పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-44-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యెడఁ గాలు దన్నక రయంబున నేఁగి సరస్వతీనదీ
తోములందుఁ గ్రుంకి మునితుల్యుఁడు వే చనియెం దనూనపా
త్తోరుహాప్త భార్గవ పృథుత్రిత సోమ సుదాస శక్తి భృ
ద్వాయు యమాభిధానయుత వాహినులం దనురక్తిఁ గ్రుంకుచున్.

టీకా:

ఆ = ఆ; ఎడన్ = సమయములో; కాలు = కాలు; తన్నక = నిలువక; రయంబునన్ = శ్రీఘ్రముగా; ఏగి = వెళ్ళి; సరస్వతీ = సరస్వతి అను; నదీ = నది యొక్క; తోయములు = నీటి; అందున్ = లో; క్రుంకి = స్నానముచేసి; ముని = మునులతో; తుల్యుడు = సమానమైనవాడు; వేచనియెం = వెళ్ళివెళ్ళి; తనూనపాత్ = అగ్నిహోత్ర; తోయరుహాప్త = సూర్య {తోయరుహాప్త - తోయ (నీట) రుహ (పుట్టిన, మొలచిన) (పద్మము)లకు ఆప్తుడు, సూర్యుడు}; భార్గవ = భార్గవ {భార్గవుడు - భర్గుని కొడుకు, పరశురాముడు}; పృథు = పృథు {పృథు - పృథుచక్రవర్తి}; త్రిత = త్రిత; సోమ = సోమ {సోముడు - చంద్రుడు}; సుదాస = సుదాస; శక్తిభృత్ = కుమారస్వామి; వాయు = వాయు; యమ = యమ; అభిదాన = పేర్లు; యుత = కల; వాహినులు = నదులు; అందున్ = లో; అనురక్తిన్ = ఇష్టముగ; క్రుంకుచున్ = స్నానముచేయుచు.

భావము:

విదురుడికి ఇక అక్కడ ఉండడానికి కాలు నిలబడలేదు. మునిసమానుడైన ఆ విదురుడు వెంటనే యాత్రలకు మరల బయలుదేరాడు. సరస్వతీ నదిలో స్నానంచేసాడు. అనంతరం అగ్ని, సూర్య, శుక్ర, పృథు, త్రిత, సోమ, సుదాస, కుమార, వాయు, యమ ఇత్యాది దేవతానామాలతో ప్రసిద్ధమైన నదులలో ఆసక్తితో స్నానాలు చేసాడు.