పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : హిరణ్యాక్ష వధ

 •  
 •  
 •  

3-698-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దిచెడి లోఁబడె దైత్యుఁడు
టికిన్ దంష్ట్రావిభిన్న త్రు మహోర
స్తటికిన్ ఖరఖురపుటికిం
టితటహత కమలజాండటికిం గిటికిన్.

టీకా:

దిట = పటుత్వము; చెడి = తప్పిపోయి; లోబడెన్ = లొంగెను; దైత్యుడు = హిరణ్యాక్షుడు {దైత్యుడు - దితి యొక్క పుత్రుడు, హిరణ్యాక్షుడు}; సటి = వరహావతారుని {సటి – జూలు కలది, అడవిపంది}; కిన్ = కి; దంష్ట్రావిభిన్నశత్రుమహోరస్తటి = వరహావతారుని {దంష్ట్రా విభిన్న శత్రు మహోరస్తటి - దంష్ట్రా (కోరలచే) విభిన్న (బద్ధలుకొట్టబడిన) శత్రువు యొక్క మహా (గొప్ప) ఉరస్తటి (వక్షస్థలము కలది), ఆదివరాహము}; కిన్ = కి; ఖరఖురపుటి = వరహావతారుని {ఖర ఖుర పుటి - ఖర (వాడి) యైన ఖుర (గిట్టలు) యొక్క పుటి (నేర్పుగల నడక కలది), ఆదివరాహము}; కిన్ = కి; కటితటహతకమలజాండఘటి = వరహావతారుని {కటి తట హత కమలజాండ ఘటి - కటి (మొల) తట (భాగమున) హత (కట్టబడిన) కమలజాండ (బ్రహ్మాండము అను) ఘటి (గంటకలది), ఆదివరాహము}; కిన్ = కి {కమల జాండము - కమల (పద్మము)న జ (పుట్టినవాడు) (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కిటి = వరహావతారుని; కిన్ = కి;

భావము:

మెడమీద జూలుతో, శత్రువుల గొప్ప వక్షస్థలాన్ని బద్దలు కొట్టే కోరలతో, వాడియైన గిట్టల నైపుణ్యంతో, బ్రహ్మాండము అను గంట కట్టబడిన మొలతో ఉన్న ఆ యజ్ఞవరాహానికి పటుత్వం కోల్పోయిన ఆ హిరణ్యాక్షుడు లొంగిపోయాడు.

3-699-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇట్లు లోఁబడిన.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; లోబడినన్ = లొంగిపోగా.

భావము:

ఆ విధంగా లొంగిపోగా...

3-700-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దివి నింద్రాదులు సంతసింప హరి మొత్తెం గర్ణమూలంబునం
విసంకాశకఠోరహస్తమున శుంల్లీలమై దాన దా
లోకేశుఁడు రక్తనేత్రుఁ డగుచున్ దైన్యంబు వాటిల్లగా
భువిమీఁదంబడి సోలె మారుతహతోన్మూలావనీజాకృతిన్.

టీకా:

దివిన్ = దేవలోకమున; ఇంద్ర = ఇంద్రుడు; ఆదులు = మొదలైనవారు; సంతసింపన్ = సంతోషింపగ; హరి = యజ్ఞవరహావతారుడు; మొత్తెన్ = మొత్తెను; కర్ణ = చెవి {కర్ణమూలము - చెవిగూబ}; మూలంబునన్ = క్రింది భాగమున; పవి = వజ్రాయుధము; సంకాశ = వంటి; కఠోర = కఠినమైన; హస్తమునన్ = చేతితో; శుంభత్ = మెరిసిన; లీలమై = విధముగ; దానన్ = దానితో; దానవలోకేశుడు = హిరణ్యాక్షుడు {దానవ లోకేశుడు - దానవ (రాక్షసుల యొక్క) లోకమునకు ఈశుడు (ప్రభువు), హిరణ్యాక్షుడు}; రక్త = రక్తము చిందుతున్న; నేత్రుడు = కన్నులు కలవాడు; అగుచున్ = అవుతూ; దైన్యంబున్ = దీనత్వము; వాటిల్లగన్ = కలుగగా; భువి = భూమి; మీదన్ = మీద; పడి = పడి; సోలెన్ = అలసిపోయెను; మారుతా = గాలి; హత = దెబ్బకు; ఉన్మూల = వేళ్ళతో పెళ్ళగించబడిన; అవనీజ = వృక్షము {అవనీజము - అవని (భూమి)న పుట్టినది, చెట్టు}; ఆకృతిన్ = వలె.

భావము:

ఆకాశంనుండి చూస్తున్న ఇంద్రాది దేవతలు సంతోషించే విధంగా విష్ణువు వజ్రంలాగా కఠోరమైన చేతితో హిరణ్యాక్షుని గూబమీద కొట్టాడు. ఆ దెబ్బతో రాక్షసరాజు కన్నులనుండి రక్తం చిందగా గాలిదెబ్బకు కూకటివేళ్ళతో కూలిన వృక్షంలాగా నేలపై కూలిపోయాడు.

3-701-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

బుబుడ నెత్తురు గ్రక్కుచు
వెరూపముదాల్చి గ్రుడ్లు వెలికుఱుక నిలం
డి పండ్లు గీటుకొనుచును
విడిచెం బ్రాణములు దైత్యవీరుం డంతన్.

టీకా:

బుడబుడ = బుడబుడమని శబ్దము చేయుచు; నెత్తురు = రక్తము; క్రక్కుచున్ = కక్కుకుంటూ; వెడ = వికృత; రూపమున్ = ఆకారమును; తాల్చి = ధరించి; గ్రుడ్లు = కనుగుడ్లు; వెలి = బయట; కున్ = కి; ఉఱకన్ = ఉబుకొచ్చి; నిలంబడి = ఉండి; పండ్లు = నోటి పండ్లు; గీటుకొనుచున్ = కొరుకుతూ; విడిచెన్ = వదలెను; ప్రాణములు = ప్రాణములు; దైత్యవీరుడు = హిరణ్యాక్షుడు {దైత్యవీరుడు - దైత్యుల (రాక్షసుల)లో వీరుడు, హిరణ్యాక్షుడు}; అంతన్ = అప్పుడు.

భావము:

అప్పుడా రాక్షసవీరుడు బుడబుడమని నెత్తురు కక్కుతూ, వికారమైన ఆకారంతో, కన్నులు బయటికి పొడుచుకురాగా, పండ్లు కొరుకుతూ నేలమీద పడి ప్రాణాలు విడిచాడు.

3-702-తే.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

డిన దనుజేశ్వరునిఁ జూచి ద్మసంభ
వాది దివిజులు వెఱగంది రాత్మ లందు
నితఁడు వొందుట యెట్లొకో యీ యవస్థ
ని తలంచుచు మఱియు నిట్లనిరి వరుస.

టీకా:

పడిన = పడిపోయిన; దనుజేశ్వరున్ = హిరణ్యాక్షుని {దనుజేశ్వరుడు -దనుజుల (రాక్షసుల)లో ఈశ్వరుడు (ప్రభువు), హిరణ్యాక్షుడు}; చూచి = చూసి; పద్మసంభవ = బ్రహ్మదేవుడు {పద్మసంభవుడు - పద్మమున సంభవుడు (పుట్టినవాడు), బ్రహ్మదేవుడు}; ఆది = మొదలగు; దివిజులు = దేవతలు {దివిజులు - దివి (స్వర్గము)న ఉండువారు, దేవతలు}; వెఱగున్ = ఆశ్చర్యమును; అందిరి = పొందిరి; ఆత్మలు = మనసుల; అందున్ = లో; ఇతడు = ఇతడు; పొందుట = పొందగలుగుట; ఎట్లొకో = ఎలానో; ఈ = ఈ విధమైన; అవస్థ = స్థితివిశేషమును; అని = అని; తలంచుచున్ = అనుకొనుచు; మఱియున్ = ఇంకనూ; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి; వరసన్ = వరసగా.

భావము:

అట్లా పడిన హిరణ్యాక్షుని చూచి బ్రహ్మ మొదలైన దేవతలు ఆశ్చర్యపడి తమ మనస్సులలో ‘ఇతడు ఈ అవస్థను ఎట్లా పొందాడా’ అని తలుస్తూ ఇంకా ఇలా అనుకున్నారు.

3-703-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"యోగీంద్రులు యోగమార్గముల నెవ్వానిన్ మనోవీథి సు
స్థితన్ లింగశరీరభంగమునకై చింతింతు రా పంకజో
రు పాణ్యాహతిఁ దన్ముఖాంబురుహమున్ ర్శించుచుం జచ్చె దు
ర్భరితోత్తంసుఁని దైత్య వల్లభుని సౌభాగ్యంబు దా నెట్టిదో.

టీకా:

వర = శ్రేష్ఠమైన; యోగి = యోగులలో; ఇంద్రులు = ఉత్తములు; యోగమార్గమునన్ = యోగవిధానముతో; ఎవ్వానిన్ = ఎవనినైతే; మనస్ = మానస; వీథిన్ = మార్గమున; సుస్థిరతన్ = శాశ్వతముగ; లింగశరీర = లింగశరీరము యొక్క; భంగమున్ = నాశము; కై = కొరకై; చింతింతురు = ధ్యానించెదరో; ఆ = ఆ; పంకజోదరు = భగవంతుని {పంక జోదరుడు - పంకజము (పద్మము) ఉదరమున కలవాడు, విష్ణువు}; పాణ్య = చేతితో; హతిన్ = కొట్టబడుటచే; తత్ = అతని; ముఖ = మోము అనెడి; అంబురుహమున్ = పద్మమును; దర్శించుచున్ = చూస్తూ; చచ్చెన్ = మరణించెను; దుర్భరిత = భరింపరాని వారిలో; ఉత్తంసుని = ఉత్తముని; దైత్యవల్లభుని = హిరణ్యాక్షుని {దైత్య వల్లభుడు - దైత్యుల (రాక్షసుల) కు వల్లభుడు (ప్రభువు), హిరణ్యాక్షుడు}; సౌభాగ్యంబున్ = అదృష్టము; తాన్ = అది; ఎట్టిదో = ఎలాంటిదో కాని.

భావము:

“లింగశరీరాలను భంగం చేసికొనడానికి మహా యోగిపుంగవులు యోగమార్గాల ద్వారా ఏ మహానుభావుని తమ హృదయాలలో పదిల పరచుకుంటారో ఆ మహావిష్ణువు చేతిదెబ్బ తిని, అతని ముఖపద్మాన్ని చూస్తూ చచ్చిన ఈ రాక్షసుడు ఎంత అదృష్టవంతుడో, ఎంత ఉత్తముడో?

3-704-చ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మతి వీరు దైత్యకులశాసను పారిషదుల్ మునీంద్ర శా
మున నికృష్టజన్మమునఁ బైకొని పుట్టియు నేఁడు విష్ణుచే
యుటఁ జేసి మీఁదనగు న్మమునన్ జలజాక్షు నిత్య వా
మున వసింతు రెన్నటికిఁ జావును బుట్టువు లేవు వీరికిన్."

టీకా:

సమమతిన్ = సరిగా చూస్తే; వీరు = వీరు; దైత్యకులశాసను = విష్ణుమూర్తి యొక్క {దైత్య కుల శాసనుడు - దైత్య (రాక్షస) కుల (వంశమునకు) శాసనుడు (శిక్షించువాడు), హరి}; పారిషదుల్ = కొలువులోని వారు; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుల; శాపమునన్ = శాపము వలన; నికృష్ట = నీచమైన; జన్మమునన్ = జన్మమును; పైకొని = స్వీకరించి; పుట్టియున్ = పుట్టినప్పటికిని; నేడు = ఈనాడు; విష్ణు = విష్ణుమూర్తి; చేన్ = చేత; సమయుటన్ = మరణించుట; చేసి = వలన; మీదనగు = రాబోవు; జన్మమునన్ = జన్మములో; జలజాతాక్షు = విష్ణుమూర్తి యొక్క {జలజాతాక్షుడు - జలజాతము (పద్మము) వంటి అక్షుడు (కన్నులు ఉన్నవాడు), హరి}; నిత్య = శాశ్వతమైన; వాసమునన్ = నివాసమందు; వసింతురు = నివసించెదరు; ఎన్నటికిన్ = ఎప్పటికిని; చావు = మరణము; పుట్టువు = జన్మములు; లేవు = లేవు; వీరి = వీరి; కిన్ = కి.

భావము:

వీళ్ళు శ్రీహరి యొక్క ద్వారపాలకులే కదా! మునీశ్వరుల శాపం వల్ల ఈ నీచ రాక్షసజన్మను పొంది ఈరోజు విష్ణువు చేతనే చావడం వల్ల వచ్చే జన్మలో వైకుంఠంలో శాశ్వతంగా నివసిస్తారు. వీళ్ళకు ఇక చావు పుట్టుకలు ఉండవు.”

3-705-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ని వెఱగు నొంది త్రిసవన
ను వొందిన యట్టి వికచతామరసాక్షు
న్ననిమిష ముని యోగిజనా
దక్షున్ దనుజకరటిరహర్యక్షున్.

టీకా:

అని = అనుకొనుచు; వెఱగున్ = ఆశ్చర్యమును; పొంది = పొంది; త్రి = మూడు (3); సవన = యజ్ఞ ముల స్వరూపమైన; తనువున్ = దేహమును; పొందిన = ధరించిన; అట్టి = అటువంటి; వికచతామరసాక్షున్ = యజ్ఞవరహావతారుని {వికచ తామర సాక్షుడు -వికచ (వికసించిన) తామర (పద్మముల) స (వంటి) అక్షుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు}; అనిమిష ముని యోగి జనావన దక్షున్ = యజ్ఞవరహావతారుని {అనిమిషమునియోగిజనావనదక్షుడు - అనిమిష (దేవతలు) మునులు యోగులు ఐన జనములను అవన (రక్షించుట) యందు దక్షుడు (సమర్థుడు), విష్ణువు}; దనుజకరటివరహర్యక్షున్ = యజ్ఞవరహావతారుని {దనుజ కరటి వర హర్యక్షుడు - దనుజులు (రాక్షసులు) అను కరటి (ఏనుగు)ల వర (రాజు)కు హర్యక్షుడు (సింహము వంటివాడు)}.

భావము:

అని అనుకొంటూ ఆశ్చర్యపడి పరమ పవిత్రమైన శరీరాన్ని ధరించినవాడూ, వికసించిన కమలాల వంటి కన్నులు కలవాడూ, దేవతలనూ మునులనూ రక్షించడంలో సమర్థుడూ, రాక్షసులనే ఏనుగులకు సింహం వంటివాడూ అయిన విష్ణువును (చూచారు).