పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : యుద్ధవ దర్శనంబు

  •  
  •  
  •  

3-43-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వర! వేణుజానలవిష్ట మహాటవిమాడ్కిఁ బాండు భూ
ధృతరాష్ట్ర సూను లనివార్య నిరూఢ విరోధ మెత్తి యొం
డొరుల జయింపఁ గోరి కదనోర్విఁ గురుక్షితిపాలముఖ్యు లం
ఱు మృతు లౌటయున్ విని ఘనంబుగ శోకనిమగ్నచిత్తుఁడై.

టీకా:

నరవర = రాజా {నరవరుడు - నరులకు వరుడు, రాజు}; వేణు = వెదుళ్ళ కు; జ = పుట్టిన; అనల = నిప్పు వలన; వినష్ట = బాగా నశించిన; మహా = గొప్ప; అటవి = అడవి; మాడ్కిన్ = వలె; పాండుభూవర = పాండురాజు; ధృతరాష్ట్ర = ధృతరాష్ట్రుల; సూనులు = కొడుకులు; అనివార్య = వారింపలేని; నిరూఢ = పాతుకుపోయిన; విరోధమున్ = వైరమును; ఎత్తి = వహించి; ఒండొరులన్ = ఒకరి నొకరు; జయింపన్ = జయించుటను; కోరి = కోరుకొని; కదన = రణ; ఉర్విన్ = రంగమున; కురు = కురువంశపు; క్షితిపాల = రాజులలో {క్షితిపాలుడు - భూమిని పాలించువాడు, రాజు}; ముఖ్యులున్ = ముఖ్యమైనవారు; అందఱున్ = అందరూ; మృతులు = మరణించినవారు; ఔటన్ = అవుటను; విని = విని; ఘనంబుగన్ = ఎక్కువగా; శోక = దుఃఖమున; నిమగ్న = మునిగిన; చిత్తుడు = చిత్తము కలవాడు; ఐ = అయి.

భావము:

రాజా! పరీక్షిత్తూ! అప్పుడు ఆ విదురునికి కురుక్షేత్రసంగ్రామం సంగతి తెలిసింది. కౌరవులూ, పాండవులూ వారింపరాని వైరాలతో మహా ఘోరమైన యుద్ధం చేసారనీ, పరస్పర విజయోత్కంఠతో జరిగిన ఆ కురుక్షేత్ర మహాసంగ్రామంలో, వెదురుపొదలలో పుట్టే దావాగ్నిలో దగ్ధమయ్యే అడవిలాగా దుర్యోధనాది కురుకుమార సమూహమంతా నశించారనీ విని విదురుడు పట్టరాని శోకంలో మునిగాడు.