పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : బ్రహ్మణ ప్రశంస

  •  
  •  
  •  

3-590-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నకాదు లంతఁ బులకాంకురముల్ ననలొత్త బాష్పధా
రా సుభగాక్షులై మునిశణ్యవరేణ్యు నగణ్యు దేవతా
గ్రేరు దివ్యమంగళశరీరముఁ జారు తదీయ ధామమున్
భాసుర లీలఁ జూచి నవద్మదళాక్షునకున్ వినమ్రులై.

టీకా:

ఆ = ఆ; సనక = సనకుడు; ఆదులు = మొదలగువారు; అంతన్ = అంతట; పులకాంకురముల్ = పులకింతలు; ననలొత్త = చిగురించగా; బాష్ప = కన్నీటి; ధారా = ధారలతో; సుభగ = సౌభాగ్యముచెందిన; అక్షులు = కన్నులు కలవారు; ఐ = అయ్యి; మునిశరణ్యవరేణ్యున్ = హరిని {ముని శరణ్య వరేణ్యుడు - మునులకు రక్షణ ఒసగు శ్రేష్ఠుడు, విష్ణువు}; అగణ్యున్ = హరిని {అగణ్యుడు - ఇంతవాడని గణించుటకు అందని వాడు, విష్ణువు}; దేవతాగ్రేసరున్ = హరియొక్క {దేవ తాగ్రేసరుడు - దేవతలలో గొప్పవాడు, విష్ణువు}; దివ్య = దివ్యమైన; మంగళ = శుభకరమైన; శరీరమున్ = దేహమును, విగ్రహమును; చారు = మనోహరమైన; తదీయ = అతని; ధామమున్ = నివాసమును (వైకుంఠమును); భాసుర = చక్కటి; లీలన్ = విధముగ; చూచి = చూసి; నవపద్మదళాక్షున్ = భగవంతుని {నవ పద్మద ళాక్షుడు - నవ (లేత) పద్మముల వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; కున్ = కి; వినమ్రులు = మిక్కిలి వినయము కలవారు; ఐ = అయ్యి.

భావము:

అప్పుడా సనకాదులు పులకింత మొలకెత్తగా, ఆనందబాష్ప ధారలు కనులవెంట ప్రవహించగా మునులు శరణు కోరే ఉత్తముడూ, ఇంతవాడని అంతవాడని లెక్కింపరానివాడూ, దేవతలలో శ్రేష్ఠుడూ అయిన విష్ణువుయొక్క దివ్యమంగళ శరీరాన్ని, అతని వైకుంఠ మందిరాన్ని సందర్శించి క్రొంగ్రొత్త తామర రేకులవంటి కన్నులు గల అతనికి నమస్కరించి...