తెలియజేయుదును; ఉదారతన్ = వివరముగ; నీవు = నీవు; ఇపుడు = ఇప్పుడు; వినుము = వినుము; తత్ = ఆ; విధము = వివరము; ఎల్లన్ = అంతా.

భావము:

విదురుడా! ధీరులలో ఉత్తముడా! ఏకాగ్ర చిత్తంతో విను. నిగనిగలాడే తెల్లని క్రొందామరరేకుల వంటి కన్నులు కల ఆ శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతాన్నీ, ఆయన లీలా విశేషాలనూ నీకు తేటతెల్లంగా తెలియజేస్తాను.

3-103-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణిభరంబు వాపుటకుఁ దామరసాసను ప్రార్థనన్ రమా
రుఁ డల కంస బంధననివాసమునన్ వసుదేవదేవకీ
రులకు నుద్భవింప బలవంతుఁడు గంసుఁడు హింససేయు న
న్వెపున నర్థరాత్రి సుతునిం గొని యవ్వసుదేవుఁ డిమ్ములన్.

టీకా:

ధరణీ = భూమి యొక్క; భరమున్ = భారమును; వాపుటకున్ = తగ్గించుటకు; తామరసాసను = బ్రహ్మదేవుని {తామరసాసనుడు - పద్మమున ఆసీనుడై ఉండువాడు}; ప్రార్థనన్ = వేడికోలు వలన; రమావరుడు = కృష్ణుడు {రమావరుడు - రమ (లక్ష్మీ దేవి) భర్త, విష్ణువు}; అలన్ = అక్కడ; కంస = కంసునిచే; బంధననివాసమునన్ = చెరసాల యందున్న; వసుదేవ = వసుదేవుడు; దేవకీ = దేవకీదేవి అను; వరుల్ = శ్రేష్ఠుల; కున్ = కు; ఉద్భవింప = పుట్టగా; బలవంతుడు = బలవంతుడైన; కంసుడు = కంసుడు; హింససేయునన్ = సంహరించునని; వెఱపునన్ = భయముతో; అర్థరాత్రి = అర్థరాత్రి; సుతునుం = పుత్రుని; కొని = తీసుకొని; ఆ = ఆ; వసుదేవుడు = వసుదేవుడు; ఇమ్ములన్ = ఉపాయముగ.

భావము:

పుట్టుక ఎరుగని ఆ లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు భూభారాన్ని పోగొట్టడానికి, తన నాభి కమలంలో పుట్టిన బ్రహ్మదేవుని ప్రార్థన మన్నించాడు. అలా కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులకు పుత్రుడై పుట్టాడు. వసుదేవుడికి తన ముద్దుల కుమారుణ్ణి అతి బలవంతుడైన కంసుడు హింసిస్తాడేమో అనే భయం కలిగింది, వెంటనే వసుదేవుడు ఆ అర్థరాత్రి పసివాణ్ణి తీసుకుని బయలుదేరాడు.

3-104-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నందుని మందకుఁ జని త
త్సుంరితల్పమునఁ బరులు సూడకయుండన్
నంను నినునిచి యానక
దుందుభి మరలంగ నేగెఁ దొల్లిటి పురికిన్.

టీకా:

నందుని = నందుని; మంద = పల్లె {మంద - యాదవులు మొదలైన జాతులవారి జనవాసము, ఊరుకంటె చిన్నది, పల్లె}; కున్ = కి; చని = వెళ్ళి; తత్ = అతని; సుందరి = భార్య; తల్పమునన్ = మంచముపైన; పరులు = ఇతరులకి; చూడక = కనబడక; ఉండన్ = ఉండేలా; నందనుని = పుత్రుని; ఉనిచి = ఉంచి; ఆనకదుందుభి = వసుదేవుడు {ఆనకదుందుభి - పుట్టినప్పుడు దుందుభులు మ్రోగినవాడు, వసుదేవుడు}; మరలంగ = మరలి, వెనుకకు; ఏగెన్ = వెళ్ళెను; తొల్లిటి = ముందటి, వచ్చిన; పురికిన్ = పురమునకు, చోటికి.

భావము:

అలా వసుదేవుడు నందుడు ఉన్న వ్రేపల్లెకు వెళ్ళాడు. ఎవ్వరూ చూడకుండా నందుని భార్య యశోద పక్కలో బాలుణ్ణి పడుకోబెట్టాడు. తిరిగి మధురా నగరం లోని తన కారాగారానికి వచ్చాడు.

3-105-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి యేకాదశ సంవ
త్సములు నందవ్రజమునఁ ను హరి యని యె
వ్వరు నెఱుఁగకుండ నా హల
రుతోఁ గ్రీడించుచుండె ద్దయు బ్రీతిన్.

టీకా:

హరి = కృష్ణుడు {హరి - సంచిత పాపములను హరించువాడు, విష్ణువు}; ఏకాదశ = పదకొండు(11); సంవత్సరములు = ఏళ్ళు; నంద = నందుని; వ్రజమునన్ = పల్లెలో; తను = తాను; హరి = విష్ణువు {హరి - సమస్త దుఃఖములను హరించువాడు, విష్ణువు}; అని = అని; ఎవ్వరున్ = ఎవరికిని; ఎఱుగక = తెలియకుండగ; ఉండన్ = ఉండేలా; ఆ = ఆ; హలధరు = బలరాముడు {హలధరుడు - నాగలి ధరించు వాడు, బలరాముడు}; తోన్ = తో; క్రీడించుచున్ = ఆడుకొంటూ; ఉండెన్ = ఉన్నాడు; దద్దయున్ = మిక్కిలి; ప్రీతిన్ = ప్రేమతో.

భావము:

నందుని గోకులంలో కృష్ణ బాలుడు, తనను శ్రీహరి అవతారమని ఎవరికీ తెలియకుండా, నందనందనుడిగా అన్న బలరామునితో కలిసి ఆనందంగా ఆడుకుంటున్నాడు. ఇలా పదకొండు సంవత్సరాలు గడిచాయి, ఆయన్ని శ్రీహరి అవతారమని ఎవరూ గుర్తించలేదు.

3-106-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గోపాలవరులకైనను
నాపోవఁగఁ దన సమంచితాకార మొగిం
జూని శ్రీపతి వేడుక
గోపాలురఁ గూడి కాచె గోవత్సములన్.

టీకా:

గోపాల = దేవతలలో {గోపాలకులు - గోపాలకము (అమరపురమున) వసించు వారు, దేవతలు}; వరులు = శ్రేష్ఠులు; కున్ = కి; ఐనన్ = అయినప్పటికిని; ఆపోవంగ = తృప్తిపడగా; తన = తన యొక్క; సమంచిత = చక్కటి; ఆకారమున్ = ఆకారమును; ఒగిన్ = సరిగ్గా; చూపని = చూపించని; శ్రీపతి = కృష్ణుడు {శ్రీపతి - శ్రీ (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు}; వేడుకన్ = వేడుకగా; గోపాలురన్ = యాదవులతో {గోపాలురు - గోవులను పాలించువారు, యాదవులు}; కూడి = కలిసి; కాచెన్ = కాచెను {కాచుట - పశువులను మేపుటకు తీసుకు వెళ్ళి అక్కడ వాటికి ఏ ప్రమాదములు రాకుండ అవి తప్పిపోకుండ చూచుట}; గోవత్సములన్ = ఆవులను దూడలను.

భావము:

దేవతా శ్రేష్ఠులకు సైతం కన్నుల విందుగా తన దివ్య స్వరూపాన్ని చూపించని ఇందిరాదేవి భర్త తోటి గొల్లపిల్లలతో కలిసి ఆడుతూ ఎంతో వేడుకగా ఆవుల్నీ దూడల్ని కాచాడు.

3-107-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యవసరంబునం గృష్ణుండు లీలావినోదంబులు తోడిగోపాలబాలురకుం జూపం దలంచి.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; కృష్ణుండు = కృష్ణుడు; లీలా = లీలలు; వినోదంబులున్ = వినోదములు; తోడి = తోటి; గోపాల = గోపాల; బాలుర = పిల్లల; కున్ = కు; చూపన్ = చూపించవలెనని; తలంచి = అనుకొని;

భావము:

ఆ సమయంలో శ్రీకృష్ణుడు తనతో ఉండే గోపాలబాలురకు తన లీలలూ వినోదాలూ చూపించాలనుకున్నాడు.

3-108-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యమునానదీ సలిల ర్ధిత సౌరభ యుక్త పుష్ప మే
దు మకరంద పానపరితుష్ట మధువ్రతయూధ మాధవీ
కువక కుంద చందన నికుంజము లందు మయూర శారికా
భృత రాజకీర మృదుభాషల భంగిఁ జెలంగి పల్కుచున్.

టీకా:

వర = శ్రేష్ఠమైన; యమునా = యమున అను; నదీ = నది యొక్క; సలిల = నీటితో; వర్ధిత = పెంచబడిన; సౌరభ = పరమళముతో; యుక్త = కూడిన; పుష్ప = పూవులలోని; మేదుర = చిక్కని; మకరంద = తేనె; పాన = తాగుటచే; పరి = చక్కగా; పరితుష్ట = సంతృప్తి చెందిన; మధువ్రత = తేనెటీగల; యూధ = సమూహములు కల; మాధవీ = మాధవీ లత; కురవక = ఎఱ్ఱగోరింట; కుంద = మల్లెచెట్లు; చందన = మంచిగంధపుచెట్లు; నికుంజముల = పొదల; అందున్ = లో; మయూర = నెమళ్ళు; శారిక = గోరువంకలు; పరభృత = కోకిలలు; రాజకీర = రామచిలుకలు; మృదు = మెత్తని; భాషల = పలుకుల; భంగిన్ = వలె; చెలంగి = చెలరేగి; పల్కుచున్ = పలుకుతూ.

భావము:

ఆ గోపాల బాలుడు నిర్మలమైన యమునా నదీ జలాలతో పెద్దగా పెరిగి ఘుమఘుమలాడే సువాసనలు గల పూలనుండి చిందుతున్న మకరందాన్ని కడుపు నిండా త్రాగి మైమరచిన తుమ్మెదల గుంపులతో కూడిన మాధవీ మంటపాలలో, గోరింట గుబురులులో, మొల్ల పొదలలో, మంచి గంధపు నికుంజాలలో దూరి నెమలిలాగా కేకలు వేస్తూ, గోరువంకలాగా కూతలు కూస్తూ కోకిలలాగా రాగాలు తీస్తూ రామచిలకలలాగా రమణీయ పలుకులు పలుకుతూ ఉండేవాడు.

3-109-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీమణీమనోవిభుఁడు సింహకిశోరముఁబోలి లీలఁ గౌ
మాదశన్ రమావిమలమందిరముం బురుడించు గోతతిన్
వాక మేపుచుండెఁ దన వంశరవస్ఫుటమాధురీసుధా
సాముచేత గోపజనసంఘములన్ ముదమందఁజేయుచున్.

టీకా:

శ్రీరమణీమనోవిభుడు = కృష్ణుడు {శ్రీరమణీమనోవిభుడు - శ్రీరమణీ (లక్ష్మీదేవి) మనసునకు విభుడు, విష్ణువు}; సింహ = సింహపు; కిశోరమున్ = పిల్ల; పోలి = వలె; లీలన్ = లీలగా; కౌమార = కౌమార {కౌమార - బాల్యము తరువాత యౌవనమునకు ముందు దశ}; దశన్ = దశలో {దశ - అవస్థ, చతురావస్థలు, బాల్యము, కౌమారము, యౌవనము, వార్థక్యము, ఇంకోవిధముగ అష్టధశలు పిండ, శైశవ, బాల్య, కౌమార, యౌవన, ప్రౌఢ, వార్థక్య, మరణ దశలు}; రమా = లక్ష్మీదేవి; విమల = నిర్మల; మందిరమున్ = నివాసమునకు; పురుడించు = సాటియైన; గో = ఆవుల; తతిన్ = సమూహమును; వారక = విడువక; మేపుచున్ = మేపుతూ; ఉండెన్ = ఉండెను; తన = తన యొక్క; వంశ = వేణూ; రవ = నాదము; స్ఫుట = వర్షించిన; మాధురీ = తియ్యని; సుధాసారము = అమృతము; చేతన్ = చే; గోపజన = గోపాలుర; సంఘములన్ = సమూహములకు; ముదము = సంతోషము; అందజేయుచున్ = అందిస్తూ.

భావము:

లక్ష్మీవల్లభుడైన ఆ నందనందనుడు కృష్ణుడు తన కౌమార దశలో సింహకిశోరంలాగా ప్రకాశించాడు. లీలగా పిల్లనగ్రోవిని మ్రోగిసూ ఆ మధరగాన సుధా సరస్సులో గో గోప బృందాన్ని ముంచి తేల్చి పరవశింపజేస్తూ లక్ష్మీనివాసాలైన గోవుల్ని మేపుతూ ఉండేవాడు.

3-110-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియును.

టీకా:

మఱియును = ఇంకనూ.

భావము:

అంతేకాకుండా.

3-111-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చికేళీరతి బాలకుల్ తృణములన్ సింహాది రూపంబులం
మొప్పన్ విరచించి వాని మరలన్ ఖండించు చందంబునం
రుణాతీతులఁ గామరూపు లగు నక్కంసప్రయుక్తక్షపా
రులం గృష్ణుఁడు సంగరస్థలములం క్కాడె లీలాగతిన్.

టీకా:

చిర = మిక్కిలి; కేళీ = ఆడుకొనే; రతిన్ = ఆసక్తితో; బాలకుల్ = పిల్లలు; తృణములన్ = గడ్డిపోచలను; సింహ = సింహము; ఆది = మొదలైన; రూపములన్ = రూపములతో; కరము = చాలా; ఒప్పన్ = చక్కగా; విరచించి = తయారుచేసి; వానిన్ = వాటిని; మరలన్ = మళ్ళా; ఖండించు = ముక్కలుచేయు; చందంబునన్ = విధముగ; కరుణా = దయ; అతీతులన్ = లేనివారిని; కామరూపులన్ = కోరిన రూపు ధరించ గలవారిని; ఆ = ఆ; కంస = కంసునిచే; ప్రయుక్త = ప్రయోగింపబడిన; క్షపాచరులన్ = రాక్షసులను {క్షపాచరులు - రాత్రి తిరుగువారు, రాక్షసులు}; కృష్ణుడు = కృష్ణుడు; సంగర = యుద్ధ; స్థలములన్ = భూములలో; చక్కాడెన్ = చెండాడెను, సంహరించెను; లీలా = లీల; గతిన్ = వలె.

భావము:

ఆడుకోటానికి చిన్న పిల్లలు గడ్డితో సింహం మొదలైన బొమ్మల్ని తయారు చేస్తారు. ఆట పూర్తి కాగానే వాటిని మళ్లీ చించి, తుంచి పారేస్తారు. అలానే దయమాలిన వారూ, కామరూపధారులూ, కంసుని చారులూ అయిన రాక్షస వీరుల్ని ఎందరినో గోవిందుడు కదన రంగంలో అవలీలగా చించి చెండాడాడు.

3-112-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యమునానదీజల నివాస మహోరగ విస్తృతాస్య వి
స్ఫురిత విషానలప్రభల సోకునఁ గ్రాగిన గోప గోధనో
త్కముల నెల్లఁ గాచి భుజప్రవరున్ వెడలంగఁదోలి త
త్సరిదమలాంబు పానమున సంతసమందగఁ జేసె గోతతిన్.

టీకా:

వర = శ్రేష్ఠమైన; యమునా = యమున అను; నదీ = నది యొక్క; జలములన్ = నీటిలో; నివాస = నివసించుచున్న; మహా = గొప్ప; ఉరగ = సర్పము యొక్క; విస్త్రుత = విశాలమైన, పెద్ద; అస్య = నోళ్ళ నుండి; విస్ఫురిత = వెలిగ్రక్కుచున్న; విష = విషపు; అనల = అగ్ని; ప్రభలన్ = కీలలు; సోకునన్ = తగులుటచేత; క్రాగిన = తపించిన, కాలిపోయిన; గోప = గోపాలకులను; గో = గోవులు అను; ధన = సంపదల; ఉత్కరములు = సమూహములు; ఎల్లన్ = అన్నిటిని; కాచి = కాపాడి; భుజగ = సర్పములలో; ప్రవరున్ = శ్రేష్ఠును; వెడలంగన్ = వెళ్ళునట్లు; తోలి = తోలి; తత్ = ఆ; సరిత్ = మడుగులోని; అమల = నిర్మలమైన; అంబు = నీరు; పానమునన్ = తాగుటవలన; సంతసము = సంతోషము; అందన్ = కలుగునట్లు; చేసెన్ = చేసెను; గోతతిన్ = ఆలమందలను.

భావము:

యమునా నదిలో భయంకరమైన మహా సర్పం ఒకటి నివాసం ఉండేది. విశాలంగా తెరచిన దాని నోటిలో నుంచి వెలువడే విషాగ్ని జ్వాలల తాపానికి గోపాలకులు తాళలేక పొయ్యే వారు. గో సంపద కూడా బాధపడుతూ ఉండేది. నందనందనుడు ఆ నాగరాజును నదిలో నుండి తరిమేశాడు. (గోపకులు గోవులుతో కూడిన) ఆలమందల్ని కాపాడి వాటికి మళ్లీ ఆ నదిలోని నిర్మలమైన నీటిని త్రాగే అవకాశాన్ని అనుగ్రహించాడు. అందరికీ ఆనందం కలిగించాడు.

3-113-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివిజాధీశుగుఱించి వానకొఱకై దీపింప నందాది వ
ల్లవు లేటేఁట ననూనసంపదల నుల్లాసంబునం జేయు ను
త్సముం గృష్ణుఁడు మాన్పి గోపగణముల్ సంప్రీతినొందన్ శచీ
వు గర్వం బడఁపంగ నవ్యయముగాఁ దాఁ జేసె గోయాగమున్.

టీకా:

దివిజాధీశున్ = ఇంద్రుని {దివిజాధీశుడు - దివిజుల (దేవతల)కు అధీశుడు (ప్రభువు), ఇఁద్రుడు}; గుఱించి = ఉద్ధేశించి; వాన = వాన; కొఱకై = కోసము; దీపింపన్ = అతిశయించునట్లు; నంద = నందుడు; ఆది = మొదలైన; వల్లవులు = గోపాలురు; ఏటేటన్ = ప్రతిసంవత్సరము; అనూన = వెలితిలేని; సంపదలన్ = సంపదలకై; ఉల్లాసంబునన్ = ఉల్లాసముతో; చేయున్ = చేసెడి; ఉత్సవమున్ = పండుగను; కృష్ణుడు = కృష్ణుడు; మాన్పి = మాన్పించి; గోప = గోపాలుర; గణముల్ = సమూహములు; సంప్రీతిన్ = సంతోషమును; ఒందగన్ = పొందగన్; శచీధవు = ఇంద్రుని {శచీధవుడు - శచీదేవి భర్త, ఇంద్రుడు}; గర్వం = గర్వము; అడపంగన్ = అణచుటకు; అవ్యయముగన్ = శుభకరముగ; తాన్ = తాను; చేసెన్ = చేసెను; గోయాగమున్ = గోయాగమును.

భావము:

నందుడు మొదలైన యాదవులు వర్షం బాగా కురియటంకోసం ఇంద్రుణ్ణి గూర్చి ఒక ఉత్సవం ఎంతో వైభవంతో, ఎంతో ఉత్సాహంతో ఏటేటా గొప్పగా చేసేవారు. కృష్ణుడు, ఆ ఇంద్రోత్సవాన్ని మాన్పించి ఇంద్రుని అహంకారం అడుగంటేలాగా, గోపాలురు అందరూ సంతోషించేలాగా గోపూజ ప్రధానమైన గోయాగాన్ని తక్కువ వ్యయంతో, ఎక్కువ వైభవంతో జరిపించాడు.

3-114-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిహయుఁ డంత రోషవివశావిలమానసుఁడై సరోరుహో
రు మహిమం బెఱుంగక మదం బడరంగ వలాహకాది భీ
ఘనపంక్తిఁ బంపిన నఖండశిలామయ భూరి వర్షముల్
కురిసె ననూన గర్జనల గోకుల మాకుల మౌచుఁ గుందఁగన్.

టీకా:

హరిహయుడు = ఇంద్రుడు; అంతన్ = అంతట; రోష = రోషముచే; వివశావిల = వశము తప్పి కలతపొందిన, ; మానసుండు = మనసు కలవాడు; ఐ = అయి; సరోరుహోదరు = కృష్ణుని {సరోరుహోదరుడు - సరోరుహము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; మహిమంబు = మహిమను; ఎఱుంగక = తెలియక; మదంబున్ = గర్వము; అడరంగ = విజృంభింపగ; వలాహక = వలాహకము {వలాహకము - ప్రళయ భయంకరమైన మేఘము}; ఆది = మొదలైన; భీకర = భయంకరమైన; ఘన = మేఘముల; పంక్తిన్ = సమూహమును; పంపినన్ = పంపగా; అఖండ = ఎడతెరపిలేని; శిలా = రాళ్ళతో; మయ = కూడిన; భూరి = మిక్కిలి విస్తారమైన; వర్షముల్ = వర్షములు; కురిసెన్ = కురిసినవి; అనూన = పెద్దపెద్ద; గర్జనలన్ = గర్జనలతో; గో = గోపాలుర; కులము = గుంపు అంతా; ఆకులము = చీకాకు చెందినది; ఔచున్ = అవుతూ; కుందగన్ = కుంగిపోగా, దుఃఖింపగా.

భావము:

ఈ విషయం తెలుసుకొన్న ఇంద్రుడికి ఎంతో ఆగ్రహం వచ్చింది. మనస్సు ద్వేషంతో, రోషంతో నిండిపోయింది. పద్మనాభుడైన శ్రీకృష్ణుని మహిమ తెలుసుకోలేక అహంకారంతో వలాహకం మొదలైన భయంకర కాలమేఘాల్ని పంపించాడు. ఆ కారుమబ్బులు గోకులమంతా శోకంతో వ్యాకులమై పోయేలా పెద్దగా ఉరుముతూ ఎడతెగకుండా రాళ్లవర్షం కురిశాయి.

3-115-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఱి మంద గొందలము నందఁగ వల్లవు లెల్లఁ "గృష్ణ! యీ
చేనులెల్ల నిట్టి జడిఁ జిందఱవందఱలై కలంగుచుం
గారు లైరి నీవు గృపఁ గావుము; కావు మనాథనాథ! ని
ర్థూకళంక! భక్తిపరితోషణభూషణ! పాపశోషణా!"

టీకా:

ఆ = ఆ; తఱి = సమయమున; మంద = గొల్లపల్లె; కొందలమున్ = చీకాకును; అందగన్ = పొందగా; వల్లవులు = గోపాలురు; ఎల్లన్ = అందరును; కృష్ణ = కృష్ణా; ఈ = ఈ; చేతనులు = జీవులు; ఎల్లన్ = అందరూ; ఇట్టి = ఇటువంటి; జడిన్ = వర్షపుజడికి; చిందఱవందఱలు = చెల్లాచెదురు; ఐ = అయి; కలంగుచున్ = కలతపడుతూ; కాతరులు = భయభ్రాంతులు; ఐరి = అయిరి; నీవు = నీవు; కృపన్ = దయతో; కావుము = కాపాడుము; కావుము = కాపాడు; అనాథనాధ = దిక్కులేనివారికి దిక్కైనవాడా; నిర్ధూత = విడువ బడిన, ఎగురగొట్టబడిన; కళంక = పాపములు కలవాడ; భక్త = భక్తులను; పరితోషణ = సంతోషపెట్టుట అను; భూషణ = అలంకారములు కలవాడ; పాప = పాపములను; శోషణ = నశింపజేయువాడ.

భావము:

అప్పుడు వ్రేపల్లెలోని గోపాలురూ, గోవులూ అందరూ ఆ వర్షానికి అల్లకల్లోలమయ్యారు. గొల్లలంతా తల్లడిల్లి ఒక చోట చేరారు. “కృష్ణా! రక్షించు! రక్షించు! ఈ జడివాన ధాటికి గోకులంలోని సకల జీవులూ చీకాకుపడి చిందరవందరలు అవుతున్నారు. దిక్కులేని వారికి నీవే దిక్కు. సజ్జనులను పోషించేవాడవూ దుర్జనులను శిక్షించేవాడవూ నిష్కళంకుడవూ అయిన కృష్ణా! దయతో కాపాడవయ్యా.”

3-116-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యిబ్భంగి విపన్నులై పలుకఁ గుయ్యాలించి కృష్ణుండు స
జ్జవర్ధిష్ణుఁడు గోపగోనివహరక్షాదక్షుడై దేవతా
ను లగ్గింపఁ గరాంబుజాతమున సచ్ఛత్రంబుగాఁ దాల్చె బో
గోవర్థన శైలముం దటచరద్రమ్యామరీజాలమున్.

టీకా:

అని = అని; ఇబ్బంగి = ఈ విధముగ; విపన్నులు = మిక్కిలి ఇడుములు పాలైన వారు; ఐ = అయి; పలుకన్ = అనగా; కుయ్యి = మొర; ఆలించి = విని; కృష్ణుండు = కృష్ణుడు {కృష్ణుడు - కృష్ణ(నల్లని)రంగు కలవాడు}; సత్ = మంచి; జన = జనముల; వర్దిష్టుడు = వృద్ధిని కలిగించువాడు; గోప = గోపాలుర; గో = ఆవుల; నివహ = సమూహమును; రక్షా = రక్షించుట యందు; దక్షుడు = సమర్థుడు; ఐ = అయి; దేవతాజనులు = దేవతలు; అగ్గింపన్ = స్తుతింపగా; కర = చేయి అను; అంబుజాతమున = పద్మమున {అంబుజాతము - నీట పుట్టినది, పద్మము}; సత్ = మంచి; ఛత్రముగా = గొడుగువలె; తాల్చెన్ = ధరించెను; బోరనన్ = ధారాళముగ; గోవర్థన = గోవర్థనము అను; శైలమున్ = పర్వతమును; అట = అచట; చరత్ = తిరుగుతున్న; రమ్య = అందమైన; అమరీ = దేవతాస్త్రీల; జాలమున్ = సమూహము కలదానిని.

భావము:

అంటూ ఆపన్నులైన వ్రేపల్లెలోని గోపాలకులు అందరూ ప్రార్థించారు. సజ్జనుల పెంపు కోరి కృష్ణుడు, వారి మొర ఆలకించి గోవులనూ, గోపాలకులనూ కాపాడటానికి నడుం కట్టాడు. దేవ కన్యలు విహరించే చరియలు గల గోవర్థన పర్వతాన్ని ఒక్క చేత్తో గొడుగులా ఎత్తి పట్టాడు. ఆ దృశ్యం ఆలోకించి ఆకాశంలోని అమరులంతా “బళీ! బళీ!” అని ప్రశంసించారు.

3-117-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెండియు.

టీకా:

వెండియున్ = ఇంకనూ.

భావము:

ఇంకో విషయం విను.

3-118-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రదాగమారంభ సంపూర్ణపూర్ణిమా-
చంద్ర సాంద్రాతపోజ్జ్వలిత మగుచు
వెలయు బృందాటవీవీథి యందొకనాడు-
రాసకేళీ మహోల్లాసుఁ డగుచు
రుచిర సౌభాగ్యతారుణ్యమనోరమ-
స్ఫూర్తిఁ జెన్నొందిన మూర్తి దనర
లలితముఖచంద్రచంద్రికల్ గోపికా-
యనోత్పలముల కానంద మొసగ

3-118.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్యచాతుర్యభంగిఁ ద్రిభంగి యగుచు
బ్జనాభుండు సమ్మోద తిశయిల్ల
లీలఁ బూరించు వరమురళీ నినాద
ర్థి వీతేర విని మోహితాత్ము లగుచు.

టీకా:

శరత్ = శరదృతువు; ఆగమన = వచ్చునట్టి; ప్రారంభ = మొదటి; సంపూర్ణ = నిండు; పూర్ణిమా = పున్నమి; చంద్ర = చంద్రుని; సాంద్ర = చిక్కని; ఆతప = వెన్నెల చేత; ఉజ్జ్వలితము = వెలిగించబడినది; అగుచున్ = అవుతూ; వెలయు = ప్రకాశించుచున్న; బృంద = బృంద అను (తులసీ); అటవీ = వనము యొక్క; వీథి = మార్గము; అందు = లోన; ఒక = ఒక; నాడు = రోజు; రాసకేళీ = రాసక్రీడ యందు; మహా = మిక్కిలి; ఉల్లాసుడు = ఉత్సాహముకలవాడు; అగుచున్ = అవుతూ; రుచిర = ప్రకాశిస్తున్న; సౌభాగ్య = శుభకరమైన; తారుణ్య = యౌవనముతొణకిసలాడు; మనస్ = మనసును; రమా = రమింపజేయు; స్ఫూర్తిన్ = స్ఫూర్తితో; చెన్నొందిన = అందముచిందిన; మూర్తిన్ = స్వరూపము; తనరన్ = గోచరించగా; సలలిత = సొగసుతోకూడిన; ముఖ = ముఖము అను; చంద్ర = చంద్రుని; చంద్రికల్ = వెన్నెలలు; గోపికా = గోపికలయొక్క; నయన = కన్నులు అను; ఉత్పలముల = కలువల; కున్ = కు; ఆనందము = ఆనందము; ఒసగన్ = అందించగా;
భవ్య = శుభకరమైన; చాతుర్య = నేర్పుకలిగిన; భంగి = భంగిమకలవాడు; త్రిభంగి = త్రిభంగి అను భంగిమలో ఉన్నవాడు {త్రిభంగి - ఒకకాలుమీదనిలబడి రెండవకాలు వేళ్ళు నేలను ఆనునట్లు కొంచము మడచి నిలబడు భంగిమ, మువ్వొంకలభంగి, కృష్ణుడు వేణవు వాయించుచు నిలబడిన విధము}; అగుచున్ = అవుతూ; అబ్జ = పద్మము {అబ్జము - అప్పు (నీరు)నందు పుట్టినది, పద్మము}; నాభుండు = నాభికలవాడు; సమ్మోదము = సంతోషము; అతిశయిల్ల = అతిశయించునట్లు; లీలన్ = లీలగా; పూరించున్ = ఊదుచున్న; వర = శ్రేష్ఠమైన; మురళీ = వేణు; నినాదము = మంచినాదము; అర్థిన్ = కోరి; వీతేర = వస్తుండగా; విని = విని; మోహిత = మోహింపబడిన; ఆత్ములు = ఆత్మలుకలవారు; అగుచున్ = అవుతూ.

భావము:

శరత్కాలం ప్రారంభమైంది. పూర్ణిమ నాటి నిండు చందమామ పండువెన్నెలలో బృందావనం కన్నుల విందు చేస్తూన్నది. ఒకరోజు కృష్ణునికి రాసకేళిపై ఉల్లాసం కలిగింది. మనోహరమైన యౌవన సౌభాగ్య శోభలతో అందాలు చిందే రూపంతో అతిశయించి ఉన్నాడు, తన ముఖం నుండి వెలువడే చంద్రకాంతులతో, గోపికల కనులు అనే కలువలకు ఆనందాన్ని అందిస్తూ నందనందనుడు త్రిభంగి గా నిలబడి వేణుగానం చేయసాగాడు. ఆ మువ్వంకల ముద్దుకృష్ణుని మురళీనినాదం వీనులవిందుగా విని వ్రేపల్లెలోని గోపికలు మైమరిచిపోయారు.
(త్రిభంగి, మువ్వొంకల భంగిమ అంటే - ఒక కాలుమీద నిలబడి రెండవ కాలు వేళ్ళు నేలను ఆనే లాగ కొంచం మడిచి నిలబడు భంగిమ, కృష్ణుడు వేణువు వాయిస్తూ నిలబడు విధము)

3-119-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తులు మఱుందులున్ సుతులు బావలు నత్తలు మామలున్ సము
న్నతి వలదన్న మానక మనంబునఁ గృష్ణపదాబ్జసేవనా
న్విరతి గోపకామినులు వేచనుదేర దయాపయోధి శో
భిగతి రాసకేళి సలిపెం దరుణీనవపుష్పచాపుడై.

టీకా:

పతులు = భర్తలు; మఱుందులున్ = మరుదులు, భర్త తమ్ముళ్ళు; సుతులు = కుమారులు; బావలు = బావలు, భర్త అన్నలు; అత్తలు = అత్తలు; మామలున్ = మామలు; సమున్నతిన్ = ఎక్కువగా, మిక్కిలిగా; వలదు = వద్దు; అన్నన్ = అన్నప్పటికిని; మానక = మానకుండా; మనంబునన్ = మనసులో; కృష్ణ = కృష్ణుని; పద = పాదములు అను; అబ్జ = పద్మముల; సేవనా = సేవింపవలెనను; అన్విత = కూడిన; రతిన్ = కోరికతో; గోపకామినులు = గోపికలు; వే = వేగముగా; చనుదేర = వచ్చినప్పుడు; దయా = దయకి; పయోధి = సముద్రము; శోభిత = శోభించు; గతిన్ = విధముగ; రాసకేళి = రాసక్రీడ; సలిపెన్ = సలిపెను; తరుణీ = యౌవనవతుల/ పడుచు పడతుల పాలిట; నవ = నవకమైన; పుష్పచాపుడు = మన్మథుడు; ఐ = అయి.

భావము:

వెళ్ళ వద్దు అని తమ భర్తలూ, మరుదులూ, కొడుకులూ, అత్తలూ, మామలూ ఎంతగానో చెప్పినా ఏమాత్రం వినకుండా మనసుల లోపల శ్రీకృష్ణుని పాదపద్మాలను ఆరాధించాలనే ఆరాటం అధికం కావటంతో గోపికలు పరుగు పరుగున వచ్చారు. కరుణాసముద్రుడైన శ్రీకృష్ణుడు, ఆ జవరాండ్ర పాలిట నవ మన్మథుడై రమ్యమైన రాసకేళీనాట్యంతో వారందరినీ ఆనందింపజేశాడు.

3-120-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాముఁడు దానుఁగూడి మధురాపురికిం జని యందు వైభవో
ద్దా నృపాసనంబున ముదంబున నున్న దురాత్ముఁ గంసు దు
ష్టారశత్రుఁ ద్రుంచి ముదమారఁగఁ దల్లిని దండ్రి నంచిత
శ్రీహితాత్ములై తనరఁజేసె సరోరుహనాభుఁ డున్నతిన్.

టీకా:

రాముడున్ = బలరాముడు; తానున్ = తాను; కూడి = కలసి; మధుర = మధుర అను; పురికిన్ = పట్టణమునకు; చని = వెళ్ళి; అందు = అక్కడ; వైభవ = వైభవమువలని; ఉద్దామ = ఉప్పతిల్లు; నృపాసనంబునన్ = సింహాసనమున; ముదంబునన్ = సంతోషముగ; ఉన్న = ఉన్నట్టి; దురాత్మున్ = చెడుబుద్ధి గలవానిని; కంసున్ = కంసుని; దుష్ట = దుష్టుడు ఐన; అమరశత్రున్ = రాక్షసుని; త్రుంచి = సంహరించి; ముదము = సంతోషము; ఆరన్ = నిండునట్లు; తల్లి = తల్లిని; తండ్రిన్ = తండ్రిని; అంచిత = ఒప్పుచున్న; శ్రీ = సంపదలతో నిండిన; మహిత = గొప్ప; ఆత్ములన్ = ఆత్మలు కలవారిగా; తనరన్ = సంతృప్తులను; చేసెన్ = చేసెను; సరోరుహనాభుడు = కృష్ణుడు {సరోరుహనాభుడు - సరోరుహము (పద్మము) నాబిన కలవాడు}; ఉన్నతిన్ = గొప్పగా.

భావము:

అనంతరం అన్నగారైన బలరామునితో కలిసి శ్రీకృష్ణుఢు మధురకు వెళ్ళాడు. అక్కడ మహా వైభవంగా మణిమయ సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న మదోన్మత్తుడు, దుర్మార్గుడు, దుష్ట రాక్షసుడు అయిన కంసుణ్ణి సంహరించాడు. తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని బంధవిముక్తుల్ని గావించి, భోగభాగ్యాలతో సమున్నతంగా సంతుష్టి పరిచాడు

3-121-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లువొప్పంగ షడంగ యుక్త మహితామ్నాయంబు చౌషష్టివి
ద్యలు సాందీపనిచే నెఱింగెఁ జెలువొందన్ విన్నమాత్రంబులో
నే లోకగురుండు దాన తనకున్ భావింప నన్యుల్ గురు
ల్గరే లోకవిడంబనార్థ మగు లీలల్ గావె యమ్మేటికిన్.]

టీకా:

నలువు = సామర్థ్యము; ఒప్పన్ = ఒప్పగా; షడంగ = ఆరు అంగములతో {షడంగములు – వేదము నందలి ఆరు అంగములు -1 శిక్ష 2 వ్యాకరణము 3 ఛందస్సు 4 నిరుక్తము 5 జ్యోతిషము 6 కల్పము}; యుక్త = కూడిన; మహిత = గొప్ప; ఆమ్నాయంబున్ = వేదములను; చౌషష్టి = అరువదినాలుగు; విద్యలు = విద్యలు; సాందీపని = సాందీపని {సాందీపని - కృష్ణుని గురువు}; చేన్ = నుండి; ఎఱింగెన్ = తెలిసికొనెను; చెలువు = చక్కదనము; ఒందన్ = పెంపొందగా; విన్న = వినిన; మాత్రంబు లోపలనే = మాత్రముననే; లోక = లోకమునకు; గురుడు = గురువు; తాన = అతనే; తనకున్ = అతనికి; భావింపన్ = ఆలోచిస్తే; అన్యుల్ = ఇతరులు; గురుల్ = గురువులు; కలరే = కలరాఏమి; లోక = లోకమును; విడంబన = అనుకరించు; అర్థము = కొరకు; అగు = అయిన; లీలల్ = లీలలు; కావె = కావా ఏమి; ఆ = ఆ; మేటికిన్ = సమర్థునకున్.

భావము:

శ్రీకృష్ణుడు సమస్త జగత్తు అంతటికి గురువు. సామర్థ్యము గలవాడు అయి షడంగాలతో కూడిన వేదాల్నీ, అరవైనాల్గు కళల్నీ సాందీపని అనే గురువు వద్ద అభ్యసించాడు. నిజానికి ఆ జగద్గురువునకు ఇతరులు గురువుల అవుతారా? ఇవన్నీ ఆ పరాత్పరుడు లోకాచారం కోసం చేసే లీలలు అంతే.

3-122-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మించి ప్రభాసతీర్థమున మృత్యువశంబునఁ బొంది పోయి యా
పంజనోదరస్థుఁ డగు బాలకు దేశికునందనుం బ్రభో
దంచితలీలఁ దెచ్చి గురుక్షిణగా నతిభక్తియుక్తి న
ర్పించె గురుండు చిత్తమునఁ బెంపెసలార మురారి వెండియున్.

టీకా:

మించి = అతిశయించి; ప్రభాస = ప్రభాసము అను; తీర్థమునన్ = తీర్థములో; మృత్యు = మృత్యువునకు; వశంబునన్ = లొంగిపోవుటను; పొంది = పొంది; పోయి = వెళ్ళి; ఆ = ఆ; పంచజన = పంచజనుని {పంచజనుడు - పంచజనుడు అను రాక్షసుడు}; ఉదరస్థుడు = ఉదరమున ఉన్నవాడు; అగు = అయిన; బాలకున్ = పిల్లవానిని; దేశిక = గురువు యొక్క; నందనున్ = పుత్రుని; ప్రభ = తేజస్సుతో; ఉదంచిత = ఒప్పారు; లీలన్ = లీలతో; తెచ్చి = తీసుకు వచ్చి; గురు = గురువుకొరకు; దక్షిణన్ = దక్షిణ; కాన్ = వలె; అతి = మిక్కిలి; భక్తి = భక్తితో; యుక్తిన్ = కూడి; గురుండు = గురువు; చిత్తమునన్ = మనసులో; పెంపు = అతిశయము; ఎసలారన్ = ప్రకాశించగా; మురారి = కృష్ణుడు {మురారి - ముర అను రాక్షసుని సంహరించినవాడు}; వెండియున్ = ఇంకనూ.

భావము:

చావు ముంచుకొనివచ్చిన గురుపుత్రుడు అతిశయంతో ప్రభాసతీర్థంలోకి పోయి పంచజనుని కడుపులోకి చేరాడు. అధికమైన భక్తిగలవాడై గురువు మిక్కిలి ఆనందించునట్లు ప్రకాశమానమైన తన లీలతో, మురారి ఆ పిల్లవానిని తీసుకువచ్చి, గురుదక్షిణగా సమర్పించెను.

3-123-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుఁడు విదర్భేశుఁన నొప్పు భీష్మకు-
రసుతామణి నవవారిజాక్షి
ద్మాసమానరూశ్రీవిభాసిత-
మనీయభూషణఁగంబుకంఠి
తురస్వయంవరోత్సవ సమాగత చైద్య-
సాల్వ మాగధ ముఖ్య నవరేణ్య
నిరసమావృతఁ బ్రట సచ్చారిత్ర-
రుక్మిణి నసమానరుక్మకాంతి

3-123.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మర గుప్తామృతంబు విహంగవిభుఁడు
కొనినకైవడి మనుజేంద్రకోటిఁ దోలి
మలనాభుండు నిజభుజార్వ మలరఁ
దెచ్చి వరియించె; నతని నుతింప వశమె?

టీకా:

ఘనుడు = గొప్పవాడు; విదర్భ = విదర్భ దేశమునకు; ఈశుడన్ = ప్రభువు; అనన్ = అనగా; ఒప్పు = చక్కగా ఉండు; భీష్మకు = భీష్మకుని; వర = శ్రేష్ఠ; సుతా = పుత్రికా; మణి = మణి; నవ = కొత్త; వారిజ = పద్మములవంటి; అక్షి = కన్నులు ఉన్నామె; పద్మా = లక్ష్మీదేవితో; సమాన = సమానమైన; రూప = రూపము; శ్రీ = శోభలతో; విలాసిత = ప్రకాశించునామె; కమనీయ = మనోహరమైన; భూషణ = ఆభరణములు కల; కంబు = శంఖమువంటి; కంఠిన్ = కంఠము కలామె; చతుర = వేడుకగా; స్వయంవర = స్వయంవరము అను {స్వయంవరము - కన్య తన స్వయంవర సభకు వచ్చినవారిలో తనకు నచ్చినవానిని స్వయముగ వరించుట, వివాహమాడే పద్ధతులలో ఒకటి}; ఉత్సవ = ఉత్సవమునకు; సమాగత = వచ్చిన; చైద్య = శిశుపాలుడు {చైద్య - చైద్యదేశ యువరాజు, శిశుపాలుడు}; సాల్వ = సాల్వదేశపురాజు; మాగధ = జరాసంధుడు {మాగధుడు - మగధదేశపు రాజు, జరాసంధుడు}; ముఖ్య = మొదలగు ముఖ్యమైన; జనవరేణ్య = రాజుల {జనవరేణ్యుడు - జనులచే గౌరవింపబడువాడు, రాజు}; నికర = సమూహముచే; సమ = బాగా; ఆవృతన్ = ఆవరింపబడినామె; ప్రకట = ప్రసిద్ధకెక్కిన; సత్ = మంచి; చారిత్ర = నడవడిక కలామె; రుక్మిణిన్ = రుక్మిణీదేవి; అసమాన = సాటిలేని; రుక్మ = బంగారపు; కాంతిన్ = ప్రకాశముకలామెను; అమర = దేవతలచే;
గుప్త = దాచబడిన; అమృతంబున్ = అమృతమును; విహంగవిభుడు = గరుత్మంతుడు {విహంగవిభుడు - పక్షులకు ప్రభువు, గరుత్మంతుడు}; కొనిన = తీసుకొనిన; కైవడిన్ = వలె; మనుజేంద్ర = రాజులను {మనుజేంద్రుడు - మానవులకు ప్రభువు, రాజు}; కోటిన్ = అందరను; తోలి = పారదోలి; కమలనాభుడు = కృష్ణుడు {కమలనాభుడు - కమలము నాభి యందు కలవాడు, విష్ణువు}; నిజ = తనయొక్క; భుజా = బాహు; గర్వము = బలము; అలరన్ = అతిశయింపగా; తెచ్చి = తీసుకువచ్చి; వరియించెన్ = పెండ్లాడెను; అతనిన్ = అతని(మహిమ)ని; నుతింపన్ = స్తుతించుట; వశమె = తరమాఏమి.

భావము:

విదర్భ దేశానికి అధిపతి భీష్మకుడు; ఆయన ముద్దుల కూతురు రుక్మిణి; అందమైన ఆమె కన్నులు క్రొందామర రేకులు; లక్ష్మీసమానురాలైన లావణ్యరాశి ఆమె; శుభంకరాలైన అలంకారాలతో శంఖంవంటి కంఠంతో సాటిలేని మేటి బంగారు చాయతో సంస్తవనీయమైన సత్ఫ్రవర్తనంతో విరాజిల్లే రుక్మిణికి స్వయంవరం ప్రకటించారు; ఆ స్వయంవర మహోత్సవానికి శిశుపాలుడు, సాల్వుడు, జరాసంధుడు మొదలైన రాజాధిరాజులంతా వచ్చారు. పూర్వం దేవతలు రక్షిస్తున్న అమృత కలశాన్ని పక్షిరాజైన గరుత్మంతుడు తీసుకొనిపోయాడు కదా, అలాగే భగవంతుడైన శ్రీకృష్ణుడు తన బాహుబాలాన్ని ప్రదర్శించి ఆ రాజు లందరినీ పరాజితులను చేసి రుక్మిణిని తీసుకొనివెళ్ళి పరిణయమాడారు. అటువంటి ఆ జగదేక వీరుణ్ణి పొగడడం ఎవరికి మాత్రం సాధ్యమౌతుంది.

3-124-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రువడిఁ బట్టి సప్తవృషభంబుల ముక్కులు గుట్టఁ దద్బల
స్ఫుణ సహింపఁజాలక నృపుల్ తలపడ్డ జయించి నగ్నజి
ద్ధణిపునందనన్ వికచతామరసాక్షిఁ బ్రమోదియై స్వయం
మునఁ బెండ్లియాడె గుణవంతుఁ డనంతుఁ డనంత శక్తితోన్.

టీకా:

పరువడిన్ = వరుసగా; పట్టి = పట్టుకొని; సప్త = ఏడు (7); వృషభంబులన్ = ఎద్దుల; ముక్కులున్ = ముక్కులును; కుట్టన్ = కుట్టగా; తత్ = అతని; బల = బలము యొక్క; స్ఫురణ = ప్రదర్శనను; సహింపన్ = సహించ; చాలక = లేక; నృపుల్ = రాజులు {నృపుడు - నరులను పాలించువాడు, రాజు}; తలపడ్డ = కలియబడగా; జయించి = జయించి; నగ్నజిత్ = నగ్నజిత్ అను; ధరణిపు = రాజు {ధరణిపు - భూమికి ప్రభువు, రాజు}; నందనున్ = పుత్రికను; వికచ = వికసించిన; తామరసా = పద్మములవంటి; అక్షిన్ = కన్నులు ఉన్నామెను; ప్రమోది = సంతోషముతో ఉన్నవాడు; ఐ = అయి; స్వయంవరమునన్ = స్వయంవరములో {స్వయంవరము - కన్య తన స్వయంవర సభకు వచ్చినవారిలో తనకు నచ్చినవానిని స్వయముగ వరించుట}; పెండ్లి = పెండ్లి; ఆడెన్ = ఆడెను; గుణవంతుడు = కృష్ణుడు {గుణవంతుడు - సుగుణములు కలవాడు, కృష్ణుడు}; అనంతడు = కృష్ణుడు {అనంతుడు - అంతమన్నది లేనివాడు, విష్ణువు}; అనంత = మిక్కిలి; శక్తి = బలము; తోన్ = తో.

భావము:

ఏడు మదించిన ఆబోతులను శ్రీకృష్ణుడు ఎదురొడ్డి తన అపారమైన శక్తితో ఆ ఆబోతులకు ముక్కుతాళ్ళు బిగించి వాటిని లొంగదీసుకొన్నాడు. శ్రీకృష్ణుని పరాక్రమమును సహింపజాలని రాజులు తనతో తలపడగా వారిని జయించి, వికసించిన తామరరేకులవంటి కన్నులు గల రాజపుత్రి నాగ్నజిత్తిని గుణవంతుడూ, అనంతుడూ, అనంత శక్తిమంతుడూ అయిన గోపాలకృష్ణుడు సంతోషంతో స్వయంవరంలో పెండ్లాడాడు.

3-125-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రతివీరక్షయకారి నాబరఁగి సత్రాజిత్తనూజాహృదీ
ప్సిముం దీర్పఁ దలంచి నాకమునకుం బెంపారఁగా నేగి వ
ర్ణిశౌర్యోన్నతిఁ బారిజాత మిలకున్ లీలాగతిం దెచ్చె ను
ద్ధతి దేవేంద్రు జయించి కృష్ణుఁ డన నేన్మాత్రుఁడే చూడగన్.

టీకా:

ప్రతివీర = విరోధికి; క్షయ = నాశనము; కారి = కలిగించినవాడు; నాన్ = అనగా; పరగి = ప్రసిద్ధికెక్కి; సత్రాజిత్ = సత్రాజిత్తు యొక్క; తనూజా = పుత్రిక; హృది = మనసులోని; ఈప్సితమున్ = కోరికను; తీర్పన్ = తీర్చవలెనని; తలంచి = అనుకొని; నాకమున = స్వర్గమున; కున్ = కి; పెంపారగా = అతియించి; ఏగి = వెళ్శి; వర్ణిత = స్తుతింపబడిన; శౌర్య = శౌర్యపు; ఉన్నతిన్ = గొప్పదనముతో; పారిజాతమున్ = పారిజాతమును; ఇల = భూమి; కున్ = కి; లీలా = లీల; గతిన్ = వలె; తెచ్చె = తెచ్చెను; ఉద్ధతిన్ = శౌర్యమొప్పగా; దేవేంద్రున్ = దేవేంద్రుని; జయించి = జయించి; కృష్ణుడు = కృష్ణుడు; అనన్ = అనగా; ఏతన్మాత్రడే = సామాన్యుడా ఏమి; చూడగన్ = తరచిచూచినచో.

భావము:

శత్రువీరులకు సింహస్వప్నంగా పేరుగాంచిన యదుసింహుడు శ్రీకృష్ణుడు. ఆయన సత్యభామ మనస్సులోని కోరికను తీర్చడంకోసం స్వర్గానికి జైత్రయాత్ర సాగించి ప్రశంసనీయమైన పరాక్రమాతిశయంతో ఇంద్రుణ్ణి జయించి పారిజాతాన్ని అవలీలగా స్వర్గలోకంనుండి భూలోకానికి తీసుకొచ్చాడు. అటువంటి జగన్మాన్యుడు కృష్ణుడు సామాన్యుడు కాదు.

3-126-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానితాఖిల జగన్మయ దేహమునఁ బొల్చు-
రణిదేవికిఁ బ్రియనయుఁ డైన
రకదానవుని సునాభాఖ్యఁ జెన్నొందు-
న చక్రధారా విఖండితోత్త
మాంగునిఁ జేయ నయ్యవనీలలామంబు-
వేఁడినఁ దత్పుత్రు విపులరాజ్య
దమున నిల్పి లోలి మందిరంబులఁ-
జిరముగ నరకుండు సెఱలఁ బెట్టి

3-126.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి కన్యలు నూఱుఁబదాఱువేలు
నార్తభాంధవుఁడైన పద్మాక్షుఁ జూచి
ర్షభాష్పాంబుధారా ప్రర్ష మొదవఁ
బంచశరబాణ నిర్భిన్నభావ లగుచు.

టీకా:

మానిత = గౌరవింపదగినదియై; అఖిల = సమస్తమైన; జగత్ = లోకములతో; మయ = కూడిన; దేహమునన్ = శరీరముతో; పొల్చు = ప్రకాశించు; ధరణీదేవి = భూదేవి; కిన్ = కి; ప్రియ = ఇష్టమైన; తనయుడు = పుత్రుడు; ఐన = అయినట్టి; నరక = నరకుడు అను; దానవునిన్ = రాక్షసుని; సునాభ = సునాభము అను; ఆఖ్యాతన్ = పేరుగన్నట్టి; చెన్నొందు = ప్రకాశించు; ఘన = గొప్ప; చక్ర = చక్రము యొక్క; ధారా = పదునుతో; విఖండిత = ఖండింపబడిన; ఉత్తమాంగునిన్ = శిరస్సు కలవానిని; చేయన్ = చేయగా; ఆ = ఆ; అవనీ = భూ; లలామంబు = దేవి; వేడినన్ = కోరగా; తత్ = అతని; పుత్రున్ = కోడుకును; విపుల = విస్తారమైన; రాజ్య = రాజ్య; పదమున = అధికారమున; నిల్పి = ఉంచి; లోపలిమందిరంబులన్ = అంతఃపురమున; చిరముగన్ = చాలాకాలముగ; నరకుండు = నరకుడు; చెఱలన్ = చెరసాలలో; పెట్టిన = బంధించిన; అట్టి = అటువంటి;
కన్యలు = స్త్రీలు; నూఱుబదాఱువేలున్ = పదహారువేలఒకవందమందిని (16100); ఆర్త = ఆర్తులను, దుఃఖితులను; బాంధవుడు = కాపాడువాడు; ఐన = అయినట్టి; పద్మాక్షున్ = కృష్ణుని {పద్మాక్షుడు - పద్మములవంటి కన్నులు ఉన్నవాడు, కృష్ణుడు}; చూచి = చూసి; హర్ష = ఆనందపు; బాష్పాంబు = కన్నీటి; ధారా = ధారలు అను; ప్రవర్షము = పెద్దవర్షము; ఒదవన్ = కలుగగా; పంచశర = మన్మథుని {పంచశర - ఐదు బాణముల వాడు, మన్మథుడు}; బాణ = బాణములచే; నిర్భిన్నలు = బాగాగాయపడినవారు; అగుచున్ = అవుతూ.

భావము:

సమస్త జీవులకు అంతర్లీనమైన రూపం ధరించి గౌరవాన్ని అందుకొనే భూదేవికి ప్రియమైన కుమారుడు నరకుడు. అయినా వాడు రాక్షస లక్షణాలు కలవాడు కావడంతో శ్రీకృష్ణుడు “సునాభము” అనే పేరుగల చక్రము అంచుతో అతని శిరస్సును ఖండించాడు. అనంతరం ధరణీమాత ప్రార్థించగా అతని కుమారుణ్ణి ఆ విశాల సామ్రాజ్యానికి అధిపతిగా చేసాడు. ఆ నరకాసురుని అంతఃపురంలోని చెరసాలలో చిరకాలంగా మ్రగ్గుతున్న పదహారువేల నూరుగురు కన్యలూ ఆర్తజన రక్షకుడైన కృష్ణుని వీక్షించి, అనురాగయుక్తులౌతూ ప్రమోదబాష్పాలు వర్షించారు.

3-127-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లితఁ దదీయ సుందర విలాస విమోహితలైన వారినిం
బొసిన గోర్కిఁదీర్చుటకు నొక్కముహూర్తమునన్ వరించి క
న్య లలితావరోధభవనంబుల నందఱ కన్నిరూపులై
సి సుఖస్థితిం దనిపెఁ గాంతల భక్తినితాంతచిత్తలన్.

టీకా:

లలితన్ = సౌకుమార్యముతో; తదీయ = అతని; సుందర = అందమైన; విలాస = శృంగారములకు; విమోహితులు = బాగా మోహింపబడిన వారు; ఐన = అయినట్టి; వారినిం = వారిని; పొలసిన = వికసించిన; కోర్కిన్ = కోరికను; తీర్చుటకున్ = తీర్చుటకోసము; ఒక్క = ఒక్క; ముహూర్తమునన్ = సమయమున; వరించి = పెండ్లాడి; కన్యలన్ = కన్యలను; లలిత = అందమైన; అవరోధభవనంబులన్ = అంతఃపురములలో; అందఱ = అందర; కున్ = కు; అన్ని = అన్ని; రూపులు = స్వరూపములు కలవాడు; ఐ = అయి; కలసి = కూడి; సుఖ = సుఖమైన; స్థితిన్ = స్థితులలో; తనిపెన్ = సంతృప్తులజేసె; కాంతలన్ = స్త్రీలను; భక్తి = భక్తితో; నితాంత = పూర్తిగ నిండిన; చిత్తలన్ = మనసులు కలవారిని.

భావము:

. తన సౌందర్యవిలాసాలకు వ్యామోహం చెందిన ఆ పదహారువేల నూరుగురు సుందరీమణుల కోర్కె తీర్చుటకోసం, అందాలరాశి నందనందనుడు అయిన కృష్ణుడు ఒక్క సుముహూర్తలోనే వారందరినీ పెండ్లాడాడు. అత్యంత మనోహరాలైన అంతఃపురాలలో అందరికీ అన్ని రూపులు ధరించిన వాడై, అంతులేని అనురాగంతో నిండిన మనసులు గల ఆ కాంతామణులను సంతోషపరచాడు.

3-128-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తురతతో నందొక్కొక
తివకుఁ బదురేసి సుతుల నాత్మసముల ను
న్నభుజశక్తులఁ గాంచెను
వితంబై కీర్తి దిశల వినుతుకి నెక్కన్.

టీకా:

చతురత = విలాసము, నేర్పరితనము; తోన్ = తో; అందున్ = అందలి; ఒక్కొక్క = ఒక్కో; అతివ = స్త్రీ; కున్ = కి; పదురు = పదిమంది; ఏసి = చొప్పున; సుతులన్ = పుత్రులను; ఆత్మ = తనతో; సములను = సమానమైనవారిని; ఉన్నత = గొప్ప; భుజ = బాహు; శక్తులన్ = బలము కలవారిని; కాంచెన్ = కలిగించెన్; వితతంబు = విస్తరించినది; ఐ = అయి; కీర్తి = కీర్తి; దిశలన్ = దిక్కులకు; వినుతి = ప్రసిద్ది; కిన్ = కి; ఎక్కగా = చెందగా.

భావము:

చతురకళానిధి అయిన శ్రీకృష్ణుడు ఒక్కొక్క భార్యకు తనకు సాటి అయిన మేటి పరాక్రమం గల కుమారులను పదిమంది చొప్పున ప్రసాదించాడు. నలుదిశలా విశాలమైన యశోదీప్తులు నిండించాడు.

3-129-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధురాపురముఁ జతుర్వి బలౌఘములతో-
నావరించిన కాలవన సాల్వ
గధభూపాలాది నుజేంద్ర లోకంబు-
సైన్యయుక్తముగాఁగ సంహరించి
న బాహుశక్తిఁ జిత్తముల నర్థించిన-
భీపార్థులకు నుద్దా విజయ
మొసఁగి తద్వైరులనుక్కడంగఁగఁ ద్రుంచి-
బాణ శంబర ముర ల్వలాది

3-129.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుజనాయక సేనావితానములను
లధరాది సమేతుఁడై తులఁ జేసె
దంతవక్త్రాది దైత్యులు న్ను నెదుర
భండనములోనఁ ద్రుంచె దోర్బలము మెఱసి.

టీకా:

మధురా = మధుర అను; పురమున్ = పట్టణమును; చతుర్విధ = చతురంగ {చతుర్విధబలములు - చతురంగబలములు - రథ గజ అశ్వ పదాతి దళములు అను నాలుగు సైన్య విభాగముల - ఇంకొకవిధమున - చతుర్విధబలములు - బాహు మనో ధన మరియు బంధు బలములు}; బల = సైన్య; ఓఘముల = సమూహములు; తోన్ = తో; ఆవరించినన్ = చుట్టుముట్టిన; కాలయవన = కాలయవనుడు; సాల్వ = సాల్వుడు; మగధభూపాల = జరాసంధుడు {జరాసంధుడు - మగధ దేశపురాజు}; ఆది = మొదలైన; మనుజేంద్ర = రాజుల {మనుజేంద్రుడు - మానవులకు ఇంద్రుడు, రాజు}; లోకంబున్ = సమూహములు; సైన్య = సైన్యముతో; యుక్తము = కూడినవారుగా; కాగ = అయిన అందరను; సంహరించి = చంపి; తన = తనయొక్క; బాహు = భుజ; శక్తిన్ = బలము; చిత్తములన్ = మనసున; అర్థించిన = కోరిన; భీమ = భీముడు; పార్థుల = అర్జునుల; కున్ = కి; ఉద్దామ = ఉన్నతమైన; విజయమున్ = విజయమును; ఒసగి = ఇచ్చి; తత్ = వారి; వైరులన్ = శత్రువులన; ఉక్కు = శౌర్యము; అడగంగ = అణగునట్లు; త్రుంచి = సంహరించి; బాణ = బాణుడు; శంబర = శంబరుడు; ముర = ముర; పల్వల = పల్వలుడు; ఆది = మొదలైన;
దనుజ = రాక్షస; నాయక = నాయకుల; సేనా = సేనా; వితానములను = సమూహములను; హలధర = బలరామునితో {హలధర - నాగలి ధరించువాడు, బలరాముడు}; ఆది = మొదలగు వారితో; సమేతుడు = కూడినవాడు; ఐ = అయ్యి; హతులన్ = చనిపోయినవారుగా; చేసెన్ = చేసెను; దంతవక్త్ర = దంతవక్త్రుడు; ఆది = మొదలైన; దైత్యులు = రాక్షసులు; తన్ను = తనను; ఎదుర = ఎదిరించగా; భండనము = రణము; లోనన్ = లో; త్రుంచెన్ = సంహరించెను; దోర్బలము = భుజబలము; మెఱసి = అతియింపగా.

భావము:

కాలయవనుడు, సాల్వుడు, జరాసంధుడు మొదలైన రాజులు అందరూ, చతురంగ బలాలతో కూడి మథురాపురాన్ని చుట్టుముట్టారు. ఆ రాజలోకాన్ని సేనానీకంతో సహా శ్రీకృష్ణుడు సంహరించాడు. మనస్ఫూర్తిగా తన అండదండలను అర్థించిన భీమార్జునులకు సాటిలేని విజయశ్రీని సమకూర్చాడు. మదోన్మత్తులైన వారి శత్రువులను తుదముట్టించాడు. బలరాముణ్ణి వెంటబెట్టుకొని బాణుడు, శంబరుడు, మురుడు, పల్వలుడు అనే రాక్షస నాయకుల్ని, సేనలతో సహా నేలకూల్చాడు. కదనరంగంలో ఎదిరించిన దంతవక్త్రుడు మొదలైన దానవుల్ని అవక్రవిక్రమంతో సంహరించాడు.

3-130-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెండియుం, గృష్ణుండు గౌరవపాండవ భండనంబునకుం దోడ్పడి రాజన్యు లన్యోన్య మాత్సర్యోత్సహ సమేతులై సైనికపాదఘట్టనంబుల ధరాచక్రంబు గంపింప నసమాన్యంబు లయిన శంఖభేరీ ప్రముఖ తూర్యఘోషంబులు నింగి మ్రింగఁ దురంగమరింఖాసముద్ధూత ధూళిపటల పరిచ్ఛన్న భానుమండలంబునుంగాఁ జనుదెంచి కురుక్షేత్రంబున మొహరించిన నుభయపక్షంబులం దునుమాడి; నిఖిలరాజ్యవైభవ మదోన్మత్తుం డైన సుయోధనుండు నిఖిల రాజసమక్షంబునఁ గర్ణ శకుని దుశ్శాసనాదుల దుర్మంత్రంబున నిరంతరంబుఁ గుంతీనందనుల కెగ్గుసేసిన దోషంబునంజేసి సంగరరంగంబున భీముగదాఘాతంబునం దొడలు విరిగి పుడమింబడి గతాయుశ్శ్రీవిభవుండై యుండఁ జూచినం గదా పరితుష్టచిత్తుండ నగుదు; నని యపరిమిత బాహుబలోత్సాహు లైన భీష్మ ద్రోణ భీమార్జునులచేత నఖిల ధరాధిపతుల నష్టాదశాక్షౌహిణీ బలంబులతోడం దునిమించె; మఱియు స్వసమాన బలులయిన యదువీరుల జయింప నెంతవారలకైనం దీరదని మధుపానమద విఘూర్ణిత తామ్రలోచనులై వర్తించు యాదవుల కన్యోన్యవైరంబులు గల్పించి పోరించి యితరేతర కరాఘాతంబుల హతులై తన్నుఁ గలసినం గాని భూభారంబుడగ దని చిత్తంబునఁ దలంచి; యంత ధర్మనందనునిచే నిస్సపత్నం బగు రాజ్యంబు పూజ్యంబుగాఁ జేయించుచు మర్త్యులకుం గర్తవ్యంబులైన ధర్మపథంబులు సూపుచు బంధుమిత్రుల కెల్లఁ బరితోషంబు నొందించుచుం దత్పరోక్షంబున వారివంశం బుద్ధరింపఁ దలంచి యభిమన్యువలని నుత్తరయందు గర్భంబు నిలిపి గురుతనయప్రయుక్త మహిత బ్రహ్మాస్త్రపాతంబునం దద్గర్భదళనంబు గాకుండ నర్భకుని రక్షించి నిజపదారవింద సేవారతుం డై న ధర్మసుతుచేఁ గీర్తి ప్రతాపంబులు నివ్వటిల్లం దురంగమేధంబులు మూఁడు సేయించి; వెండియు.

టీకా:

వెండియున్ = తరువాత; కృష్ణుండు = కృష్ణుడు; కౌరవ = కౌరవ; పాండవ = పాండవుల; భండనమున = యుద్ధమున; కున్ = కు; తోడ్పడి = సహకరించి; రాజన్యులు = రాజులు; అన్యోన్య = వారిలోవార; మాత్సర్య = ఈర్ష్యతో; ఉత్సాహ = ఉత్సాహముతోను; సమేతులు = కూడినవారు; ఐ = అయి; సైనిక = సైనికుల; పాద = కాళ్ల; ఘట్టనంబులన్ = తొక్కిడిలవలన; ధరా = భూ; చక్రంబున్ = చక్రము; కంపింపన్ = వణికిపోగా; అసమాన్యంబులు = సాటిలేనివి; అయిన = అయినట్టి; శంఖ = శంఖములు; భేరీ = భేరీలు {భేరీ - పెద్ద డప్పు వంటి వాయిద్యము}; ప్రముఖ = మొదలగు ముఖ్యమైన; తూర్య = వాయిద్యముల; ఘోషంబులు = శబ్దములు; నింగిన్ = ఆకాశమును; మ్రింగన్ = ఆక్రమించగా; తురంగ = గుఱ్ఱముల; రింఖా = గిట్టలచే; సముద్ధూత = ఎగరగొట్టబడిన; ధూళి = ధూళి; పటల = పొరలచే; పరిఛ్ఛన్న = కప్పబడిన; భాను = సూర్య; మండలంబునున్ = బింబముకలది; కాన్ = అవ్వగా; చనుదెంచి = వచ్చి; కురుక్షేత్రంబునన్ = కురుక్షేత్రమునందు {కురుక్షేత్రము - హస్తినాపురమునకు దగ్గరలోని ఒక ప్రదేశము}; మొహరించిన = చేరిన; ఉభయ = రెండు; పక్షంబులన్ = వైపుల వారిని; తునుమాడి = సంహరించి; నిఖిల = సమస్తమైన; రాజ్య = రాజ్య; వైభవ = వైభవమువలని; మద = గర్వముతో; ఉన్మత్తుడు = పిచ్చెక్కిన; ఐన = అయినట్టి; సుయోధనుండు = దుర్యోధనుడు; నిఖిల = సమస్తమైన; రాజ = రాజుల; సమక్షంబునన్ = ఎదుట; కర్ణ = కర్ణుడు; శకుని = శకుని; దుశ్శాసన = దుశ్శాసనుడు; ఆదుల = మొదలైనవారి; దుర్మంత్రంబునన్ = కుట్రతో; నిరంతరంబున్ = ఎప్పుడూ; కుంతీ = కుంతీదేవి; నందనుల = పుత్రుల; కున్ = కి; ఎగ్గు = అపకారములు; చేసిన = చేసిన; దోషంబునన్ = తప్పుల; చేసి = వలన; సంగర = యుద్ధ; రంగంబునన్ = భూమిలో; భీము = భీముని; గదా = గదయొక్క; ఘాతంబునన్ = దెబ్బలువలన; తొడలు = తొడలు; విరిగి = విరిగి; పుడమిన్ = భూమిమీద; పడి = పడి; గత = నష్టమైన; ఆయుస్ = అయుష్షు; శ్రీ = సంపద; విభవుండు = వైభవము కలవాడు; ఐ = అయి; ఉండన్ = ఉండగా; చూచినన్ = చూస్తే; కదా = కదా; పరితుష్ట = తృప్తిచెందిన; చిత్తుండను = మనసుకలవాడను; అగుదును = అవుతాను; అని = అని; అపరిమిత = పరిమితిలేని; బాహు = భుజ; బల = బలముతో; ఉత్సాహులు = ఉత్సాహవంతులు; ఐన = అయిన; భీష్మ = భీష్ముడు; ద్రోణ = ద్రోణుడు; భీమ = భీముడు; అర్జునుల = అర్జునులు; చేతన్ = చేత; అఖిల = సమస్తమైన; ధరాధిపులన్ = రాజులను {ధరాధిపుడు - భూమికి ప్రభువు, రాజు}; అష్టాదశ = పద్దెనిమిది; అక్షౌహిణీ = అక్షౌహిణుల {అక్షోహిణి - ఇరవైఒక్కవేల ఎనిమిదివందల డెబ్బై (21,870) రథములు, అన్ని ఏనుగులు, అరవైయైదువేల నాలుగువందల పది (65,410) గుఱ్ఱాలు, లక్షా తొమ్మిదివేల మూడు వందల యాభై (1,09,350) కాల్బలమును కల సేనావిశేషము}; బలంబుల = బలముల; తోడన్ = తోటి; దునిమించె = సంహరింపజేసి; మఱియున్ = ఇంకా; స్వ = తనతో; సమాన = సమానమైన; బలులు = బలముకలవారు; అయిన = అయినట్టి; యదు = యాదవ; వీరులన్ = వీరులను; జయింపన్ = జయించుటకు; ఎంతవారల = ఎంతవారి; కైనన్ = కైననూ; తీరదు = వీలుకాదు; అని = అని; మధు = మద్యము; పాన = తాగుటవలని; మద = మదముతో; విఘూర్ణత = మిక్కిలితిరుగుచున్న; తామ్ర = ఎఱ్ఱని; లోచనులు = కన్నులు ఉన్నవారు; ఐ = అయి; వర్తించి = ప్రవర్తిస్తున్న; యాదవుల = యాదవుల; కిన్ = కి; అన్యోన్య = వారిలోవారికి; వైరంబులు = శత్రుత్వంబులు; కల్పించి = ఏర్పరచి; పోరించి = పోట్లాడించి; ఇతరేతర = ఒకరిచే నింకొకరిని; కరా = చేతి; ఘాతంబులన్ = దెబ్బలచే; హతులు = చనిపోయినవారు; ఐ = అయి; తన్నున్ = తనను; కలసినన్ = కలసిపోతే; కాని = తప్ప; భూ = భూమి యొక్క; భారంబు = భారము; ఉడగదు = తగ్గదు; అని = అని; చిత్తంబునన్ = మనసులో; తలంచి = భావించి; అంత = అంతట; ధర్మనందనుని = ధర్మరాజు {ధర్మనందనుడు - యముని పుత్రుడు, ధర్మరాజు}; చేన్ = చేత; నిస్సపత్నంబు = శత్రువులు లేనిది; అగు = అయిన; రాజ్యంబున్ = రాజ్యమును; పూజ్యుంబుగా = పూజనీయంబుగా; చేయించుచు = చేయిస్తూ; మర్త్యుల = మానవుల; కున్ = కు; కర్తవ్యంబులు = చేయవలసిన పనులు; ఐన = అయిన; ధర్మ = ధర్మబద్ధమైన; పథంబున్ = మార్గమును; చూపుచున్ = చూపిస్తూ; బంధు = బంధువుల; మిత్రుల = స్నేహితుల; కున్ = కి; పరితోషంబున్ = సంతోషమును; ఒందించుచున్ = కలిగిస్తూ; తత్ = వారి; పరోక్షంబునన్ = లేనప్పుడు, తరువాత; వారి = వారి; వంశమున్ = వంశమును; ఉద్ధరింపన్ = కాపాడువలెనని; తలంచి = నిశ్చయించుకొని; అభిమన్యు = అభిమన్యుని {అభిమన్యుడు - అర్జునునికి ఉత్తరకు జన్మించిన పుత్రుడు}; వలన = వలన; ఉత్తర = ఉత్తర {ఉత్తర - అభిమన్యుని భార్య}; అందు = కి; గర్భంబు = గర్భము; నిలిపి = నిలబెట్టి; గురుతనయ = అశ్వత్థామచే {గురుతనయ - గురువు ద్రోణుని పుత్రుడు, అశ్వత్థామ}; ప్రయుక్త = ప్రయోగింపబడిన; మహిత = గొప్ప; బ్రహ్మాస్త్ర = బ్రహ్మాస్త్రము యొక్క; పాతంబునన్ = దెబ్బ వలన; తత్ = ఆ; గర్భ = గర్భము; దళనంబు = విఛ్ఛిత్తి; కాకుండ = అవ్వకుండగ; అర్భకుని = పిల్లవానిని; రక్షించి = కాపాడి; నిజ = తన; పాదా = పాదములు అను; అరవింద = పద్మములను; సేవా = సేవించుట యందు; రతుండు = లగ్నమైనవాడు; ఐన = అయినట్టి; ధర్మసుతు = ధర్మరాజు {ధర్మసుతుడు - యముని పుత్రుడు, ధర్మరాజు}; చేన్ = చేత; కీర్తి = కీర్తియు; ప్రతాపంబులున్ = ప్రతాపములు; నివ్వటిల్లన్ = అతిశయించగా; తురంగమేధంబులు = అశ్వమేధయాగములు; మూడున్ = మూడు (3); చేయించి = చేయించి; వెండియు = ఇంకనూ.

భావము:

దుర్యోధనుడు సమస్త మహీరాజ్య మహా సంపత్తి వలన మదోన్మత్తుడు అయ్యాడు. కర్ణ, శకుని, దుశ్శాసనుల దురాలోచనలూ, దుర్భోధలూ తలకెక్కి, తెగనిక్కి పాండవులకు తగని, ఎడతెగని ఎన్నెన్నో ఎగ్గులు చేసాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా సంగ్రామంలో భీముని ప్రచండ గదా ఘాతంతో తొడలు విరిగి, ప్రాణాలు సురిగి, రాజ్యం పోయి, ప్రతిష్ఠ గోల్పోయి, భూమిమీద పొరలాడుతున్న రారాజును చూడాలని వేడుక కలిగింది శ్రీకృష్ణునికి కౌరవపాండవుల పోరాటం నిశ్చయ మయింది. ఉభయ పక్షాల రాజులూ పెచ్చుపెరిగిన మత్సరంతో ఉరకలు వేసే ఉత్సాహంతో కురుక్షేత్రంలో యుద్ధానికి సన్నద్ధులై నిలిచారు. సైనికుల పాద ఘట్టనలకు భూమి కంపించింది. శంఖధ్వానాలకూ భేరీపటహాది వాద్యధ్వనులకూ ఆకాశం దద్దరిల్లింది. గుఱ్ఱాల డెక్కల తొక్కిడికి రేగిన పరాగపటలాలు సూర్యమండలాన్ని కప్పివేశాయి.
ఒకరి చేతిలో మరొకరు చొప్పున చచ్చి తనలో చేరితే తప్ప భూభారం తగ్గదు అనుకొన్నాడు శ్రీకృష్ణుడు. అపారపరాక్రమోపేతులూ, అపరిమితోత్సాహ సమేతులూ అయిన భీష్మ ద్రోణులను ఒక పక్షంలోనూ, భీమార్జునులను ఒక పక్షంలోనూ నిలిపి మదోన్మతులైన మహీపతులతోపాటు పదునెనిమిది అక్షౌహిణుల సైన్యాన్ని సైతం చంపించాడు. తనతో సమానమైన బలం గల యాదవ యోధుల్ని నిర్జించటం ఎంత బలవంతులకైనా సాధ్యం కాదు. అందువల్ల మద్యపానంవల్ల మత్తెక్కి గిరగిర తిరుగుతూ ఎఱ్ఱబడిన కన్నులతో కన్నుమిన్ను గానని యదువీరులకు వారిలో వారికే వైరాలు పెట్టించి, పోరాటాలు పుట్టించి తుదకు అందరినీ తుదముట్టించాడు. అలా అన్యోన్యం కొట్టుకొని మరిణించి తనలో చేరితేనే కాని భూభారం తగ్గదని భావించిన వాసుదేవుడు ధర్మరాజుచే నిష్కంటకమైన రాజ్యాన్ని ప్రశంసనీయంగా పాలింపజేశాడు. మానవులకు ఆవశ్యకాలైన ధర్మమార్గాలను ప్రతిష్ఠించాడు. బంధువులకూ, మిత్రులకూ పరమానందాన్ని కలిగించాడు. పాండవ వంశాన్ని నిలుపదలచి అభిమన్యుడి అర్ధాంగీ అయిన ఉత్తర గర్భాన్ని రక్షించాడు. అశ్వత్థామ ప్రయోగించిన అమోఘమైన బ్రహ్మాస్త్రం వల్ల ఆమె గర్భంలోని అర్భకుడికి హాని కలుగకుండా కాపాడాడు. తన చరణ కమలసేవా పరాయణుడైన ధర్మతనయుడు ధర్మరాజు పేరు ప్రతిష్ఠలు, శౌర్యసాహసాలు ప్రకటితం అయ్యేలా ఆయన చేత మూడు అశ్వమేధ యాగాలు చేయించాడు.

3-131-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లనొప్ప లౌకికవైదికమార్గముల్-
డపుచు ద్వారకాగర మందు
విదితాత్మీయమాయా ప్రభావమున ని-
స్సంగుఁడై యుండి సంసారిపగిదిఁ
జెంది కామంబులచేత విమోహితుం-
డై సుఖించుచు ముదితాత్ముఁ డగుచు
నంచిత స్నిగ్ధస్మితావలోకముల సు-
ధాపరిపూర్ణసల్లాపములను

3-131.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీనికేతనమైన శరీరముననుఁ
బాండునందన యదుకుల ప్రకరములను
లీలఁ గారుణ్య మొలయఁ బాలించుచుండె
నార్తరక్షాచణుండు నారాయణుండు.

టీకా:

వలనొప్ప = తగిన నేర్పుతో; లౌకిక = లౌకికమైన {లౌకిక - లోకమునకు సంబంధించిన}; వైదిక = వైదికమైన {వైదిక - వేదములకు సంబంధించిన}; మార్గముల్ = పద్ధతులు; నడపుచూ = చేస్తూ; ద్వారకా = ద్వారక అను; నగరము = పట్టణము; అందు = లో; అవిదిత = స్పష్టముగా తెలియని; ఆత్మీయ = స్వంత; మాయా = మాయ యొక్క; ప్రభావమున = ప్రభావముతో; నిస్సంగుడు = ఎట్టి సంగము లేనివాడు; ఐ = అయ్యి; ఉండి = ఉండి; సంసారి = సంసారమున ఉన్నవాని; పగిదిన్ = విధమును; చెంది = చెంది; కామమంబులు = కోరికల; చేత = చేత; విమోహితుండు = బాగా మోహింపబడినవాడు; ఐ = అయ్యి; సుఖించుచు = సుఖిస్తూ; ముదిత = సంతోషించిన; ఆత్ముడు = మనసు కలవాడు; అగుచున్ = అవుతూ; అంచిత = చక్కటి; స్నిగ్ధ = స్నేహపూరిత; స్మిత = చిరునవ్వులతోకూడిన; అవలోకనములన్ = చూపులును; సుధా = అమృతము; పరిపూర్ణ = నిండిన; సల్లాపములును = చక్కటి సంభాషణలును;
శ్రీ = శౌభాగ్యమునకు; నికేతనము = నివాసాస్పదము; ఐన = అయినట్టి; శరీరమునను = శరీరముతోను; పాండునందన = పాండవుల {పాండునందనులు - పాండురాజు పుత్రులు, పాండవులు}; యదుకుల = యాదవవంశస్థుల; ప్రకరములను = సమూహములను; లీలన్ = లీలగా; కారుణ్యము = దయ; ఒలయ = ఉట్టిపడుతుండగ; పాలించుచు = పాలిస్తూ; ఉండెన్ = ఉండెను; ఆర్త = ఆర్తులను; రక్షా = రక్షించు; చణుండు = సామర్థ్యముగలవాడు; నారాయణుండు = కృష్ణుడు {నారాయణుడు - నారముల ఉండువాడు, విష్ణువు}.

భావము:

భక్త రక్షణ దీక్షా పరాయణుడైన శ్రీమన్నారాయణుడు ద్వారకా పట్టణంలో నివసిస్తూ వైదికములూ, లౌకికములూ అయిన సదాచారాలను సక్రమంగా చక్కగా నిర్వహిస్తూ తన మాయామహత్త్వం అభివ్యక్తం కాకుండా ప్రవర్తించాడు. ఏమీ అంటనివాడై కూడా సంసారిలాగా, కోరికలకు ఆకర్షితుడైన వాని లాగా, భోగభాగ్యాలతో నిత్య సంతోషి అయి ఉన్నాడు. సౌందర్యలక్ష్మికి మందిరమైన దేహంతో, అతిశయించిన స్నేహంతో, చిరునవ్వుల విరిసే కడగంటి చూపులతో, అమృతం కురిసే సరససల్లాపాలతో ఇటు పాండవులనూ, అటు యాదవులనూ ఆనందింపజేస్తూ కరుణతో లాలించి పాలించాడు.

3-132-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సంపూర్ణపూర్ణిమా చంద్రచంద్రిక నొప్పు-
మణీయశారదరాత్రు లందు
లలితకాంచనస్తంభ సౌధోపరి-
చంద్రకాంతోపలస్థలము లందు
హిత కరేణుకా ధ్య దిగ్గజముల-
తిని సౌదామినీతల నడిమి
నీలమేఘంబులలీల ముక్తాఫల-
లిత మధ్యస్థ నీముల భాతి

3-132.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

త యౌవనసుందరీయు విహారుఁ
గుచు సతు లెంద ఱందఱ న్నిరూప
ములనుఁ గ్రీడించె బెక్కబ్దములు సెలంగి
నందనందనుఁ డభినవానందలీల.

టీకా:

సంపూర్ణ = నిండు; పూర్ణిమా = పున్నమినాటి; చంద్ర = చంద్రుని; చంద్రికన్ = వెన్నెలతో; ఒప్పు = ఒప్పి ఉండు; రమణీయ = అందమైన; శారద = శరత్కాలపు; రాత్రులు = రాత్రుల; అందున్ = లో; సలలిత = మనోహరత్వముతోకూడిన; కాంచన = బంగారు; స్తంభ = స్తంభములుకల; సౌధ = మేడల; ఉపరి = పైన; చంద్రకాంత = చంద్రకాంత; ఉపల = రాళ్ళుపరచిన; స్థలములు = ప్రదేశములు; అందున్ = లో; మహిత = గొప్ప; కరేణుకా = ఆడు ఏనుగుల; మధ్య = మధ్యన నుండు; దిగ్గజముల = గొప్పఏనుగుల; గతిన్ = వలె; సౌదామినీ = మెరుపు; లతల = తీగల; నడిమి = మద్యన; నీల = నల్లని; మేఘంబు = మేఘము; లీలన్ = వలె; ముక్తాఫల = ముత్యముల; లలిత = సౌందర్యముల; మధ్యస్థ = మధ్యనగల; నీలముల = నీలమణుల; భాతిన్ = వలె;
సతత = ఎల్లప్పుడూ; యౌవన = యౌవనవయస్కులైన; సుందరీ = సుందరస్త్రీలతో; యుత = కూడి; విహారుడు = తిరుగుతుండువాడు; అగుచు = అవుతూ; సతులు = భార్యలు; ఎందఱ = ఎందరో; అందఱ = అందరి; కిన్ = కి; అన్ని = అన్ని; రూపములనున్ = రూపములతో; క్రీడించెన్ = క్రీడించెను; పెక్కు = చాలా; అబ్దముల్ = సంవత్సరములు; చెలంగి = అతిశయించి; నంద = నందుని; నందనుడు = పుత్రుడు; అభినవ = సరికొత్త; ఆనంద = విలసములతో; లీలన్ = లీలగా.

భావము:

పౌర్ణమిరోజు పండు వెన్నెల వెలుగులతో విరాజిల్లే శరత్కాల రాత్రులలోనూ, అందమైన మేలిమి బంగారు స్తంభాలు గల సౌధాల పైఅంతస్తుల్లోని చలువరాతి తిన్నెలమీదా, తరుగని తారుణ్యం, చెరగని సౌందర్యం గల అంగనలతో కూడి క్రీడించాడు. అందమైన ఆడు ఏనుగుల సమూహం మధ్య దిగ్గజాలు తిరిగినట్లు, మెరుపుతీగల నడుమ నీలిమేఘాలు విహరించినట్లు, ముత్యాల సందున ఇంద్రకాంత మణులు ప్రకాశించినట్లు అందగత్తెలు అందరికీ అన్ని రూపాలు ధరించిన నందుని కుమారుడైన శ్రీకృష్ణుడు సరికొత్త ఆనందాలతో ఎన్నో సంవత్సరాలు విహరించాడు.

3-133-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతనొక్కనాఁడు.

టీకా:

అంత = అంతట; ఒక్క = ఒక; నాడు = రోజు.

భావము:

అలా ఉండగా ఒకరోజు.

3-134-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మునివరు లేగుదేర యదుముఖ్యులు గొందఱు గూడి ముట్టఁబ
ల్కినఁ గనలొంది వారు దమకించి శపించినఁ గొన్నిమాసముల్
నునెడ దైవయోగమున జాతరఁబో సమకట్టి వేడుకల్
ములఁ దొంగిలింప గరిమన్ నిజయానము లెక్కి యాదవుల్.

టీకా:

ముని = మునులలో; వరులు = శ్రేష్ఠులు; ఏగుదేర = రాగా; యదు = యాదవులలో; ముఖ్యులు = ముఖ్యమైనవారు; కొందఱు = కొందరు; కూడి = కలిసి; ముట్టబల్కినన్ = ఎత్తిపొడుపు మాటలు పలికిన; కనలొంది = బాధపడి; వారు = వారు; తమకించి = సంభ్రమములోపడి; శపించిన = శపించిన; కొన్ని = కొన్ని; మాసముల్ = నెలలు; చనునెడ = జరుగగా; దైవ = దేవునియొక్క; యోగమునన్ = యోగము వలన; జాతరన్ = జాతరకోసం; పోన్ = వెళ్ళుటకు; సమకట్టి = సంకల్పించుకొని; వేడుకల్ = వేడుకలు; మనములన్ = మనసులందు; తొంగిలింప = వికసింపగా; గరిమన్ = గొప్పగా; నిజ = తమ; యానములు = వాహనములు; ఎక్కి = ఎక్కి; యాదవుల్ = యాదవులు.

భావము:

ఇలా ఉండగా కొంతమంది మునీశ్వరులు ద్వారకా నగరానికి వచ్చారు. అప్పుడు కొందరు యాదవ కుమారులు వారిని చుట్టుముట్టి ఎత్తిపొడుపు మాటలతో వారి మనస్సు నొప్పించారు. అందుకు వారు ఆగ్రహించి ఘోరంగా శపించారు. కొన్ని మాసాలు గడిచిన పిమ్మట, దైవయోగం వల్ల యాదవు లంతా ఒక పెద్ద ఉత్సవం చేయాలని తలపెట్టారు. మిక్కిలి కుతూహలంతో కూడిన అంతరంగాలతో పొంగిపోతూ, తమతమ వాహనా లెక్కి జాతరకోసం ప్రయాణమయ్యారు.

3-135-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కోరి ప్రభాసతీర్థమునకుం జని తన్నదిఁ గ్రుంకి నిర్మలో
దాత నందు దేవ ముని ర్పణముల్ పితృతర్పణంబులున్
వాని భక్తిఁ జేసి నవత్సలతోఁ బొలుపారు గోవులన్
భూరిసదక్షిణాకముగ భూసురకోటికి నిచ్చి వెండియున్.

టీకా:

కోరి = కోరికోరి; ప్రభాస = ప్రభాసము అను; తీర్థమున = తీర్థమున; కున్ = కు; చని = వెళ్ళి; తత్ = ఆ; నదిన్ = నదిలో; క్రుంకి = స్నానాలుచేసి; నిర్మల = నిర్మలమైన; ఉదారతన్ = బుద్ధితో; అందున్ = అక్కడ; దేవ = దేవతలకు; ముని = మునులకు; తర్పణముల్ = తర్పణలు; పితృ = పితృదేవతలకు; తర్పణంబులున్ = తర్పణలు; వారని = విడువని; భక్తిన్ = భక్తితో; చేసి = చేసి; నవ = లేత; వత్సల = దూడల; తోన్ = తో; పొలుపారు = ఒప్పారు; గోవులన్ = ఆవులను; భూరి = గొప్ప; దక్షిణాకముగా = దక్షిణలతోకలిపి; భూసుర = బ్రాహ్మణులకు {భూసుర - భూమికి దేవతలు, బ్రాహ్మణులు}; కోటి = సమూహముల; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చి; వెండియు = మరియు.

భావము:

అలా వెళ్ళిన యాదవులు అందరూ ప్రభాస తీర్థానికి చేరారు. ఆ నదీజలాల్లో స్నానాలు చేశారు. అరమరికలు లేని ఉదారబుద్ధితో దేవతలకూ, మహర్షులకూ, పితృదేవతలకూ తర్పణాలు విడిచారు. అపారమైన భక్తితో లేగదూడలతో కూడి ఉన్న చూడముచ్చటైన గోవులను భూరి దక్షిణలతో సహా బ్రాహ్మణులకు దాన మిచ్చారు.

3-136-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జిన పట రత్నకంబళ
త మహారజత తిల ధరావరకన్యా
తురగ రథములను స
ద్వికోటికి నిచ్చిఁ బెంపు దీపింపంగన్.

టీకా:

అజిన = లేడి చర్మములు {అజినము - లేడి మొదలైన వాని చర్మములు కట్టుకొనుటకు, ఆసనముగాను పనికి వచ్చునవి}; పట = వస్త్రములు; రత్నకంబళ = రత్నకంబళులు; రజత = వెండి; మహారజత = బంగారము; తిల = నువ్వులు; ధర = భూములు; వర = శ్రేష్ఠమైన; కన్యా = కన్యలు; గజ = ఏనుగులు; తురగ = గుఱ్ఱములు; రథములను = రథములను; సత్ = మంచి; ద్విజ = బ్రాహ్మణుల; కోటి = సమూహమున; కిని = కు; ఇచ్చి = ఇచ్చి; పెంపు = అతిశయము; దీపింపగన్ = ప్రకాశించగా.

భావము:

అనంతరం జింకచర్మాలూ, మంచి మంచి వస్త్రాలూ, రత్నకంబళ్లూ, వెండీ, బంగారమూ, నువ్వులూ, భూములూ, చక్కని కన్యలూ, ఏనుగులూ, గుఱ్ఱాలూ, రథాలు బ్రాహ్మణోత్తములకు బహూకరించారు.

3-137-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సఫలంబులైన భూదానంబు మొదలుగాఁగల దానంబు లనూనంబులుగా భగవదర్పణబుద్ధిం జేసి యనంతరంబ.

టీకా:

ఇట్లు = ఈవిధముగా; సఫలంబులు = పంటలతో కూడినవి; ఐన = అయిన; భూ = భూమి; దానంబు = దానము; మొదలుగాఁగల = మొదలైన; దానంబులన్ = దానములను; అనూనంబులు = వెలితి లేనివు; కాన్ = అగునట్లు; భగవత్ = భగవంతునికి; అర్పణ = సమర్పించు; బుద్ధిన్ = భావించి; చేసి = చేసి; అనంతరంబ = తరువాత.

భావము:

ఇలా పంటలతో కూడిన భూములు మున్నగునవి భగవంతునికే ఇస్తున్నామన్న భావంతో ఏమాత్రం వెలితి లేకుండా దానం చేశారు.

3-138-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సగు మోదంబు సంధిల్ల నిష్టమైన
సిక మృదులాన్న మర్థిఁ బాణలుసేసి
మంజులాసవరసపానత్తు లగుచుఁ
డగి యన్యోన్నహాస్యవాక్యములఁ గలఁగి.

టీకా:

ఎసగు = అతిశయించు; మోదంబు = సంతోషము; సంధిల్లన్ = కలుగగా; ఇష్టమైన = ఇష్టమైన; రసిక = రసవంతమైన; మృదుల = మృదులమైన; అన్నము = అన్నము; అర్థిన్ = కోరి; పారణలు = తృప్తిగా ఆరగించుట; చేసి = చేసి; మంజుల = మనోహరమైన; ఆసవరస = మద్యముల రసమును; పాన = తాగుటవలన; మత్తులు = మత్తెక్కిన వారు; అగుచున్ = అవుతూ; కడగి = కావాలని; అన్యోన్య = వారిలోవారు; హాస్య = వేళాకోళపు; వాక్యములన్ = మాటలు; కలంగి = విసరుకొనుచు.

భావము:

ఇలా దానధర్మాలు చేసిన తర్వాత యాదవు లందరూ సంతుష్టిగా నచ్చిన మృష్టాన్నాలను కడవునిండా తిని, మధుర మోహనమైన మద్యాలు తాగి, మత్తెక్కి మైమరిచి, పరస్పరం పరిహాసపు మాటలుతో మొదలు పెట్టి కలతలు, కలహాలు మొదలు పెట్టారు.

3-139-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దమలోన మదిరాపాన మద విఘూర్ణిత తామ్రలోచను లయి మత్సరంబుల నొండొరులం బొడిచి సమస్త యాదవులును వేణూజాతానలంబునఁ దద్వంశ పరంపరలు దహనంబు నొందు చందంబునం బొలిసి రది యంతయుం గనుంగొని శ్రీకృష్ణుం డప్పుడు.

టీకా:

ఇట్లు = ఈవిధముగ; తమలోన = తమలోతాము; మదిరా = మద్యము; పాన = తాగుటవలన; మద = మత్తెక్కి; విఘూర్ణిత = బాగాతిరుగుచున్న; తామ్ర = ఎఱ్ఱని; లోచనులు = కన్నులు ఉన్నవారు; అయి = అయి; మత్సరంబులన్ = స్పర్థలతో; ఒండొరులను = ఒకరినొకరు; పొడిచి = పోట్లాడుకొని, పొడుచుకొని; సమస్త = సమస్తమైన; యాదవులును = యాదవులందరును; వేణూ = వెదురు చెట్టున; జాతా = పుట్టిన; అనలంబునన్ = నిప్పులో; తత్ = ఆ; వంశ = వెదురు; పరంపరలు = పొదలు; దహనంబున్ = తగలబడి; ఒందు = పోవు; చందంబునన్ = విధముగ; పొలిసిరి = నశించిరి; అది = అది; అంతయున్ = అంతా; కనుంగొని = చూసి; శ్రీకృష్ణుడు = కృష్ణుడు; అప్పుడు = అప్పుడు.

భావము:

మధుపానం వలన మత్తెక్కిన వారి కళ్లు బాగా ఎరుపెక్కాయి. కళ్ళు తిరగసాగాయి. మత్సరాలు పెచ్చు పెరిగి, ఒకరి నొకరు పొడుచుకొని చచ్చారు. ఎలా అయితే వెదుళ్ళ రాపిళ్లు వల్ల ఆవిర్భవించిన అగ్నిజ్వాలల్లో వెదురు పొదలన్నీ దగ్ధమైపోతాయో, అలానే యాదవులు అందరూ నాశనమయ్యారు. ఈ యాదవకుల విధ్వంసం అంతా శ్రీకృష్ణుడు తిలకించాడు.

3-140-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తురతతో నిజమాయా
తిఁ జూచి లసద్విలోలల్లోల సమం
చి విమల కమల సార
స్వజలముల విహితవిధులు లిపినవాఁడై.

టీకా:

చతురత = నేర్పరితనము; తోన్ = తో; నిజ = తన; మాయా = మాయ యొక్క; గతిన్ = వర్తనను; చూచి = చూసి; లసత్ = తళుకులతో; విలోల = కదులుతున్న; కల్లోల = అలలతో; సమంచిత = కూడిన; విమల = నిర్మలమైన; కమల = పద్మములు కలిగిన; సారస్వత = సరస్వతీ నదీ; జలములన్ = నీటిలో; విహిత = నిర్వహించవలసిన; విధులు = కర్మలు; సలిపినవాడు = చేసినవాడు; ఐ = అయి.

భావము:

తన ఆ మాయా విలాసాన్ని చాతుర్యంతో గమనించిన తరువాత పొంగిపొరలే తరంగాలతో, వికసించిన కమలాలతో, జలజల ప్రవహించే సరస్వతీ నదిలోని జలాలలో చనిపోయిన వారందరికీ ఉత్తరక్రియలు యథావిధిగా జరిపాడు.

3-141-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వృక్ష మూలతలమున
లంక గుణాభిరాముఁ డాసీనుండై
కుటిలమతి బదరీవని
కిఁ నీ వరుగు మని మొఱఁగి యేగిన నేనున్.

టీకా:

ఒక = ఒక; వృక్ష = చెట్టు; మూల = మ్రాను పక్కని; తలమునన్ = ప్రదేశమున; అకలంకగుణాభిరాముడు = కృష్ణుడు {అకలంకగుణాభిరాముడు - మచ్చలేని సుగుణములతో ఒప్పువాడు, కృష్ణుడు}; ఆసీనుండు = కూర్చున్నవాడు; ఐ = అయి; అకుటిల = నిర్మలమైన; మతిన్ = మనసుతో; బదరీవని = బదరీవనమున; కిన్ = కి; ఇక = ఇంక; నీవు = నీవు; అరుగుము = వెళ్ళుము; అని = అని; మొఱగి = మాయపుచ్చి; ఏగినన్ = వెళ్ళిపోగా; నేనున్ = నేను కూడా.

భావము:

మచ్చ లేని మంచి గుణాలతో విరాజిల్లే శ్రీకృష్ణుడు ఒక చెట్టు మొదట్లో కొంచెము సేపు కూర్చున్నాడు. తరువాత నన్ను పిలిచి “ఉద్ధవా! ఇక నీవు బదరికాశ్రమానికి వెళ్లు” అని నాకు చెప్పి, మాయ పుచ్చి, లేచి, ఎక్కడికో వెళ్ళిపోయాడు.

3-142-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క్రమున నిజకులసంహా
ము సేయఁ గడంగు టెఱిగి మణీయశ్రీ
ణు చరణాబ్జయుగ విర
మునకు మది నోర్వలేక నుగమనుఁడనై.

టీకా:

క్రమమునన్ = క్రమముగ; నిజ = తన; కుల = వంశమును; సంహారము = సంహరింప; చేయన్ = చేయుటకు; కడంగుటన్ = పూనుకొనుట; ఎఱిగి = తెలిసికొని; రమణీయ = మనోహరమైన; శ్రీరమణు = కృష్ణుని {శ్రీరమణుడు - శ్రీ (లక్ష్మీదేవి) రమణుడు (భర్త), విష్ణువు}; చరణ = పాదములు అను; అబ్జ = పద్మముల; యుగము = జంట; విరహమున = ఎడబాటున; కున్ = కు; మదిన్ = మనసులో; ఓర్వలేక = ఒర్చుకొనలేక; అనుగమనుండను = అనుసరించువాడను; ఐ = అయి.

భావము:

ఆయన తన వంశాన్ని పూర్తిగా సమాప్తం చేసుకోవాలని సంకల్పించాడన్న సంగతి నేను గ్రహించాను. ఆ లక్ష్మీపతి యైన కృష్ణుని సుందర పాదారవిందాల ఎడబాటును సహించలేకపోయాను. ఆయన వద్దన్నా వినకుండా ఆయన అడుగు జాడలను అనుసరించాను.

3-143-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి నరయుచుఁ జనిచని యొక
రుమూలతలంబు నందుఁ న దేహరుచుల్
గఁగ నున్న మహాత్మునిఁ
రునిఁ బ్రపన్నార్తిహరుని క్తవిధేయున్.

టీకా:

హరిన్ = కృష్ణుని {హరి - సర్వసంచితపాపములను హరించువాడు, విష్ణువు}; అరయుచున్ = వెతుకుచూ; చనిచని = వెళ్ళివెళ్ళి; ఒక = ఒక; తరు = చెట్టు; మూల = మ్రాను దగ్గరి; తలంబు = ప్రదేశము; అందు = లో; తన = తన; దేహ = దేహము యొక్క; రుచులు = కాంతులు; పరగగన్ = వ్యాపించుచు; ఉన్న = ఉన్న; మహాత్ముని = కృష్ణుని {మహాత్ముడు - గొప్పవాడు, విష్ణువు}; పరునిన్ = కృష్ణుని {పరుడు - పరబ్రహ్మమును, విష్ణువు}; ప్రపన్నార్తిహరుని = కృష్ణుని {ప్రపన్నార్తిహరుడు - శరణుజొచ్చినవారి బాధలను తొలగించువాడు, విష్ణువు}; భక్తవిధేయున్ = కృష్ణుని {భక్తవిధేయుడు - భక్తులకు అనుకూలముగ ఉండువాడు, విష్ణువు}.

భావము:

అలా కృష్ణుని జాడ వెతుక్కుంటూ వెళ్ళగా, ఒక చెట్టు మొదలుకి అనుకొని నేలమీద కూర్చుని ఉన్న ఆ మహానుభావుడు నాకు కన్పించాడు. ఆయన దేహం దేదీప్యమానంగా కాంతులు వెదజల్లుతోంది. ఆ సమయంలో ఆ వాసుదేవుడు ఆర్తుల కష్టాలను పోగొట్టి భక్తజనులను పరిపాలించే పరమాత్మగా నాకు కన్పించాడు.

3-144-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మఱియును.

టీకా:

మఱియును = ఇంకనూ.

భావము:

ఇంకా.

3-145-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

స్మత్ప్రియస్వామి చ్యుతుఁ బరు సత్త్వ-
గుణగరిష్ఠుని రజోగుణవిహీను
సురుచిరద్వారకాపురసమాశ్రయు ననా-
శ్రయు నీలనీరదశ్యామవర్ణు
ళదరవిందసుంరపత్రనేత్రు ల-
క్ష్మీయుతుఁ బీతకౌశేయవాసు
విలసితవామాంకవిన్యస్త దక్షిణ-
రణారవిందు శశ్వత్ప్రకాశు

3-145.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నచతుర్భాహు సుందరాకారు ధీరుఁ
జెన్నుగల లేతరావిపై వెన్నుమోపి
యున్న వీరాసనాసీను న్నుఁగన్న
తండ్రి నానంద పరిపూర్ణు నుజహరుని.

టీకా:

అస్మత్ = నాయొక్క; ప్రియ = ప్రియమైన; స్వామిన్ = దేవుని; అచ్యుతున్ = కృష్ణుని {అచ్యుతుడు - చ్యుతము (పడుట) లేనివాడు, విష్ణువు}; పరున్ = కృష్ణుని {పరుడు - పరబ్రహ్మము, విష్ణువు}; సత్త్వగుణగరిష్ఠుని = కృష్ణుని {సత్త్వగుణగరిష్ఠుడు - సత్త్వగుణములు కలవారిలో గొప్పవాడు, విష్ణువు}; రజోగుణవిహీను = కృష్ణుని {రజోగుణవిహీనుడు - రజోగుణము లేనివాడు, విష్ణువు}; సురుచిరద్వారకాపురసమాశ్రయున్ = కృష్ణుని {సురుచిరద్వారకాపురసమాశ్రయుడు - మనోహరమైన ద్వారకానగరమునకు చక్కటి ఆశ్రయిము అయినవాడు, కృష్ణుడు}; అనాశ్రయు = కృష్ణుని {అనాశ్రయుడు - ఆశ్రయమే అక్కరలేనివాడు, విష్ణువు}; నీలనీరదశ్యామవర్ణు = కృష్ణుని {నీలనీరదశ్యామవర్ణుడు - నల్లని మేఘమువలె నల్లని రంగుకలవాడు, విష్ణువు}; దళదరవిందసుందరపత్రనేత్రు = కృష్ణుని {దళదరవిందసుందరపత్రనేత్రుడు - విచ్చుకొన్నపద్మములరేకులవంటి నేత్రములు కలవాడు, విష్ణువు}; లక్ష్మీయుతుఁ = కృష్ణుని {లక్ష్మీయుతుడు - లక్ష్మీదేవితో కూడి ఉండువాడు, విష్ణువు}; పీతకౌశేయవాసు = కృష్ణుని {పీతకౌశేయవాసుడు - పచ్చని పట్టువస్త్రము ధరించినవాడు, విష్ణువు}; విలసితవామాంకవిన్యస్తదక్షిణచరణారవిందు = కృష్ణుని {విలసితవామాంకవిన్యస్తదక్షిణచరణారవిందుడు - విలాసముగా ఎడమతొడపైన ఉంచిన కుడికాలు యొక్క పాదము అను పద్మము కలవాడు, విష్ణువు}; శశ్వత్ప్రకాశు = కృష్ణుని {శశ్వత్ప్రకాశు - శాశ్వతమైన ప్రకాశము ఐనవాడు, విష్ణువు};
ఘనచతుర్భాహు = కృష్ణుని {ఘనచతుర్భాహు - గొప్పవైన చేతులు నాలుగు కలవాడు, విష్ణువు}; సుందరాకారు = కృష్ణుని {సుందరాకారు - సుందరమైన ఆకారము కలవాడు, విష్ణువు}; ధీరున్ = కృష్ణుని {ధీరుడు - మిక్కిలి ధీరత్వము కలవాడు, విష్ణువు}; చెన్ను = అందము; కల = కల; లేత = లేత; రావి = రావిమ్రాకు; పైన్ = పై; వెన్నుమోపి = వీపు ఆనుకొని; ఉన్న = ఉన్నట్టి; వీరాసన = వీరాసనమున; ఆసీను = కూర్చున్నవానిని; నన్నున్ = నన్ను; కన్నతండ్రి = కన్నతండ్రి; ఆనందపరిపూర్ణు = కృష్ణుని {ఆనందపరిపూర్ణుడు - ఆనందమునకు పరిపూర్ణ రూపుడు, విష్ణువు}; దనుజహరుని = కృష్ణుని {దనుజహరుని - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు}.

భావము:

నా ప్రేమమూర్తీ, నా స్వామీ, అచ్యుతుడూ, పరాత్పరుడూ, సత్త్వగుణసంపన్నుడూ, రజోగుణ రహితుడూ, సుందర ద్వారకానగర నివాసీ, అన్యులను ఆశ్రయించనివాడూ, నీలమేఘ శ్యామల శరీరం కలవాడూ, అప్పుడే వికసిస్తున్న అందమైన అరవిందాలవంటి కన్నులు కలవాడూ, శ్రీనివాసుడూ అయిన శ్రీకృష్ణుడు పట్టుపీతాంబరం కట్టుకుని తన ఎడమ తొడపై కుడి పాదాన్ని ఉంచి కూర్చుని ఉన్నాడు. అక్షర తేజస్సుతో, చతుర్బాహువులతో ప్రకాశిస్తున్నాడు. అటువంటి ధీరుణ్ణి, సుందరాకారుణ్ణి, రాక్షససంహారుణ్ణి, లేత రావిమ్రాకును ఆనుకొని వీరాసనాసీనుడై విరాజిల్లుతున్న ఆనందమయుణ్ణి నను గన్న నా తండ్రిని కన్నులారా వీక్షించాను.

3-146-మత్త.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కంటిఁగంటి భవాబ్ధి దాటఁగఁ గంటి నాశ్రితరక్షకుం
గంటి యోగిజనంబుడెందముఁ గంటిఁ జుట్టముఁ గంటి ము
క్కంటికింగనరాని యొక్కటిఁ గంటిఁ దామరకంటిఁ జే
కొంటి ముక్తివిధానముం దలకొంటి సౌఖ్యము లందగన్.

టీకా:

కంటిగంటి = చూసేను చూసేను; భవ = సంసారము అను; అబ్ధిన్ = సాగరమును; దాటగన్ = దాటు విధానమును; కంటి = చూసితిని; ఆశ్రితరక్షకున్ = కృష్ణుని {ఆశ్రితరక్షకుడు - ఆశ్రయించినవారిని రక్షించువాడు, కృష్ణుడు}; కంటి = చూసితిని; యోగిజనంబుడెందమున్ = కృష్ణుని {యోగిజనంబుడెందము - యోగుల మనసులో ఉండు వాడు, విష్ణువు}; కంటి = చూసేను; చుట్టమున్ = బంధువును; కంటి = చూసేను; ముక్కంటికింగనరానియొక్కటిన్ = కృష్ణుని {ముక్కంటికింగనరానియొక్కటి - శివునికి కూడ చూచుటకురాని ఏకేశ్వరుడు, విష్ణువు}; కంటి = చూసేను; తామరకంటిన్ = కృష్ణుని {తామరకంటి - పద్మములవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; చేకొంటి = చేపట్టేను; ముక్తివిధానమున్ = కృష్ణుని {ముక్తివిధానము - ముక్తినిచేరు మార్గము, విష్ణువు}; తలకొంటి = చేరుకొన్నాను; సౌఖ్యములు = సౌఖ్యములు; అందగన్ = పొందగా.

భావము:

ఆహా! దర్శించాను; సందర్శించాను; సంసారసాగరాన్ని తరించాను; ఆశ్రితులను రక్షించే ఆ సర్వరక్షకుని దర్శించాను; మహాయోగుల ఆత్మబంధువును సందర్శించాను; మూడు కన్నులున్న మహేశ్వరునికి కూడ అంతుపట్టని అద్వితీయుని కనుగొన్నాను; పద్మాక్షుడు గోవిందుని చేరాను; ముక్తిమార్గాన్ని చేరుకున్నాను; పరమానందాన్ని అందుకున్నాను.

3-147-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యవసరంబునం బరమ భాగవతోత్తముండును, మునిజన సత్తముండును, ద్వైపాయన సఖుండునుఁ, బరమ తపోధనుండును, నఘశూన్యుండును, యఖిలజన మాన్యుండును, బుధజనవిధేయుండును నగు మైత్రేయుండు తీర్థాచరణంబు సేయుచుం జనిచని.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయమున; భాగవత = భాగవతులలో {భాగవతుడు - భాగవత సంప్రదాయము అనుసరించువాడు}; ఉత్తముండును = ఉత్తమమైనవాడును; ముని = మునులుయైన; జన = జనమునందు; సత్తముండును = మిక్కిలి మంచి వాడును; ద్వైపాయన = వేదవ్యాసుని {ద్వైపాయనసఖుడు - వేదవ్యాసుడు మైత్రేయుడు సాందీపని యీ ముగ్గురును పరాశరమహర్షి శిష్యులు, బాల్యసఖులు}; సఖుండును = మిత్రుడును; పరమ = అత్యుత్తమ; తపస్ = తపస్సు అను; ధనుండును = ధనము కలవాడును; అఘ = పాపములు; శూన్యుండును = లేనివాడును; అఖిల = సమస్తమైన; జన = జనముచేత; మాన్యుండును = పూజింపబడువాడును; బుధ = బుద్దమంతులైన; జన = జనులకు; విధేయుండును = విధేయుడును; అగు = అయిన; మైత్రేయుండు = మైత్రేయుడు; తీర్థా = తీర్థ; ఆచరణంబున్ = యాత్రలు చేయుట; చేయుచున్ = చేస్తూ; చనిచని = వెళ్ళివెళ్ళి.

భావము:

. విదురా! అదే సమయంలో భగవద్భక్తులలో ఎన్నదగినవాడూ, మునులలో అగ్రగణ్యుడూ, వేదవ్యాసుని సహాధ్యాయుడూ, యోగులచే స్మరింపబడువాడూ, సద్గుణాలప్రోగూ, జనులందరికీ పూజనీయుడూ, విజ్ఞులకు విధేయుడూ అయిన మైత్రేయుడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడికి వచ్చాడు.

3-148-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నియెం దాపసపుంగవుం డఖిలలోఖ్యాతవర్ధిష్ణు శో
భాస్వత్పరిపూర్ణయౌవనకళాభ్రాజిష్ణు యోగీంద్రహృ
ద్వజాతైకచరిష్ణుఁ గౌస్తుభముఖోద్యద్భూషణాలంకరి
ష్ణు నిలింపాహితజిష్ణు విష్ణుఁ బ్రభవిష్ణుం గృష్ణు రోచిష్ణునిన్.

టీకా:

కనియెన్ = దర్శించెను; తాపసపుంగవుడు = మైత్రేయుడు {తాపసపుంగవుడు - తాపసులలో శ్రేష్ఠుడు, మైత్రేయుడు}; అఖిలలోకఖ్యాతవర్థిష్ణున్ = కృష్ణుని {అఖిలలోకఖ్యాతవర్థిష్ణుడు - సమస్త లోకస్థులచే కీర్తింపబడి అతిశయించు శీలము కలవాడు, విష్ణువు}; శోభనభాస్వత్పరిపూర్ణయౌవనకళాభ్రాజిష్ణు = కృష్ణుని {శోభనభాస్వత్పరిపూర్ణయౌవనకళాభ్రాజిష్ణు - శుభకరమై ప్రకాశిస్తున్న నిండుజవ్వనము యొక్క శోభచే ప్రకాశించువాడు, విష్ణువు}; యోగీంద్రహృద్వనజాతైకచరిష్ణు = కృష్ణుని {యోగీంద్రహృద్వనజాతైకచరిష్ణు – యోగులలో శ్రేష్ఠు లైనవారి హృదయపద్మములందు ఒకడై చరించువాడు}; కౌస్తుభముఖోద్యద్భూషణాలంకరిష్ణు = కృష్ణుని {కౌస్తుభముఖోద్యద్భూషణాలంకరిష్ణు - కౌస్తుభము మొదలగు ముఖ్యమైన మిక్కిలి ప్రకాశిస్తున్న భూషణములచే అలంకరింపబడినవాడు, విష్ణువు}; నిలింపాహితజిష్ణు = కృష్ణుని {నిలింపాహితజిష్ణు - నిలంప (దేవతల)కు అహిత (శత్రువులు) అగు రాక్షసులను జయించు శీలము కలవాడు, విష్ణువు}; విష్ణున్ = కృష్ణుని {విష్ణువు – వ్యాపించు శీలము కలవాడు, హరి}; ప్రభవిష్ణున్ = కృష్ణుని {ప్రభవిష్ణుడు - సృష్టిగా పుట్టుకువచ్చే స్వభావము కలవాడు, విష్ణువు}; రోచిష్ణున్ = కృష్ణుని {రోచిష్ణుడు - ప్రకాశించు స్వభావము కలవాడు}.

భావము:

అలా వచ్చిన మునిశ్రేష్ఠుడు మైత్రేయుడు విశ్వమంతా విస్తరిల్లిన శాశ్వతకీర్తితో, సౌభాగ్యశోభల వైభవంతో కూడినవాడు, సంపూర్ణ యౌవన స్ఫూర్తితో విరాజిల్లేవాడు, మహా యోగీంద్రుల హృదయపద్మాలలో సంచరించేవాడు, కౌస్తుభం మొదలైన తళతళలాడే ఆభరణాలు అలంకరించుకొనువాడు, సర్వవ్యాపకుడు, సర్వ సమర్థుడు, తేజోమయుడు, రాక్షసులను జయించు శీలము కలవాడు అయిన శ్రీకృష్ణుని దర్శించాడు.

3-149-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నంతరంబ హరి దన
హృయాబ్జము నందు ముకుళితేక్షణముల స
మ్మమునఁ జూచుచు నానత
నుండై యుండె ముదము ఱలఁగ ననఘా!

టీకా:

తదనంతరంబ = తరువాత; హరిన్ = కృష్ణుని {హరి – సర్వ సంచిత పాపములను హరించువాడు, విష్ణువు}; తన = తన; హృదయ = హృదయము అను; అబ్జము = పద్మము; అందు = లో; ముకుళిత = మూసిన; ఈక్షణములన్ = కన్నులలో; సమ్మదమునన్ = సంతోషముతో; చూచుచున్ = చూస్తూ; ఆనత = వంచిన; వదనుండు = శిరస్సు కలవాడు; ఐ = అయి; ఉండెన్ = ఉండెను; ముదము = సంతోషము; వఱలగన్ = అతిశయించగా; అనఘా = పుణ్యాత్ముడా.

భావము:

. ఓ పుణ్యాత్ముడా! విదురుడా! విను, అలా చూసి కన్నులు మూసుకున్నవాడైన మైత్రేయ మహర్షి తన హృదయకమలంలో పదిలపరచుకున్న ఆ భగవంతుణ్ణి సంతోషంతో సందర్శించుకుంటూ తలవంచుకొని నిలబడ్డాడు.

3-150-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత దగ్గఱ నేతెంచి యున్న మైత్రేయుండు వినుచుండ దరహాస చంద్రికా సుందర వదనారవిందుండును, నానందసుధానిష్యంద కందళిత హృదయుండును, భక్తానురక్త దయాసక్త విలోకనుండును నగు పుండరీకాక్షుండు నన్ను నిరీక్షించి యిట్లని యానతిచ్చె "పూర్వ భవంబున వసుబ్రహ్మలుసేయు సత్రయాగంబున వసువై భవదీయ హృదయంబున నితర పదార్థంబులు గోరక మదీయ పాదారవిందసేవం గాంక్షించితివి గావునఁ దన్నిమిత్తంబున నేను నీ హృదయంబున వసియించి సమస్తంబునుఁ గనుచుండుదు; యాత్మారాముండునైన నన్ను నెవ్వరేనియు సదసద్వివేకులై యెఱుంగం జాలరు వారలకు నేను నగోచరుండనై యుండుదు; మత్పరిగ్రహంబు గల నీకు నీజన్మంబ కాని పునర్భవంబు నొందకుండుటకు భవదీయ పూర్వజన్మ కృతసుకృత విశేష ఫలంబు కతంబున నియ్యాశ్రమంబున మత్పాదారవింద సందర్శనంబు కలిగె; నదియునుంగాక పద్మకల్పంబు నందు మన్నాభిపద్మమధ్య నిషణ్ణుం డగు పద్మసంభవునకు జన్మమరణాది సంసృతి నివర్తకంబును యవిరతా నశ్వరసౌఖ్య ప్రవర్తకంబును నగు మన్మహత్త్వంబుఁ దెలియ జేయు నద్దివ్యజ్ఞానంబు నీకునెఱింగింతు." నని యమ్మహనీయ తేజోనిధి యానతిచ్చిన సుధాసమాన సరసాలాపంబులు కర్ణకలాంపంబులై మనస్తాపంబులం బాపిన రోమాంచ కంచుకిత శరీరుండను, నానందభాష్పధారాసిక్త కపోలుండనుఁ, బరితోష సాగరాంతర్నిమగ్న మానసుండను నయి యంజలిపుటంబు నిటలతటంబున ఘటియించి యిట్లంటి.

టీకా:

అంత = అంతట; దగ్గఱన్ = దగ్గరకు; ఏతెంచి = వచ్చి; ఉన్న = ఉన్నట్టి; మైత్రేయుండు = మైత్రేయుడు; వినుచుండ = వింటూ ఉండగ; దరహాస = చిరునవ్వు అను; చంద్రికా = వెన్నెల తో; సుందర = అందమైన; వదన = ముఖము అను; అరవిందుండును = పద్మము కలవాడును; ఆనంద = ఆనందము అను; సుధా = అమృతము; నిష్యంద = చిందుటచేత; కందళిత = వికసించిన; హృదయుండును = హృదయము కలవాడును; భక్త = భక్తులయందు; అనురక్త = అనురాగముచేత; దయా = దయతో; సక్త = కూడిన; విలోకనుండును = కన్నులు కలవాడును; అగు = అయిన; పుండరీకాక్షుండు = కృష్ణుడు {పుండరీకాక్షుడు - పుండరీకముల (పద్మముల) వంటి కన్నులు ఉన్నవాడు}; నన్ను = నన్ను; నిరీక్షించి = చూసి; ఇట్లు = ఈవిధముగ; అని = అని; ఆనతిచ్చె = చెప్పెను; పూర్వ = పూర్వ; భవంబునన్ = జన్మలో; వసు = వసువులు {వసువు - కిరణరూపమున ఉండు ఒక రకమైన గణదేవత. అష్టవసువులు - 1 అవుడు 2 ధ్రువుడు 3 సోముడు 4 అధర్వుడు 5 అనిలుడు 6 ప్రత్యూషుడు 7 అనలుడు 8 ప్రభాసుడు}; బ్రహ్మలు = బ్రహ్మలు {బ్రహ్మలు - బ్రహ్మజ్ఞాన స్వరూపులైన ఒకరకమైన గణదేవతలు. నవబ్రహ్మలు - 1 మరీచి 2 భరద్వాజుడు 3 అంగీరసుడు 4 పులస్త్యుడు 5 పులహుడు 6 క్రతువు 7 దక్షుడు 8 వశిష్టుడు 9 వామదేవుడు}; చేయు = చేయు; సత్ర = సత్ర అను; యాగంబున = యాగములో; వసువు = వసువు; ఐ = అయి; భవదీయ = నీ యొక్క; హృదయంబున = హృదయమున; ఇతర = ఇతరమైన; పదార్థంబులు = వానిని; కోరక = కోరుకొనక; మదీయ = నా యొక్క; పాద = పాదములు అను; అరవింద = పద్మముల; సేవన్ = సేవించుటను; కాంక్షించితివి = కోరితివి; కావున = కనుక; తత్ = ఆ; నిమిత్తంబునన్ = కారణముచేత; నేను = నేను; నీ = నీ; హృదయంబున = హృదయములో; వసియించి = ఉండి; సమస్తంబును = అన్నిటిని; కనుచుండుదు = గమనించుచుండుదును; ఆత్మా = ఆత్మయందు; రాముండను = వసించువాడను; ఐన = అయినట్టి; నన్ను = నన్ను; ఎవ్వరేనియు = ఎవరైనా; సత్ = సత్తు; అసత్ = అసత్తు; వివేకులు = వివేకము కలవారు; ఐ = అయినంత మాత్రమున; ఎఱుంగన్ = తెలిసికొన; చాలరు = లేరు; వారల = వారి; కున్ = కి; నేను = నేను; అగోచరుండను = కనిపించనివాడను; ఐ = అయి; ఉండుదు = ఉంటాను; మత్ = నా యొక్క; పరిగ్రహంబున్ = స్వీకరించుట; కల = కలిగిన; నీకున్ = నీకు; ఈ = ఈ; జన్మంబ = జన్మమే; కాని = కాని; పునర్భవంబు = పునర్జన్మంబు; ఒందక = పొందకుండగ; ఉండుటకున్ = ఉండుటకు; భవదీయ = నీ యొక్క; పూర్వజన్మ = పూర్వజన్మలో; కృత = చేసిన; సుకృత = పుణ్యకార్యముల; విశేష = విశేషమైన; ఫలంబునన్ = ఫలితముగా; ఈ = ఈ; ఆశ్రమంబునన్ = ఆశ్రమములో {ఆశ్రమము - మానవునికి బ్రహ్మచర్యాది వంటివే భగవంతునికి అనంత అవతారములు అనంత ఆశ్రమములు ?}; మత్ = నా యొక్క; పద = పాదములు అను; అరవింద = పద్మముల; దర్శనంబు = దర్శనము; కలిగెన్ = కలిగెను; అదియునున్ = అంతే; కాక = కాకుండ; పద్మకల్పంబునన్ = పద్మకల్పము {పద్మకల్పము - ప్రస్తుతము జరుగుచున్న శ్వేతవరాహ కల్పమునకు ముందరి కల్పము, జీవుడు గర్భమున పడినది మొదలు బొడ్డు కోయుటవరకు గల సమయము పద్మకల్పము తరువాతది శ్వేతవరాహకల్పము}; అందు = లో; మత్ = నా యొక్క; నాభి = నాభి అను; పద్మ = పద్మము; మధ్య = మధ్యన; నిషణ్ణుండు = ఆసీనుడు; అగు = అయిన; పద్మసంభవున = బ్రహ్మదేవున {పద్మసంభవుడు - పద్మమున పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; కున్ = కు; జన్మ = జన్మము; మరణ = మరణము; ఆది = మొదలైన; సంసృతి = సంసారము (బంధము)ను; నివర్తకంబును = తొలగించునదియును; అవిరత = ఎడతెగని; అనశ్వర = నశింపని; సౌఖ్య = సౌఖ్యమును; ప్రవర్తకంబునున్ = కలిగించునదియును; అగు = అయిన; మత్ = నా యొక్క; మహత్త్వంబున్ = మహిమను; తెలియన్ = తెలియునట్లు; చేయున్ = చేసెడి; ఆ = ఆ; దివ్య = దివ్యమైన; జ్ఞానంబున్ = జ్ఞానమును; నీకున్ = నీకు; ఎఱింగింతు = తెలుపుదును; అని = అని; ఆ = ఆ; మహనీయతేజోనిధి = కృష్ణుడు {మహనీయతేజోనిధి - మహిమాన్వితమైన తేజస్సునకు నిధి వంటివాడు, కృష్ణుడు}; ఆనతిచ్చిన = సెలవిచ్చిన; సుధా = అమృతమునకు; సమాన = సాటి యైన; సరస = సంతోషపూర్వక; ఆలాపంబులు = పలుకులు; కర్ణ = చెవులకు; కలాపంబులు = ఇంపైనవి; ఐ = అయి; మనస్ = మనసు యొక్క; తాపంబులన్ = బాధలను; పాపిన = పోగొట్టగ; రోమాంచ = గగుర్పాటు అను; కంచుకిత = అంగీధరించిన; శరీరుండను = శరీరము కలవాడను; ఆనంద = ఆనందము వలని; బాష్ప = కన్నీటి; ధారా = ధారలచే; సిక్త = తడసిన; కపోలుండను = చెక్కిలి కలవాడను; పరితోష = సంతోషము అను; సాగర = సముద్రము; అంతర్ = లోపల; నిమగ్నుడను = ఓలలాడువాడను; అయి = అయి; అంజలి = దోసిలి అను; పుటంబున్ = మొగ్గను; నిటల = నుదురు; తటంబునన్ = ప్రదేశమున; ఘటియించి = హత్తించి; ఇట్లు = ఈవిధముగ; అంటి = అన్నాను.

భావము:

అలా తన దగ్గరకు వచ్చిన మైత్రేయుడు వింటూ ఉండగా, చిరునవ్వు వెన్నెలలు చిందించే అందమైన పద్మలాంటి ముఖం కలవాడూ, ఆనందామృతంతో వికసించిన హృదయం కలవాడూ, భక్తులను ఆదరించే దయతో కూడిన చూపులు కలవాడూ అయినట్టి శ్రీకృష్ణుడు నా ముఖం వైపు చూసి ఇలా భాషించాడు “ఉద్ధవా! నీవు పూర్వజన్మలో వసుబ్రహ్మలు చేస్తున్న సత్త్రయాగంలో వసువు గా ఉన్నావు. అప్పుడు నీ మనస్సులో మరే వస్తువునూ కోరకుండా నా పాదపద్మాలసేవనే కోరుకున్నావు. అందుకని నేను ఇక మీదట నీ హృదయంలో నివాసం చేస్తూ సర్వం వీక్షిస్తూ ఉంటాను. ఆత్మారాముడ నైన నన్ను ఇది “సత్తు”, ఇది “అసత్తు” అని విమర్శించేవారు ఎవరూ తెలుసుకోలేరు. నేను వారికి కనిపించకుండా ఉంటాను. నా అనుగ్రహంవలన ఇదే నీకు చివరి జన్మ. మరొక జన్మ ఉండదు. అందుకనే నీ పూర్వజన్మ లోని పుణ్యవిశేషం కారణంగా నా పాదపద్మాలను ఈరోజు, ఈ ఆశ్రమంలో సందర్శించగలిగావు. అంతేకాక పద్మకల్పంలో నా నాభికమలంలో ఆసీనుడై వున్న బ్రహ్మదేవునికి తెలియజేసిన దివ్యజ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తాను. ఆ దివ్యజ్ఞానం వల్ల జనన మరణాది సంసారబంధాన్ని నివర్తింపజేసి అఖండమూ, అనంతమూ అయిన ఆనందాన్ని ప్రవర్తింపజేసే నా మహత్త్వం నీకు తెలుస్తుంది.”
ఇలా మహాతేజస్సంపన్నుడైన కృష్ణుడు పలికిన అమృత సమానములు అయిన సరస సంభాషణలు నాకు శ్రవణ భూషణాలు అయ్యాయి. నా మనస్తాపాన్ని తొలిగించాయి. నా శరీరం సంతోషంతో గగుర్పొడిచింది. నా చెక్కిళ్లు ఆనందభాష్పాలతో తడిసి పోయాయి. నా అంతరంగం సంతోష సముద్ర తరంగాలలో ఓలలాడింది. నేను దోసిలి నుదుటిపై చేర్చి ఇలా విన్నవించుకొన్నాను.

3-151-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పురుషోత్తమ! నీ పదసర
సీరుహ ధ్యానామృతాభిషేకస్ఫురణం
మొప్పిన నా చిత్తమి
వస్తువు లందు వాంఛఁ గులునె యెందున్.

టీకా:

పురుషోత్తమ = కృష్ణా {పురుషోత్తముడు - పురుషులలో ఉత్తముడు, విష్ణువు}; నీ = నీ; పద = పాదములు అను; సరసీరుహ = పద్మము నందు; ధ్యాన = ధ్యానము అను; అమృత = అమృతముచే; అభిషేక = అభిషేకింపబడుట; స్ఫురణన్ = తోచినంతనే; కరము = మిక్కిలి; ఒప్పిన = చక్కనిది అయిన; నా = నా; చిత్తమున్ = మనసున; ఇతర = ఇతరమైన; వస్తువులు = వస్తువులు; అందు = పై; వాంఛ = కోరిక; తగులునె = కలుగునా; ఎందున్ = ఎలాగైన.

భావము:

“ఓ పరమపురుషా! శ్రీకృష్ణా! నీ చరణకమలాల స్మరించటం అనే అమృతాభిషేకంతో పొంగి పరవశించిన నా మనస్సు ఇతర వస్తువులను ఎందుకు కాంక్షిస్తుంది.

3-152-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నములేని నీవు భవసంగతి నొందుట కేమి కారణం
నియునుఁ, గాలసంహరుఁడవై జగముల్ వెలయించు నీవు పా
ని రిపుభీతికై సరిదుదంచిత దుర్గము నాశ్రయించు టె
ట్లనియును దేవ నామనము నందుఁ దలంతు సరోజలోచనా!

టీకా:

జననము = పుట్టుక; లేని = లేని; నీవు = నీవు; భవ = జన్మలతో; సంగతిన్ = సంబంధము; ఒందుట = పొందుట; కున్ = కి; ఏమి = ఏమిటి; కారణంబు = కారణము; అనియున్ = అనియును; కాల = కాల స్వరూపమున; సంహరుండవు = సంహరించువాడవు; ఐ = అయి; జగముల్ = లోకములు; వెలయించు = సృష్టించు; నీవు = నీవు; పాయని = వదలని; రిపు = శత్రువుల వలన; భీతి = భయమున; కై = కై; సరిత్ = నీటిచే; ఉదంచిత = చుట్టబడిన; దుర్గమున్ = కోటను; ఆశ్రయించుట = ఆశ్రయించుట; ఎట్లు = ఏమిటి; అనియును = అనియును; దేవ = కృష్ణా {దేవ - దివికి సంబంధించిన వాడు, దేవుడు, విష్ణువు}; నా = నా; మనము = మనసు; అందు = లో; తలంతు = తలచెదను; సరోజలోచనా = కృష్ణా {సరోజలోచనుడు - సరోజము (పద్మము)ల వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}.

భావము:

ఓ పద్మాక్షా! కృష్ణమూర్తీ! పుట్టుకే లేని నీవు ఈ భూలోకంలో అవతరించటానికి కారణం ఏమిటో బోధపడటం లేదు; కాల స్వరూపుడవై లోకాలను లయం చేసుకునే నీవు శత్రుభయంతో సముద్రంలో చుట్టూ నీరు ఆవరించి ఉండేలా కోటలు కట్టుకోవటం ఏమిటో నా మనస్సుకు అర్థం కావటం లేదు.

3-153-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుంగాక.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ.

భావము:

. అంతేకాకుండా.

3-154-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్రీమణీశ్వర నీ వా
త్మారాముఁడ వయ్యు లీలఁ రుణీకోటిం
గోరి రమించితి వనియును
వాక యేఁ దలఁతు భక్తత్సల! కృష్ణా!

టీకా:

శ్రీరమణీశ్వర = కృష్ణా {శ్రీరమణీశ్వరుడు - శ్రీ (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు}; నీవు = నీవు; ఆత్మ = ఆత్మ యందు; ఆరాముండవు = వసించువాడవు; అయ్యున్ = అయినప్పటికిని; లీలన్ = లీలకొరకై; తరుణీ = స్త్రీల; కోటిన్ = సమూహమును; కోరి = కోరి; రమించితివి = సుఖించితివి; అనియును = అనియును; వారక = ఎల్లప్పుడు; ఏన్ = నేను; తలతు = భావింతును; భక్తవత్సల = కృష్ణా {భక్తవత్సలుడు - భక్తులయెడ వాత్సల్యము కలవాడు, విష్ణుసహస్రనామాలలోని 736వ నామం}}; కృష్ణా = కృష్ణా {కృష్ణుడు - నల్లనివాడు}.

భావము:

. ఓ లక్ష్మీరమణా! భక్తవత్సలా! శ్రీకృష్ణా! నీవు ఆత్మలలో విహరించే వాసుదేవుడవు. అయినప్పటికి స్త్రీల సమూహాల నడుమ లీలావిలాసాలతో విహరించడ మేమిటో ఊహించలేకుండా ఉన్నానయ్యా!.

3-155-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తత్త్వజ్ఞులు గరుణా
! నిను సంసారరహితుగాఁ దలపోయ
న్నసి నినుఁ గాంచు టెల్లనుఁ
మరుదు తలంచి చూడఁ మలాధీశా!

టీకా:

పరతత్త్వజ్ఞులు = పరబ్రహ్మమును తెలిసినవారు; కరుణాకర = కృష్ణా {కరుణాకరు - కరుణకు నివాసమైనవాడు, కృష్ణుడు}; నిను = నిన్ను; సంసార = సంసార బంధములు; రహితుని = లేనివాడు; కాన్ = అయినట్లు; తలపోయన్ = భావించుటకు; అరసి = ప్రయత్నించి; నినున్ = నిన్ను; కాచుట = చూచుట; ఎల్లను = అంతా; కరము = మిక్కిలి; అరుదు = విశేషమైనది; తలంచి = తరచి; చూడన్ = చూస్తే; కమలాధీశ = కృష్ణా {కమలాధీశ - కమల (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు}.

భావము:

ఓ ఇందిరాపతీ! నీవు కరుణామయుడవు. పెద్దలు చాలా మంది వేదాంతులు గూడ నిన్ను సంసారివి అనుకుంటున్నారు. నీవు నాపై చూపే దయ, రక్షించే విధానం గమనిస్తే నాకే మిక్కిలి ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది ఎంతటి అరుదైన సంగతి.

3-156-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దేవా! నీ వఖండిత విజ్ఞాన రూపాంతఃకరణుండ వయ్యును ముగ్ధభావంబునఁ బ్రమత్తుని చందంబున విమోహికైవడిం బ్రవర్తించుచు నెందేని నొదిఁగి యుండుటం దలంచి నా డెందంబు గుందుచుండు; అరవిందలోచన! సురవందిత! ముకుంద! ఇందిరాసుందరీరమణ! సరస్వతీరమణునకుం గరుణించిన సుజ్ఞానంబు ధరించు శక్తి నాకుం గలదేనిఁ గృపసేయుము భవదీయ శాసనంబు ధరియించి భూరి సంసారపారావారోత్తరణంబు సేయుదు" నని విన్నవించి బహుభంగులం బ్రస్తుతించిన భగవంతుడునుఁ బ్రపన్నపారిజాతంబును నైన కృష్ణుండు పరతత్త్వనిర్ణయంబు నెఱింగించిన.

టీకా:

దేవా = కృష్ణా; నీవు = నీవు; అఖండిత = అనంతమైన; విజ్ఞాన = విజ్ఞానము యొక్క; రూప = స్వరూపమే; అంతఃకరణుండవు = ఆత్మగా కలవాడవు {అంతఃకరణము – మనసు లోపలి ఇంద్రియము, ఆత్మ}; అయ్యున్ = అయినప్పటికిని; ముగ్ధ = అమాయకమయిన; భావంబునన్ = వానివలె; ప్రమత్తుని = నిర్లక్ష్యుని; చందంబునన్ = వలె; విమోహి = మిక్కిలి మోహమున పడినవాని; కైవడిన్ = వలె; ప్రవర్తించుచు = ప్రవర్తిస్తూ; ఎందేని = ఎక్కడో; ఒదిగి = లొంగి; ఉండుటన్ = ఉండుటను; తలంచి = తలచుకొని; నా = నా; డెందము = మనసు; కుందుచున్ = దుఃఖపడుతూ; ఉండున్ = ఉండును; అరవిందలోచన = కృష్ణా {అరవిందలోచనుడు - అరవిందము (పద్మము)ల వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; సురవందిత = కృష్ణా {సురవందిత - దేవతలచే వందనీయుడు, విష్ణువు}; ముకుంద = కృష్ణా {ముకుందుడు - విష్ణువు, విష్ణుసహస్రనామములులోని 515 వ నామం, ముక్తిని ఒసగువాడు}; ఇందిరాసుందరీరమణ = కృష్ణా {ఇందిరాసుందరీరమణ - ఇందిరాసుందరి (లక్ష్మీదేవి) రమణ (భర్త), విష్ణువు}; సరస్వతీరమణున్ = బ్రహ్మదేవున {సరస్వతీరమణుడు - సరస్వతీదేవి రమణ (భర్త), బ్రహ్మదేవుడు}; కున్ = కు; కరుణించిన = దయతో ఇచ్చిన; సుజ్ఞానంబున్ = విజ్ఞానమును; ధరించు = తెలిసికొను; శక్తి = శక్తి; నాకున్ = నాకు; కలదేని = ఉంటే; కృపసేయుము = దయసేయుము; భవదీయ = నీ యొక్క; శాసనంబు = శాసనము; ధరియించి = స్వీకరించి; భూరి = మిక్కిలి పెద్దదైన; సంసార = సంసారము అను; పారావార = సముద్రమును; ఉత్తరణంబు = దాటుట; చేయుదున్ = చేసెదను; అని = అని; విన్నవించి = విన్నపము చేసి; బహు = అనేక; భంగుల = విధములుగ; స్తుతించిన = స్తుతింపగా; భగవంతుడును = పూజ్యుడును; ప్రపన్నపారిజాతంబును = ఆశ్రయించినవారికి కల్పవృక్షము వంటివాడును; ఐన = అయిన; కృష్ణుండు = కృష్ణుడు; పరతత్త్వ = పరబ్రహ్మ స్వరూప; నిర్ణయంబున్ = నిర్ణయ విజ్ఞానము (పరవిద్య)ను; ఎఱింగించిన = తెలిపిన;

భావము:

. ఓ దేవా! కమలాక్షా! దేవతలచే కీర్తింపబడేవాడా! మోక్షమును ఇచ్చే ముకుందా! శ్రీమహాలక్ష్మీవరుడా! నీవు అఖండమైన విజ్ఞానమే రూపుకట్టినవాడవు. అయినా కూడా అమాయకునిలా, అవివేకిలా, వ్యామోహానికి లొంగిన వానిలా ప్రవర్తిస్తావు. ఒక్కొక్కప్పుడు ఎక్కడో దాక్కొని ఉంటావు. ఈ సంగతులు గుర్తుకు వచ్చినప్పుడు నా స్వాంతం ఎంతో చింతాక్రాంత మవుతుంది. సరస్వతీదేవి భర్త అయిన చతుర్ముఖబ్రహ్మకు ప్రసాదించిన సుజ్ఞానాన్ని, దాన్ని పరిగ్రహించి భరించగల శక్తిసామర్థ్యాలు నాకు ఉన్నాయంటే, ఆ జ్ఞానాన్ని నాకు కూడా అనుగ్రహించు. దానిని గ్రహించి, మీ ఆజ్ఞ శిరసావహించి అపార సంసార సముద్రాన్ని తరిస్తాను” అని విన్నవించుకొని ఎన్నో విధాల సన్నుతించగా. భగవంతుడూ, భక్తజన కల్పవృక్షమూ అయిన శ్రీకృష్ణుడు నాకు పరతత్త్వ సంబంధమైన పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించాడు.

3-157-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సిజలోచన కరుణా
రిలబ్ధజ్ఞానకలిత భావుఁడ నగుటన్
రితత్త్వవేదినై త
చ్ఛణసరోజముల కెరఁగి మ్మతితోడన్.

టీకా:

సరసిజలోచన = కృష్ణుని {సరసిజలోచనుడు - సరసున జ(పుట్టిన) (పద్మము)లవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; కరుణా = దయచేత; పరిలబ్ధ = చక్కగ లభించిన; జ్ఞాన = జ్ఞానము; కలిత = కలిగిన; భావుండను = స్వభావము కలవాడను; అగుటన్ = అయి ఉండుటచే; హరితత్త్వవేదిన్ = భాగవతుడను {హరితత్త్త్వవేది - హరి (భగవంతుని) తత్త్వమును వేది (తెలిసినవాడు), భాగవతుడు}; ఐ = అయి; తత్ = అతని; చరణ = పాదములు అను; సరోజముల = పద్మముల; కిన్ = కి; ఎరగి = నమస్కరించి; సమ్మతి = ఇచ్ఛా; తోడన్ = పూర్వకముగా.

భావము:

. కమలదళాల వంటి కన్నులున్న కృష్ణుని కరుణాకటాక్షం వల్ల సంప్రాప్తమైన జ్ఞానంతో మనస్సు నింపుకొన్నవాడనై, పరతత్త్వాన్ని తెలుసు కొన్నాను. ఎంతో ఇష్టంగా ఆయన పాదపద్మాలకు ప్రణామం చేశాను.

3-158-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి పదజలరుహ విరహా
తుతన్ దుర్దాంత దుఃఖతోయధిఁ గడవన్
వెవేది తిరుగవలసెను
సిజభవకల్పవిలయ మయము దాఁకన్.

టీకా:

హరి = కృష్ణుని {హరి - సర్వసంగములను హరింపజేయు వాడు, విష్ణువు}; పద = పదములు అను; జలరుహ = పద్మముల {జలరుహము - జలమున పుట్టినది, పద్మము}; విరహా = ఎడబాటు; ఆతురతన్ = బాధతో; దుర్దాంత = అణచుకొనలేని; దుఃఖ = దుఃఖము అను; తోయధిన్ = సముద్రమును {తోయధి - తోయము (నీటి)కి నివాసము, సముద్రము}; కడవన్ = దాటుటకు; వెరవేది = ఉపాయములేక; తిరుగవలసెను = తిరగవలసివచ్చెను; సరసిజభవ = బ్రహ్మ {సరసిజభవడు - సరసున జ(పుట్టిన) (పద్మము)న పుట్టిన వాడు, బ్రహ్మదేవుడు}; కల్ప = కల్పము; విలయ = ప్రళయ, కల్పాంత; సమయము = కాలము; దాకన్ = వరకూ.

భావము:

కృష్ణుని పాదపద్మాలతో కలిగిన ఎడబాటు నాకు తడబాటు కలిగించింది. భరింపరాని ఆ దుఃఖ సముద్రాన్ని తరించటానికి మరో ఉపాయం లేదు. కల్పాంత పర్యంతం నేను ఇలాగే తిరుగుతూ ఉండవలసిందే.

3-159-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు దిరుగుచు.

టీకా:

ఇట్లు = ఈవిధముగ; తిరుగుచు = తిరుగుతూ.

భావము:

ఇలా తిరుగుతూ.

3-160-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నారాయణ దాపసాశ్రమ పదౌన్నత్యంబునం బొల్చు భా
సు మందార రసాల సాల వకుళాశోకామ్ల పున్నాగకే
జంబీర కదంబ నింబ కుటజాశ్వత్థస్ఫురన్మల్లికా
వీరక్షితిజాభిరామ బదరీకాంతార సేవారతిన్.

టీకా:

నరనారాయణ = నరనారాయణుల; తాపస = తపసుచేసికొను; ఆశ్రమ = ఆశ్రమము; పద = ప్రదేశము యొక్క; ఔన్నత్యంబునన్ = గొప్పతనమున; పొల్చు = అతిశయించు; భాసుర = ప్రకాశిస్తున్న; మందార = మందారము చెట్లు; రసాల = తీయమామిడి చెట్లు; సాల = మద్ధిచెట్లు; వకుళ = పొగడచెట్లు; అశోక = నరమామిడిచెట్లు; ఆమ్ల = ఉసిరిచెట్లు; పున్నాగ = పొన్నచెట్లు; కేసర = చిటికేసరముచెట్లు; జంబీర = నిమ్మచెట్లు; కదంబ = కడిమిచెట్లు; నింబ = వేపచెట్లు; కుటజ = కొండమల్లెచెట్లు; అశ్వత్థ = రావిచెట్లు; స్ఫురన్ = తమ్మికచెట్లు; మల్లిక = మల్లి; కరవీర = గన్నేరు; క్షితిజ = చెట్ల {క్షితిజము - భూమిని పుట్టినది, చెట్టు}; అభిరామన్ = అందముతో ఒప్పుచున్నట్టి; బదరికా = బదరిక అను {బదరిక - రేగుచెట్ల}; కాంతార = వనమును; సేవా = సేవించవలెనను; రతిన్ = కుతూహలముతో.

భావము:

నేను ఇలా తిరిగితిరిగి, ఆ పుణ్యభూమి పరమ తపోధనులైన నరనారాయణులు తపస్సు చేసిన పవిత్రాశ్రమంగా ప్రఖ్యాతిగన్నది. ఆ బదరీవనం అందమైన మందారాలు, తీయ మామిడిచెట్లు, పొగడలు, అశోకాలు, చింతలు, సురపొన్నలు, పొన్నలు, నిమ్మలు, కదంబాలు, వేములు, కొండమల్లెలు, రావిచెట్లు, మల్లెలు, గన్నేరులు మొదలైన సుందరమైన వృక్షాలతో, పొదలతో నిండి మనోహరంగా ఉంటుంది. ఆ బదరికాశ్రమాన్ని దర్శించాలనే కుతూహలంతో బయలుదేరి...

3-161-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుచున్నవాఁడ"నని ప
ల్కి పలుకుల కులికి కళవళించుచు విదురుం
నుపమశోకార్ణవమున
మునిఁగియు నిజయోగ సత్త్వమునఁ దరియించెన్.

టీకా:

చనుచున్ = వెళ్ళుతూ; ఉన్నవాడను = ఉన్నాను; అని = అని; పల్కిన = పలికిన; పలుకుల = మాటల; కున్ = కు; ఉలికి = ఉలిక్కిపడి; కళవళించుచున్ = కంగారుపడుతూ; విదురుండు = విదురుడు; అనుపమ = సాటిలేని; శోక = శోకము అను; ఆర్ణవమున = సముద్రమున; మునిగియున్ = మునిగినప్పటికిని; నిజ = తన; యోగ = యోగ; సత్త్వమునన్ = బలముచే; తరియించెన్ = దాటెను.

భావము:

నేను ఆ బదరికాశ్రమానికి వెళుతున్నాను” అని ఉద్ధవుడు చెప్పగానే ఆ పలుకులు విని అదిరిపడి కలతచెంది విదురుడు అపారమైన దుఃఖసాగరంలో మునిగిపోయాడు. మళ్ళీ తన యోగసాధనాబలంవల్ల సంప్రాప్తమైన సత్త్వబలంతో గుండె నిబ్బరించుకొని మామూలు స్థితికి వచ్చాడు.

3-162-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు విదురుండు శోకపావకునిం దన వివేకజలంబుల నార్చి యుద్ధవున కిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; విదురుండు = విదురుడు; శోక = శోకము అను; పావకున్ = అగ్నిని; తన = తన యొక్క; వివేక = వివేకము అను; జలంబులన్ = నీటితో; ఆర్చి = ఆర్పి; ఉద్ధవున = ఉద్ధవున; కున్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;

భావము:

విదురుడు దుఃఖాగ్నిని తన వివేకం అనే జలాలతో ఆర్పి ఉద్ధవుడితో ఇలా అన్నాడు.

3-163-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఘా! యుద్ధవ! నీకుఁ గృష్ణుఁ డసురేంద్రారాతి మన్నించి చె
ప్పి యధ్యాత్మ రహస్యతత్త్వ విమలాభిజ్ఞానసారంబు బో
నన్నుం గరుణించి చెప్పినఁ గృతార్థత్వంబునం బొందెదన్
విను పుణ్యాత్ములు శిష్యసంఘముల నుర్విం బ్రోవరే? వెండియున్.

టీకా:

అనఘా = పుణ్యాత్ముడా; ఉద్ధవా = ఉద్ధవుడా; నీకు = నీకు; కృష్ణుడు = కృష్ణుడు; అసురేంద్రారాతి = కృష్ణుడు {అసురేంద్రారాతి - రాక్షసులకు ఆరాతి (శత్రువు), కృష్ణుడు}; మన్నించి = గౌరవించి; చెప్పిన = చెప్పినట్టి; ఆధ్యాత్మ = ఆత్మవిద్యా; రహస్య = రహస్యమైన; తత్త్వ = తత్త్వము యొక్క; విమల = నిర్మలమైన; అభి = శ్రేష్ఠమైన; జ్ఞాన = జ్ఞానము యొక్క; సారము = సారమును; బోరన = శ్రీఘ్రముగ; నన్నున్ = నన్ను; కరుణించి = కరుణించి; చెప్పినన్ = చెప్పినచో; కృతార్థత్వంబున్ = ధన్యతను; పొందెదన్ = పొందెదను; విను = వినుము; పుణ్యాత్ములు = పుణ్యాత్ములు; శిష్య = శిష్యుల; సంఘములన్ = సమూహములను; ఉర్విన్ = భూమిమీద; ప్రోవరే = ఉద్ధరించరా; వెండియున్ = ఇంకనూ.

భావము:

“పరమ పావనుడవైన ఉద్ధవా! రాక్షసాంతకుడు అయిన కృష్ణుడు అత్యాదరంతో నీకు అనుగ్రహించిన ఆ అధ్యాత్మ తత్త్వ రహస్యాన్ని, అతి పవిత్రమైన అభిజ్ఞాన సారాన్ని అపార కృపాతిశయంతో ఇపుడే నాకు ఉపదేశించు. నా జన్మ సార్థకమౌతుంది. పుణ్యాత్ములైన గురువులు తమ శిష్యులను ధన్యాత్ములను చేస్తారు కదా.

3-164-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వద్భక్తులు సుజనులుఁ
వెఱిఁగి పరోపకారతాత్పర్యవివే
రిష్ఠులై చరింతురు
తిం బొగడొంది వృష్ణిత్తమ యెందున్."

టీకా:

భగవత్ = భగవంతుని; భక్తులు = భక్తులు; సుజనులున్ = మంచివారు; తగవెఱిగి = ధర్మముతెలిసి; పరోపకార = పరోపకారము నందలి; తాత్పర్య = నిష్ఠచేత; వివేక = వివేకమున; గరిష్ఠులు = గొప్పవారు; ఐ = అయి; చరింతురు = ప్రవర్తింతురు; జగతిన్ = లోకముచేత; పొగడు = కీర్తింపబడుటను; ఒంది = పొంది; వృష్ణి = వృష్ణికులమున పుట్టిన; సత్తమ = మహనీయుడా; ఎందున్ = ఎక్కడైనను.

భావము:

వృష్ణివంశపావనా! ఉద్ధవా! ఈ భూమండలంలో పుణ్యమూర్తులైన భగవద్భక్తులు ధర్మానురక్తులై, పరోపకార పరాయణులై ప్రవర్తిస్తారు. అటువంటి వారిని ప్రజలు ప్రస్తుతిస్తారు కదా.”