పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : దితికశ్యప సంవాదంబు

  •  
  •  
  •  

3-450-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఆకర్ణింపుము.

టీకా:

ఆకర్ణింపుము = వినుము.

భావము:

అట్టి విష్ణు కథలు చెప్తాను శ్రద్ధగా విను.

3-451-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లిసి దక్షప్రజాతితనూభవ దితి-
సంతానరుచి మానమునఁ బొడమ
నొనాడు పుష్పసాశరనిర్భిన్న-
భావ యై విరహతామున వచ్చి
తిసమాగమవాంఛ ప్రభవింప నిజనాథు-
న్నిథి నిలిచి యస్ఖలితనియతి
గ్నిజిహ్వుండును జురధీశుండును-
గు విష్ణుఁ దన చిత్తమందు నిలిపి

3-451.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గఁ బయస్సున నగ్నిహోత్రంబు సేసి
మలహితుఁ డస్తశైలసంతుఁడు గాఁగ
హోమశాలాంగణమునఁ గూర్చున్న విభునిఁ
శ్యపునిఁ గాంచి విమలవాక్యముల ననియె.

టీకా:

బలిసిన్ = అతిశయించి, మదించి; దక్ష = దక్షుడు అను; ప్రజాపతిన్ = ప్రజాపతి యొక్క; తనూభవ = కూతురు; దితి = దితి; సంతాన = సంతానము పై; రుచిన్ = కోరికతో; మానసమునన్ = మనసులో; పొడమన్ = కలుగగా; ఒక = ఒక; నాడు = రోజు; పుష్పసాయక = మన్మథుని {పుష్పసాయకుడు - పుష్పముల బాణములు కల వాడు, మన్మథుడు}; శర = బాణములచే; నిర్భిన్న = బాగాకొట్టబడిన; భావ = భావములు కలది; ఐ = అయ్యి; విరహ = విరహము వలన; తాపమునన్ = బాధ; వచ్చి = కలిగి; పతి = భర్తతో; సమాగమ = కలవవలెనను; వాంఛన్ = కోరిక; ప్రభవింపన్ = అతిశయించగా; నిజ = తన; నాథున్ = భర్త; సన్నిథిన్ = దగ్గర; నిలిచి = నిలబడి; అస్ఖలిత = స్ఖలించను అను; నియతిన్ = నియమముతో; అగ్నిజిహ్వుండును = విష్ణుమూర్తి {అగ్నిజిహ్వుడు - అగ్నియే నాలుకగా కలవాడు, భగవంతుడు}; యజురధీశ్వరుండును = విష్ణుమూర్తి {యజురధీశ్వరుండు - యజుర్వేదమునకు అధికారి, భగవంతుడు}; అగు = అయిన; విష్ణున్ = విష్ణుని; తన = తన; చిత్తము = మనసు; అందున్ = అందు; నిలిపి = నిలుపుకొని;
తగన్ = తగినట్లు; పయస్యునన్ = నేతితో {పయస్యము - పయస్సు (పాల) నుండి వచ్చినది, నెయ్యి}; అగ్నిహోత్రంబున్ = అగ్నిహోత్రమును {అగ్నిహోత్రము - హోమగుండము లోని అగ్నియందు వేల్చుట ద్వారా చేయు యాగము}; చేసి = చేసి; కమలహితుడు = సూర్యుడు {కమలహితుడు - కమలములకు హితమైనవాడు, సూర్యుడు}; అస్త = పడమటి (అస్తమించు దిక్కు); శైల = కొండకు; సంగతుడు = చేరినవాడు; కాగా = అవ్వగా; హోమ = హోమము చేయు; శాల = శాలయొక్క; అంగణమునన్ = ముంగిట; కూర్చున్న = కూర్చున్న; విభునిన్ = భర్తను; కశ్యపునిన్ = కశ్యపుడిని; కాంచి = చూసి; విమల = నిర్మలమైన; వాక్యములన్ = మాటలతో; అనియెన్ = పలికెను.

భావము:

దితి దక్షప్రజాపతి పుత్రిక, కశ్యపప్రజాపతి భార్య. ఒకరోజు ఆమె మనస్సులో సంతానకాంక్ష పెల్లుబికింది. మన్మథుని పుష్ప బాణాలు ఆమె హృదయాన్ని అల్లకల్లోలం చేశాయి. విరహవేదన భరించలేక తన పతి దగ్గరకు భోగవాంఛతో వెళ్ళింది. ఆయన అప్పుడే నిశ్చల నియమంతో వేదవేద్యుడూ, జ్యోతిర్మయుడూ అయిన మహావిష్ణువును ఉద్దేశించి యథావిధిగా అగ్నికార్యం నెరవేర్చి, సూర్యాస్తమయ సమయంలో హోమశాల ముందర కూర్చుని ఉన్నాడు. ఆయనతో ఆమె వినయంగా ఇట్లా అంది.

3-452-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"విభుఁ డుద్ధతిన్ననఁటికంబములన్ విదళించు లీలఁ జి
త్తజుఁడు ప్రసూనసాయకవితానముచేత మదీయచిత్తమున్
జిబిజి సేసి నెవ్వగలఁ గాఱియవెట్టఁగ నాథ! నీ పదాం
బుములఁ గానవచ్చితి బ్రభుత్వమెలర్పఁగ నన్నుఁ గావవే!

టీకా:

గజ = ఏనుగుల; విభుడు = రాజు; ఉద్దతిన్ = దుడుకుతనముతో; అనటి = అరటి; కంబములన్ = స్తంభములను; విదళించు = తెగవేయు, తురుమివేయు; లీలన్ = విధముగా; చిత్తజుడు = మన్మథుడు {చిత్తజుడు - మనసున పుట్టువాడు, మన్మథుడు}; ప్రసూన = పుష్పముల; సాయక = బాణముల; వితానమున్ = సమూహము, విరివి; చేతన్ = చేత; మదీయ = నా యొక్క; చిత్తమున్ = మనసును; గజిబిజిచేసి = కలతపరచి; నెవ్వగలన్ = నిండుమాయలతో; కాఱియన్ = యాతన; పెట్టగన్ = పెట్టగా; నాథ = భర్తా; నీ = నీ యొక్క; పద = పాదములు అను; అంబుజములన్ = పద్మములను; కానగన్ = వెతుక్కుంటూ; వచ్చితిన్ = వచ్చితిని; ప్రభుత్వము = సామర్థ్యము చూపుట; ఎలర్పగన్ = అతిశయించునట్లు; నన్నున్ = నన్ను; కావవే = కాపాడుము.

భావము:

“ప్రాణేశా! అరటిచెట్టును పట్టి గజరాజు గజిబిజి చేసినట్లు, రతిరాజు మన్మథుడు తన పదునైన పూలబాణాలతో నా హృదయాన్ని కదిలించి వేస్తున్నాడు. ఆ బాధ భరించలేక నీ పాదపద్మాల దగ్గరకు వచ్చాను. నీ ఆధిపత్యం పటుత్వం ప్రదర్శించి నన్ను కాపాడు.

3-453-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అదియునుం గాక నా తోడిసవతు లెల్లను భవత్కృపావిశేషంబున గర్భాదానంబులు వడసి నిర్భరానందంబున నుండం జూచి శోకవ్యాకులితచిత్త నై యున్న నన్ను రక్షించుట పరమ ధర్మంబు నీవు విద్వాంసుడవు నీ యెఱుంగని యర్థంబు గలదే? నీ వంటి మహానుభావు లయిన సత్పురుషు లార్తులైన వారి కోర్కులు వ్యర్థంబులు గాకుండఁ దీర్చుట ధర్మం" బని; వెండియు నిట్లనియె.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగా; నా = నా యొక్క; తోడి = తోటి; సవతులు = సపత్నులు; ఎల్లను = అందరును; భవత్ = నీ యొక్క; కృపా = దయ యొక్క; విశేషంబునన్ = విశేషము వలన; గర్భా = గర్భమును; దానంబులున్ = చేయబడుటను; పడసి = పొంది; నిర్భర = పట్టరాని; ఆనందమునన్ = ఆనందము నంది; ఉండన్ = ఉండగా; చూచి = చూసి; శోక = దుఃఖముతో; వ్యాకులిత = చీకాకుపడిన; చిత్తను = మనసు కలదానను; ఐ = అయి; ఉన్న = ఉన్నట్టి; నన్నున్ = నన్ను; రక్షించుట = రక్షించుట; పరమ = ఉత్తమమైన; ధర్మము = ధర్మము; నీవున్ = నీవు; విద్వాంసుడవు = పండితుడవు; నీ = నీకు; ఎఱుంగని = తెలియని; అర్థంబున్ = విషయము; కలదే = ఉందా ఏమి; నీవంటి = నీలాంటి; మహానుభావులు = గొప్పవారు; అయిన = అయినట్టి; సత్ = మంచి; పురుషులు = పురుషులు; ఆర్తులు = బాధ చెందినవారు; ఐనవారి = అయినవారి; కోర్కులు = కోరికలు; వ్యర్థంబులు = వ్యర్థము; కాకుండగ = అయిపోకుండగ; తీర్చుటన్ = తీర్చుట; ధర్మంబు = ధర్మము; అని = అని; వెండియున్ = మరల; ఇట్లు = ఈవిధముగా; అనియెన్ = పలికెను.

భావము:

అంతేకాకుండా నా సవతులు అందరు నీ కృపవల్ల గర్భవతులై ఎంతో సంతోషంతో ఉన్నారు. నేనే శోకంతో వ్యాకులమైన మనస్సుతో అలమటిస్తున్నాను. ఆర్తురాలనైన నన్ను రక్షించటం నీకు పరమ ధర్మము. నీవు విద్వాంసుడవు, నీకు తెలియని విషయాలు ఏమీ లేవు. నీ వంటి సత్పురుషులైన మహానుభావులకు నా వంటి ఆర్తులను, రక్షించి వారి కోరికలు సఫలం చేయటం పరమ ధర్మం కదా.” అని మళ్ళీ ఇలా అన్నది.

3-454-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పతిసమ్మానము వడసిన
తులకు నభిమతపదార్థసంసిద్ధియు నూ
ర్జి యశముఁ గలిగి లోక
స్తు మై చెలువారుచుండు జువ్వె, మహాత్మా!

టీకా:

పతి = భర్త; సమ్మానము = సన్మానము, గౌరవము; పడసిన = పొందిన; సతుల = భార్యల; కున్ = కు; అభిమత = కోరిన; పదార్థ = వస్తువులు; సంసిద్ధియున్ = సిద్ధించుటయును; ఊర్జిత = దృఢమైన, గట్టి; యశమున్ = కీర్తియును; కలిగి = పొంది; లోక = లోకులచే; స్తుతము = స్తుతింపబడుట; ఐ = కలిగి; చెలువారుచున్ = చక్కతనము పొందుతూ; ఉండున్ = ఉండును; సువ్వె = సుమా; మహాత్మా = మహత్మా.

భావము:

“ఓ మహానుభావా! పతి వద్ద గౌరవం సంపాదించిన సతులకు కోరిన కోరికలు తీరుతాయి. గొప్ప కీర్తి లభిస్తుంది. అటువంటి వారు లోకుల పొగడ్తలను అందుకుంటూ విలసిల్లుతారు.

3-455-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ధర్మపత్నివలనను
మునుకొని తాఁ బుత్రరూపమున నుదయించున్
విను దీప మందు ముట్టిం
చి దీపము రెండు గావె శిఖి యొకటయ్యున్.

టీకా:

తన = తన; ధర్మపత్ని = భార్య; వలనన్ = వలనను; మునుకొని = పూని; తాన్ = తాను; పుత్ర = పుత్రుని; రూపమునన్ = రూపములో; ఉదయించున్ = పుట్టును; విను = వినుము; దీపము = దీపము; అందున్ = అందు; ముట్టించిన = ముట్టించిన ఎడల; దీపమున్ = దీపము; రెండు = రెండు (2); కావె = కావా ఏమి; శిఖి = అగ్నిహోత్రము; ఒకటి = ఒకటి; అయ్యున్ = అయినప్పటికిని.

భావము:

అగ్ని శిఖ ఒకటే అయినప్పటికీ, దీపముతో ముట్టించిన దీపము రెండు దీపములు అయినట్లు, పురుషుడు తన భార్య యందు పుత్రరూపంలో జన్మిస్తాడు.

3-456-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున నీ యర్థమ యా
త్మావై పుత్ర యని వేద తులం దోలిన్
వావిరిఁ బలుకఁగ వినవే
ధీర! నను గావు మధికదీనన్ కరుణన్.

టీకా:

కావున = కనుక; ఈ = ఈ; అర్థమ = అర్థము లోనే; ఆత్మావై = నీవే పుట్టుదువు; పుత్ర = పుత్రునిగా; అని = అని; వేద = వేదముల; తతిన్ = సమూహములు; ఓలిన్ = చక్కగా; వావిరి = నొక్కి; పలుకగన్ = చెప్పుచుండుట; వినవే = వినలేదా; ధీ = బుద్ధిమంతులలో; వర = శ్రేష్ఠుడా; ననున్ = నన్ను; కావుము = కాపాడుము; అధిక = మిక్కిలి; దీనన్ = దీనురాలిని; కరుణన్ = దయతో.

భావము:

ఈ విషయాన్ని, ఆత్మస్వరూపుడైన తానే కుమారుడై జన్మిస్తాడు. ఆత్మావై పుత్రా. అని వేదాలు చెబుతున్నాయి. ఇది నీకు తెలియని విషయం కాదు. అతి దీనంగా ఉన్న నన్ను కరుణతో కాపాడు. పరమ బుద్ధిశాలీ!

3-457-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కరుణామతిన్ దుహితృ త్సలతం దనరారు నట్టి మ
ద్గురుఁ డొకనాడు మమ్ముఁ దన కూతుల నందఱఁ బిల్చి మీ మనో
రునెఱిఁగింపుఁ డిత్తుఁ గమలాననలార! యటన్న నందులోఁ
బురుషవరేణ్య! యేము పదమువ్వుర మర్మిలినిన్ వరింపమే."

టీకా:

వర = మంచి; కరుణా = దయగల; మతిన్ = మనసుతో; దుహిత్రున్ = పుత్రికల ఎడలి; వత్సలతన్ = వాత్సల్యముతో; తనరారున్ = విలసిల్లు; అట్టి = అటువంటి; మత్ = మా యొక్క; గురుడు = తండ్రి {గురువులు - 1 కన్నతండ్రి 2 పెంచినతండ్రి 3 ఉపాధ్యాయుడు 4 బృహస్పతి 5 కులముపెద్ద 6 తండ్రితోడ పుట్టిన వాడు 7 తాత 8 అన్న 9 మామ 10 మేనమామ 11 రాజు 12 కాపాడినవాడు}; ఒక = ఒక; నాడు = రోజు; మమ్మున్ = మమ్మల్ని; తన = తన యొక్క; కూతులన్ = కూతుళ్లను; అందఱన్ = అందరిని; పిల్చి = పిలిచి; మీ = మీ యొక్క; మనోహరున్ = మనసుకు నచ్చిన వానిని; ఎఱింగింపుడు = తెలుపండి; ఇత్తున్ = ఇచ్చెదను; కమలాననలార = అమ్మాయిలూ {కమలాననలు - పద్మములవంటి అననము (ముఖము)లు కలవారు, స్త్రీలు}; అటన్ = అని; అన్నన్ = అనగా; అందులో = అందులకు; పురుష = పురుషులలో; వరేణ్య = శ్రేష్ఠుడా; ఏము = మేము; పదమువ్వురమున్ = పదముగ్గురమును (13); అర్మిలిన్ = కోరికతో; నిన్ = నిన్ను; వరింపమే = వరించితిమా లేదా.

భావము:

ఓ పురుషశ్రేష్ఠుడా! దయాశాలి అయిన మా తండ్రి దక్ష ప్రజాపతికి ఆడపిల్లలంటే ఎంతో అభిమానం. ఆయన ఒకనాడు కూతుళ్లను మమ్మల్ని అందరిని పిల్చి, “కమలాల వంటి కన్నులు గల మా అందాల పుత్రికలూ! మీ మనస్సుకు నచ్చిన భర్తలను తెలియజేయండి ఇచ్చి పెండ్లి చేస్తాను” అని అడిగాడు. అప్పుడు మేము పదమూడు మందిమి నీ పేరు చెప్పి నిన్నే వరించాం కదా.”

3-458-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దితి యీగతిఁ గామవిమో
హిమతి బహువచనముల హృదీశునిఁ బలుకన్
ధృతిఁ గృపణఁ బతివ్రత నిజ
తిఁ గని కశ్యపుఁడు పలికె ల్లాపమునన్.

టీకా:

దితి = దితి; ఈ = ఈ; గతిన్ = విధముగా; కామ = కామముచేత; విమోహిత = మిక్కిలి మోహము చెందిన; మతిన్ = మనసుతో; బహు = అనేక; వచనములన్ = మాటలతో; హృదీశునిన్ = భర్తతో {హృదీశుడు - హృదయేశ్వరుడు, మనసునకు పెద్దదేవుడు, భర్త}; పలుకన్ = అనగా; ధృతిన్ = నిశ్చయమైన; కృపణన్ = దయతో; పతివ్రతన్ = పతివ్రతను; నిజ = తన; సతిన్ = భార్యను; కని = చూసి; కశ్యపుడు = కశ్యపుడు; పలికెన్ = పలికెను; సత్ = మృదువైన; ఆలాపములన్ = మాటలతో.

భావము:

అని కామంతో మోహితురాలు అయిన దితి దీనంగా అనేక సార్లు అర్థించింది. అప్పుడు ధృతిమంతుడైన కశ్యపుడు ఆర్తురాలు, పతివ్రత, తన సతి అయిన దితిని అనునయిస్తూ ఇలా అన్నాడు.

3-459-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీవు చెప్పిన యట్ల పురుషులకు నంగనలవలన ధర్మార్థకామంబులు సిద్ధించు; కర్ణధారుఁడు నావచేతం బయోధిఁ గడచు చందంబున వ్యసనార్ణవంబు దరియింపం జేయు భార్య పురుషునందు నర్దంబు; భార్యయందు సకల గృహకార్య భారంబునుం జేర్చి పురుషుండు నిశ్చింతుండై సుఖియించుచుండు; మఱియు నితరాశ్రమ దుర్జయంబు లైన యింద్రియ శత్రువర్గంబుల భార్యాసమేతుం డైన గృహస్థుండు దుర్గాధిపతి యైన రాజు శత్రు సంఘంబుల జయించు చందంబున లీలామాత్రంబునం జయించు; ఇట్టి కళత్రంబునకుం బ్రత్యుపకారంబు సేయ సకలగుణాభిరాము లగు సత్పురుషులు నూఱేండ్లకును జన్మాతరంబులకు నైన సమర్థులుగారు; అనిన మము బోటివారలు సేయ నోపుదురే? ఐన నీ మనంబుంనం గల దుఃఖంబు దక్కు" మని, యిట్లనియె.

టీకా:

నీవున్ = నీవు; చెప్పిన = చెప్పిన; అట్ల = విధముగనే; పురుషుల్ = పురుషుల; కున్ = కు; అంగనల = భార్యల; వలనన్ = వలన; ధర్మ = ధర్మము; అర్థ = అర్థము; కామంబులున్ = కామములు; సిద్ధించున్ = కలుగును; కర్ణధారుడు = పడవ నడుపువాడు {కర్ణధారుడు - కర్ణము (చుక్కాని) ధారుడు (పట్టువాడు), పడవ నడుపు వాడు, మార్గదర్శి}; నావ = పడవ; చేతన్ = చేత; పయోధిన్ = సముద్రమును {పయోధి - నీరు కి నిధి వంటిది, సముద్రము}; కడచు = దాటు; చందంబునన్ = విధముగనే; వ్యసన = వ్యసనములు అను; ఆర్ణవమున్ = సముద్రమును; తరియింపన్ = దాటునట్లు; చేయున్ = చేసెడి; భార్య = భార్య, పెండ్లాము; పురుషున్ = పురుషుని; అందున్ = లో; అర్థంబున్ = సగము; భార్య = పత్ని; అందున్ = అందు; సకల = సమస్తమైన; గృహ = ఇంటి; కార్య = పనుల; భారంబునున్ = బరువును; చేర్చి = పెట్టి; పురుషుండు = పురుషుడు; నిశ్చింతుడు = ఏ బాధ లేనివాడు; ఐ = అయి; సుఖియించుచున్ = సుఖపడుతూ; ఉండున్ = ఉండును; మఱియున్ = ఇంకనూ; ఇతర = ఇతరమైన; ఆశ్రమ = ఆశ్రమములలో {ఆశ్రమములు - చతురాశ్రమములు, 1 బ్రహ్మచర్య 2 గార్హస్థ 3 వానప్రస్థ 4 సన్యాస ఆశ్రమములు}; దుర్జయంబులు = జయింపరానివి; ఐన = అయిన; ఇంద్రియ = ఇంద్రియములు అను; శత్రు = శత్రువుల; వర్గంబులన్ = సమూహములను; భార్యా = పత్నితో; సమేతుండు = కూడినవాడు; ఐన = అయిన; గృహస్థుండు = గృహస్థుడు; దుర్గా = కోటకు; అధిపతి = అధిపతి; ఐన = అయిన; రాజు = రాజు; శత్రు = శత్రువుల; సంఘంబులన్ = సమూహములను; జయించున్ = జయించే; చందంబునన్ = విధముగా; లీలామాత్రంబునన్ = సుళువుగా; జయించున్ = జయించును; ఇట్టి = ఇటువంటి; కళత్రంబునన్ = భార్య; కున్ = కి; ప్రత్యుపకారము = బదులు ఉపకారము; చేయన్ = చేయుట; సకల = సమస్తమైన; గుణ = సుగుణములతో; అభిరాములు = ప్రకాశించువారు; అగు = అయిన; సత్ = మంచి; పురుషులు = పురుషులు; నూఱు = వంద (100); ఏండ్లు = సంవత్సరముల; కున్ = కును; జన్మ = జన్మలకొద్దీ; అంతరములు = సమయములు; కున్ = కును; ఐనన్ = అయినను; సమర్థులు = సరిపడువారు; కారు = కాలేరు; అనిన = అంటే యింక; మమున్ = మా; బోటి = లాంటి; వారలు = వారు; చేయన్ = చేయుటకు; ఓపుదురే = సమర్థులా ఏమి; ఐనన్ = అయినప్పటికిని; నీ = నీ యొక్క; మనంబునన్ = మనసులో; కల = ఉన్నట్టి; దుఃఖంబున్ = దుఃఖమును; తక్కుము = వదులుము; అని = అని; ఇట్లు = ఈవిధముగా; అనియెన్ = పలికెను.

భావము:

“నీవు చెప్పినట్లే, పురుషులకు స్త్రీల వలన ధర్మార్ధ కామ మోక్షాలు సిద్ధిస్తాయి. నావికుడు తన నావతో సముద్రాన్ని తాను దాటటమే కాకుండా ఇతర ప్రయాణీకులను కూడా దాటించినట్లు, గృహస్ధు తన గృహస్ధాశ్రమం ద్వారా తాను తరిస్తూ ఇతర ఆశ్రమవాసులను కూడా తరింపచేస్తూ ఉంటాడు. అటువంటి గృహస్థుడిలో భార్య అర్థభాగం, అటువంటి అర్థాంగియందు తన గృహకృత్యాల భారమంతా ఉంచి పురుషుడు నిర్విచారంగా సుఖం అనుభవిస్తాడు. అంతేకాకుండా, మిగిలిన ఆశ్రమవాసులు జయించలేని ఇంద్రియాలనే శత్రువులను (అరిషడ్వర్గాలను) సతీ సమేతుడైన గృహస్థుడు కోటలో ఉన్న రాజు శత్రు సమూహాలను జయించినట్లు అవలీలగా జయిస్తాడు. అటువంటి భార్యకు ప్రత్యుపకారం చేసి ఋణం తీర్చుకోవడానికి సమస్త సుగుణాలతో కూడి ఉన్న సత్పురుషులకు సైతం నూరేళ్ళకు గానీ, జన్మజన్మలకు గానీ సాధ్యంకాదు. అటువంటప్పుడు మావంటివాళ్లకు ఎలా సాధ్యమౌతుంది. ఇక నీ మనస్సులోని దుఃఖాన్ని విడిచిపెట్టు” అని చెప్పి కశ్యపుడు ఇలా అన్నాడు.

3-460-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"రలలోచన! నీవు సంతానవాంఛఁ
జేసి వచ్చితి వౌఁ గుల శీల వర్త
ములు గల భార్యమనమున మరు కోర్కిఁ
విలి తీర్చుట పతికిఁ గర్తవ్య మరయ.

టీకా:

తరల = తళుకైన; లోచన = కన్నులు కలదాన; నీవున్ = నీవు; సంతాన = సంతానము పొందవలెనను; వాంఛన్ = కోరిక; చేసి = వలన; వచ్చితివి = వచ్చావు; ఔన్ = సరియైన పనే; కుల = కులము; శీల = శీలము; వర్తనములు = సత్ప్రవర్తనములు; కల = కలిగిన; భార్య = పత్ని; మనమునన్ = మనసులో; అమరు = కలుగు; కోర్కిన్ = కోరికలను; తవిలి = అవశ్యము; తీర్చుటన్ = తీర్చుట; పతికిన్ = భర్తకు; కర్తవ్యము = చేయదగినది; అరయన్ = తరచి చూసిన.

భావము:

చక్కటి కన్నులున్న సుందరీ! నీవు సంతాన వాంఛతో నా దగ్గరకు వచ్చావు. గుణవంతురాలూ, శీలవంతురాలూ, అయిన ఇల్లాలి మనస్సులోని కోరిక తీర్చడం భర్త ఆవశ్య కర్తవ్యం.