తృతీయ స్కంధము : బ్రహ్మస్తవంబు
- ఉపకరణాలు:
బాలుఁడు గరమున నుగ్ర
వ్యాళము ధరియించి యాడు వడుపున రక్షః
పాలునిఁ ద్రుంపక యూరక
పాలార్చుట నీతియే శుభప్రద! యింకన్.
టీకా:
బాలుడు = చిన్నపిల్లవాడు; కరమునన్ = చేతిలో; ఉగ్ర = భయంకరమైన; వ్యాళమున్ = సర్పమును; ధరియించి = ధరించి; ఆడు = ఆడుకొను; వడుపునన్ = విధముగ; రక్షస = రాక్షస; పాలునిన్ = రాజుని; త్రుంపక = సంహరించకుండగ; ఊరక = ఉత్తినే; పాలార్చుటన్ = ఉపేక్షించుట; నీతియే = పద్ధతా ఏమి; శుభప్రద = ఆదివరాహ {శుభప్రదుడు - శుభకరుడు, విష్ణువు}; ఇంకన్ = ఇంకనూ.
భావము:
శుభకరా! చిన్న పిల్లవాడు చేతిలో భయంకర సర్పాన్ని పట్టుకొని ఆడుకొనే విధంగా ఈ రాక్షసరాజును చంపకుండా ఊరికే ఉపేక్షించడం మంచిదా?