పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

తృతీయ స్కంధము : విధాత వరాహస్తుతి

  •  
  •  
  •  

3-429-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విందోదర తావకీనసితదంష్ట్రాగ్రావ లగ్నక్షమా
నద్యబ్ధినదాటవీయుత సమిద్ధక్ష్మాతలంబొప్పె భా
సుకాసారజలావతీర్ణమదవచ్ఛుండాలరాడ్దంతశే
సంసక్త వినీలపంకజమురేఖంబొల్పు దీపింపఁగన్

టీకా:

అరవిందోదర = భగవంతుడా {అరవిందోదరుడు - అరవిందము (పద్మము) ఉదరమున (కడుపున) కలవాడు, విష్ణువు}; తావకీన = నీ యొక్క; సిత = తెల్లనైన; దంష్ట్ర = కోరల; అగ్ర = కొనలందు, చివరలందు; అవలగ్న = చిక్కిన; క్షమాధర = పర్వతములు; నది = నదులు; అబ్ధి = సముద్రములు; నద = నదములు; అటవీ = అడవులతోను; యుత = కూడినదైన; సమిద్ధ = ప్రకాశితమైన; క్షాతలంబున్ = భూమండలము; ఒప్పెన్ = చక్కగా ఉన్నది; భాసుర = ప్రకాశిస్తున్న; కాసార = కోనేటి; జలా = నీట; అవతీర్ణ = దిగిన; మదవత్ = మదమెక్కిన; శుండాల = ఏనుగుల; రాట్ = రాజు యొక్క; దంత = దంతము; శేఖర = శిఖరమున, చివర; సంసక్త = చిక్కుకొన్న; వినీల = నల్ల; పంకజము = పద్మము {పంకజము - నీటిలో పుట్టునది, పద్మము}; రేఖన్ = వలె; పొల్పు = విలాసము; దీపింపగన్ = ప్రకాశిస్తుండగా.

భావము:

పద్మనాభా! వరాహా! పర్వతాలతో, నదీనదాలతో, సముద్రాలతో, అరణ్యాలతో నిండిన ఈ భూమండలం నీ తెల్లని కోర చివర ప్రకాశిస్తున్నది. ఆ భూదేవి మనోహరమైన సరోవర జలాలలో దిగిన మదించిన గజేంద్రుని దంతాగ్రాన తగులుకుని ఉన్న ఆకుతో కూడిన తామరపువ్వు లాగా చూడముచ్చటగా ఉంది.