పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : శ్రీహరి దర్శనంబు

  •  
  •  
  •  

3-537.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖిల యోగీంద్రజన సేవ్యుఁ డైన వాఁడు
సాధుజనముల రక్షింపఁ జాలు వాడు
భువన చూడా విభూషయై భూరిమహిమ
మించు వైకుంఠపురము భూషించు వాఁడు.

టీకా:

నిఖిల = సమస్తమైన; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులచేత; వర్ణిత = కీర్తింపబడు; సస్మిత = చిరునవ్వుతో కూడిన; ప్రసన్న = ప్రసన్నమైన; ఆనన = మోము అనెడి; అంబుజము = పద్మము; చేన్ = చేత; అలరువాడు = ఒప్పువాడు; విశ్రుత = ప్రసిద్దికెక్కిన; స్నేహ = ప్రేమతో; ఆర్ద్ర = చెమ్మగిలిన; వీక్షణ = కన్నులు కల; నిజ = తన; భక్త = భక్తులైన; జన = జనుల; గుహా = హృదయములందు; ఆశయుడు = నివసించువాడు; అనన్ = అనగా; తనరువాడు = అతిశయించువాడు; మానిత = గౌరవింపబడిన; శ్యామా = నల్లని; అయమాన = రంగుకల; వక్షమునన్ = వక్షస్థలమున; అంచిత = అలంకరింపబడిన; వైజయంతి = వైజయంతి అను మాలచేత; రాజిల్లువాడు = విరాజిల్లువాడు; నత = స్తుతిస్తున్న; జన = జనులు అను; అవన = రక్షించునట్టి; కృపా = దయఅను; అమృత = అమృతతో; తరంగితములు = తౌణుకుచున్నవి; ఐ = అయ్యి; భాసిల్లు = ప్రకాశించు; లోచన = కన్నులు అను; అబ్జములవాడున్ = పద్మములుకలవాడును; అఖిల = సమస్తమైన; యోగి = యోగులలో; ఇంద్ర = ఉత్తములైన; జన = జనులచే; సేవ్యుండు = సేవింపబడువాడు; ఐన = అయిన; వాడు = వాడు;
సాధు = మంచి; జనములన్ = జనులను; రక్షింపన్ = రక్షించుటకు; చాలువాడు = సమర్థుడు; భువన = సకల భువనములకు; చూడావిభూష = శిరోమణి అను ఆభరణము వంటిది; ఐ = అయ్యి; భూరి = గొప్ప; మహిమన్ = మహిమతో; మించు = అతిశయించు; వైకుంఠ = వైకుంఠము అను; పురమున్ = పురమునకు; భూషించువాడు = ఆభరణము వంటివాడు.

భావము:

ఆ శ్రీహరి మునీశ్వరు లందరూ వర్ణించే మందహాస సుందరమైన ప్రసన్న ముఖపద్మంతో అలరేవాడు. విశేషమైన ప్రేమతో చెమ్మగిల్లిన కన్నులున్న తన భక్తజనుల హృదయాలలో నివసిస్తూ తనరేవాడు. విశాలమైన నల్లని వక్షస్థలంపై వైజయంతి అనే మాలచేత అలంకరింపబడి రాజిల్లేవాడు. నమస్కరించే జనులను రక్షించడంలో దయామృత తరంగాలు పొంగిపొరలే పద్మనేత్రాలు కలవాడు. ఆ విష్ణువు యోగిపుంగవు లందరిచేత సేవింపబడేవాడు. సజ్జనులను రక్షించడానికి సమర్థుడైనవాడు. అత్యంత మహిమాన్వితమై అఖిలలోకాలకు చూడామణి అయిన వైకుంఠపురాన్ని అలంకరించేవాడు.