పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-438-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని బ్రహ్మవాదు లగు స
న్మునివర్యులు భక్తియోగమున వినమితులై
మున మోదము ముప్పిరి
గొనఁ బొగడిరి ఖురవిదళితగోత్రిం బోత్రిన్.

టీకా:

అని = అని; బ్రహ్మవాదులు = బ్రహ్మజ్ఞానమును పలుకువారు; అగు = అయిన; సత్ = మంచి; ముని = మునులలో; వర్యులు = శ్రేష్ఠులు; భక్తియోగమునన్ = భక్తియోగముచేత; వినమితులు = నమ్రత కలవారు; ఐ = అయి; మనమునన్ = మనసులో; మోదము = సంతోషము; ముప్పిరికొనన్ = పెనుగొనగా {ముప్పిరిగొను - మూడు రెట్లుగ పెరుగు, పెనుగొను}; పొగడిరి = పొగిడిరి; ఖుర = గిట్టలచే; విదళిత = చీల్చబడిన; గోత్రిన్ = కులపర్వతములు కలదానిని; పోత్రిన్ = వరాహమును.

భావము:

అని బ్రహ్మజ్ఞాన సంపన్నులైన మునివరేణ్యులు భక్తిప్రపత్తులతో వినయ వినమ్రతలతో, తమ అంతరంగాలలో ఆనంద తరంగాలు పొంగిపొర్లగా గిట్టలతో పర్వతాలను సైతం పగులగొట్టే జగజ్జెట్టి యైన వరాహస్వామిని ప్రస్తుతించారు.